ఒకరు కీర్తిని అభినందించారు.
మరొకరు పొగడలతో ముంచేశారు.
వేరొకరు చేసిన పనిని కీర్తించారు.
ఇంకొకరు ముక్కు సూటిగ మాట్లాడారు.
ఇంక కీర్తి వంతు వచ్చింది.
కీర్తి తన కుర్చీలోంచి లేచి నిలబడి ముకిళిత హస్తాలతో అక్కడున్న అందరికి నమస్కారం పెట్టింది.
చాలా విషయాలలో స్త్రీకిపురుషునికి సహస్రవారతేడా వుంటుంది, అందగాడైన మగాడుగాని పెద్ద పదవిలో వున్న మగాడుగానివందమంది మధ్యలోకి వస్తే పనిగట్టుకుని అతడిని ఆడామగా ఎవరూ చూడరు. పనిగట్టుకుని పదిమందీ చూసేది యాక్టరుని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని అలాంటి ఏ కొద్ది మందినో అదైనా చెప్పాపెట్టకుండా ఏ అట్టహాసం లేకుండా మామూలుగ వంటరిగ వస్తే అతగాడిని ఎవరూ పట్టించుకోరు.
అదే ఆడది అయితేచాలు. తీర్చిదిద్దినట్లున్న అవయవాలు, ముగ్ధ మనోహర రూపం వుంటే యింక చెప్పేపని లేదు, అందానికి తోడు పదవి తోడైతే ఆ దరిచూపులు ఆమె పైనే.
కీర్తి అందంగ వుంటుంది.
కీర్తి మాంచి హైటు దానికి తగ్గ వెయిటు.
అలా అని కీర్తి మొరటుగ వుండదు. తీర్చిదిద్దిన అవయవాలతో మళ్ళీమళ్ళీ చూసేలావుంటుంది. కీర్తి డ్యూటీలోవున్నప్పుడు రకరకాల మారు వేషాలు వేయాల్సి వస్తుంది. పురుషుడి వేషం, అందులో మళ్ళీ రకాలు. ఇలా ఎన్నో వేయాల్సివస్తుంది. పొట్టి బుడంకాయ వేషం తప్పించి ఏ వేషం వేసినా కీర్తిని ఎవరూ ఆనవాలు పట్టలేదు. కీర్తి మారు వేషాలకి అలా సరిపోతుంది.
వేసిన వేషానికి తగ్గట్లు పలు రకాలుగ కంఠస్వరం మార్చి మాట్లాడగలదు. ఉడుంపట్టు దగ్గరనుంచీ కుంగ్ ఫూ వరకూ నేర్చుకుంది. ఏ కేసులో దూరినా విజయంతో తిరిగి రావాల్సిందే. అందుకే క్లిష్టమైన చాలా కేసులని కీర్తికే అప్పగిస్తుంటారు సి.ఐ.డి. డిపార్ట్ మెంటువారు.
అప్పగించిన కొన్ని కేసులు ప్రప్రధమంలోనే దిగ్విజయంగపూర్తి చేయటంతో ఇంటల్ జెంట్ వారు నెం.ఎ.స్థానానికి కీర్తిని ప్రమోట్ చేశారు. అందుకే చిన్న వయసులోఇనే డ్యూటీ విషయంలో పెద్ద తల కాయలకి సరిసమానం అయింది. అందుకే అందరి పెద్దల అభినందనలు.
అక్కడ సమావేశం అయిన వాళ్ళలో డాక్టర్లు పోలీసు డిపార్ట్ మెంటులోని నలుగురు ప్రముఖులు, ఓ పత్రిక విలేఖరి, క్రైమ్ మాసపత్రిక ఎడిటరు కొందరు బడావ్యాపారస్తులు, మొదలైనవారు కాగా, ఇన్స్ పెక్టర్ శివకాంత్ వున్నారు.
ఇన్ స్పెక్టర్ శివకాంత్ అంతో యింతో అందగాడే, అందులో సందేహంలేదు. అయితే అమూల్ బేబీలాగా బొద్దుగ తెల్లగ వుంటాడు. కొండొకచో కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోయేరకం. అతనిలోని ఆమెతకతనం చూసి కొందరు తెలివిగ పబ్బం గడుపుకుంటుంటారు.
ఇన్ పెక్టర్ శివకాంత్ అసలు పేరు శివరావు. ఆ పేరు వల్ల పూర్వం సినిమాల్లో నటించిన కస్తూరి శివరావు గుర్తుకురావటం వల్ల తన పేరు కాస్త ఫేషస్ గ మార్చుకొని శివకాంత్ అని చదువుకునే రోజుల్లోనే మార్చాడు.
ఇన్ స్పెక్టర్ శివకాంత్ పేరే శివరావని ఎవరికీ తెలియదు పాత వాళ్ళకి ఏ కొద్ది మందికో తప్ప.
శివకాంత్ కీర్తిని ప్రేమించాడు. అయితే అతనిది వన్ సైడ్ లవ్.
శివకాంత్ మనసు కీర్తికి తెలుసు. కాని కీర్తి అతడిని మిత్రుడిగ ఆప్తుడిగా భావిస్తుందామె కాని ప్రేమికుడిగ భర్తగ కలలోనైనా వూహించలేదు. ఐ లవ్ యూ అని చెప్పే ధైర్యం శివకాంత్ కి బొత్తిగా లేదు. యిది తెలుసు కీర్తికి.
కీర్తి తన కుర్చీలోంచి మాట్లాడటానికి లేవంగానే అందరి కళ్ళతో పాటు శివకాంత్ కళ్ళుకూడా కీర్తినే చూస్తూ అలానిలిచాయి.
కీర్తి మృదు మధురంగ పెదవి కదిపింది.
16
ఈర్తి అందరికి నమస్కారం పెట్టి "అందరికి ఇందరి ఆప్తులకి వందనాలు అభినందనాలు." అంది.
అందరూ చిరునవ్వులు చిలికించారు.
"ప్రతి విషయంలో కీర్తిది ఓ ప్రత్యేకత." అనుకున్నాడు ఇన్ స్పెక్టర్ శివకాంత్.
కీర్తి ఖరీదైన గద్వాల్ పెద్దంచు జరీ చీర కట్టుకుంది. పింక్ కలర్ చీరలో ముక్కే జాకెట్టు కుట్టటం వల్ల చేతికి జరీఅంచు వచ్చి అందంగా వుంది. ఓ చేతికి సీకో వాచీ మరోచేతికి కంకణంలా వకే గాజు లావుపాటిది వేసుకుంది. మెడలో ఖరీదైన ముత్యాలదండ వుంది. అంతకు మించి పెద్దగ అలంకరణ ఏమీలేదు. అయినా అణువణువున అందం తొణికిసలాడుతూంది.
కీర్తి చెప్పుకు పోతున్నది.
"మనం ఎంత ప్రయత్నం చేసినా అనుకున్నవి కొన్ని అనుకోని విధంగ జరిగి పోతుంటాయి. ఉదాహరణకి ఈకేసు....ఈ స్పైడర్ కేసు విషయమేతీసుకుందాం. ఓ దేశ ద్రోహుల ముఠా వుందని దేశాన్నే తాకట్టు పెట్టటానికి సిద్దమైందని మన మిలటరీ రహస్యాలను వాళ్ళకి అనగా ఇతర దేశాలకు పెద్ద మొత్తాలకి అమ్ముతుందని తెలిసింది. ఈ కేసు నాకప్పగించారు. అయితే నేను వంటరిగాకాక మరి కొందరు మా డిపార్టుమెంటు వాళ్ళు కూడా ఈ కేసులో పని చేస్తున్నాము.
