Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 17

    "కాస్త తలనొప్పిగా వుంటే, లైటు వేసుకునే ఓపిక లక అలానే పడుకుండిపోయాను... సారీ..." అంది గిల్టీగా.

    "భలేదానివే... ఈ మాత్రం దానికే సారీ  ఎందుకు? అయినా వచ్చినప్పుట్నుంఛీ నువ్వు పరద్యనంగానే ఉమ్తున్నావు. చెప్పాలని అనిపిస్తే నువ్వే చెబుతావు కదాని నేను ఏమీ అడగలేదు... అనీ పర్సనల్ ప్రాబ్లం? అడిగింది యమున.

    'అవును లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం...' మనసులో అనుకుంది మృదువని.

    "సర్లే... పద హాలులో కూచొని తీవె చూద్దాం...' అంది యమున.

    "నువ్వెళ్ళి చూడు... నాకు ఇంట్రెస్ట్ లేదు. కాసేపు పడుకుంటాను..." అంది మృదువని.

    "నీ ఇష్టం" అంది బాత్రూంలోకి వెళ్ళబోతూ. అప్పుడే పక్క రూమ్ లో వుండే ప్రసూన వచ్చింది.

    "ఏయ్ యమునా... త్వరగా రా న్యూస్ టైం" అంది గట్టిగా అరుస్తూ.

    "అబ్బ... నేను ఇక్కడే వున్నవుగా... ఏమిటా గావుకేక, అయినా న్యూస్ స్పెషలేమిటి?" అడిగింది యమున.

    ప్రసూన, యమునలు న్యూస్ మారం తప్పనిసరిగా చూస్తారు.

    అందుకే కదా.. నిన్ను రమ్మంటా..." అంటూ హాలులోకి నడిచింది ప్రసూన. వెళ్ళిన రెండు నిమిషాలకే పరుగెత్తుకు వచ్చింది.

    "ఏయ్ యమునా... హాట్ న్యూస్... ఢిల్లీనుంచి ఓ అమ్మాయి ఫోలీసుల కళ్ళుగప్పి పారిపోయి హైదరాబాదు కు వచ్చిందట. ఆమె కోసం ఫోలీసులు వెతుకుతూన్నారట. న్యూస్ హైలైట్స్ లో చెప్పారెఉ. చూద్దాం పద.. ఆ అమ్మాయిని కూడా చూపిస్తారేమో?"

    ఒక్కక్షణంఝల్లుమంది మృదువని శరీరం... అంటే తన గురించేనా? ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చింది తనే! పైగా ఇందాకే శరణ్య చెప్పింది.

    "అలాగా... పద పద... ఏది మిస్సయినా క్రయిం న్యూస్ మిస్సవ్వోద్దు..." అంటూ హాలులోకి వెళ్ళింది యమున.
   
                                                                          ***

    తన గుండె కొట్టుకునే శబ్దం తనకే పెద్ద విస్పోటనంలా వినిపిస్తోంది. అయిపోయింది... అంతా అయిపోయింది... న్యూస్ చూసే వార్డెన్, రూమ్మేట్స్ తన దగ్గరికి వస్తారు... రావడం కాదు... వెంటనే ఫోలీసులకు ఫోన్ చేసి చెబుతారు. ఏం చేయాలి? ఎలా పారిపోవాలి ?

    రకరకాల ఆలోచనలు ఆమెను వేధిస్తున్నాయి.

    రకరకాల భయాలు ఆమెను వెంటాడుతున్నాయి. క్షణాలు కూడా భారంగా కదులుతున్నట్లు అనిపిస్తున్నాయి.

    రూమ్ లో టేబుల్ మీద వున్న టేబుల్ వాచీలోని సెకన్ ముళ్ళు శబ్దం స్టీరియోఫోనిక్ సౌండ్ లో వినిపిస్తుంది.

    చెవులు రిక్కరించింది... ఆ వార్తలు వినాలన్నా భయంగానే ఉంది. హాలు తన గదికి దూరంగా వుండడంతో వార్తలు వినిపించే అవకాశం లేదు. పోనీ హాలులోకి వెళ్ళి చూస్తే...

    ఆ సిట్యూయేషన్ ఊహించుకోవడానికి భయంగా ఉంది.

    నిమిషాలు గడుస్తున్నాయి. ఈ పాటికి వ్వార్తలు అయిపోయి వుంటాయి. వార్డెన్, మిగతా అమ్మాయిలు తన గురించి చెవులు కొరుక్కుంటున్నారా? లేదా ఫావులీసులకు ఫోన్ చేస్తున్నారా? అంతా అయోమయంగా ఉంది. చాలా టెన్స్ ఫీలవుతోంది.

    శరీరమంతా స్వేదం అలుముకుంది. సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత యమున వచ్చింది. యమున మొహంలోకి చూడాలంటేనే భయంగా ఉంది.

    యమున తన వైపే వస్తూంది. తనని నిలదీస్తూందా?

    'మమ్మల్ని ఎందుకు మోసం చేశారని అడుగుతుందా?' తనేమని  సమాధానం చెప్పాలి? ఈ పాటికి ఫోలీసులు తన గురించి బయల్దేరి వుంటారు.

    "ఐశ్వర్యా..." ఒక్క క్షణం ఆశ్చర్యం... తనని ఐశ్వర్య అని పిలుస్తుందేమిటి? అంటే తన గురించి టీవీలో ఏం చెప్పలేదా?

    ఏమిటి ఐశ్వర్యా... అలా కాం గా వుండిపోయావు. అసలు నువ్వు రోజూ టీవీ ఎందుకు చూడవు.... ఢిల్లీలో ఓ అమ్మాయి సెంట్రల్ మినిష్టర్ ని కాల్చబోయి, ఫోలీసులకు చిక్కి, వాళ్ల కస్టడీ నుంచి పారిపోయి వచ్చిందట. ముంబాయిలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో ఈ అమ్మాయికి సంభంధం ఉందేమోనని అరా తీసున్నారు. నీకీ వుశయం తెలుసా.. ఆ అమ్మాయి ఇక్కడికే... అదే,, హైదరాబాదు కు వచ్చిందట..."

    ఊపిరి పీల్చుకుంది మృదువని.

    'హమ్మయ్య. అంటే తన గురించి కాదన్నమాట..'

    "మాట్లాడవేంటి ఐశ్వర్యా... నాకైతే ఎంత థ్రిలింగ్ గా ఉందో తెలుసా... ఆ అమ్మాయి నాకే కనుక కనపడితే వెంటనే పట్టుకుని ఫోలీసులకు అప్పగించేదాన్ని... ఆ అమ్మాయి కనిపిస్తే బావుండు... ఇంతవరకూ క్రిమినల్స్ ని దగ్గర్నుండి చూళ్ళేదు..." నిట్టూరుస్తూ అంది యమున.

    నవ్వుకుంది మృదువని.... దిఫెంస్ వాళ్ళ వాంటెడ్ లిస్టులో వున్న తను... మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని యమునకు తెలిస్తే.... అనికోకుండా, ఆమె పెదవుల మీదకి నవ్వొచ్చింది.

    "ఏయ్ ఐశ్వర్యా... నీకు నవ్వడం కూడా వచ్చా..." అంది తనేదో జోక్ పేలుస్తున్నట్టు ఫీలయి.

    మృదువని నవ్వి వూర్కుంది.
                                 
                                                                            ***

    అంకిత్, రాహుల్, చేతన్ లు హాలులో నెల మీద కూచున్నారు. వాళ్లకు అడురుగా టీవీ వుంది. విటివి పెట్టాడు అంకిత్. యాంకర్ జనం మద్యకు వెళ్ళి, వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ, వాళ్లకు నచ్చిన పాటలు వేసే ప్రోగ్రామ్స్ అది.

    "భయ్యా... పెట్టకపెట్టక  ఈ ప్రోగ్రామే పెట్టావా?" అన్నాడు రాహుల్.

    అంకిత్ మాత్రం సీరియస్ గా చూస్తున్నాడు. యాంకర్ స్క్రీన్ మీదికి వచ్చింది. ముందు పలు వరస కనిపించేలా నవ్వింది.

    "హాలో... ఆదాబర్సే... నమస్కార్... గుడ్ ఈవినింగ్..." అంటూ రెండు మూడు వంకర్లు తిరిగింది.

    చూట్టూ వున్న జనం నవ్వలేక నవ్వారు.

    "హలో తాతా... చిన్నప్పుడు నువ్వు బామ్మాను ఎలా ప్రేమించావు?" అని అడుగుతోంది.

    ఆ తాతా బోసి  నవ్వు నవ్వాడు...

    "చూశారా... తాతకు సిగ్గేసింది... బామ్మతో  ఫస్ట్ నైట్ గుర్తోస్తూంది... కదూ తాతా... నాకు తెలుసు... చిలిపి తాతా..." అంటూ ఆ తాతా బుగ్గలు గట్టిగా పిండింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS