Previous Page Next Page 
మహావృక్షం పేజి 16

భరణి హాస్పిటల్ కి వేళ్ళేట్టప్పటికి ఒంటిగంట అయింది. అనూష గురించి  వాకబుచేస్తే ఆమె ఇంకా రాలేదన్నారు.మూడుగంటలకి వస్తుందని చెప్పడంతో, ఇలోపల అతను తన పేపర్ కి కావలసిన మాటర్ ఏవన్నా దొరుకుతుందేమోనని హాస్పిటల్ రెండు బిల్డింగులు తిరిగాడు జనరల్ వార్డ్ లో బెడ్ లు ఖాళీలేక కిందనే జంపఖానాలు పరచుకుని పడుకున్న పేషంట్లను, వరండాలలో,బయట తిరుగుతోన్న కొందరు పేషంట్లను, వాళ్ళ బందువులను, అంబులేన్సులలో వచ్చిన ఎమర్జన్సీ కేసులను పరీక్షిస్తూ పాకెట్ డైరీలో పాయింట్లు నోట్ చేసుకున్నాడు తరువాత బయటికి వెళ్ళి, హొటలులో భోజనంచేసి,మూడు అవుతుండగా తిరిగి హాస్పటల్ కి వచ్చాడు. ఇంకా అనూష రాలేదు.
అరగంట అటూ ఇటూ తిరుగుతుండగా తన ముందునుంచే వెళ్ళిన అనూషని చూసి ఆమె అనూష అని తెలియకపోయినా ఆమె రూపం, హుందాతనం చూసి ఈమే అనూశాయితే బాగుండును అనుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు అతడిని చూడగానే అప్పటిదాకా అతని ప్రశ్నలకి సమాధానం చెప్పిన నర్స్ "మేడమ్! సార్ మీకోసం రెండుమూడు సార్లు తిరిగి వెళ్ళిపోయిండు" అంది. అనూష హ్యండ్ బ్యాగ్ టేబుల్ మీదపెట్టి అతడివైపు చూసి "యస్!ఏం కావాలి మీకు?"అంది.
"మీరేనా అనూషగారు?" ఆనందంగా అడిగాడు భరణి.
"అవును. మీరూ...."సందేహంగా చూసింది.
"నా పేరు భరణి. తోలికిరణం పత్రిక ఎడిటర్ ని ఈ రోజు మీగురించిన వార్త చదివాను. పెపర్ లో మిమ్మల్ని ఇంటర్వ్యు చేయడానికి వచ్చాను. నా రాబోయే ఇష్యూలో మీఇటర్వ్యు వేయాలని వుంది."
"నా ఇంటర్వ్యు తీసుకోవాల్సినంత ఘనకార్యం నేనేం చేశానని" నవ్వుతూ అంది.
"ఎవరి ఘనకార్యం వారికి తెలియదు, ఇతరులు ఆ ఘనకార్యం గుర్తించి అభినందించేదాకా. మీరు చేసిన సాహసం కన్నా ఘనకార్యం ఏం వుంటుంది?వామనముర్తిని అరెస్టు చేయించడం ద్వారా మీరు ఎంతోమంది అమాయకురాళ్ళను అతని ఉచ్చు నుంచి రక్షించారు. ప్లీజ్ మేడమ్.... కాదనకండి."
"ఓ. కే! కానీ ఇక్కడ కాదు. రేపు ఉదయం ఎనిమిది గంటలలోగా మా ఇంటికి రండి. ఇది నా ఎడ్రస్" అంటూ బ్యాగ్ లోంచి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చింది.
వికసించిన మొహంతో "థాంక్యూ మేడమ్ "అని అందుకున్నాడు. అనూష నవ్వుకుంది. చాలా రోజుల తరువాత మళ్ళి తన పేరు పేపర్లో వచ్చింది. ఇలాంటివి వారం దాకా తప్పవు అనుకుంది.
నిజంగానే ఆరోజు తోటి డాక్టర్లు, స్టూడెంట్స్ ఆభినందనలతో ముంచెత్తారు. వసుదైతే ఏకంగా పూలడండ తీసుకోచ్చివేసి, స్వీట్స్ తినిపించింది. పేషెంట్లంతా విషయం తెలుసుకొని ఆమెకి నమస్కారాలు పెట్టారు. ఆరోజు అనూష ఇంటికి వెళ్ళగానే మణీవాళ్ళ చీప్ పోన్ చేశారు. "కంగ్రాట్యులేషన్స్ అనూష! చాలా గొప్ప పని చేశావమ్మా నువ్వు. ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి పారిపోవడం ఎంత మంచిపనైంది అనిపిస్తోంది నాకు" అన్నాడాయన.
"థాంక్స్ సార్!"
"అనూ! నీవలన నా గౌరవం పెరిగింది. నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు గర్వపడుతున్నాను. నేనివాళ చాలా బిజీగా వున్నాను.లేకపోతే వచ్చి నిన్నూ ముద్దుపెట్టేసుకోవాలని వుంది" అంది మణి.
అనూష నవ్వింది.
మరునాడు సరిగ్గా ఎనిమిది గంటలకి అనూష ఇంటికి వచ్చాడు భరణి. ఆమె అతని రాకనిగానీ, తనని ఇంటర్వ్యు  చేస్తానన్న విషయం గానీ సీరియస్ గా తీసుకోలేదు. అతనల ఠంచనుగా వచ్చేటప్పటికి అనూషకి చిత్రంగా అనిపించింది. ఆమె అతను రాకనిగానీ, తనని  ఇంటర్వ్యు చేస్తానన్న విషయం గానీ సీరియస్ గా  తీసుకోలేదు.
అతను చెప్పిన పత్రిక పేరు కూడా ఆమెకు గుర్తులేదు. దానిక్కారణం ఇంతకుముందు ఎప్పుడూ ఆ పత్రిక ఒకటి వుందన్న విషయం తెలిసి ఉండకపోవడమే.
"గుడ్ మార్నింగ్ డాక్టర్!" అంటూ వచ్చిన అతన్ని సాదరంగా ఆహ్వానించింది. వెంట కెమెరా తెచ్చుకున్నాడు భరణి.
"మీ పోటోలు రెండు యాంగిల్స్ లో కావాలి మేడమ్!" అన్నాడు కెమెరా చూసుకుంటూ. అనూష ఏం మాట్లాడలేదు. తనక్కావలసిన యాంగిల్స్ లో తీసుకున్నాడు.
"మేడమ్! మీకు నీరజ అనే అమ్మాయి అసలు ఎలా తారసపడింది చెప్పగలరా?"అడిగాడు.
అనూష వివరంగా చెప్పింది.
"మీరు ఆశ్రమాన్ని స్టాపించి ఎన్నేళ్లయింది?"అనడిగాడు.
"దాదాపు పదేళ్ళు."
"ఆప్రమం అభివృద్దికి మీరొక్కరే కృషిచేశారా?"
"మొదట్లో నేనే చేశాను. నా స్వంత స్థలంలో. నా డబ్బుతో ముందు రెండు గదులు కట్టించాను. అప్పుడు నలుగురో, అయిదుగురో వుండేవాళ్ళు. వాళ్లకి వంటకి, వాడుకకి కావలసిన సామాన్లు, సరికులూ నేనే పంపించేదాన్ని. మా అమ్మగారికి ఇంట్లో వస్తువుమీదా, ఫర్నిచర్ మీద చాలా మోజుండేది. మార్కెట్ లో కొత్త వెరైటీ ఏదోచ్చినా వెంటనే కొనేస్తుండేది. అవన్నీ చాలా వుండేవి మా ఇంట్లో. చాలామటుకు నేను హొమ్ కి పంపించేశాను. వాటర్ ఫిల్టర్,రెండు సోఫా సెట్లు, ఒక పాతప్రిజ్, గ్యాస్ స్టవ్, సిలిండర్, కోట స్టీలు సామాను....ఇలా చాలా సామాను పంపించాను."
"తరువాత ఫండ్స్ ఎలా సమకూర్చున్నారు?"
"కొంతమంది మెంబర్స్ చేరాక, గవర్నమెంట్ కి అప్లికేషన్ పెట్టాను. నేను చేసిదంతా వివరించి, నాకు ఫండ్స్ మంజూరు చేస్తే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నాకవకాశం వుంటుందని వివరించాను. ఏడాది గడిచాక, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ పేరుతో చిన్న పంక్షన్ ఏర్పాటు చేసి కలెక్టర్ గారిని, మంత్రిగారిని ఆహ్వానించాను. వాళ్ళు వచ్చి చూసి నేను నా ఆస్తితో హొమ్ నడిపిస్తున్నందుకు చాలా అభినందించారు. అప్పటికప్పుడే మాకు ఒక ఎకరం స్థలం, రెండు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు.అయితే నా ల్యాండ్  కి, ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్  కి మద్యలో నూతయాభై గజాల ల్యాండ్ వుంది. దాని యజమాని దగ్గర కొనుగోలు చేసి మొత్తం కలిపి ఎక్స్ టెంషన్ బిల్డింగ్ కట్టించాను. ఆ విధంగా డెవలప్ చేయడం జరిగింది."

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS