పంచవటికి పోవు దారిలో సీతారామ లక్ష్మణులకోక పెద్ద మఱ్ఱిచెట్టు కనపడినది. ఆ వృక్షము శాఖపై పెద్ద గద్ద యొకటి వాలియున్నది. ఆ మహా గృధ్రముఱెక్కలున్న మైనాక పర్వతమంత మేనునూ, గండభేరుండములను కూడ కబళించుటకు తగినంత వెడల్పాటి నోరునూ, ఎర్రగా గుండ్రముగా నున్న కనుదోయినీ వాడి గోళ్ళు కల చరణ యుగ్మమునూ కలిగి యుండి భయంకరముగ కనబడినది.
సీత రామ లక్ష్మణులకు ఆ విహగరాజమును చూపుచూ "దశథాత్మజులారా, ఆ వృక్షముపైన పక్షి రూపమునున్న వాడెవడో రాక్షసుడు!" అన్నది.
జానకి మాటలను విన్నవక్షీంద్రుడు "తల్లీ నేను రాక్షసుడను కాను. వినత జ్యేష్ఠపుత్రుడగు అనూరుని రెండవ కుమారుడను. శ్రీమహావిష్ణువు వాహనమగు గరుత్మంతుడు నా పినతండ్రి. నా పేరు జాటయువు. నా అగ్రజుని నామధేయము సంపాతి. అతడోకనాడు నాతో "తమ్ముడా మనము సూర్యమండలము వరకును ఎగిరి పోయి మన రెక్కల బలమును పరీక్షించుకొందము రమ్ము" అన్నాడు. సూర్య గోళము ఉష్ణమయమనియూ దానిని సమీపించినచో ప్రమాదమునకు లోనయ్యెదమనియూ మాకు తెలియదు. ఇరువురామూ పైకి ఎగిరి ఆకసమును చోరబడిపోయి మార్తాండ మండలమును ప్రవేశించినాము. ఇనుని (సూరుని) వేడిమికి నేను సోమ్మసిల్లుచుండుట గమనించి అగ్రజుడు తన విప్పారియున్న ఱెక్కలతో ప్రచండ భానునాకడ్డముగా నిలిచినాడు. అతడాందోలనతో 'తమ్ముడా ప్రమాదము! మరలిపోదము రమ్ము' అని హెచ్చరించినాడు. నేనేటులనో నేలను చేరుకొన కలిగినాను. అగ్రజుడు తన పక్ష యుగ్మముతో నన్ను రక్షుంచుచూ వచ్చుచున్నాడని అనుకొన్నాను కాని అతడు కనబడలేదు. ఏమైనాడు?.... అప్పుడు నాకు మిక్కిలి విషాదకరమైన ఆ ఆలోచన వచ్చినది: మధ్యందిన మార్తండునయుష్ణ మగ్రజుని రెక్కలను దహించి యుండుననియూ పక్షరహితుడైన వెంటనే అతడెచటనో పడిపోయి యుండుననియూ తోచినది. ఎక్కడ పదేనో జీవించి యుండెనో లేదో తెలియక దుఃఖించినాను.
సీత: పతంగ పుంగవా నీవు సూర్యుని సారధియైన అనూరుని తనయుడవనియూ గరుడ భాగవానుడు. మీ పినతండ్రి యనియూ తెలియక అన్యదా భావించినాను. నా యువధమును మన్నించగోరుచున్నాను.
జాటాయువు" తల్లీ వీరు దశరథాత్మజులని తెలియజేసి నాకు ఆనందమును కలుగజేసినావు. దశరథ మహారాజు మా తండ్రికి మిత్రుడు. యువకులారా, మీ నామధేయములను తెలుపుడు. మీరీ దక్షిణాపథము ననేక్కడకు పోవుచున్నారు.?
రాముడు: నేను దశరథనందనులలో జ్యేష్టుడను నన్ను 'రాముడు' అని పిలిచెదరు. ఈ నా తమ్ముడు లక్ష్మణుడు. ఈమె నా పత్ని సీత. మేము పంచవటికి పోవుచున్నాము. అచ్చట వర్నశాలను నిర్మంచుకొని వసించెదము.
జటాయువు: నేనునూ పంచవటి సమీపముననె వసించుచున్నాను. ఎప్పుడు నా సహాయము కావలసిననూ తీసికోనుటకు సందేహించకుడు. శ్రీమహావిష్ణువును గరుత్మంతుడు వలె మిమ్ము నేనంత దూరమైననూ వహించి తీసికొని పోగలను. ఎంత దూరమైనను ఎగిరివెళ్లి కార్యమును సాధించి రాగలను.
మీరిరువురునూ ఫలముల కొరకు గాని సమిథలకై కాని అడవిలోనికి పోయినపుడు ఈ సీతమ్మ తల్లికి క్రూరమృగముల వలన ప్రమాదము కలుగకుండ పర్ణశాల ప్రాంగణమున రక్షకునిగా నిలువగలను.
సీతారామ లక్ష్మణులు ఆ వక్షీంద్రుని అపూర్వభిమానమునకు సంతోషించినారు. ఆ పక్షీంద్రుని తండ్రిని వలె గౌరవించి సెలవు తీసుకొని ,ముందుకు సాగినారు. పంచవాటిని చేరుటతోనే లక్ష్మణుడొక రమణీయ స్ధలమున వర్ణశాలను నిర్మించినాడు. వారికచ్చట ఒడుదుడుకులు లేకుండా కాలము గడువసాగినది. * * *
శూర్పనఖ
లంకేశ్వరుడగు రావణునకు ఇద్దరు అనుజులు. వారిలో ప్రథముడు కుంభకర్ణుడు. ద్వితీయుడు విభీషణుడు. వారి పినతల్లికి ముగ్గురు సంతానము. మొదటిది శూర్పనఖ. రెండవవాడు ఖరుడు, తృతీయుడు దూషణుడు. ఆ అక్కచెల్లెండ్ర సంతాన మారుగురిలో శూర్పనఖ పెద్దది. తమ్ములైదుగురకును ఆమె యెడల ప్రేమాభిమానములు మెండు.
దండకారణ్యమున ఋషులు కల భాగమును 'జన స్థానమం'దురు. రావణుడు పదునాలుగు వేల రాక్షస వీరులను జనస్థానమున నిలిపి దానికొక సైనిక స్థావరముగ జేసినాడు. ఖరుని అధిపతిగను దూషణుని సేనాధిపతిగను నియమించినాడు. వేలాది రాక్షస సైనికుల సాన్నిధ్యము అచ్చటి ఋషులకు నిత్యోపద్రపకారమైనది.
జనస్థానమునకు దగ్గరలోనే పంచవటి యున్నది. ఒకనాడు యధేచ్చముగ తిరుగుచూ శూర్పణఖ పర్ణశాలలోని సీతారామ లక్ష్మణులను చూచినది. ఆ రాక్షసాంగన రాముని అంధచందములను తిలకించి మోహపరవశయైనది. "యువకుడా నిన్ను నేను వలచినాను. నేను కామరూపిని. ఎంత అందగత్తెగా మారి రమ్మన్ననూ మారివచ్చి నీకు సుఖమునందించెదను. నీ పక్కనున్న ఈ అర్భకురాలు నీకు భార్యగా నుండుటకు తగదు. నన్ను పెండ్లియాడుము అనెను.
రాముడు: నేను ఏకపత్నీవ్రతుడను. నీ విచటినుండి తొలగిపొమ్ము.
శూర్పనఖ: నేనీ ఒక్కదానిని భక్షించి పిమ్మట నీకు నేనే ఏకైక పత్నినయ్యెదను, జనస్థానమున కధిపతులైన నా తమ్ములు ఖరదూషణలతో బాంధవ్యము నీకు అన్ని విధముల వాంఛనీయము.
శూర్పనఖ సీతను కబళించుటకు వచ్చుచుండగా రాముడుక్రుద్దుడై హుంకరించి ఆ రక్కసిని ఆపివేసినాడు.
రాముడు: లక్ష్మణా ఈ దానవిని శిక్షించి తరిమివేయుము.
సౌమిత్రి శూర్పనఖ నాసికనూ కర్ణములనూ ఖండించి వదలినాడు. ఆమె రోదించుచూ జనస్థానమునకు పోయి ఖరునకు పంచవటి యందలి పర్ణశాలణు గూర్చియూ సీతారామ లక్ష్మణుల గురించియూ తెలిపి 'తమ్ముడా ఆ మువ్వురనూ చంపివేయుము; నా పగను తీర్చుము" అన్నది.
ఖరుడు పదునలువురు రాక్షస వీరులను పర్ణశాలకు పంపినాడు. వారిలో ఎవడునూ తిరిగిరాలేదు; ఆ దైత్యులు రామలక్ష్మణులతో జరిపిన పోరాటములో ఆ సోదరద్వయము బాణములకు బలియై పోయినారు. శూర్పణఖ ఖరునితో "నీవు స్వయముగా పోయి నా పగను తీర్చెదవనుకున్నాను. పిరికిపందవు! అప్రయోజకులగు భటులను పంపినావు! నాకు జరిగిన పరాభవము ఇనుమడించినది!" అన్నది.
ఖరుడు: అక్కా నన్ను నిందించుట మాని నా పథకమును ఆలకించుము. ఆ రాముడన్నవాడు దండకాటవిని ప్రవేశించి అభయమిచ్చుటతోనే ఇందలి మునిజనమునకు దైత్యులన్న బెదురుపోయినది. వారికి తిరిగి హడలు పుట్టించుటకు నేను నా పదునాల్గువేల రాక్షస యోధులతోనూ అరణ్య మంతయూ పర్యటించి రావలెనని సంకల్పించినాను. పర్యటనానంతరము పర్ణశాలకు పోయి రామలక్ష్మణులను వధించి నీ పగను తీర్చిదను.
