Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 18

   
    "ఓస్ అదో పెద్ద కష్టంకాదు. వీళ్ళతో వేటకెళ్ళినప్పుడు చూశాను. కొండల నడుమ దరి వుంది. కొండలు దాటితే సురక్షిత ప్రాంతం వస్తుంది. ఆ ఏరియా నాకుతెల్సు."    
    "మధ్యలో నీళ్ళకి, జంతువుల బెడదకి..."    
    "ఊహు అలాంటి బెడదేంలేదు."    
    "గుడ్"మెచ్చుకోలుగా చూశాడు బాజారావుగోమతి వైపు.    
    "మనం ఎప్పుడు బయలు దేరుదామన్నది నీ ఇష్టం సాధ్యమైనంత తొందరగా వెళ్ళటం మంచిది."    
    నేనూ అదే ఆలోచిస్తున్నాను.    
    "నీ ఆలోచనేమిటో నా కర్ధం కావటంలేదు బాజీ! అనవసరంగా రోజులు దాటేస్తున్నావు-కమల్ ని సఫాచేసి వెళదాం బాస్ ని కల్సుకుందాము." చాలా తేలిక విషయం అన్నట్లు అంది గోమతి.    
    "వద్దు వద్దు, తొందర పడటం మన నియమానికి విరుద్దం వీలయితెకమల్ ని బంధించి తీసికెళదాం. బాస సంతోషిస్తాడు."    
    "ఇదో రిస్కు, చూద్దాం నీవు కమల్ ని రెచ్చగొట్టి నీ ఆకర్షణలో పడేసుకుని అతని రహస్యాలు లాగరాదు. అతనేందు కొచ్చాడో ఏం రహస్యాలున్నాయో తెలుస్తాయి."    
    "కమల్ ప్రవరాఖ్యుడి తమ్ముడు. కనీ కనిపించకుండ ఎన్నిసార్లో రెచ్చగొట్టారు దగ్గరగా ఓసారి వస్తాడు మరోసారి గంభీరంగా దూరం తొలుగుతాడు. కమల్ దగ్గర వున్నవి రక్షణ పరికరాలు మనకి కావలసినవి జాగ్రత్తగానేవున్నాయి.    
    "ఎందుకంతాశ్చర్యం! ఆల్బంవుంది, చిలకలున్నాయి, కర్ చీఫులున్నాయి, సూట్ కేస్ తొడుగులో మేటరుంది. అవి కమల్ కి దక్కినాదాని వుపయోగం తెలియకదాచాడు."    
    "తెల్సి దాచాడేమో?"    
    "నే అలా అనుకోటంలేదు." క్షణం ఆగేడు.    
    "ఇలా మనం కల్సుకోటానికి నాలుగు రోజులు ఆగాల్సి వచ్చింది. కొద్దిగా కదిలితే చాలు వాడు ఆ కమల్ లేచి కూర్చోటమే. ఇప్పుడయినా నే వెళ్ళేటప్పటికి లేచి వుంటే అవసర నిమిత్తం అంటూ అబద్దం ఆడాలి. పగలు దూరంగా మసలుతున్నామేమో. పోనీ ఈ అడవి మూకలతో వేటకెళ్ళి నప్పుడు దారి తప్పించి మనం కల్సుకుందామా అంటే ఒకరం ఉత్తరానికి మరొకరం దక్షిణానికి వెళుతుంటిమి. ఏమయినా సరే బాజీ! ఇంక ఆగేది లేదు. ఇంకొక్క వారం తర్వాత మనం బయలుదేరక తప్పదు." స్థిర నిశ్చయంతో అంది గోమతి.    
    "ఓ.కె." అన్నాడు బాజారావు గోమతిని దగ్గరకు లాక్కుంటూ.    
    తర్వాత కొద్దిసేపు వారివురి మధ్య కొద్దిమాటలే జరిగాయి. వాళ్ళు బయలు దేరి వస్తారని కీర్తి లేచింది చెట్టుచాటునుంచి.  
    "ఛీ!నా తెలివెందుకు?" అనుకుంది కీర్తి గబ గబ అడుగులు ముందుకేస్తూ.    
    ఎత్తుకు పై ఎత్తు లెన్నో కీర్తి ఆలోచిస్తున్నది. ఒక్కటీ నచ్చటంలేదు.    
    దోవ పొడుగూతా ఆలోచించి గోమతి వచ్చేటప్పటికే గుడిసె చేరి నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకుంది కీర్తి.    
    కీర్తి వచ్చిన పదిహేను నిమిషాలకి గోమతివచ్చింది.
    
                                    13
    
    గోమతి చూడకుండ కీర్తి ఆల్బం, కర్ చీఫులు, చిలకలను, సూట్ కేసును పరీక్షించింది. చాలా భాగం అర్ధమయింది. చక్కని పధకం పన్నింది. ఆ రోజు కారోజే ముఖ్యమైనవి ఓ చోట రహస్యంగా దాచి వచ్చింది.    
    "ఎతకబోయిన తీగ కాలికి చుట్టుకుంది మంచిదే కాని అతీగ ఇనప గొలుసు లాంటిది. కాలు విదిలిస్తే వదలదు. వీళ్ళు ఒకరికి ఇద్దరయారు. తనపై అనుమానం కలిగింది. ఇప్పుడు ఏంచేయాలి? ఆ....అంతకన్నా ఉపాయం లేదు అంతే అదే చేయాలి" ఇలా ఆలోచించుకుంటూ కీర్తి ఓ పక్కకు నడిచింది గోమతి సాయంత్రమప్పుడు అటు వేపుంటుందని తెల్సు.    
    కీర్తి అనుకున్నట్లే గోమతి చేతులు కట్టుకుని అక్కడ పచార్లు చేస్తున్నది.    
    కీర్తి కాస్తదూరం వెళ్ళి కూర్చుని పొడిగా దగ్గుతూ నేలమీద ఏదో వస్తువుని పరీక్ష చేస్తున్నట్లు నటిస్తూ వుండిపోయింది.  
    దగ్గువిని గోమతి దగ్గర కొచ్చింది. "ఎంతసేపటి నుంచి ఇక్కడున్నావ్ కమల్!" అనబోతూ టక్కున ఆగిపోయింది. కీర్తి చేతిలోవున్న వస్తువు గోమతి నాకర్షించింది" అరె అదేమిటి?" అంది.    
    గోమతిని అప్పుడే చూస్తున్నట్లు కంగారుపడి వస్తువుని దాచేయబోయింది కీర్తి.    
    రెండంగల్లో కీర్తి చేతిని పట్టుకుంది గోమతి.    
    "వదులు" చేతిని వెనక్కు గుంజుకుంటూ అంది కీర్తి.    
    "వదలను కమల్. ఇదేమిటో చెప్పు" అంది గోమతి అనుమానంగా కీర్తిని చూసి.    
    "ఇది నాకుసంబందించింది."    
    "చెప్పకూడదా?"    
    "ప్రమాదం. నాకు ప్రాణాపాయం కల్గుతుంది."    
    "ఈ అడవిలోనా? ఎవరి వల్ల?"    
    "దయచేసి నన్నేమీ ప్రశ్నించవద్దు గోమతి."    
    "ఉహు చెప్పాల్సిందే. నీ మధ్య నామధ్య రహస్యాలుండ కూడదు కమల్."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS