"ఆ అమ్మాయి పేరేమిటి?"
"ఐశ్వర్య" చెప్పింది యమున. ఆమెకు ఇదంతా కంగారుగా, భయంగా ఉంది.
"ఐశ్వర్యా...?" అనుమానంగా అడీగాడు ఆ అధికారి
"అవును" చెప్పింది యమున.
ఆ అధికారి తన జేబులో వున్న ఫోటోని తీసి చూపించబోయెడు.
సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. ఆ అధికారి అనుమానంగా ఫోన్ వైపు చూసి, రీసివార్ లిప్ట్ చేశాడు.
"హలో... అనవసరంగా హాస్టల్ లో ఆ అమాయకులను అడిగితె ఏం చెబుతారు? నేను హాస్టల్ బయటే వున్నాను. మీకు గట్స్ వుంటే నన్ను పట్టుకొండ..." పహోన్ డిస్ కనెక్ట్ అయింది.
ఆ అధికారి వెంటనే బయటకు నడిచాడు. తన కింద అధికారులకు అదేశాలిచ్చాడు. ఆ రోడ్డు మొత్తానికి బ్లాక్ చేయమని చెప్పాడు.
ఆ స్ట్రీట్ మొత్తం మఫ్టీ ఫోలీసులతో నిండిపోయింది.
***
టెలీఫోన్ బూత్ లో నుంచి బయటకు వచ్చింది. అప్పటికే పంజాగుట్టదాటింది. తను కనిపించకపోతే నేక్సేట్ ఆల్టర్ నేటివ్ గా హాస్టల్ లో వున్న అమ్మాయిలను ఎంక్వయిరీ చేస్తారని తెలుసు. తన ఆచూకీ చెప్పమని...
వాళ్ళని ఇబ్బంది పెడతారు అనవసంగా వాళ్ళని ఇబ్బందిల్లోకి నెట్టడం ఇష్టంలేదు. అందుకే ఓ పబ్లిక్ టెలీఫోన్ బూత్ దగ్గర ఆగి హాస్టల్ కు ఫోన్ చేసింది.
ఆ పహోన్ డిఫెన్స్ వాళ్ళు రుసీవ్ చేసుకుంటారని తెలుసు... తన ఫోన్ కల రీసేవ్ చేసుకుని, తను దొరుకుతుందన్న నమ్మకంతో హాస్టల్ అమ్మాయిలను వదిలేస్తారు. ఆమె ట్రిక్ ఫలించింది.
***
తను ఈ ప్రాతం నుంచి తప్పించుకోవాలి... ఈ పతికి నగరమంతా తన గురించి గాలించడం మొదలు పెడతారు. ఓ వైపు ఫోలీసులు, మరో వైపు డిఫెన్స్, ఇంకోవైపు శంశార్ దాదా మనుషులు.
అ ప్రమాదకరమైన ఆ మనుషుల బారి నుంచి తను ఎలా తప్పించుకోగలదు...అయిపోయింది... తనకు వున్న ఒక్కగా నొక్క షెల్టర్ లేకుండా పోయింది.
పంజాగుట్ట నుంచి ఖైతరాబాద్ వైపు వెళ్తోంది. ప్లీ ఓవర్ మీదుగా ఆమె ఎక్కినా ఆటో వెళ్తోంది. ప్లీ ఓవర్ చివర ఓ పావుక్లీసు జెపు ఆగి ఉంది. దూరంనుంచే గమనించింది మృదువని.
"ఆటో... ఒక్కసారి ఆపు..." అంది.
"ఏంటి మేడమ్ ?" అడిగాడు ఆటో ఆపి.
"ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి... సెల్ మరచిపోయాను. పంజాగుట్టకు పోనీ" అంది.
"ఇది వాన్ వే మేడమ్ . ముందుకు వెళ్ళి ప్లీ ఓవర్ చివరి నుంచి టర్న్ చేసుకోవాలి."
"అంత దూరమూ... వద్దులే... నేను రోడ్డు క్రాస్ చేసి వెళ్తాను" అంటూ అతనికి డబ్బులు ఇచ్చి, ఆటో దిగి రోడ్డు క్రాస్ చేసి, మరో ఆటో ఎక్కింది.
***
"ఏమైంది... అటువైపు హడావిడిగా ఉంది..." అడిగింది మృదువని.
"ఎవరో ఓ టెర్రరిస్టు పారిపోయి వచ్చిందట... మీకు తెలుసా మేడమ్... టెర్రరిస్ట్ అంటే మగాడు కాదు. పాతికేళ్ళ అమ్మాయిట... అన్ని వెహికల్స్ ఆపి చెక్ చేస్తున్నారు..." చెప్పాడు ఆటోవాలా.
"అలాగా..." అంది.
"తను వూహించిందే కరేక్ట్..." అనుకుంది మృదువని పంజాగుట్ట దగ్గర ఆటో దిగింది.
ఇప్పుడు ఆమెకు ఎక్కడికి వెళ్తారో తోచలేదు. అప్పటికే రోడ్డు మీద జనం పల్చపడ్డారు. చలిపులి బారిన పడకుండా, త్వరగా ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నారు.
రాత్రి తొమ్మిది దాటింది. ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలి? ఏదైనా హొటల్ లో ఈ రాత్రి స్టే చేస్తే... అది చాలా ప్రమాదకరమైంది. హోటల్స్ ను కచ్చితంగా చెక్ చేస్తారు. పార్కుల్లో జనం ఎక్కువుగా ఉండరు. ఈజిగా తనని ఐడెంటిఫై చేయొచ్చు.
తనకు వున్న ఒకే ఒక పరిష్కారం, రైల్వేస్టేషన్ ఖచ్చితంగా రైల్వేస్టేషన్ లో కూడా నిఘా వుంటుందని తెలుసు. అయినా అంతకు మించి మార్గం లేదు.
ప్రయాణీకుల మధ్య తను కొంతలో కొంత సెప గా ఉండొచ్చు. ముఖ్యంగా షంషేర్ దాదా మనుషుల నుంచి కొంత సురిక్షతంగా ఉండొచ్చు.
తనిప్పుడు జాగ్రాత్తగా ఆచి, తూచి అడుగువేయాలి. ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది.
ఈ రాత్రి స్టేషన్ లో గడపాలి. వీలైతే రాత్రికి రాత్రే తను ఎక్కడికైనా వెళ్ళాలి...
***
రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది.
మిద నైట్ త్రేయిన్స్ వెళ్ళేవాళ్ళు, ట్రెయిన్స్ నుంచి దిగేవాళ్ళు, ఏ షెల్టరూ లేక రైల్వేస్టేషన్ ను ఆశ్రయించే వాళ్ళూ... వీళ్ళందరితో స్టేషన్ నిండిపోయి ఉంది. కొంగును తల మీదుగా కప్పుకుంది. ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకుని లోపలకి నడిచింది.
జనం ముసుగుతన్ని పడుకున్నారు. రెస్ట్ రూమ్ లో కూచోవాలని ఐడియా ఎప్పుడో వదులుకుంది.అది ప్రామదకరమని ఆమెకు తెలుసు. ఒకవేళ ప్రామదంలో పడితే,రెస్ట్ రూమ్ లో నుంచి ఎస్కేప్ అవ్వడం, ఇంపాజిబుల్...
ఎక్కువగా గుంపు వున్న ప్లేస్ చూసుకుని, ఆ గుంపుకు మద్యలో ఓ మూల ఒదిగి కూచుంది.
***
అప్పటికే నగరమంతా చాపకిందా నీరులా ఎలర్ట్ అయింది. డిఫెన్స్, పోలీసులు నగరంలోని ప్రతీ అంగుళాన్ని శోధిస్తూన్నారు. మరోపక్క షంషేర్దాదా.మనుషులు మృదువని కోసం అన్వేషిస్తున్నారు.
మృదువని పట్టుకుని షంషేర్ దాదాకు అప్పగించాలి. అక్కడితో వాళ్ళు ఎప్పయిన్ మెంట్ పూర్తవుతుంది. వాళ్ల చేతుల్లో కత్తులు, మారణాయుధాలు వున్నాయి.
ఒకవేళ, మృదువని ప్రాణాలతో పట్టుకోవడం సాద్యం కాకపోతే, ఫినిష్ చేయడానికి కూడా వాళ్ళు 'డీల్'కుదుర్చుకున్నారు.
ఎర్ పోర్ట్, బస్టాండులు చుట్టుముట్టారు. కొంతమంది రైల్వేస్టేషన్ కి వచ్చారు శాలువాలు కప్పుకుని, శాలువాల్లో మారణాయుధాలు పెట్టుకుని రైల్వేస్టేషన్ గాలిస్తున్నారు.
***
