Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 20

 

    ఉ.    నీవు త్రిలోకకర్తవని నే శిలనీటనువేసితెల్తు స
        త్పవని నీవెకాని మఱిదైవములేదని మడ్డుచూతు స
        ర్పవళిఁ బట్టి యంఘ్రితలమంటుదుఁ జూడుము బంటు శక్తుల
        దేవర వెంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ!

    ఉ.    నీపదభక్తీ నాహృదయనిర్మలపీఠిక నిల్చే నాభవం
        బేపు వహించే నాసుకృత మెర్పడే నేఁడు గదయ్య తండ్రి హృ
        త్పాపసముద్ర ముద్దవిడి దాటుట మీకరుణాకటాక్షపు
        దేపను వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ!

    చం.    నిద్దపుటాస్యరంగమున నిల్పి ప్రభోధపుఁ గాసెగట్టి యే
        ప్రొద్దును వెంటఁదంబు\రను బూనిచి తాత్త్విక నాట్యశాస్త్రపు
        బుద్దులు సెప్పి నా హృదయపుత్రిక మీకును మేలుపాడఁగా
        దిద్దితి వెంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ!

    చం.    గురుపదసాధనంబు లివిగో భవదమకము లుండుఁ జూడవో
        సిరి దళుకొత్తుచున్నయవి శ్రీ తులసీవనమాలికావళుల్
        మురిపెపుశంఖుచక్రములు ముద్రలు మీతిరు చూర్ణ రేఖలు
        దిరుమణి వేంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ!

    ఉ.    అక్షముఁడైన నేర కేదురాడిన దుర్జనుఁడైన తండ్రి సం
        రక్షణలేక బిడ్డఁడు సురక్షితుఁడై మనునే జగ త్రయా
        ధ్యక్షుఁడ వీపు దాసజనదక్షసురక్షణక్షిణక్షమా
        దీక్షిత వెంకటాచలపతీ కలశాంబుధి కన్యకాపతీ!

                  అలమేలు మంగాస్తవము
        
    సిరి నెఱి నీలపురంగు బెడంగుల - చిన్నరి పొన్నరి పెన్నేఱితురుముమ
    మురువగు పాపటచుక్క నుచుక్కను - మొత్తపు ముత్తెపు సరిసిందురమును
    
    నుదయారుణకరబింబ ప్రతిబిం - బోద్యద్దగధగీతశిరోమణియును
    ముదురరచందురు నుదురు చలములన్ - మొలచెనోయనజనుముఖతిరు మణియును
    పచ్చలరచ్చల బొగడల మొగడల - పజ్జలసజ్జల వజ్రపుమురువును
    విచ్చలవిడివిడి కెంపులమంపుల - విరివినేరవు కొనుబవిరేలహరువును
    మగరా కమ్మలకళ్కులతళ్కుల - మలచిన చక్కని చెక్కుల పెక్కును
    పగడపు జగడపు మోవిసుపాణియు- పసిమి మిసిమిగల ముక్కరనిక్కును
    చంపక సుమపరిహాసిక నాసిక - చక్కందనముల నింపగుసొంపును
    యొరపుగఁ బరపుగ దయకుదయంభై - యెలపుసొలపుదగు  చూపుల కోపులు
    మురిపెపు ముచ్చట ముసిముసినగవుల - మొలచిన చిలుకలకలుకుల ప్రోవులు
    కులుకు కలికివాలుందెలి గన్నుల - కొమరుల మరుతామర నగుమోమును
    అల చిందము చందము గలగళమున - నమరిన మంగళసూత్రపు గోమును
    తుదలమొదల సిరిమెలగు జతనల - దోల్కుకళ్కుకుతికంటుత్తండలు
    ఉదిరిపసిఁడి మొగ్గలనిగ్గుల జ - గ్గొందగఁ బొందగు సందిటిదండలు
    వలయపు సొలపుల ఝుణఝుణరవముల - వలనవలనమగు శ్రీహస్తమ్మును
    జక్కవనడకల చన్నుంగవపై - సౌరై తీరై తగుహారమ్ములు
    చిక్కఁగ ఁజక్కఁగ మేనంబూసిన - సిస్తగు కస్తూరి గాంబూరంబును
    నవనిధులును గల శ్రీవర్ణనక - ర్ణముల నేదుర్కొను మణి భుజకీర్తులు
    సవరణజల్ తార్ రైక నలుపు పై - చాందిన చక్కని పతి మలమూర్తులు
    చివ్వున నాభి బిలమ్మున వెడలిన - చీమల చాలనఁ దగు నూఁగారును
    చివ్వకు నాకౌ నీకౌ నని బలు - సింగముఁ జెనకెడు కౌనుందీరును
    మెచ్చుల కుచ్చెల నెరిపై నొరపై - మేలఁగి చెలఁగు మణికాంచీదామము
    గ్రుచ్చుకొనఁగ మానికమున్ జెక్కిన - కొలుకుల యుడ్యాణపుబలు సీమము
    కిసమసనిసుమున్ దీవులఠీ వులఁ - గేరు తీరుపిరుదరుదు నొయారము
    మినుకుమినుకుమని కదలిన మెరసెడు - మెఱుఁగు టోయారపుటూరుల బీరము
    నందంబు హళాహళికాహళి యఱ - పఱఁదఱమిన జిగిబిగి చిఱుఁదొడలును
    కెందామరలన్ గని తా మరలన్ - గెలచిన మృదుపదముల నిలుకడలును
    చిటిపొటివ్రేశ్లన్ జిటుకు పోటుకు మనఁ - జిటికెడు మట్టపు మట్టెంభంగులు
    పెటుకున జిలిబిలి గలిబిలిగల బొ - బ్బిలి కాయల నిబ్బరపు టేలుంగులు
    బడిబడి గలుగలు గల్లన మొరసేడి - బంగరు టందియక వసింగారము
    నడుగుల పైఁబడు బడుగులగాచుట - కయిపెట్టిన గండర పెండారము
    శతకోటి రతి ప్రతిభాభాసుర - సౌందర్యపుఁ దిరుమేని విలాసము    
    సతతానత సంరక్షణదీక్షా - సంరంభ సమగ్రసముల్లాసము
    కలిగి చెలఁగు శ్రీ వెంకటనిలయుని - ఘన పక్షన్ స్థల సింహాసనమున
    నెలకొని యలమేల్మంగాదివ్య వి - నిర్మలనామమునంధగు ప్రియమున
    సకల జగమ్ముల బొజ్జను నిడికొని - సాకిన తల్లిని నినుఁగొనియాడెద
    ముకుళితకరకమలుఁడనై నీకున్ - మ్రొక్కెద నిఁక నాలేములు వీడేద
    మాం దీన మనాధం పాహి రమే - మకుటాలంకృత కల్పకకుసుమే
    మాం దేవి క్రుతార్ధం కురు పరమే - మంజులచంద్రస్పురదురుసుషమే
    తుభ్యం మంగళ మార్తశరణ్యే - తుభ్యం మంగళ మభిజనగణ్యీ
    శ్రీ వరలక్ష్మి జనని నమస్తే - క్షీరాంబుధి సజ్జనని నమస్తే
    భవభవాబ్జజ జనని నమస్తే - పాహి మాం జగజ్జగని నమస్తే.


          నవ శేషాచలనాథ నమస్తే
        
    శ్రీ వెంకటగిరి దేవ నమస్తే - నవ శేషాచలనాథ నమస్తే
    భూవినుత మహాపురుష నమస్తే - మీనశరీరము పూని సోమకుని
    చానడంచియును జదువులు ధాతకు - దయచేసిన మాదవుఁడ నమస్తే
    శరనిధి మంధరగిరి ముణిఁగినచో - గురు కమఠాకృతిఁ గుధురం బెత్తియు
    సురులకు నమృతము సూరగనిచ్చిన- పరమాత్మదయాపరుఁడ నమస్తే
    ధర చుట్టు కొనుచు దానవుఁ బొలిగొని - కిరిరూపంబున మెరసిలోకముల
    నలరించిన దైత్యారి నమస్తే - హరిఁ జూపర వోరని బాలుని పై
    చురచుర జూచెడు సురవైరిని నర - హరివై కంభమునందు జనించియుఁ
    బరిమార్చిన ఘనబలుఁడ నమస్తే - బలి నణఁగించెడు తలపున వటువై
    యిల మూఁ డడుగుల నిమ్మని వేడియు - పుడమియుదివి రెం డడుగులఁ
    కడుశూర త్రివిక్రముఁడ నమస్తే - ధరణీ వరులతి దర్భంబున మై (గొలిచిన
    మరచినవారల మర్దించుటకై - జమదగ్ని మునీశ్వరురాముఁడ వగు
    నమిత మహాసత్వాడ్య నమస్తే - రవికులమున దశరాధరాముఁడవై
    దివిజవైరిఁబం క్తి ముఖునిఁ గూల్చిన - మునిజనావనామోద నమస్తే
    ధరణి భారము పరిహరించుటకు - అరయఁగ వసుదేవాత్మజుఁడవై
    కంసాది మహాగర్వాంధుల వడి - హింసించిన లోకేశ నమస్తే  
    త్రిపుర రాక్షసస్త్రీల మానములు - నిపుణతఁ జెఱపగ నీవు బుద్దవై
    హరుచాపమ్మున శరమై నిల్చిన - సురలోకస్తుత సుగుణ నమస్తే
    తురగారోహణ మొనరంజేయుచు - మెర యుకల్కివయి తిరిగి జగమ్ముల
    నిరవుకొల్పు దేవేశ నమస్తే - పరగ ననంతాంతర రూపమ్ములు
    ధరియించి విరాట్పురుషుఁడు నీవై - పరమానందం బలరఁగ సుస్థిర
    పరుఁడగు శ్రీగోపాల నమస్తే - అపరాధసహాస్రానీకమ్ముల
    నపర బుద్దియుతుఁడై నేఁ జేసిన - గృపతోడుత రక్షింపగ వలయును
    విపుల బుద్దియును విమలజ్ఞానము- భవధంఘ్రిద్వయభక్తీయు నొసగుచు
    భువనపావనాంబుజ భవవందిత - మఱి మీగుణ గరిమంబుల నొప్పెడి    
    వరమంజరి యెవ్వరు పఠియించిన - వ్రాసిన విన్నాను వర సౌఖ్యమ్ములు        
    దాసీసుత మిత్రామోధమ్ము - దనకనక సమస్తేశ్వర్యములు
    ఆయుష్యములు చిరారోగ్యమ్ములు - చారురూపములు సకల విద్యలను
    ఘనసద్గుణములు పెను పొందుదు రిల - నీకృతి వసుమతి నినాచంద్రాదులు
    భూమీధరములు పోలుపగుతారలు - నెన్నివత్సరము లిరవై యుండేడు
    నన్ని హయనము లతి విలసితమై - యుండగ రక్షణ మొనరం జేయును
    పాండవపాలన పరమదయానిధి - తవదాసోహం తవదాసోహం
    నవశేషాచలనాధ నమస్తే - నవశేషాచలనాధ నమస్తే .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS