Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 16



    "ఏ మొక్కాలేని చోట, ఆముదం మొక్కే మహావృక్షంగా చెలా మణి

ఔతుంది. అక్కడ గ్రౌండ్ లో ఆడుతున్న వాళ్ళంతా లఫంగీ మొహాలు! వాళ్ళల్లో కాస్త

బెటర్ గా ఆడగలిగితే చాలు..... పెద్ద కిలాడీలా ఫోజు!

    ప్రముఖ ఫుట్ బాల్ ఛాంపియన్... ఆట ఎప్పుడైనా చూసావా?

అలాంటిది చూస్తే..... వీళ్లంతా నీ కళ్లకి పిపీలకల్లా కనిపిస్తారు!" అంది మాధురి.

     రుక్మిణి మాట్లాడలేదు.

     మాధురితో వాదనకి దిగటం అనవసరం అని ఆమె భావన .

     కానీ... ఆమె వూరుకోలేదు.

     "రుక్కూ! ఆ అబ్బాయిది ఎంత ఇడియాటిక్ స్ట్రేచరో ఇప్పుడే

నిరూపిస్తాను చూడు!"అంది మాధురి.

    "ఎందుకులే... ఊర్కో....." అంది రుక్మిణి కంగారుగా.

    ఆమెకు తెలుసు మాధురి మనస్తత్వం ఎటువంటిదో. ఆమె దృష్టిలో

మగాళ్లు కేవలం ఆడవాళ్లని వలలో వేసుకుని, కేవలం సెక్స్ కోసం వాళ్లని

వినియోగించుకోవాలని అనుకునే 'క్లీచర్లు!'

    అది నిజమే కావచ్చు.

     కానీ అందులో తప్పేముంది?

    ఈ సృష్టిలో రెండేరెండు జాతులు.

     స్త్రీ... పురుషులు!

    ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ, ఒకరంటే ఒకరికి కూతూహలం ఒకరినుంచి

ఒకరు ఏదో పొందాలనే కోరిక, సెక్స్ ద్వారా సుఖాన్ని స్వంతం చేసుకోవాలను కోవటంలో

తప్పేముంది?

     ఇష్టం వుంటే ఓ. కే!

    లేకపోతే నో...

     అంతేగానీ, ఆకాంక్ష వుండటం తప్పని అనుకోవటం ఒక రకమైన

ఫోబియా!!

     "షటప్, అది ఫోబియా కాదు!" అంది మాధురి.

     "నీకు తెలీదు. ఈ మగాళ్ళు ఎంత హిపోక్రాట్సో

తెలిసా?....డైరెక్టుగా అసలు సంగతికి రారు!నానుస్తారు! ప్రేమంటారు! ఇష్టం

అంటారు! అభిమానం అంటారు! ఇంకేదో 'ఇది'  అంటారు! డొంకతిరుగుడు

మార్గంలో వచ్చి... .చివరికీ అందరూ అడిగేది 'అదే' అంది మాధురి.

     "ఔను మాధురీ! దుకాణంలో సరుకులు అడిగినట్లు, అది కావాలి

ఇది కావాలి అని అడగటం ఎంతో హాస్యాస్పదం. ముందు లైనులో పెట్టాలి. తర్వాత

మనసు మీటాలి. ఆ తర్వాత... .మెల్లిగా చేరువ కావాలి. అప్పుడు కావలసింది

అడిగేయాలి! అప్పుడే థ్రిల్!" అంది  రుక్మిణి.

    "డోంట్ బీ సిల్లీ. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లాంటిదే ఇది!

మగాడి చీప్ నేచర్ ని సపోర్ట్ చెయ్యటానికి నీకు సిగ్గు లేదూ? అసలు నువ్వు

ఆడదానివేనా?" అంది మాధురి.

     కానీ రుక్మిణి లాజిక్ వేరు.

     ఎప్పుడూ 'మగాడు' అనే పదార్దాన్ని అనుమానంగా చూడటం

అలవాటైతే... ఇక భూప్రపంచంలో తనకి తగిన పదార్దం' దొరకదు.

     అది ఫోబియా. నో డౌట్.

     కానీ ఆ విషయం ఆమెకు చెప్పటం అనవసరం అని మౌనం వహించేది.

     ఇప్పుడూ అంతే.

     అతన్ని ఏం చేస్తుందో!....

    కుతూహలంగా చూడసాగింది రుక్మిణి.

    ప్లే గ్రౌండ్ ఆట అయిపోయింది.

    ప్రశాంత్ కారిడార్ వైపు నడుస్తున్నాడు చెమట్లు కక్కుకుంటూ.

    కిసుక్కున నవ్వింది మాధురి....

    అంతే ఠక్కున ఆగిపోయాడు ప్రశాంత్.

    "అరగంట ఆడేసరికి అంత ముద్దముద్ద అయిపోయావ్! స్టామినా

ఇంప్రూవ్ చేసుకోకుండా స్పోర్ట్స్ జోలికి రావడం దేనికి?"  అంది మాధురి వ్యంగ్యంగా.

     వికాస్, రాజేష్ ప్రశాంత్ ని కలుసుకుని, ఆమె మాటల గురించి

చెప్పాలని అనుకుంటూ వుండగానే, మాధురి రంగంలోకి దిగటంతో నిశ్శబ్దంగా

వుండిపోయారు.

    "ఒకసారి ఆడి చూపెట్టండి. అరగంట అక్కర్లేదు.... ఐదు

నిముషాలు చాలు. మీరు చెమట్లు క్కకుకోకుండా ఉల్లాసంగా ఎలా వుంటారో 

చూసి.... నేర్చుకుంటాను!" అన్నాడు ప్రశాంత్.

     పకపక నవ్వారు వికాస్, రాజేష్.

    మరో ఇద్దరమ్మాయిలు కిసుక్కున నవ్వటం వినిపించింది ఆమెకి.

    "నేను మీలాంటి కిలాడీతో ఆడగలనా?" అంది మాధురి.

    "నా కిలాడీతనం ఏం చూశారు?రంగంలోకి దిగితే కదా

అర్దమవుతుంది!" అన్నాడు ప్రశాంత్.

     "ఛీ..... పోండి! అంది మాధురి చిలిపిగా.

     రుక్మిణికి ఏమీ అర్దంకాలేదు."

    ఎందుకంత 'గివ్ అప్' స్టయిల్ లో ప్రవర్తిస్తోందో

తేల్చుకోలేకపోయింది.

    కుతూహలంగా చూస్తోంది.

     "మీలో ఇంతటి చిలిపితనం కూడా వుందని ఇప్పుడే అర్దమయ్యింది.

నాకు.... కాలేజ్ అయిపోయాక కలుసుకుందాం...." అన్నాడు ప్రశాంత్.  
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS