"ఈ సంస్థ నిర్వహణలోగానీ ఇతరత్రాగానీ మీరేం ఇబ్బందులు ఎదుర్కోలేదా?"
"చాలామంది మాతో భాగస్వామ్యంకోసం వచ్చారుకానీ, నేను ఒప్పుకోలేదు. స్వచ్చందంగా సేవ చేసేవాళ్ళు, అంకితభావం వున్నవాళ్ళే కావాలి నాకు అని వాళ్ళ ఆఫర్ తిరస్కరించాను. వాళ్ళంతా విమర్శలు చేశారు. ఆ తరువాత కూడా ల్యాండ్ విషయంలో కొన్ని గొడవలు జరిగాయి.అప్పుడే నాకు వీణతో పరిచయం ఏర్పడింది. ముందు లీగల్ అడ్వయిజర్ గా ప్రారంభం అయిన మా పరిచయం....మా భావాలు కలవడంతో మంచి స్నేహంగా మారింది. తను కూడా పాతికవేలు ఆశ్రమానికి విరాళం ఇచ్చి భాగస్వామ్యం తీసుకుంది?"
"వామనముర్ర్తిని ఎలా అరెస్టు చేయగలిగారు?"
నవ్వి చెప్పింది -
"నీరజ వామనమూర్తి గురించి చెప్పిన విషయాలన్నీ విన్నాక, నేను, నా స్నేహితులు వీణా కలిసి చిన్న ప్లాన్ వేశాం. నీరజని పంపిస్తాం నచ్చి తీసుకెళ్ళమని ఫోన్ చేశాం.వామనమూర్తి నీరజ కోసం మా ఇంటికి వచ్చాడు. నీరజ అతడిని తన మేనమామగానే భావించి ప్రేమగా మాట్లాడినట్లు చిన్న నాటకం ఆడించాం. తనకి ప్రస్తుతం ఒంట్లో బాగుండలేదని, సాయంకాలానికి ప్లాట్ కి వస్తానని చెప్పింది. నీరజ మాటలు నమ్మి సాయంకాలం నీరజని తీసుకొచ్చి దించవలసిందిగా మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.
సాయంత్రం నీరజ మళ్ళీ వామనమూర్తి బస చేసిన హొటల్ కి ఫోన్ చేసి తను బయలుదేరుతునట్టు చెప్పింది. నేను వీణ ఈ విషయాలన్నీ పోలిసులకి చెప్పాం. వాళ్ళు వామనమూర్తిమీద ఓ కన్నేసి ఉంచారు. నీరజ తన ప్లాట్ కి వచ్చేసినట్లు అతనికి మళ్ళీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హొటల్ కి ఫోన్ చేసింది. నీరజ మాటలు నమ్మి వామనమూర్తి ఎవరో ఒకతనని తీసుకొని ప్లాట్ కి బయలుదేరాడు. అప్పటికే అతని ప్రియురాలు అతడి కోసం ఎదురుచూస్తోంది.
వామనమూర్తిని పోలీసులు ఫాలో అయి అతడు ప్ల్హాట్ లోపలికి వెళ్ళి తలుపేసుకోగానే, తలుపు దగ్గర నిలబడి వాళ్ళ మాటలు విన్నారు. ఆ మాటల్లో నీరజ ఫోన్ చేసినట్టు చెప్పి, ఇంకా రాలేదా అని అడగడం, మమ్మల్ని అడ్డం పెట్టుకుని నీరజ తనని మోసం చేస్తోందని రంకెలు వేయడం అన్నీ విన్నారు. అలా మాటలద్వారా వాళ్ళు చేస్తోన్న దారుణ కృత్యాన్ని తెలుసుకున్నారు. వెంటనే తలుపులు కొట్టి అక్కడ వున్న ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు. పోలీసులు అంతగా కోపరేట్ చేయకపోయి వుంటే మా ప్లాన్ ఫెయిల్ అయ్యేది?
"వామనమూర్తి పొలిటికల్ ఇన్ ప్లుయన్స్ వున్నవాడని అన్నారు . ఇప్పుడు మీకేం భయం వేయడంలేదా అతనంటే? రేపు జైలు నుంచి వచ్చాక మీమీద రివెంజ్ తీసుకుంటే?
"అంత ఇన్ ప్లుయన్స్ ఉన్నవాడైతే వెంటనే బెయిలు తీసుకుని వెళ్ళి పోయేవాడేగా, అలాంటిదేంలేదు. అతను కేవలం బిల్డప్పిచ్చాడు.ఇద్దరు బట్టలు కట్టుకున్న వాళ్ళంతా రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళేనా?అదేం లేదు. అలా చెబితే అందరూ భయపడతారని, తనకు తెలిసిన మంత్రుల పేర్లు చెప్పి, వాళ్ళాతో బందుత్వం ఉందని చెప్పాడు. డబ్బు సంపాదించటానికి అతను తొక్కిన చాలా అసహ్యాకరమైన, అవమానకరమైనా మార్గం ఇది. ఈ మార్గం సుగమం కావాలంటే రాజకీయాలను అడ్డం పెట్టుకోవాలి.
తరువాత అతను చాలా ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ ఒపిగ్గా సమాధానం ఇచ్చింది.
చాలా సేపటి నుంచీ తోలిచేస్తూన్న సందేహాన్ని చాకచక్యంగా తీర్చుకున్నాడు.
"మీరు పెద్ద కార్దయాలజిస్టుగా, మంచి సోషల్ వర్కర్ గా, ఇటూ గృహిణిగా ఎంతో సమర్దవంతంగా నెట్టుకుని వస్తున్నారు. మీకు మీ శ్రీవారి సహాయ సహకారాలు బాగా లభిస్తాయనుకుంటాను."
ఆ సమాధానం ఎందుకో భరణికి చాలా ఊరటనీ, సంతృప్తినీ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కాఫీ తాగి, సెలవు తీసుకుని వచ్చేశాడు.
ఆరోజు అనూషతో జరిపిన ఇంటర్వ్యూ ప్రచురించడానికి,ఆమె ఫోటోలు రంగుల్లో వేయడానికి చాలా శ్రమ తీసుకున్నాడు భరణి. ఆ శ్రమ అతనికెంతో ఆనందాన్ని, ఉత్సాహన్ని ఇబ్బంది.
రెండు రోజుల తరువాత ఉదయాన్నే పత్రిక పంపించాడు. ఓ కుర్రాడితో అనూష ఇంటికి. ఆమె తన ఫోటోలు, బాక్స్ లో వేసిన ఇంటర్వ్యు చదువుకుని సరదాగా నవ్వుకుంది. పత్రిక పంపించిన పావుగంటకి భరణి ఫోన్ చేశాడు.
"గుడ్ మార్నింగ్ డాక్టర్!పత్రిక అందిందా?"
"హలో!గుడ్ మార్నింగ్. అందించండీ, చాలా థాంక్స్"అంది.
"థాంక్స్ నేను చెప్పాలి మేడమ్! మీ అంతటివారు మా పత్రికకి ఇంటర్వ్యు ఇచ్చారంటే మా పత్రిక గౌరవం పెరిగిందన్నమాట. బైదబై మీరు కనీసం వారానికో మెడికల్ ఆర్టికల్ రాసివ్వచ్చుగా మా పత్రికకి."
"నేనా? ఆర్టికలా! ఎప్పుడూ రాయలేదు.ప్రయత్నిస్తాను."
"థాంక్యూ"అన్నాడు.
అతను ఫోన్ పెట్టేయగానే అనూష వీణకి ఫోన్ చేసింది.
"అబ్బ దోరికావా?ఇందాకటి నుంచీ చేస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు?ఒకటే ఎంగేజ్ వస్తోంది" దబాయింపుగా అంది వీణ.
"ఒక జర్నలిస్టు తగిలాడులే. ఈమద్య మనం చేసిన ఎడ్వంచర్ గురించి పేపరులో చదివి, నన్ను వాళ్ళ పేపరుకి ఇంటర్వ్యూ పబ్లిష్ చేశాడు. అతని తోటే మాట్లాడుతున్నాను."
"నేనూ అదే చూస్తున్నాను. ఈరోజు ఉదయాన్నే ఎవరో వచ్చి ఈ పత్రిక ఇచ్చి వెళ్ళారు. ఏంటి, ఫోటోలు రంగు,రంగుల్లో వేశాడు.ఓ యాంగిల్ లో శ్రీ దేవిలా,ఓ యాంగిల్ లో మాధురీదీక్షిత్ లాగా వున్నావు. అతనెలా వుంటాడు.సల్మాన్ ఖానా? అమీర్ ఖానా? షారుక్ ఖానా?"
"నీ తలకాయఖానా?"అనూష మాటకి గట్టిగా నవ్వింది వీణ.
"అదిసరే! నేనివాళ సాయంత్రం నీ దగ్గరకి వస్తున్నాను. మీవంటావిడకి చెప్పు నాక్కూడా వంట చేయమని. నాకు కోర్టు పని లేదు."
