Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 22



    మూర్తీభవించిన సౌందర్యం మాధురి!

     అంతటి అందాల బొమ్మ తన ఎదురుగా నిల్చుని.... 'నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ప్రశాంత్! నామీద పగ తీర్చుకో!"అంటూ తన ఒంటిమీద దుస్తులని తీసెయ్యటానికి సిద్దపడుతుందని ప్రశాంత్ కలలోనైనా ఊహించలేకపోయాడు.
 
     ఆమె వేపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.

     మాధరి తన చీరని ఒంటిమీదనుంచి లాగి పారేసింది.

     చటుక్కున తలెత్తి చూసింది ప్రశాంత్ వేపు.

     ఆమె పెదవులపైన మందహాసం.

     అతను కదలలేదు.

     ఆమె ఒంటిమీదవున్న నీలం రంగు లంగా, జాకెట్లోంచి ఆమె బంగారు రంగు దేహం ధగధగా మెరిసిపోతూ కళ్లు మిరిమిట్లు గొలుపుతున్నట్లు అనిపించింది.

     "ఏమిటి చూస్తున్నావ్ ప్రశాంత్! నాకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికీ నమ్మకం కుదరలేదా?" చేతులు వెనక్కి పోనిచ్చింది మాధురి.

    ఆమె బంగారు బంతులు ముందుకి ఎగతన్నుకొచ్చాయి.

     ఆ జాకట్టు వాటి స్వేచ్చాకాంక్షని అదుపులో పెట్టి శాసిస్తున్న నియంతలా వుంది!

     హిమవత్పర్వత శిఖరాలకి అడ్డుగా నిలిచిన మేఘాల్లా వున్నాయి. ఆమె బంగారు కొండలు.

     ఊపిరి పీల్చు కోవడం మర్చిపోయి చూస్తున్నాడు ప్రశాంత్.

     ఒంట్లో నెత్తురు వేగంగా ఉరకలేస్తోంది.

     ఒక్కసారిగా ఆమె మీద కోపం అంతా అదృశ్యమైపోయింది.

     తనకి తెలియకుండానే అతని అడుగులు మాధురివేపు సాగిపోతున్నాయి.

     ఆమె కళ్లు మిలమిల మెరిసాయి.

     గమ్మత్తుగా నవ్వింది మాధురి.

     మునిపంటితో క్రింద పెదవిని నొక్కిపట్టి చిలిపిగా చూసిందతన్ని.

     ఇద్దరిమధ్య పదడుగుల దూరం!

     ఇప్పుడామె జాకెట్ హుక్స్ విప్పుతుందా?

     లోపల బ్రాసరీ వుందా?

    బ్రాసరీలోంచి ఆమె స్వర్ణ శిఖరాలు ఎలా కనిపిస్తాయి?

     ఒకదానికొకటి రాసుకుని, ఉక్కిరి బిక్కిరి ఔతూ, పైకి చీల్చుకుని రావాలని పోటీపడుతూ ...ఎత్తుగా....

     ఫర్... ఫర్....!!!

    అదిరిపడ్డాడు ప్రశాంత్.

     ఆమె జాకెట్ ని చింపివేసింది కసిగా.

     అతను ఠక్కున ఆగిపోయాడు.

    ఆమె నవ్వుతూనే వుంది!

     ఇప్పుడామె గుండెల మీద బ్రాసరీ మాత్రమే వుంది.

     నల్లని క్వీన్ మేరీ బ్రాసరీ!!!

     ఆమె మెల్లిగా, వొయ్యారంగా, కైపుగా, ఆకాంక్షగా....

     ప్రశాంత్ వేపు నడుస్తోంది!

     అతనికి పిచ్చెక్కుతున్నట్లుగా వుంది!

     తను ఏదైనా "కల కంటున్నానేమో" అనే అనుమానామూ కల్గుతోంది!

    యువతరాన్ని వెర్రెత్తించే నవ్యమోహిని స్వప్న రాగిణి, శృంగార యోగిని, సౌందర్య మందాకిని....

     మాధురీ... మాధురీ... మాధురీ!!!

    తనంటే ఆమెకు ఎంత ఇష్టం!?

    ఆమె ఉచ్వాస నిశ్వాసాలకి ఎగిరెగిరి పడ్తున్నాయి ఆమె వక్షశిఖరాలు!

     ఆమె అడుగుల కదలికలకి ఆమె నడుము మీద అందంగా పడుతున్న చిరుమడత....

     మాధురీ!!

    షీ ఈజ్ గ్రేట్......

     షీ ఈజ్ గ్రేట్....

     షీ ఈజ్ లవ్ లీ....!!

    మాధురివేపు వేగంగా నడిచాడు.

    ఆమె కళ్లల్లోకి చూస్తూ నవ్వాడు ప్రశాంత్.

     "ప్రశాంత్! నీకు ఇప్పటికైనా అర్దమయ్యిందా ఈ మాధురి ఎందుకిలా ప్రవర్తించిందో!" అంది గోముగా.
     "యస్ అర్దమయ్యింది! నిన్ను నేను అనవసరంగా అపార్దం చేసుకున్నాను!" అన్నాడు ప్రశాంత్, ఆమెను కౌగిట్లోకి లాక్కోవాలని చేతులు చాచి.

     "అమ్మో ఆశ" అంటూ చిలిపిగా వెనక్కి అడుగులేసింది మాధురి.

     "అంత తొందరెక్కడినుంచి వచ్చిందమ్మా అబ్బాయి గారికి మైడియర్ ప్రశాంత్! ఆడదానిగా పుట్టడం, అందులోనూ అందమైన ఆడదానిగా పుట్టడం - నేను చేసుకున్న అదృష్టం- "అంది.

     "కాదు, నేను చేసుకున్న అదృష్టం -" అన్నాడు ప్రశాంత్ పరవశంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS