Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 18

   
    
    సీ.     ఎంతఁ జదివిన రవంత కులాచార
                ధర్మ మెఱుంగడ తన కుమార
        కుఁడయిన ప్రహ్లాదు నొడిసి పట్టి నఱుక
                  రహి వచ్చినట్టి హిరణ్యకశిపు
        కట్టెదుట నినుపకంబము పటపటఁ
                   బగులఁ బొగ లెగయ భగభగ మను
        పెనుమంటఁ జిటజిట మనుమిడుఁగురులు బ్ర
                   హ్మండము నిండ బ్రహ్మాదులు గడ
        
    గీ.    గడ వడఁక నల్గడ లడల వెడలి కెవ్వు
        నార్చి రిపు నేర్చి వటు నేలినట్టి శ్రీ నృ
        సింహ! వైకుంఠ నాథ ! లక్ష్మీసనాథ !
        రక్షణ పరాయణుండు ! నారాయణుండు !

    సి.    అదితి కశ్యపునకు "నంగుష్టమాత్రఃపు
                 రుష" యను వచనము రూడి సేయ
        వామనమూర్తి నవతరించి వడుగవై
                  గొడుగు జందెముఁ బచ్చగోఁచిపంచె
        పంచశిఖలు మౌంజి పాలాశదండము
                   కృష్ణాజినము చెంబు నిట్టివేష
        మమర "నణోరణీయా స్మహతో మహీ
                    యా" నన్న వేదవాక్యము ప్రసిద్ది
    
    గీ.    పడ బలికడను బుడమి మూఁ డడుగు లడిగి
        త్రిభువనము లాక్రమించు వర్దిష్టు పని భ
        జింతు వైకుంఠ నాథ ! లక్ష్మీసనాథ !
        రక్షణ పరాయణుండు ! నారాయణుండు !

    సి.    జమదగ్ని గర్భవాసమునఁ బుట్టి వివిధ
                   విద్యాతపొదనుర్విధ్య లధిక
        పతివై ప్రబలి "ఇదం బ్రాహ్మ్య మిదం క్షాత్ర"
                   మని మునిరాజచిహ్నముల శాప
        చాపనై పుణిఁ జూపి పాపభూపతుల శ
                    ఠారిక ఠోరకు ఠారాధారా
        నస్రధారా ప్రవాహములుగా శతధా స
                     హస్రధా ఖండించి యానదులను
    
    గీ.    దర్పణము భూమి దేవతాతర్పణము గఁ
        జేసిన పరశురామవేషి వని నిను భ
        జింతు వైకుంఠ నాథ ! లక్ష్మీసనాథ !
        రక్షణ పరాయణుండు ! నారాయణుండు !

    సి.    సూర్యవంశము పరిశుద్ద మని దశర
                  థుఁడనతులమనోరథుఁ డని భరత
        లక్షణ శత్రుఘ్నులకు నన్నవై పుట్టి
                   సౌందర్య చాతుర్య సౌకుమార్య
        శౌర్యధైర్యౌదార్య వీర్యసత్యౌచిత్య
                    గాంభీర్య కర్తుమకర్తుమన్య
        ధాకర్తు మతి సమర్ధత్వసత్వాఘట
                    ఘటనా పటీయ స్త్వఘనయశస్త్వ

    గీ.    సౌఖ్యసఖ్యదయాముఖ్యశాలి వైన
        రాముని సరాముని దయాభిరాము నిను భ
        జింతు వైకుంఠ నాథ ! లక్ష్మీసనాథ !
        రక్షణ పరాయణుండు ! నారాయణుండు !

    సీ.    బ్రహ్మను గన్నపరబ్రహ్మమూర్తివై
                యాద్యంత శూన్యుండ వయ్యు "ధర్మ
        సంస్థాపనార్దాయ సంభవామి యుగే యు
                  గే" యటంచును దేవకీతనయుఁడ
        వయి బలరామనహాయుఁడవై శిష్ట
                  రక్షణమును దుష్టశిక్షణమును
        సలుపుచు రుక్మిణి సత్యభామ సుదంత
                   భద్ర కాళింది జాంబవతి మిత్ర

    గీ.    వింద లక్షణయును బదార్వేలనూర్వు
        రంగనలు గొల్వ వెలయుకృష్ణాహ్వాయ ప్ర
        సిద్ద ! వైకుంఠ నాథ ! లక్ష్మీసనాథ !
        రక్షణ పరాయణుండు ! నారాయణుండు !

    సీ.    త్రిపుర దైత్యులను మిత్తికి బుత్తిఁ జేయఁ ద
                 లఁచి తదీయాంగనల యతిజృంభ
        కుఛకుంభపరిరంభగుంభనరంభాత
                రుస్తంభశుంభదూరుఘనజఘన
        బింబబింబాధర పీడన తాడన
                 దంతక్ష తనఖక్షత ప్రముఖర
        తుల నతుల గతులఁ గలసి మెలసివిల
                 సితత ద్ర్వతక్షతిఁ జేసి చేసి

    గీ.    కంటిగొంటమ్మువై మింట గంటక త్రి
        పురచరులఁ గాల్చి కాల్చినబుద్ద! గుణస
        మృద్ద!  వైకుంఠ నాథ ! లక్ష్మీసనాథ !
        రక్షణ పరాయణుండు ! నారాయణుండు !

    సీ.    కలియుగాంతమున దుష్కరముష్కరతురుష్క
                 చండాలపతిత పాషండమండ
        లీమండితా ఖండభూమండలముఁ జూచి
                  కమ్రామ్రపర్ణార్ణతామ్రపర్ణీ
        తటమున బ్రహ్మ విద్బ్రాహ్మణునకుఁ బట్టి
                  వై పుట్టి యుత్త మాశ్వాదిరూడుఁ
        డవయి జోడుఁ దొడిగి డాలు కత్తిక మానుఁ
                   బూని పూనిక మీఱఁ బుడమిఁ బుట్టి

    గీ.    నట్టిదుష్టులఁ బుడమిఁ జెండాడ నున్న
        కలికిమూర్తి! గుణస్పూర్తి ! కలితశౌర్య
        కీర్తి ! వైకుంఠ నాథ ! లక్ష్మీసనాథ !
        రక్షణ పరాయణుండు ! నారాయణుండు !

    ఈ క్రింది దశావతారస్తుతి పద్యము లేలకూచి బాలసరస్వతీ మహోపాద్యాయుఁడు రచియించెను.

                   మత్స్యావతారము

    శా.    సాదీయోముఖ పూరితోద్వామిత తాసతోర్ధ్వగోదన్వ ద
        ర్జోధారాంతరట త్తి మింగిలగిల ప్రోద్దాననిధ్యానల
        భ్దాదీశ ప్రభుతా స్వభాగహరణార్దాయాయినాథానుజ
        ప్రాధాన్యాం కవిలో లవాగ్ధృగబట బ్రహ్మంస్తుమ స్త్వా మనున్.

        
                   కూర్మావతారము

    శా.    ద్యూత్తంభద్గిరి కల్పితావతరణద్యోవాహిని సంగ మో
        పాత్తెం దూదయనిష్పితౄణ జలధి ప్రారబ్ధపు త్రోత్సవో
        దాత్తత్వాత్త గజాశ్వవన్యశనకన్యాగోమణీ దాన సం
        పత్తి ప్రీణితదేవడుల్యధిపతి బ్రహ్మంస్తుమ స్త్వా మనున్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS