బహుపావధరుఁ డేల భక్తుఁడౌనని కంటి
బహుపాపములు నన్ను ఁ బట్టి విడుచుటఁ గంటి
నయముగా నయనములు నాకీయఁ బొడగంటి
భయభక్తు లీ భర్గు పాదములు పొడగంటి
నిది పుణ్య మనికంటి నిది గణ్యమని కంటి
నిది యోగ మనికంటి నిది భోగమని కంటి
నిధి ధర్మ మనికంటి నిది మర్మ మనికంటి
నిధి నిత్య మనికంటి నిది సత్య మనికంటి
నిధి పుణ్యముల కెల్ల నేక్కుడని పొడగంటి
నిధి గణ్యమల కెల్ల కెల్ల నేక్కుడని పొడగంటి
నిధి యోగముల కెల్ల నేక్కుడని పొడగంటి
నిధి భోగముల కెల్ల నేక్కుడని పొడగంటి
నిధి ధర్మముల కెల్ల నేక్కుడని పొడగంటి
నిధి మర్మముల కెల్ల నేక్కుడని పొడగంటి
నిధి నిత్యముల కెల్ల నేక్కుడని పొడగంటి
నిధి సత్యముల కెల్ల నేక్కుడని పొడగంటి
గణఁగి సంసారంబు కడగంటి నని కంటిఁ
గణఁగి శ్రీగిరి చెన్ను కారుణ్య మని కంటి
ఘనుఁడు రంగన దూషకరగండఁ డని కంటి
జనకల్పతరులలో జయశాలి యని కంటిఁ
దవిలి రంగనామంత్రి ధన్యకృతి యని కంటి
భువిలోనఁ బ్రోలాంబ పుణ్యవతి యని కంటి
నింక శ్రీగిరిఁ జేర నేఁ గందు నని కంటి
శంకరుని కృప వడయ సమయమిది యని కంటి
నిఁకను నాయేత్తు కృతు లిత్తునని పొడగంటి
నిఁకఁ గృతుల్ చెప్ప నా కేమిభయమని కంటి
వడిఁ గృతుల్ చెప్ప నా కేమిభయమని కంటి
మృడుఁ డింక నాకృతుల మెచ్చునని పొడగంటిఁ
దనర శ్రీరంగకవి దాత యని పొందగంటి
.... .... .... ..
భువిలోపలఁ బ్రసిద్ధ పుణ్యుఁ డనఁగాఁ గంటి
శివభక్తి దీపికాశీతాంశు వని కంటి
శ్రీగిరీశునకు నర్పింతు నని పొడగంటి
శ్రీగిరిశ్వరుని కృప చెన్నలరు నని కంటి. 221
నమశ్శివాయ రగడ (శివ మంత్ర వర్ణనము)
క|| శ్రీకాము లతులకీర్తి
శ్రీకాము లుమాధినాథ చిత్తానంద
శ్రీకాములు సద్భక్తిం
జేకొనుఁడు 'నమశ్శివాయ' చెప్పెద మీకు 222
నమశ్శివాయ
శ్రీగిరీశ వశ్యమంత్ర సేకరము నమశ్శివాయ
అగమోవదిష్ట విధి మహాకరము నమశ్శివాయ
పంచవర్ణ పంచరూప భాసురము నమశ్శివాయ
అంచితానురక్త జిత గజాసురము నమశ్శివాయ
సునిశితోపనిష దధీత సుస్వరము నమశ్శివాయ
కనదనూన భక్తీరస వికస్వరము నమశ్శివాయ
పారలౌకిక ప్రధాన భాషణము నమశ్శివాయ
భూరిపుణ్య హేతుభూత భూషణము నమశ్శివాయ
సతత జన్మ దాహ దగ్ధ చందనము నమశ్శివాయ
నత విశిష్ట భక్తభ్రుంద నందనము నమశ్శివాయ
శృతిశిర స్సహస్ర రత్న సుందరము నమశ్శివాయ
మత కుతర్క శరధి మధన మందరము నమశ్శివాయ
దారువన మునీంద్ర ,ముఖ్యధర్మము నమశ్శివాయ
దూర దూర హత నికృష్ట దుర్మదము నమశ్శివాయ
తరుణ చంద్ర జూట దర్ప దర్పణము నమశ్శివాయ
హరణ భరణ శక్తి కృత సమర్పణము నమశ్శివాయ
పరమభక్త మహిత హిత విభావనము నమశ్శివాయ
చిరతరప్రభావ భావజీవనము నమశ్శివాయ
వామదేవ తత్త్వ లేశ వాచకము నమశ్శివాయ
సోమపాన ఫల సహస్ర సూచకము నమశ్శివాయ
నరకహర విశిష్టమంత్ర నాయకము నమశ్శివాయ
ధరణిసుర సుధీ విధా విధాయకము నమశ్శివాయ
దారుణాది జలధిమగ్న తారకము నమశ్శివాయ
కారణప్రధాన వస్తుకారకము నమశ్శివాయ
బాఢపాప ఘోర కృత్య పాచకము నమశ్శివాయ
మూడ గూడ మోహబంధ మోచకము నమశ్శివాయ
కర్మ దోష హరవిచార కారణము నమశ్శివాయ
ధర్మ మర్మ మూలమంత్ర ధారణము నమశ్శివాయ
ప్రస్తవ వ్రశస్త భరణ పండితము నమశ్శివాయ
మస్తకాయమాన విభవమండితము నమశ్శివాయ
రక్త భక్త నిత్య సత్య రక్షణము నమశ్శివాయ
భక్త లోక హృదయశోక భక్షణము నమశ్శివాయ
భజనధన్య సుజన వజ్రపంజరము నమశ్శివాయ
కుజనదృష్టి దోషకంజ కుంజరము నమశ్శివాయ
సర్గదుష్ట దుష్ట చిత్తశాసకము నమశ్శివాయ
భర్గరూప దుర్గలసదుపాసకము నమశ్శివాయ
పురభి దభిమతానురక్త పోషకము నమశ్శివాయ
సురభవన కళంకపంక శోషకము నమశ్శివాయ
పాశువత పథ ప్రవృద్ద పాలనము నమశ్శివాయ
క్లేశ పాశ వలన దళన ఖేలనము నమశ్శివాయ
యోగిహృదయ సదయ జల వయోధరము నమశ్శివాయ
భోగిభూష పక్షవిభవ భూధరము నమశ్శివాయ
దురితహత నికృష్టదుష్ట దుర్భరము నమశ్శివాయ
నిరతిశయ దయాశమాది నిర్భరము నమశ్శివాయ
భవవిపినాపౌక్ష దహన పాటవము నమశ్శివాయ
కవిముఖ ప్రసిద్ద నియమ కాటవము నమశ్శివాయ
నికటపుణ్య తంత్రనిచయ నిశ్చయము నమశ్శివాయ
ప్రకటధీర భావభర తపశ్చయము నమశ్శివాయ
భూతనాథ చరణకమల పూజనము నమశ్శివాయ
ప్రాతతప్రశస్త వస్తుభాజనము నమశ్శివాయ
శోషణాది శుద్ధికరణ శోధితము నమశ్శివాయ
పోషితాగమ ప్రమేయ భోదితము నమశ్శివాయ
ప్రసవశరవికార భావభంజనము నమశ్శివాయ
రసికభక్త రాజలోకరంజనము నమశ్శివాయ
కలుషగజనికాయ సింహగర్జనము నమశ్శివాయ
వలభిదాది చవల భజన వర్జనము నమశ్శివాయ
నరసురేశవినుతనత సనాతనము నమశ్శివాయ
ఘనఘనాఘచండ విపినఖండనము నమశ్శివాయ
మననమధిత శివరాహస్యమండనము నమశ్శివాయ
కుతలజాత భర్గరూపగురువనము నమశ్శివాయ
తతఫలప్రదాన కల్ప తరువనము నమశ్శివాయ
మరమధన వరులలోని మంతనము నమశ్శివాయ
చేరి శివునిఁ గొలుచువారి చింతనము నమశ్శివాయ
కలయ వెదకి శ్రుతులు దొలుతఁ గన్న యది నమశ్శివాయ
ఒలసి మంత్రకోటి గొలువ నున్న యది నమశ్శివాయ
నరకలోకవాసికైన నాకదము నమశ్శివాయ
విరసమతికి నైన నురువివేకదము నమశ్శివాయ
అల్ప పుణ్యమతుల కెందు నందనిది నమశ్శివాయ
కల్ప కోటి శతములందుఁ గందనిది నమశ్శివాయ
పురహరునకు మొదలఁ మొదలఁ బుట్టినది నమశ్శివాయ
పరమధర్మ నిరతు లర్దిఁ బట్టినది నమశ్శివాయ
శివుఁ డజాది సురల కెల్లఁ జెప్పినది నమశ్శివాయ
కవసి వాసవాది సతులఁ గప్పినది నమశ్శివాయ
దురితహరుఁడు దోడవుగాఁగఁ దొడిగెడిది నమశ్శివాయ
కరుణదుఃఖ మలిన హతులఁ గడిగెడిది నమశ్శివాయ
ఓరవొక సర్ప సమితి నుండేడిది నమశ్శివాయ
