మృదువని చలి వేస్తోంది.
అయిన ఆమె ఆ చలిని లెక్కచేయటంలేదు. ఆమె చురుకైనా మెదడు అనుక్షణం ఎలర్టవుతూనే ఉంది. తనేమాత్రం అలక్ష్యం చేసినా, జరిగే పరిణయం తెలుసు.
ఆమె కళ్ళు పరిసరాలను నిశితంగా గమనిస్తున్నాయి. దగ్గరకి మునగదీసుకుని కూచుంది.
"ఎక్కడికి వెళ్ళాలమ్మా..." ఓ ముసలావిడ మాటలు కలిపింది.
"వి..వి ...విశాఖాపట్నం.." చెప్పింది. వెంటనే ఏం చెప్పాలో తోచక.
"ఇప్పుడు వైజాక్ ట్రైన్స్ ఏమున్నాయి. సాయంత్రం గోదావరి వుండేది.... హైదరాబాదు కు కొత్తా..." అడిగింది ఆవిడా. పరిశీలనగా మృదువని వంక చూస్తూ.
"ఆ.. అవునవును... ఓ ఇంటర్యూ కోసం వచ్చాను. ట్రైన్ మిస్సయింది.."
"అలాగా పాపం.... అవున్లే అమ్మాయి... పాపం తెలిసిన వాళ్ళెవరూ లేరా? రాత్రిళ్ళు హోటల్లో వుంటే మంచిగా వుండే రోజులు కావాయే..." ఆవిడా ఓ నిట్టూర్పూ విడిచి అంది.
ఆవిడ నుంచి తప్పించుకోడానికి, ఆవులింతలు నటిస్తూ కళ్ళు మూసుకుంది.
అయిదు నిమిషాలు గడిచాయి. ఆ ముసలావిడ నిద్రలోకి జారుకుంది.
రాత్రి పన్నెండు దాటింది... ఏదో ట్రెయిన్ వస్తోన్న అనౌన్స్ మెంట్... అప్పుడే బూట్ల శబ్దం వినిపించింది. మేల్లిగా కళ్ళు తెరిచింది.
దూరంగా బూట్ల శబ్దం.... ఆమె కళ్ళు తెరిచింది.
ఒక్క క్షణం ఉలికిపాటు...
బ్లాక్ షూ... బ్లాక్ ప్యాంట్... మెల్లిగా కళ్ళని పైకి ఎత్తింది. శాలువాలు కప్పుకొని నలుగురు దృడకాయలు తనవైపే వస్తున్నారు.
ఆ శాలువాల మాటున మారణాయుధాలు వుంటాయన్న విషయం తెలుసు. మృదువని గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగిపోయింది. వాళ్ళు తన వైపే వస్తున్నారు. తనని వాళ్ళు కామ్ గాఫినిష్ చేసినా ఆశ్చర్యం లేదు.
వాళ్ళెలా తనని ట్రాప్ చేస్తారో డిఫెన్స్ లో పనిచేసిన ఆమెకు తెలియనిది కాదు.
ముందుగా స్టేషన్ లో అలజడి స్పష్టిస్తారు. ఎవరో బాంబు పెట్టరంటారు. లేదా వాళ్ళలో వాళ్ళు గొడవ పడతారు. ఏదో విధంగా శేత్షణ్ అంతా హాడావిడి స్పష్టిస్తారు. తర్వాత అ సందట్లో తనని లక్కేల్తారు, లేదా ఫినిష్ చేస్తారు. ఎంత వేగంగా వచ్చారో అంటే వేగంగా నిష్క్రమించగలరు.
అడుగుల శబ్దం దగ్గరవుతోంది.
మృదువని మెల్లిగా లేచింది.ప్రయాణీకులంతా నిద్రలో జోగుతున్నారు. రాత్రి ట్రెయిన్ లో వెళ్ళాల్సిన ప్రయాణీకులు మాత్రం మేలకువాగా ఉన్నారు. తన ప్రతీ కదలికా ఎదురుగా వున్న షంషేర్ దాదా మనుషులకు తెలిసిపోతుంది.
ప్లాటుఫామ్ కు అటు నుంచి ముంచుకోస్తూ కనిపించింది. అటువైపు నుంచి డిఫెన్స్ వాళ్ళు వస్తున్నారు.
ఓ వైపు షంషేర్ దాదా మనుషులు... మరోవైపు డిఫెన్స్... ఆమె బుర్ర వేగం అది షార్ప్ గా పంన్జేస్తోంది. షంషేర్ దాదా మనుషులు ప్లే చేసే ట్రిక్ తనూ ప్లే చేస్తే...
అది ర్స్కే... అయినా తప్పదు... ఇంతకన్నా తనకు మరో మార్గం లేదు. వెంటనే తన ఆలోచనను అమల్లోకి పెట్టింది.
ఒక్కసారి పక్కవాల్లను లేపి అరిచింది. "ఎవరో దోగ.... ఎవరిదో సూత కేసు తీసుకుని పరిపోతున్నాడు" అంటూ అరిచేసిమ్ది.
ఎవరికీ వాళ్ళు ఆ అరుపు విని, ఉలిక్కపడి లేచారు. ఎవరి సూట్ కేసులువాళ్ళు భద్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నారు. మృదువని చూపించిన వైపు పరుగు పెట్టారు. జనం అంతా పరుగులు పెట్టారు.
ఈ హడావిడి చూసి షంషేర్ దాదా మనుషులు కం ప్యూజ్ అయ్యారు కామ్ గా వున్న టైంలో తను పని పూత్రి చేసుకోవచ్చని అనుకున్నారు.మరి కొద్ది సేపట్లో ట్రెయిన్ వస్తుంది. ఈ హడావిడిలో తమ పని పూర్తీ కావడం దాదాపు ఆ సాధ్యమే.
ట్రెయిన్ ప్లేట ఫామ్ వచ్చేసింది. ఇంకో వైపు దొంగ దొంగ అన్నా మృదువని అరుపులు... ఈ హడావిడిలో చల్లగా జారుకుంది మృదువని.
ప్లాట్ ఫామ్ మీదికి వచ్చిన రైలు ఎక్కి, అటువైపు నుంచి దిగిపోయింది.
***
అర్దరాత్రి రెండు గంటలు.
ఓ పాట బోగీలో, ఓ మూలకు ఒదిగి మృదువని.... అప్పటికి ఆ బోగీలో ఆమె కూచొని గంటకు పైగానే అయింది. ఎప్పుడైతే షంషేర్ దాదా మనుషులు, డిఫెన్స్ వాళ్ళు తన స్టేషన్ లోకి వచ్చారో.... అప్పుడే చిన్న ట్రిక్ ప్లే చేసి, ఆ హడావిడిలో ఈ పాత బోగీలోకి వచ్చింది.
క్లోజ్ చేసిన రైల్వే ట్రాక్ చివర వున్న ప్త బోగి అది. భయం భయంగా ఆ బోగీలో గడిపింది. ఆ రాత్రంతా... ఈ రాత్రి తెల్లవారుతుందా.... ఆమె టెన్షన్...
క్షణక్షణానికి పెద్దదవుతూ వుంది.
ఫిబ్రవరి 14.
బద్దకంగా కళ్ళు బయటకు మృదువని. సూర్యకిరణాలు బోగీలోకి దూసుకు వచ్చేస్తున్నాయి. తల బయటకు పెట్టి చూసింది. ఎవ్వరూ తనని గమనించడం లేదని నిర్దారించుకొని, మెల్లిగా దిగింది.
ఆమె కళ్ళు నిశితంగా పరిసరాలను గమనిస్తూనే ఉన్నాయి.
ట్యాప్ దగ్గరకి వెళ్ళి చన్నీళ్ళతో మొహం కడుక్కుంది. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది.
చీర మొత్తం దుమ్ము కొట్టుకు పోయి ఉమ్డంతం వాళ్ళ చీర, జాకెట్ మొత్తం దుమ్ము దుమ్ముగా అయింది. స్టేషన్ బయటకు వచ్చింది. ఎదురుగా చీరాల షాపు కనిపించింది.
ఓ కాటన్ శారీ, రెడీ మేడ బ్లౌజ్ తీసుకుంది. మల్ల స్టేషన్ లోకి వచ్చింది. ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకుంది. రెస్ట్ రూములోకి వెళ్ళింది.
అక్కడ బాత్రూం లోకి వెళ్ళింది. పదిహేను నిమిషాల్లో ఫేశాప్ అయి బయటకు వెళ్ళి, జేమ్స్ కు ఫోన్ చేస్తే? శరణ్య గురించి వివరాలు తెలుస్తాయి... పాపం తన కోసం శరణ్య ఏం కష్టాలు పదోతుమ్దావు ఏమో...
ఆ ఆలోచన రావడంతోటే, బయటకు నడిచింది మృదువని. టెలిఫోన్ బూత్ దగ్గరకు నడిచింది. సరిగ్గా అప్పుడు పడింది ఆమె దృష్టి... అక్కడ షంషేర్ దాదా మనుషులు ఉన్నారు.
