Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 21

 

        కందుకూరి జనార్ధనాష్టకము

     సిరులు మించిన పసిమి బంగారు జిలుగు దుప్పటి జారగా
    చరణపద్మముమీద దేహము చంద్రకాంతులు దేరగా
    మురువు చూపగ వచ్చినావో మోహనాకృతి మీరగా
    గరుడవాహన దనుజమర్దన కందుకూరిజనార్దనా!        212
    
    ఆనపెట్టిన రాకపోతివి ఆయెబో అటు మొన్ననూ
    పూనిపిలువగా వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
    నేను చూడగ గడచిపోతివి నీటు చేసుకు నిన్న నూ
    కానిలేరా!  దనుజమర్దన కందుకూరిజనార్దనా!        213
    
    నిన్న రాతిరి చవిక లోపల నీవు చెలి కూడుంటిరా
    ఉన్న మార్గము లన్నియును నే నొక తెచేతను వింటిరా
    విన్న మాత్రమూ గాదురా నిను వీధిలో కనుగొంటిరా
    కన్నులారా  దనుజమర్దన కందుకూరిజనార్దనా!        214

    బిత్తరంబున మొలక కెంపులు పెదవి నేవ్వతే ఉంచేరా
    గుత్తమైన మిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా
    చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతే నొక్కెరా
    కత్తిగోరుల  దనుజమర్దన కందుకూరిజనార్దనా!        215
    
    దబ్బులన్నియు తెలుసుకుంటిని తప్పు బాసలు సేయకూ
    మబ్బుదేరెడికన్ను గవతో మాటిమాటికి డాయకూ
    ఉబ్బుచెసుక తత్తరంబున నొడలి పై చెయి వేయకూ
    గబ్బితనమున  దనుజమర్దన కందుకూరిజనార్దనా!        216
    
    అండబాయక కూడి యుంటివి ఆయె బోయెను నాటికి
    ఖండి మండిపడంగనేటికి కదలు మెప్పటిచోటికి
    ఉండరా నీమాటలకు నేనోర్వజాలను మాటికి
    గండిదొంగవు  దనుజమర్దన కందుకూరిజనార్దనా!        217
    
    ఆలుకలన్నియు దీర నివు నాఅండ కెప్పుడు  వస్తివి
    పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివి
    వలచి వలపించియును  గూరిమి వదల కెప్పుడు మెస్తివి
    కలసి వేడుక  దనుజమర్దన కందుకూరిజనార్దనా!        218

    కొదవ లన్నియు దీర్చుకొంటివి గుణము వేరిగీ శయ్యను
    అద నెరిగి నన్నే లితివి విరవాదివూవుల శయ్యను
    మదనకేళికి నీవె జాణవు మారుతాపము మాన్పరా
    కదియ రారా  దనుజమర్దన కందుకూరిజనార్దనా!        219


        నయన రగడ  (శివ భక్తీ దీపిక )

    శ్రీ పార్వతీశుఁ జూడక
    పాపాత్ముఁడ నగుచుఁ బోవఁ బధమునఁ జక్షుల్
    దీపించు దృష్టి తొలఁగిన
    శ్రీపతి నడుగంగఁ గర్త శివుఁడని చెప్పే.            220

    శ్రీశైలవల్లభుని శిఖరంబుఁబొడగంటి
    కాశీపురాధీశు గౌరీశుఁ బొడగంటి
    సర్వలోకేశ్వరుని సర్వేశుఁ బొడగంటి
    సర్వసంరక్షకుని సర్వంబుఁ బొడగంటి
    పరమాత్ము నీశానుఁ బరమేశుఁ బొడగంటి
    పరమ యోగీంద్ర హృత్పదనిలయుఁ బొడగంటి
    చంద్రార్క శతకోటి సంకాశుఁ బొడగంటి
    చంద్రార్క శిఖినేత్రు శంకరునిఁ బొడగంటి
    రూపింపఁ బ్రకటస్వరూపంబుఁ బొడగంటి
    నపరంజ్యోతియై యమరుదేవునిఁ గంటి    
    వేదంబు లీశ్వరుని వినుతింపఁ బొడగంటి
    నాదిదేవుఁడు రుద్రుఁడని శ్రుతులఁ బొడగంటి
    శ్రుతి 'యేక ఏవ రుద్రో ' యనఁగఁ బొడగంటి
    శ్రుతి 'పరంబ్రహ్మ' మని శూలిఁ బల్కు టఁగంటి
    ముక్కంటికై శ్రుతుల్ మ్రొక్కఁగాఁ బొడగంటి
    ముక్కంటి లీలచే మ్రోయచుండఁగఁ గంటి
    భర్గుఁడే తత్పరాత్పరుఁడనఁగఁ బొడగంటి
    భర్గుఁ డర్కునీలోనఁ బ్రభ వెలుంగుటఁగంటి
    బ్రహ్మాండముల కోట్లు భర్గులోఁ బొడగంటి
    బ్రహ్మండ మాలికా భరణభూషితుఁ గంటి
    విశ్వరూపబైన విశ్వేశుఁ బొడగంటి
    విశ్వచక్షుని విశ్వవేద్యు నభవుని ఁ గంటి'    
    మూఁడు మూర్తుల కాదిమూర్తి దేవుని గంటి
    మూఁడు మూర్తులలోన ముక్కంటిఁ బొడగంటి
    నష్టమూర్తుల కీర్తు లమరంగఁ బొడగంటి
    నిష్ఠభోగములెల్ల నిచ్చు వేల్పని కంటి
    నజ్ఞానతి మిరసంహర సూర్యునిఁ గంటి
    సుజ్ఞాన సంశీల సులభ మోక్షముఁ గంటి
    నక్షరత్రయరూప మక్షయునిఁ బొడగంటి
    దక్షాద్వరధ్వంస ధన్యవేషునిఁ గంటి
    విమలాత్ము నాద్యంత విరహితునిఁ బొడగంటిఁ
    గమలలోచన నయనకమల పూజితుఁ గంటి''
    వృషభెంద్రవాహనుని విషకంఠుఁ బొడగంటి
    వృషభధ్వజుండైన వేద వేద్యునిఁ గంటి
    ధవళసంకాశంబు దశబాహుఁ బొడగంటి
    భవదుఃఖ సంహారుఁ బంచవదనుని గంటి
    పురవైరి నందకాసుర వైరిఁ బొడగంటి
    కరివైరి గంకాళకరధాముఁ బొడగంటిఁ    
    గారుణ్య సాగరునిఁ గల్యాణుఁ బొడగంటి
    నారాయణప్రియుని నాగకంకణుఁ గంటి
    మహినొప్పు శ్రీశైల మహిమ నేఁ బొడగంటి
    బహువేదశాస్త్రముల్ వ్రణుతి సేయుటఁ గంటి
    భూలోకకైలాస పుర మనఁగఁ బొడగంటి
    ఫాలాక్షుఁడచ్చోటఁ బాయకుండుటఁ గంటి
    ధృతిఁ దూర్పు మొగసాల త్రిపురాంతకముఁ గంటి
    నతులజ్యోతిర్లింగ మట యామ్యమునఁ గంటిఁ
    బలు వశ్చిమద్వార బ్రహ్మేశ్వరముఁ గంటి
    జెలు వొందు నుత్తర శ్రీమహేశ్వరుఁ గంటి
    క్షితి లక్షకోట్లకును శివతీర్ధములు గంటి
    చతురొప్పఁ బది కోట్ల శక్తి రూపులఁ గంటి
    దివ్యస్థలంబులను దివ్యులను బొడగంటి
    దివ్యయోగీంద్రులను దివ్యమహిమలఁ గంటి
    రంగొందు పాతాళ గంగ నేఁ బొడగంటి
    గంగపాతాళంబు గంగఁ గలియుటఁ గంటి
    గంగలోఁ ద్రిజగముల్ గదలకుండుటఁ గంటి
    గంగలో సురమునులు గదలకుండుటఁ గంటిఁ
    ఋణ్య కుండము లెల్లఁ బొలుపారు నని కంటిఁ
    సరి నొప్పు బంగారు శైలంబుఁ బొడగంటి
    బరికింప నవరత్న పర్వతంబులు గంటి
    నెనసి యోగస్థలము లెల్లచోఁ బొడగంటి
    ఘనబిలంబులు గుహలు గహ్వరంబులు గంటి
    కామరూపుల గిరులఁ గణఁకతోఁ బొడగంటి
    కామరూపుల నున్న కల్పతరువులఁ గంటిఁ
    జరపర్వతంబులును జరవృక్షములు గంటి
    ధరణిఁ బ్రోద్దోకచాయ తరులు గిరులును గంటి
    గిరులు నీడలు లేక క్రిక్కిఱియఁ బొడగంటి
    తరులు నీడలు లేక తనరుచుండుటఁ గంటి
    నీడ దిరుగని శైలనికరంబుఁ బొడగంటి
    నీడ దిరుగని  తరులు నియతి నుండుటఁ గంటి
    వృక్ష మొక్కటి సర్వ వృక్ష ఫలములు గంటి    
    వృక్ష మొక్కటి సర్వ వృక్షజాతులు గంటి
    నగవక్షి మృగతరులు నాట్యమాడుటఁ గంటి
    నగపక్షి మృగతరులు నాథుఁ గొల్పుటఁ గంటి


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS