Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 17

 

    గీ.    కరుణ లమూర్తి తోడ సాక్షాత్కరించి
        నిండు వేడుక నామది నుండు మెపుడు
        మహిత శ్రీరామ పదభక్తి మద్విధేయ
        ఆర్త జనరక్షణోపాయ! ఆంజనేయ!

        రక్షణ పరాయణుండ ! నారాయణుండ!

                  : గునుగు సీసములు :
    
                  (ఈ పద్యములు సత్యవోలు భగవత్కవి రచించినవియట.)

    సీ.    వద నభు జోరోంఘ్రీవలన విప్రక్షత్ర
                  వైశ్యశూద్రులు మదివలనఁ జంద్ర
        ముఁడుఁజూపువలన సూర్యుఁడు మోమువలన మ
                   రుత్పతి వీతిహోత్రులును బ్రాణ
        మువలన వాయువు బొడ్డువలన నాక
                   సము శిరమువలన స్వర్గము పద
        మువలన భువి చెవుల వలన దిశలును
                    నుదరమువలన హెమోదరాండ

    తే.    చయము జని వృద్ది లయ మంద సలుపు నీవు
        నా హృదయ పీఠి నుండు మామ్నయసుప్ర
        సిద్ద! వైకుంఠ నాథ ! లక్ష్మినాథ !
        రక్షణపరాయణుండ ! నారాయణుండ !

    సీ.    విరజానదీపరివృతసప్తసాలా
                 తపర మభాగవత సదనపద
        వైకుంఠ భువన భవన సదనానుకృ
                  తసవీనపవనాదతల్పమున జ
        గత్కల్ప నాకల్పి కల్పుండవై కుడి
                   కాలు వంచి యెడమ కాలు సాఁచి
        కుడిచే యనంతుని యొడలి పై నెడమ చే
                    యిని జానునందున నిడి వెనుకటి
        
    గీ.    కరయుగంబుల శంఖచక్రములు మెఱయ
        సిరియు భువి నీళ గొలువ భాసిల్లు నిను భ
        జింతు వైకుంఠ నాథ ! లక్ష్మిసనాథ !
        రక్షణపరాయణుండ ! నారాయణుండ !

    సీ.    శ్రీదేవి భూదేవి సేవింపఁ గస్తూరి
                 తిలకము మాణిక్యంములుఁ గిరీట
        ము మకరకుండలములుఁ గౌస్తుభమణి తా
                  ళీలు లక్ష్మీ కుచాలేపనము వన
        మాల శ్రీవత్సము మంచిసాలు భుజకీ
                  ర్తులు బాజుబందులు గొలుసులు మురు
        గులు బటువులు ముద్రికలు శంఖచక్రాది
                   పంచాయుధములు సుభద్రసూత్ర   
        
    గీ.    కలిత పీతాంబరంబు గజ్జెలు వెలుంగ
        నా హృదయపీఠి నుండు మామ్నాయసుప్ర
        సిద్ద! వైకుంఠ నాథ ! లక్ష్మినాథ !
        రక్షణపరాయణుండ ! నారాయణుండ !
    
        
               దశావతార స్తనము

    సీ.    మహనీయమత్స్య కూర్మవరాహనరసింహ
                   వామనభృగు రామరామరామ
        బుద్దకలికి రూపములు నారదక పిల
                   వ్యాసదత్తాత్రేయు లాదిగా న
        నంతరూపము లయ్యు 'నత్యతిష్టద్దశాం
                    గుల" మని బ్రహ్మాండకోటి యేక
        పాద్విభూతిత్రి పాద్భతీగను పరమ
                    పదముగ నీ స్వరూపము దెలిసిన
        
    గీ.    తత్త్వవేత్తలు పురుషసూక్తమున నిన్నుఁ
        బొగడనెగడితి వౌ విరాట్పురుష! సుప్ర
        సిద్ద! వైకుంఠ నాథ ! లక్ష్మినాథ !
        రక్షణపరాయణుండ ! నారాయణుండ !

    సీ.    మొగము శంఖము మీసము ల్గదాఖడ్గము
                    ల్పోలను చక్రము వాలమును సుశార్జ్గా
        మునుబూని మగమీనమూర్తి వై మెఱసి పా        
                           తాళ మొఱసి తటస్థలి దొఱసి య
        రసి "స్వయంతీర్ధ: పరాం స్తారయతి" యను
                     నోజ గా నీతి "యత్యుచ్రయః ప
        తనహేతు " వని సోమకునకుఁ దెల్ప గుభాల్గు
                      భాల్గుభాల్న నెగసి పడుచుఁ గడలిఁ

    గీ.    గ్రచ్చుకొని వచ్చు మ్రుచ్చుమై వ్రచ్చి శ్రుతులు
        దెచ్చి విధి కిచ్చినట్టి నీ హెచ్చువినుతి
        సేతు! వైకుంఠ నాథ ! లక్ష్మినాథ !
        రక్షణపరాయణుండ ! నారాయణుండ !

    సీ.    అమృతవారాశి ఘటము మందరముఁ గవ్వ
                   ము ఫణి రజ్జువుఁ జేసి పూర్వదేవ
        తలు దేవతలుఁ బట్టి తరువఁగా ఘమఘుమ
                    ధ్వనుల బ్రహ్మాండము తల్లడపడ
        నపుడు "పరోపకారార్ధ మిదం శరీ
                     ర" మని కూర్మావతారమునఁ గ్రుంగి
        నగిరి క్రింద నిలిచి "నాన్నోదకసమం
                      దాన" మని సురలకమృతమిచ్చి (?)

    గీ.    నిరుపమాన లక్ష్మీరమణీమణీమ
        ణులు గొలువ విలసిల్లి తౌ నలఘు దాన
        శీల! వైకుంఠ నాథ ! లక్ష్మినాథ !
        రక్షణపరాయణుండ ! నారాయణుండ !

    సీ.    హిమగిరిఁ గేరుదేహము వజ్రములతీరు
                   రోమములుఁ బ్రళయార్కులసరి కను
        గవయు బ్రహ్మండముఁ గబళించు ముట్టె పా
                    తాళముఁ బెకలించుదంష్ట్ర యొప్పఁ
        గ వరాహమూర్తివై కదిసి హిరణ్యాక్ష
                     గర్భనిర్దేదివై భూర్భువస్సు
        వర్భయచ్చేదివై వారాశిమగ్న భు
                     గ్నవసుంధరోద్దరణ ప్రమోది
        
    గీ.    వై జగతి "యతో ధర్మస్తతో జయ" యను
        వచనము నిజముఁ జేసిన వర్ధమాన
        కీర్తి! వైకుంఠ నాథ ! లక్ష్మినాథ !
        రక్షణపరాయణుండ ! నారాయణుండ !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS