Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 21


    సోమదేవుడు ఆ వీరుని రెండు భుజాలు పట్టుకుని అతని కన్నులలోకి చూచాడు. అతని చేతులకు మెత్తగా తగిలింది శరీరం. "ఇతని భుజస్కంధాలు ఇంత కోమలంగా ఉన్నాయి ఎందువల్లనో" అని విస్తుపోయాడు సోమదేవుడు. మెల్లగా అతని తలమీద శిరస్త్రాణాన్ని తొలగించాడు. నల్ల త్రాచుల్లా ఉన్న బారెడేసి వెంట్రుక పాయలు మంచం (యుద్ధరంగంలో సైనికులు శయ్యగా ఉపయోగించేది) మీదనుండి నేలమీదకు దూకి జీరాడుతున్నాయి. సోమదేవుడు ఆమె స్త్రీ అని తెలియగానే నివ్వెరపోయిన వేమాంబ అని గుర్తించగానే నిశ్చేష్టడయ్యాడు! ఎంత పని!
    "వేమా! వేమాంబికా!" పిలిచాడు దగ్గుత్తికతో. నేను రవ్వంత కదిలింది. గుడారంలోనే ఓ మూల మట్టి పాత్రలో ఉన్న నీరు తెచ్చి అందించాడు సోమదేవుడు. ఆమె త్రాగలేక రెండు గ్రుక్కలు త్రాగి కన్నీరు విప్పార్చి అతడిని చూచింది. వేగిరపాటుతో లేచి కూర్చుంది. ఆమె చూపులలో ఎంతటి ప్రేమ వర్షిస్తున్నదో!
    "వేమా! నీవెందుకీ సాహసం చేశావు?" అన్నాడు సోమదేవుడు. వేమ కొంత తడపాటు పడింది.
    "సోమా! కొండవీటి సామ్రాజ్య రక్షణలో నీవు నేనూ అనే భేదాలున్నాయా? ఇక సాహసమంటావా? అది నీవు అనుకున్నంత ముఖ్యమైన విషయం కాదు. నీవు ఏది చేస్తే అదే చేస్తాను. నాకు ఆనందాన్ని కలిగించే పని ఎంత ప్రమాదమైనదో అని నేను ఆలోచించను."
    "వేమా! నీవు కొండవీటి పౌరులుగా, దేశభక్తురాలుగా మాట్లాడుతున్నావు. వేమాంబిక అంటే అంతేనా?"
    "కాకపోవచ్చు సోమా! అంధకార బంధురమైన, భవిష్యత్తును గుర్తుచేసే రాత్రి ఇది. ఆకాశాన చంద్రుడు లేడు. కాని నా కన్నుల ముందే సోముడున్నాడు. ఆ సోముడు ఇప్పుడు లేకపోయినా, నా సోముని సాక్షిగా చెబుతున్నాను. నేను పుట్టినప్పుడే నీ దానిని.
    నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నిన్నే వివాహం చేసుకుంటాను. విధివక్రించి అది సాధ్యపడకపోతే నిశ్చితంగా చచ్చిపోతాను. నీవు లేని నేను లేను. నిన్ను కాపాడుకోవటం నా విధి. అంతకుమించి నేను చేసిన ఘనకార్యమేమున్నది సోమదేవా."
    ఆమె తన మాటలు ముగించి తలెత్తి సోమదేవుని కన్నులలోకి చూచింది. దివిటీల వెలుగులో అతని కన్నులు తళుక్కుమన్నాయి.
    ఔను మరి. అని సజలనయనాలు!
    "వేమా! నువ్వు నాకొక వాగ్దానం చెయ్యాలి" అర్ధించాడు. "ఏమిటది? నా వద్ద నీవు అడిగి తీసుకోవలసింది ఏమీలేదు."
    "నీవు వెంటనే కొండవీడు వెళ్ళిపోవాలి."
    "భళ్ళున తెల్లారింది. మాచారెడ్డి సైన్యాలను తీసుకుని కొండవీటి సైన్యాలను కలిశాడు. విజయనగర సైన్యాలు వెనుకంజ వేశాయి. సోమదేవుడు సూర్యుడై విక్రమించాడు. అతని విజయపతాక నిను వీధుల్లో రెపరెపలాడుతోంది. వీరరసావేశంతో అతని ముఖం ఉదయించే సూర్యునివలె ఎర్రగా వుంది.
    ఆ సమయానికి ఒక ఏనుగు మీద హౌడా, దాని వెనుకనే ఒక సైంధవాశ్యమూ కొండవీటి దిశగా సాగిపోతున్నాయి. ఆ చాయ పసిగట్టిన సోమదేవుడు బంధవిముక్తుడై వనరాజులాగ విజృంభించాడు. చౌండ సామాత్యుడు సోమదేవుని ఎదురు వీరులందర్ని వెనుకంజ వేయ సైగలు పంపాడు. వారు ఇతని విక్రమానికి విలువలేక అంతకుముందే వెనుకంజలో ఉన్నారు. అతని దక్షణ భాగాన మాచారెడ్డి కైజీతగాండ్లకు నాయకుడై విజృంభించాడు. వామపక్షాన యక్కటి వీరులు మూలగూరమ్మ మనసులో నింపి విజయనగర వీరులపై విరుచుకుపడ్డారు.
    ఇటు దక్షిణ భాగాన మాచారెడ్డిని ఎదిరిస్తూ విజయనగర సైన్యాలు అట్లే నిలిచాయి. అటు యక్కటి వీరుల్ని ఎదిరిస్తూనూ అలానే నిలిచాయి. మధ్యలోనున్న సోమదేవుడు మాత్రం లోలోపలికి చొచ్చుకుపోయాడు. పోవలసినంత దూరం పోయాడని భావించాక చౌండపామాత్యుడు తన సైన్యాలను పురికొల్పాడు. మాచారెడ్డితోనూ, యక్కటి వీరులతోనూ పారుతున్న సైనికుడు వెనుదిరిగి సోమదేవుడు వెనుకకు వచ్చే దారిని మూసివేశారు. మాచారెడ్డి యక్కటి వీరులూ వారి పలాయనం చూచి మరింత విజృంభించారు. విజయనగర సైన్యాలు పారిపోయాయి. వాటి మధ్యలో అసహాయ శూరుడై యుద్ధం కొనసాగిస్తున్న సోమదేవుడు బందీగా చిక్కాడు.
    చౌండపామాత్యుడు (చౌండవనాయకుడు) కోరుకున్నది కూడ అదే! లేకపోతే అతని ప్రతిష్ట దెబ్బతినిపోయేది. కొండవీటి సైనికులు సహాయం అందగానే విజయం మీద ఆశ వదలిన అతనికి ఇప్పుడే అవకాశం పేదకు పెన్నిధిలా దొరికింది.
    అతను సంతోషంతో పలాయనం చిత్తగించాడు. కొండవీటి సైనికులు బిక్కమొఖంతో విజయాన్ని స్వీకరించాయి. విధి ఎంత విచిత్రమైన పనులు చేస్తూ వుంటుందో! ఒక ఉదాహరణగా ఈ ఘట్టం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. దక్షిణాపధాన వీరాభిమన్యుడుగా ప్రస్తుతించబడిన సోమదేవుడు బందీగా విజయనగరం తీసుకుపోబడ్డాడు. మాచారెడ్డి సైనికులను తీసుకొని కొండవీడు చేరాడు. కోమటి వేమారెడ్డి వుట్టి మునిగిపోయిందని బాధపడుతున్నాడు. రాచవేముడూ, తురగా రామయ్యా తమ కార్యక్రమాల్లో మునిగి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పెద్దియజ్వ, శ్రీనాథయ్యా కలసి సోమదేవుడిని విడిపించుకుని వచ్చేందుకు ఒక బృహత్తర పథకం తయారుచేశారు. కంచుఢక్క పగులకొట్టవలసిన మరొక పని కూడ ఉన్నదయ్యె!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS