Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 19

జరిగిన ఎన్నికలలో ఓడిపోవడంతో పాటు అటు ఆర్దికంగాను. ఇటు రాజికీయ వర్గాలలో వ్యక్తి గాను కోలుకోలేనివిధంగా అనందరావుకు.నష్టం జరిగింది.
కానీ, అంతకంటే అతనని కృంగదీసింది. ప్రత్యర్దివర్గం చేయని నేరాన్ని మోపి కొడుకును జైలుపాలు చేయడం.
ప్రస్తుతం అతను ఆలోచిస్తున్నది ప్రత్యర్దుల కుట్రను భగ్నం చేసి తన కొడుకును ఎలా విడిపించుకోవాలా అని సీరియస్ గా ఆలోచనలో మునిగి వున్న ఆనందరావు__ జర్నలిస్టు ధీరజ రాకను గమనించలేదు.
"రవితేజను రక్షించే ప్రయత్నం ఏమీ చేయరా అడిగిందామె"
"ఏ ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం నా బిడ్డను కాపాడలేదు."
"అంటే నిర్దోషిని ఉరికంబానికి అప్పగించాలనుకుంటున్నారన్న మాట..."
ఆనందరావు చివ్వున తలఎత్తి అప్పుడు చూశాడు ఆమెను.
"థాంక్స్....కనీసం నువ్వు అయినా గుర్తించావు నా కొడుకు నిర్దోషి అని..."
"అనందరావుగారూ.... మీకు తెలిసిన విషయాలు చెబితే ఆహత్య వెనక వున్నవారిని చట్టానికి పట్టించి మీ కొడుకుని రక్షించుకోనూవచ్చు ఏమంటారు?"
నిర్లిప్తంగా నవ్వాడాయన.
"ఈ సమయంలో అన్నా మీరు మీ శక్తుయుక్తులన్నీ దారపోసిఐనా మీకొడుకును నిర్దోషిగా నిరూపించుకోవాలి" అన్నది ధీరజ
"ప్చ్... నన్ను ఓడించడానికి జరిగిన కుట్రలో భాగమే యీ హత్య. కానీ నేను ఓడిపోయినందుకు బాధపడడంలేదు. రాజకీయాలలో ఎత్తులు, పైఎత్తులు సర్వసామాన్యం. కానీ అమాయకుడయిన రవితేజని పావుగా ఉపయోగించుకున్నారు. అతన్ని బలిపశువును చేశారు. అదే భరించలేకపోతున్నాను"
ధీరజ ఆయన కనులలో నీటిపొరలను చూసింది.
"డోంట్ వర్రీ సర్! మీ సహకారం పూర్తిగా వుంటే రవితేజను నిరపరాధిగా నేను నిరూపిస్తాను. నిజానికి ఆ హత్యను చూసిన ప్రత్యక్ష్య సాక్షిని నేను. అంతేకాదు ముద్దాయి పారిపోతుంటే పోటోలు కూడా తీశాను"
ఆ మాటలకు ఆనందరావు కనులలో వెలుగు తొంగి చూసింది.
ఆమె మీదకన్నా ఆమె తీసిన పోటోలు తనకు న్యాయం జరగటానికి సహాయపడతాయనే ఆలోచన స్పురించడంతో ఇప్పుడు అతనికి మెల్లగా దైర్యం పుంజుకుంది.
అయినా ఏదో చిన్న అనుమానం.
అందుకే అతని భృకుటి సాలోచనగా ముడిపడింది!
"ఆశ్చర్యపోకండి సర్... ఈ జర్నలిస్టు ఏమిటి... అందునా ఆడపిల్ల... ఏం సాధించగలుగుతుంది అని సందేహంచకండి... మీమీద జయచంద్రకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేక రాజకీయపరంగానే మీపై కుట్ర జరిగిందని భావించవచ్చా?"
జవాబు చెప్పాడు ఆయన.
జర్నలిస్టు ధీరజ అంతటితో తృప్తి చెందకుండా మరికొన్ని ప్రశ్నలు వేసింది.
అంతవరకూ ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు, వింత విషయాలు ఆనందరావు నోటివెంట విని ధీరజ బిత్తరపోయింది.
ఆయన మాటలు విన్న తర్వాత రవితేజను రక్షించాలనే అభిప్రాయం ఆమెకు మరింత బలపడింది.
"సర్... అవసరం అనిపిస్తే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను" అని ఆ ఇంటిలోనుంచి బయటకు వచ్చి తన హోండాను స్టార్టుచేసింది జర్నలిస్టు ధీరజ.
ఆమె వెళ్ళిపోగానే... అంతవరకు ఆమెను అనుసరించి వస్తున్న ఆగంతుకుడు రోడ్ ప్రక్కన వున్న పబ్లిక్ టెలిపోన్ బూత్ వేపు వడివడిగా కదిలాడు.
తనకు కావలసిన నంబరు డయల్ చేసి ధీరజ మూవ్ మెంట్స్ వివరించి చెప్పి వచ్చినంత వేగంగానే బయటపడి తన బుల్లెట్ ను స్టార్టు చేశాడు.
తన దృష్టినుంచి ఆమె తప్పించుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఆమెను ఫాలో చేస్తున్నాడు.
లాయర్ సత్యమోహన్ ఇంటి ఆవరణలోకి తిరిగింది ధీరజ హోండా.
ఆమెనే అనుసరించి వస్తున్న ఆగంతుకుడు ఖంగుతిన్నాడు.
ధీరజ వెళ్ళేసరికి సత్యమోహన్ ఇంటిలోనే వున్నాడు.
"గుడ్ మార్నింగ్ అంకుల్..."
రిఫరెన్స్ బుక్స్ తో బిజీగా వున్న సత్యమోహన్ చట్టుక్కున తల ఎత్తి చూసి.... బలవంతాన చిరునవ్వుని ముఖాన పులుముకున్నాడు.
"హల్లో ధీరజా.... వెరీ గుడ్ మార్నింగ్... నీ ఇన్  వెస్టింగ్ జర్నలిజంఎలా వుందమ్మాయ్?"
"మీకు తెలియంది ఏముందంకుల్... నా చూపు పడనేకూడదు__ పడిందంటే వాళ్ళకు నిద్రాహారాలు కరువైపోవాల్సిందే"
"ఓహో.... ఏదో హత్యకేసుని డిటెక్టివ్ కేసులా పరిశోధిస్తున్నావటగా? మా లాయర్లు అనుకుంటుండగా విన్నానులే"
తన పరిశోధన గురించి అప్పుడే ఈయనకు తెల్సిపోయిందా అనుకుందామె.
"అవును అంకుల్... అసలు దోషి తప్పించుకున్నాడనే నా అనుమానం"
"అంకుల్... నేను ఆడపిల్లను కాదు పులిపిల్లనని నిరూపిస్తాను. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకున్న దానివి. నా దారికి అడ్డు రానంత వరకూ నేను పిల్లనే...
నన్ను ఏదో చేయాలని ప్రయత్నస్తే మాత్రం పులిలా మారిపోతాను. అప్పుడు తెలుస్తుంది ఈ ధీరజ అంటే ఏమిటో...." అందామె ధీమాగా.
ఆమె వాగ్దాటికి అతని గొంతు పెగలలేదు.
"సమాజంలోని ప్రతి ఒక్కరూ నీ మాదిరిగా పట్టుదలతో నేరాల వెనక వున్న నిజానిజాలను వెలికి తీస్తే మన దేశంలో నేరాల సంఖ్య తగ్గుతుంది. కాకుంటే మాలాంటి లాయర్ లకు ప్రాక్టీసు చేయటానికి క్లయింట్స్ వుండరు"
"సెంట్ పర్సెంట్ కరెక్ట్ అంకుల్... అయితే ఒకటి మాత్రం నిజం తాత్కాలికంగా నేరస్తులు తప్పించుకున్నా ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం చాలా పటిష్టమయినది" ధీరజ అన్నది.
సత్యమోహన్ నొసలు చిట్లించి ధీరజను చూశాడు.
ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో ఆయనకు అర్దంకాలేదు.
"సారీ అంకుల్... మీతో చాలా ఎక్కువ మాట్లాడాను. ఇంతకూ న స్నేహితురాలు ఎక్కడ?" అడిగింది ధీరజ వాతావరణాన్ని తేలికపరుస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS