"ఏమిటది...? కుతూలంగా అడిగాడు చైర్మెన్.
"మనం ఓ స్టూడియోలో ఘాటింగ్పెట్టుకుందాం. అంతకు ముందే మన ఛానల్ లో 'యాడ్' కూడా ఇస్తాం... ప్రేమికులంతా ఈ ఘాటింగ్ కు అటెండ్ కావచ్చు... ఈ పరోగ్రాం పేరు ' డింగ్ డాంగ్ వేల్... ప్రేమ గంట ఎవరి మనసులో ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదు.
తను మనసులో వున్న ప్రమికుడు లడా ప్రియరాలి పేరును ప్రేక్షుకుల ముందు చెప్పే అవకాశం.... కెమెరా ముందుకు వచ్చి, తమ లవర్ పేరుని అనౌన్స్ చేయడమే ఈ పరోగ్రాం.
సరిగ్గా ఫిబ్రవరి 14,ఉదయం పది నుంచి రెండు గంటల వరకూ ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈవినింగ్ టెలికాస్ట్, టీవీ ద్వారా తమ లవర్స్ సదన్ సర్ ప్రయిజ్ కూడా చేయొచ్చు.
ఒక్కొక్కరు కెమెరా ముందుకు వచ్చి తమ లవర్ పేరు చెప్పాలి. వాళ్ళతో ఎప్పుడు పరిచయం అయింది, ఆ స్వీట్ మెమోరీస్ కూడా పంపకోవచ్చు..."
"వండర్ పుల్ ఇఅదియా... చాలా చక్కని యూత్ పుల్ ప్రోగ్రాం..." ఉత్సాహంగా, అభినందన పూర్వకంగా అన్నాడు చైర్మెన్ పరమహంస.
"థాంక్యూ సర్... దీనికి సంభందించిన యాడ్ తయారు చేశాను.." చెప్పాడు అంకిత్.
"ప్రోసీడ్ మై బోయ్... నీకేది కావాలన్నా, నన్ను అడగవలసిన పని కూడా లేదు... డైరెక్టర్ గా 'యాక్షన్' లోకి దిగెయ్... అల్ ది బెస్ట్.." అంటూ అంకిత్ చేయిని అభినందన పూర్వకంగా నొక్కి వదిలాడు.
***
ఫిబ్రవరి 13.
మృదువని చాలా ఎర్లీగా ఫ్రేషన్ అయింది. రోజూ ఉదయమే అందరికన్నా ముందు బయటకు వెళ్తుంది. ఈ రెండు రోజులూ చాలా టెన్షన్ గా గడిపింది.
రోజు రోజుకూ ఆమెలో అనుమానం పెరుగుతూ వుంది. ఓ పక్క శరణ్య గురించిన అందోళన.
అప్పటికే శరణ్య తనకు ఫోన్ చేసి రెండు రోజులైంది. శరణ్య కు ఏదైనా ప్రమాదం సంభవించిందా? ఆమె మనసు ఏదో కీడును శంకిస్తోంది. రోజూ రాత్రి నిద్ర సరిగ్గా పట్టడంలేదు.
ఈ మధ్య యమున 'అరా' ఎక్కువ అవుతోంది. కావాలని కాకపోయినా ఏదో ఓ కారణంగా తన వివరాలు అడుగుతోంది. యమున నుంచి తప్పించుకోవాడానికి ఏ రాత్రివేళో వస్తూంది. యమున నిద్ర లేవకముందే బయటకు వెళ్తుంది. లంచ్, డిన్నర్ కూడా బయటే చేస్తోంది.
ఆ రోజూ కూడా ఉదయమే బయటకు వచ్చింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఎక్కడెక్కడో తిరిగింది. ఆమె ఆలోచనల్ని శరణ్య మీదే ఉన్నాయి. తన కోసం శరణ్య ఇబ్బందిలో పడింది. ఆ ఫీలింగే ఆమెలోని బాధాను రెట్టింపు చేస్తోంది.
ఎక్కడ, ఎవరు తనని చూసినా, వాళ్ళు పోలీసు లేమావునన్నా భయం, ఎక్కడ ఎవరు కనిపించినా, డిఫెన్స్ వాళ్లేమోనన్న భయం.
రాత్రి ఎనిమిది దాటుతూండగా, పెందర్ గాస్ట్ స్టేట్ దగ్గరకు వచ్చింది. ఆటోవాడు లోపలివరకూ రానని అన్నాడు. చలి విపరీతంగా ఉంది. చీరకొంగును తలనిండుగా కప్పుకుంది.
ఈ టైంకి అందరూ రూముల్లోకి దూరి ముసుగు తన్నేసి ఉంటారు... అనుకుంది. వడివడిగా హాస్టల్ వైపు నడక సాగించింది.
సరిగ్గా అరగంట క్రితమే ఆ హాస్టల్ ని పోలీసులు, డిఫెన్స్ వాళ్ళు చుట్టుముట్టారన్న వుశయం మృదువని తెలియదు. చాలా క్యాజువల్ గా హాస్టల్ ను సమీపిస్తుండగా కొంతమంది అగంతకులు హాస్టల్ చివర వుండే సందులో తచ్చాడటం గమనించింది.
మృదువని మేమేరీ పన్జేయడం ప్రారభించింది. బ్లాక్ టీషర్టు... షార్ట్ వుండే జేబు స్థానంలోక్వశ్చన్ మార్క్
ఎంబ్రాయిడరీ... డిఫెన్స్ లో పని చేసిన ఆమె మేమేరీ శార్ప్స్ గా పని చేస్తుంది. ఆ గుర్తుగల వ్యక్తులు షంషేర్ దాదా దగ్గర పనిచేసే కి..రా...యి...హం...త ...కు...లు.
***
షంషేర్ దాదా.
ప్యారలల్ ప్రభుత్వాన్ని నడిపించగల అతి శక్తివంతమైన మాఫియా సామాజ్యపు చీకటి అధిపతి ప్రభుత్వాధికారులను నటనో, భయానో, తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగల వ్యక్తి షంషేర్ దాదా.
అంటు అధికారపక్ష సభ్యులను, ఇటు ప్రతిపక్ష సభ్యులను డబ్బుతోనో, బ్లాక్ మేయిలింగ్ తోనో ఇబ్బంది పెట్టి తన గురించి ఏ మాత్రం దుమారం లేవకుండా చూసుకోగల సత్తా వున్న వ్యక్తి.
కిరాయి హంతకుల సైన్యాన్ని మెయింటేన్ చేసే షంషేర్ దాదా తో దిల్ కుదుర్చుకోవాలంటే పెద్ద తలకాయలే దిగి రావాలి. డిఫెన్స్ లో పనిచేసే మృదువని ఈ వివరాలు అన్నీ తెలుసు.
షంషేర్ దాదా ఏదైనా పనికి జేబు పురామాయిస్తే, ఆ పని పూర్తయ్యేసరికి, బ్లాక్ టీ షర్ట్స్ తోనే వుంటారు. జేబు స్థానంలో ల్వస్చన్ మార్క్ ఉంటుంది. ఇది పోలీసుశాకకూ తెలిసిన పచ్చినిజం.
***
మృదువని శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది.
అంటే, తనని చంపమని డిఫెన్స్ చీప్ షంషేర్ దాదాను అర్దిచాడా? తన కోసం కిరాయి హంతకులు బయల్దేరారా? ఓ పక్క పోలీసులు, మరో పక్కా డిఫెన్స్, ఇమ్కావుపక్కా షంషేర్ దాదా మనుషులు.
తను విష వలయంలో కూరుకుపోయిందా? ఆమె మెదడు చురుగ్గా పన్జేస్తుంది ముందు తను ఇక్కడ్నుంచి బయటపడాలి.
ఆ ఆలోచన రావడంతోనే మృదువని నిశబ్దంగా వెనుతిరిగింది.
***
వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లో కలకలం చెలరేగింది.
అందరూ డైనింగ్ హాలులో కూచొని డిన్నర్ తీసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే హాస్టల్ ప్రేమిసిస్ లోకి పోలీసులు జీవులు, డిఫెన్స్ వెహికల్స్ వచ్చి ఆగాయి.
హాస్టల్ వార్డెన్ కంగారుగా బయటకు వచ్చింది. పోలీసులు చూసి షాకయింది. "ఏమిటి సార్..." అంటూ అడిగింది.
"మీ హాస్టల్ లో కొత్తగా ఏ అమ్మాయి అయినా వచ్చిందా?" అడిగాడో డిఫెన్స్ అధికారి కరుగ్గా.
వార్డెన్ భయంగా చెప్పింది. "కొత్తగా ఎవరూ జాయిన్ కీలేదు... కానీ..."
"కానీ?"
"ఓ అమ్మాయి టెంపరరీగా షెల్టర్ తీసుకుంది" వార్డెన్ చెప్పింది.
