Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 18

    "బోస్టిదానా..." అంటూ ఓ తిట్టు తిట్టాడు బుగ్గలు వూదుకోంటూ టాటా... ఆ తర్వాత ఎడిటింగ్ లో కట్ అయినట్టుంది.

    మాడిపోయిన పెసరట్టు ఫేస్ పెట్టి యాంకరమ్మ... "ఇప్పుడు తాత మూడ్ పాడయింది. కాబట్టి తాతకు ఇష్టమైన పాటొకటి.." అంటూ పక్కకు తప్పుకొంది.

    'రగులుతోంది  మొగలి పోడ..' అన్నా పాత వచ్చింది. సగం పాత అయిపోగానే పాత కట్ అయి, ఓ తలనొప్పి మందు యాడ్ వచ్చింది.

    "భయ్యా... ఏమిటీ శిక్ష... కట్టేయ్  భయ్యా... టీవీ కట్టెయ్" పిచ్చిగా అరిచాడు రాహుల్.

    "చచ్చినట్టు ప్రోగ్రామ్ చూడు... వి.టి.వి లో పనిచేస్తూ వి.టి.వి ప్రోగ్రామ్స్ చూడకపోతే ఎలా... రేపట్నుంచీ...

    నీకు పని లేనప్పుడల్లా మన ఈవీ ప్రోగ్రామ్స్ చూడు..."

    "ఏంటి చూసేది... పాత హింది సిన్మాల్లో హెలెన్ డ్యాన్స్... నేను చస్తే చూడను... చూడకపోతే నా ఉద్యోగం పీకేస్తానని చైర్మెన్ చెబితే, ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి, పల్లీ, బఠానీలు అమ్ముకొని బ్రతుకుతా" రాహుల్ తెగేసి చెప్పాడు.

    "అదేంటి రాహుల్... అంత మాటనేసావ్..." చేతన్ నొచ్చుకుంటూ అన్నాడు.

    "లేకపోతే... ఆ ప్రోగ్రామ్స్ చూడు... ఆ యమ్కరంమా నగలు చూడు... ఛీ... యాక్..." అన్నాడు రాహుల్.

    అంకిత్ మాత్రం ఆ ప్రోగ్రామే కాదు, వి.టి.వి ఛానల్ లో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ 'గుడ్ నైట్' చెప్పేవరకూ చూస్తూనే ఉన్నాడు.

    ఆ తర్వాత అతనో నిర్ణయానికి వచ్చాడు.

                    
                                                                             ***

    వి.టి.వి.

    చైర్మెన్ ఛాంబర్ లో చైర్మెన్ పరమహంస, అంకిత్ ఇద్దరే ఉన్నారు.

    "చెప్పు అంకిత్, నిన్న మన టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చూశావా?"

    చూశానన్నట్టు తలూపాడు అంకిత్.

    "వాటి మెడ నీ ఒపీనియేమిటి?"

    అంకిత్ ఒక్క క్షణం మౌనంగా ఉంది అ తర్వాత నోరు విప్పాడు.

    "మనం ఎవరి కోసం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామో... మన ప్రోగ్రాం ఎవరు చూస్తున్నారో అర్ధం కావడంలేదు సార్"

    "అదేమిటి అంకిత్, ఒకేసారి అంతమాటనేసావ్... మనం కొత్తగా పెట్టిన 'తైత్తక్కలు' ప్రోగ్రాం బాగానే ఉందని కొందరున్నారు."

    "ఏం బాగుండడం... యాంకర్ మరే అంత ఫస్టా... పిచ్చిపిచ్చిగా మాట్లాడం, అయినదానికి కానిదానికి చేతోలోపుతూ వుండటం, అతి చొరవ... పైగా అనవసరంగా జనం పర్సనల్ విషయాలు... మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? అని కన్నుగీటటం, వావ్! నిన్ను చూస్తావుంటే నాకే ముద్దోస్తూంది.తాతా.... అని కుళ్ళు జోకులు వేయడం... మన ప్రోగ్రాం కు, తైత్తక్కలు' అన్నా పేరు బాగా సరిపోయింది సార్."

    "అంటే ఆ ప్రోగ్రాం అస్సలు బాగా లేదంటావా?" చైర్మెన్ అడిగాడు.

    కాన్సెప్ట్ ని మనం అబ్బున్యుటీ 'వే' లో ప్రజంట్ చేయొద్దు అంటున్నాను.

    ఒఇమ్తికి వెళ్ళాలి.... అక్కడ అమ్మా, నాన్న, చెల్లెలు, తమ్ముడు... వల్లా మధ్య సరదాలు పిక్చరైజ్ చేయాలి. ఉమ్మడి కుటుంబాలు వున్న ఏరియాలోకి వెళ్ళాలి. వాళ్ళంతా ఎలా కలసి ఉమ్తున్నారావు ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళకు నచ్చిన పాటలు వేయాలి. వాళ్ల అభిప్రాయలు తెలుసుకోవాలి... చాలా డిసెంట్ గా, పోలయిట్ ఉండాలి."

    "కుర్రకారుకు హుఉశారు ఉమ్దావుద్దూ..." అన్నాడు చైర్మెన్.

    "ఇలా అయితే హుఉశారు ఉండదా? మొన్న మా కాలనీలో ఏం జరిగిందో తెలుసా?" అడిగాడు అంకిత్.

    ఏం జరిగిందేమీటి? మన ప్రోగ్రాం బావుందని ఎవరైనా సభ ఏర్పాటు చేశారా?" ఆసక్తిగా అడిగాడు చైర్మెన్.

    "కాదు... తిత్తక్కల ప్రగ్రాం ఘాంటింగ్  జరిగింది. మా కాలనీలో వుండే గోపాలం, మన యమ్కరంమా చేతికి చిక్కాడు. ' చిక్కావు' చేతిలో చిన్నావాడా...' అంటూ ఏదో ప్రాస బావుందని పొడి, గోపాలాన్ని పట్టుకుంది. మీ ఆవిడా ఎక్కడ అని అడిగితె, సిగ్గు పడుతూ 'పుట్టింటికి వెళ్ళింద' ని చెప్పాడు.

    'అయితే' నాకు చెప్పినట్టు పంపించవన్నామాట. వెరీగుడ్. అప్పుడప్పుడు ఇలా భార్యల్ని పుట్టింటికి పంపింస్తుంటే ఉండే హుఉశారే వేరు... ఏమంటావ్...' అని అడిగితె, ఆ జీవుడు కెమెరా చూసి రెచ్చిపోయాడు.

    మన యాంకరమ్మ అతనితో స్టెప్పులేసి, పైగా 'చూశారా... భార్య పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉన్నాడో...' అంటూ కన్నుగీటింది.

    "అసలు ఇమ్త్రేస్తిమ్గ్ పాయింట్ వినండి. ఈ ప్రోగ్రామ్ పుట్టింట్లో వున్న గోపాలం భార్య చూసి, ఆ యమ్కరంమా గోపాలం కలిసే, తనను పుట్టింటి పంపారని, అందుకే అతగాడు హేపీగా ఉన్నాడని ఫీలయి, 'నేను ససేమిరా మొగుడితో కాపురం చేయమని' భీష్మించుకుంది."

    "ఈజిట్.."

    హండ్రెడ్ పర్సెంట్... ఇలాంటి ఓవర్ ప్రోగ్రామ్స్ ఎందుకు సార్.... పైగా ఆ ఓవర్ రియాక్షన్ ఒకటి.... ఆ యాంకర్ చిన్నప్పుడు స్ప్రింగ్ లు మింగి ఉంటుంది. ఒకటే  ఊగుతూ ఉంటుంది.మగాళ్ళ భుజాల మీద వేస్తూ ఈలలు వేస్తూ... అంత ఓవర్ ఏం బావుంటుంది?"

    చైర్మెన్ బుర్ర గోక్కున్నాడు.

    అంకిత్ తమ ఛానల్ లో ప్రోగ్రామ్స్ గురించి విశ్లేషణాత్మకంగా చెప్పకు పోతూనే ఉన్నాడు.

    సరిగ్గా గంటసేపు నాన్ స్టాప్ గా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ లో వున్న డిఫెక్ట్ ని చెప్పాడు.

    "వెరీగుడ్ మై బోయ్... చాలా చక్కగా ఎనాలసిస్ చేశావు... ఒక్కో ప్రోగ్రాం ని మారుస్తూ పోదాం... అది సరే... మొన్న నువ్వు చేసిన ప్రోగ్రాం చాలా బావుంది. మన రాహుల్ పర్సు కొట్టేసి పారిపోతున్నా, పట్టించుకోని ఆ శాల్తీని చూసి నవ్వొచ్చింది. చక్కని అవేర్ నేస్ ప్రోగ్రాం కాకపోతే, మా ఆవిడే కాస్త చిర్రుబుర్రులాడింది" చెప్పాడు చైర్మెన్.

    "ఎందుకు సార్ "

    "ఆ శాల్తీ మా బావమరిదే... మా ఆవిడా కజిన్... వాళ్ల విడ టీవీలో మొగుడి నిర్వాకం చూసి, ఉతికి, ఆరేసి, మరీ ఇరాన్ చేసిందట మొగుణ్ణి" అని నవ్వాడు.

    అంకిత్ ఇబ్బందిగా కదిలాడు.

    "ఛ..ఛ...ఇందులో నువ్వు ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు గానే, నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి?" అడిగాడు.

    "పిబ్రవరి ఫోర్టీన్ వాలెంటైన్ డే కదా..."

    "యస్... అయితే...'

    "అ రోజు ఓ స్పెషల్ ప్రోగ్రాం చేయ బోతున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS