Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 22


                                               6

    ఉదయభానుడి లేతకిరణాలు శరీరాన్ని సోకేవరకు మెలుకువ రాలేదు. లేచి చూస్తే ఎత్తైన రాతిమీదపడి వున్నాను. నేను పద్మాసనం వేసుకుని కూర్చున్నది ఒక గుహలో కదా! ఇక్కడ ఉన్నానేమిటి? ఏమో! అంతా సస్పెన్స్.
    పెద్దియజ్వ యదార్థంగా భౌతిక శరీరంతో జీవించి ఉన్నవాడయితే ఇప్పుడు కూడ కనిపించవచ్చునే. అలా యెందుకు జరగలేదు. ఒకవేళ అది ఆయన ఆత్మ రూపమేమో! ఏమో! ఈ సృష్టి విచిత్రాలను యెవరు వివరించగలరు. ఈమధ్య సైంటిస్టులు పరిశోధించి ఆత్మలున్నాయి అని కనుక్కున్నారు. వాటిని తూచి రెండు గ్రాముల బరువుంటాయని గూడా వివరించారు. మంత్రపుష్పంలో ఆత్మస్థానం నిరూపితమయ్యే వున్నది. హృదయానికి అధోముఖముగా పద్మకోశంలో ఉన్నదన్నారు. పద్మకోశం నాభికి ఉపరిభాగాన ఉన్నది. ఆత్మ జ్వాలమాలాకులంగా ఉన్నదన్నారు. నీ వారశూకమంత, పీతవర్ణంలో ఉంటుందని వర్ణించారు. ఆ శాఖ మధ్యలో పరమాత్మగా పిలువబడే ఆత్మ వ్యవస్థితమై ఉన్నదన్నారు అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు. త్రిమూర్త్యాత్మకమయిన రూపమని దానినే వర్ణించారు కనుక ఆత్మ ఉండే అవకాశాలు యెక్కువ లేవనేవారికి సరైన ఆధారాలు లేవు. ఇంతకూ పెద్దియజ్వ ఆత్మ స్వరూపుడే కావచ్చు, కాకపోనూవచ్చు.
    అది మానసిక శక్తులున్నాయి. వస్తువులకు స్థలంతో పాటు కాలం కూడ ఒక లక్షణం కనుక ఏదైనా కావచ్చు.
    ఆలోచిస్తూ నడుస్తున్నాను. రాణి వాసపు బురుజు లవుపిస్తున్నాయి. అంటే దాదాపు బంగ్లా పరిసర ప్రాంతాలకు వచ్చానన్నమాట. బంగ్లా గుర్తు రాగానే అవ్వ గురచ్చింది. ప్రేమా, త్యాగాలతో పునీతమయిన ఆ పధ విహీనకు భగవంతుడూ, అచంచలమయిన మూఢవిశ్వాసాలే తోడు. ఆమె కోరినట్లు ఆ బ్రాహ్మణ యువకుడు అన్నట్లు యిప్పుడు బ్రతికివుంటే ముసలి బ్రాహ్మణుడు తిరిగివస్తాడా?
    మెల్లగా నక్కుతూ, నక్కుతూ తప్పుచేసినవాడల్లే బంగ్లాలో ప్రవేశించాను. రూంలో రమణా, కవీ చెరో కిటికీ వద్ద కూర్చున్నారు. కొండవీటి ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా చూస్తున్నారు కాబోలు అనుకున్నాను. వారు నన్ను గుర్తించేందుకు వీలు కల్పిస్తూ చిన్నగా దగ్గాను. ఎవ్వరూ వెనుదిరిగి నన్ను చూడలేదు.
    "నువ్వు దయచేస్తున్న సంగతి మాకు ముందే తెలుసు. నువ్వేమీ దగ్గనవసరం లేదు" అన్నాడు రమణ.
    "అయితే నేను వచ్చేసంగతి ముందే మాచారన్న మాట" అన్నాను పళ్ళు ఇకిలిస్తూ. నా ఇకిలింపు వృధా అయింది. వాళ్ళలో యెవరూ నాతో శృతి కలపలేదు. పోగా ఝామ్మని లేచారు నామీదికి. అదిరిపోయాను.
    "మమ్మల్ని కొండవీడు చూపిస్తా రమ్మని తీసుకొచ్చావు. ఈ భూత్ బంగ్లాలో మమ్మల్ని విడిచేసి రాత్రిళ్ళు రాక్షస సంచారానికి వెళుతున్నావు. ఈ దయ్యాల కొంపలేనా నువ్వు మాకు చూపదలుచుకున్నది?" కవి ఆవేదన. "నన్ను క్షమించలేరూ! మిమ్మల్ని త్వరగా తీసుకువెళదామనే పెందరాడే వచ్చాను" అన్నాను వినయం వొలికిస్తూ. "ఇంతకూ నువ్వు రాత్రులు వెళ్ళేదెక్కడికి? ఆ సస్పెన్స్ భరించలేక ఛస్తున్నాం. చెప్పవోయ్. చెప్పు త్వరగా" అంటూ తొందరించాడు కవి. నాకేమీ పాలుపోలేదు.
    ఏమని చెప్పాలి? అయిదువందల యాభై సంవత్సరాల నాడు సన్యసించి దేశాంతరం వెళ్ళిపోయిన పెద్దియజ్వ కన్పించారని చెప్పనా? చెప్పినా యీ సమాజికులు నన్ను నమ్ముతారా? లేక దయ్యాలతో, భూతాలతో కాలక్షేపం చేస్తున్నానని చెప్పనా? అదిమటుకు నమ్ముతారా? నమ్మితే మాకు చూపించమని యాగీ పెట్టుకోరూ! ఇక వీళ్ళందర్నీ నెత్తిన పెట్టుకుపోతే పెద్దియజ్వ డైరక్టర్ లా కట్ అంటే, ఆ దృశ్యాలు మాయమయితే నా గతేంకాను. ఈ కవి కిశోరుణ్ని నెత్తికెక్కించుకోవటం వల్ల చచ్చే చావొచ్చి పడింది. ఓ ఉపాయం తళుక్కుమంది. "ఇంతకూ యీరోజు మూలగూరమ్మ గుడికి రాదలుచుకోలేదా?" అన్నాను.
    "మూలగూరమ్మ ఎవరు? గుడి ఏమిటి? ఏమా కథ?" అంటూ ఆ విషయాన్ని వదలి యీ విషయంలోకి వచ్చాడు కవి.
    బ్రతుకు జీవుడా అనుకుని బయలుదేరదీశాను అందరమూ అక్కడికి సుమారు మూడుమైళ్ళ దూరంలోని మూలగూరమ్మ దేవాలయానికి వెళ్ళాము.
    అది చాలా ప్రకృతి సుందరమయిన పరిసరాలున్న చోటు. దాదాపు మూడువందల అడుగుల యెత్తుండే చిన్న కొండతిప్ప దానిముందు కొండవీటి మహా పర్వతం పంక్తి ఆ చిన్న కొండమీద బుల్లి గుడి. నల్లని కొండ. తెల్లని గుడి. ఆ గుడిలో జగజ్జనని మూలగూరమ్మ విగ్రహం. కరుణ వర్షించే నేత్రాలు ఆమెని ఆ చిన్నికొండ యెదురుగా 'వీర కల్లు'లు. కొండవీడులో స్థాపించిన సామ్రాజ్యానికి అవి మకుటాయమానంగా పవిత్ర స్థలాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS