Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 21



    "ఔను. మాధురి నీకు చెప్పమంది!"

    "ఓ. కే! వెళ్తాను! కానీ.... ఆమె మీద నమ్మకంతో నేను వెళ్లటం లేదు! ఆమెను నిలదీసి అడగటానికి వెళ్తాను!" అన్నాడు ప్రశాంత్.

     "అది నీ ఇష్టం! నువ్వు ఆమెను కలిస్తే చాలట! క్షమించమని వేడుకుని వచ్చేస్తాను రుక్కూ.... నువ్వు అతనితో చెప్పి ఒప్పించూ... .అని ప్రాధేయపడింది!" అని చెప్పింది రుక్మిణి.

     ప్రశాంత్ సరేనన్నట్లు తల పంకించాడు.

                 11

    మర్నాడు....

     గెస్ట్ హౌస్ లో....

    తనకోసం నిరీక్షిస్తూ వుండే మాధురిని కలుసుకోవాలని ఆటోలో బయలుదేరాడు ప్రశాంత్.

     సరిగ్గా పన్నెండు ఇరవైకి గెస్ట్ హౌస్ కి కొంత దూరంలోనే ఆటో దిగిపోయాడు ప్రశాంత్.

     ఆటో ఫేర్ చెల్లించి మెల్లిగా నడుచుకుంటూ గెస్ట్ హౌస్ ని సమీపించాడు.

     అతను తలుపుమీద మునివేళ్లతో తట్టాడు.

     రెండు నిముషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ....

    ఎదురుగా మాధురి!

    తెల్లని చీర! జాకెట్!!

    సిగనిండా మల్లెలు!!

    ఒంటికి రాసుకున్న పెర్ ప్యూం పరిమళం అతనికి ఆహ్లాదంగా అనిపించింది.

     ఆమె వజ్రాల్లాంటి పల్వరస తళుక్కున మెరిసేలా నవ్వుతూ....

    "హల్లో! ప్రశాంత్!థాంక్యూ వెరీమచ్! పిలవగానే వచ్చావ్!" అంది....

    అతను సీరియస్ గా చూస్తూ లోనికి అడుగుపెట్టాడు.

    "నా మీద ఇంకా కోపం తగ్గలేదా డియర్?" గోముగా అంది.

    ప్రశాంత్ మాట్లాడలేదు.

    తలుపులు వేసేసింది ఆమె.

    "నీకు క్షమాపణలు చెప్పుకుందామని రమ్మన్నాను" అందామె మళ్ళీ.

     అతను మాట్లాడలేదు.

    "చెప్పు ప్రశాంత్! నన్ను క్షమించానని ఒక్కమాట చెప్పు...." అంది మాధురి.

     అతను గిరుక్కున వెనుతిరిగి ఆమెవైపు సూటిగా చూసాడు.

     అతని కళ్లల్లో ఎర్రజీరల!

    "నా మీద నీకెందుకంత పగ?" అన్నాడు ఆవేశంగా.

    "పగ కాదు! ప్రేమ!" అంది మాధురి.

     "హు!  ప్రేమ! నిన్ను చూసేంతవరకు తెలీదు! నిన్ను చూసాకే నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది! ప్లీజ్ డియర్!...... నన్ను అర్దం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యి!"దీనంగా అంది మాధురి.

     ప్రశాంత్ లో చలనంలేదు.

     "ఓ. కే. ప్రశాంత్! నామీద నీకు నమ్మకంలేదు! సరే! ఆడదానికి తన అందచందాలే సిరిసంపదలు. ఇదిగో! ఏ అందచందాలని చూడటం కోసం మన కాలేజీ యువతరం వెర్రెత్తిపోతుందో, ఏ అందచందాల కోసం మగధీరులు బస్టాండ్ వద్ద, సందు చివర్లో... కాలేజీగేట్ల దగ్గర కాపుకాస్తుంటారో.... ఆ అందచందాలనిప్పుడు నీముందు  బహిర్గతం చేస్తాను" అంది మాధురి దృఢనిశ్చయంతో.

    అదిరి పడ్డాడు ప్రశాంత్.

    "చూడు!ప్రశాంత్!ఇటు చూడు! నీకోసం నగ్నంగా నిల్చోడానికి ఈ మాధురీ సిద్దంగా వుంది! ఐ విల్ స్టాండ్ నేక్ డ్! నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో! నా మీద నీ పగ తీర్చుకో!!" అంది మాధురి. ... చీర కుచ్చిళ్లు లాగిపారేస్తూ.
                             11


     ప్రశాంత్ గుండె వేగంగా కొట్టుకుంది.

     మాధురి తన చీర కుచ్చిళ్లు నిజంగానే లాగి పారేస్తోంది.

     ఇది కలా? నిజమా?

     అందానికి అందాన్నిచ్చే అతిలోక సుందరి....

     అపురూప సౌందర్యరాశి....

     ఇలా ఒంటరిగా....

    తన కళ్లముందు... తనని తానే కానుకగా అర్పించుకోడానికి సంసిద్దంగా వుందంటే అది నమ్మశక్యంగాని నగ్నసత్యంలా వుంది.

     గులాబీ రంగు శరీరం....

     విశాలమైన కురులు....

     పురుష జాతినే సవాల్ చేసేలా ఉప్పొంగే అవయవసౌష్టవం. ....

     చూపులతోనే మాట్లాడగలిగే పెద్ద పెద్ద కళ్లు, కురుదైన నాసిక, చిన్ననోరు, ఎర్రని పెదవులు, నిగనిగ  మెరిసే బుగ్గలు, శంఖంలాంటి మెడ, ఎత్తయిన గుండెలు, గుండ్రని భుజాలు, జాకట్టుకీ చీరకట్టుకీ మధ్యన పాముకుబుసంలా నున్నగా సన్నగా వున్న నడుము, సంపెంగ  లాంటి బొడ్డు, ఎత్తయిన పిరుదులు, బిగువుగా చీరకట్టులోంచి అంచనాలకి సులభంగా అందుబాటులో వున్న బలమైన తొడలు, కలువరేకుల్లాంటి సుకుమారమైన పాదాలు...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS