Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 15

 

    లాటిన్ అమెరికాలోని శాన్ అన్ డ్రెస్ పర్వతాలలో ఇరవై రెండు అంగుళాల పొడుగూ పన్నెండు అంగుళాల వెడల్పు ఉన్న అడుగు జాడలు కనబడ్డాయి. అమెరికాలో ని ఇండియానా రాష్ట్రంలో ఒక సమాధిలో ఒక జెయింట్ ఆస్తిపంజరం దొరికింది. ఆ మనిషి కనీసం తొమ్మిది అడుగుల ఎనిమిది అంగుళాలు ఎత్తు అంటే దాదాపు పది అడుగులు వుండి వుండాలి. మిన్నిసోటా రాష్ట్రంలో కొన్ని ఆస్తిపంజరాలు దొరికాయి. వాటికి పైవైపున, కింది వైపున రెండు వరసల పళ్ళు వున్నాయి. అన్నిటి కంటే ఆశ్చర్యం -- పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక అస్తిపంజరం దొరికింది. దాని పొడుగు ఎడడుగుల పైనే!
    అందులో స్పెషాలిటీ ఎమిటో తెలుసా? ఆ ఆస్థిపంజరానికి కనుబొమ్మలు పైన రెండు కొమ్ములు వున్నాయి !" అంది సృష్టి.
    చందమామ కధలే గుర్తొస్తున్నాయి రాజు. రాక్షసుడు -- మిడిగుడ్లు - తలమీద చిన్న కొమ్ములు!
    ఏది సత్యం ! ఎదసత్యం?
    మళ్ళీ అంది సృష్టి.
    'అలా అని రాక్షసుల విషయంలో మనం అర్జెంటుగా ఒక నిర్ణయానికి వచ్చి వేయాల్సిన అవసరం లేదు. ఒక ఆస్థిపంజరం తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్నంత మాత్రానా అది ఆటోమేటిక్ గా ఒక రాక్షసుడి రాలూకుదని చెప్పలేం . ఎందుకూ?
    ఈ శతాబ్దంలో కూడా జెయింట్ సైజులో వున్నా మనుషులు లేరూ! తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఒక పురుషుడు , ఎనిమిది అడుగుల ఎత్తు వున్న ఒక స్త్రీ రికార్డుల్లోకి ఎక్కారు."
    "అలా' కొంతమంది అంత ఎత్తు ఎదగడానికి కారణం ఏమయి వుంటుంది ?" అన్నాడు రాజు.   
    "బాడీలో పిట్యూటరీ గ్రంధి వుంటుంది కదా -- అది పనిచేసే విధానాన్ని బట్టి శరీరం ఎదుగుదల వుంటుంది. అది అబ్ నార్మల్ గా పనిచేస్తే మనిషి మరుగుజ్జు కావచ్చు. మహాకాయుడూ కావచ్చును ."
    "మరుగుజ్జు అంటే గుర్తొచ్చింది . టాంధంబ్ తెలుసుగా ......ప్రపంచంలో అతి పొట్టి మనిషిగా రికార్డు అయిన మనిషి " అన్నాడు రాజు.
    "రాక్షసులు అని మనం అనుకునే జెయింట్స్ కొందరు ఉన్నట్లే , అతి పొట్టి మనుషులు కూడా వుండి వుండే వాళ్ళనడానికి ఆధారాలున్నాయి " అంది సృష్టి.
    "ఏమిటవి? ఎక్కడ కనబడ్డాయి?"
    "ఎక్కడదాకానో ఎందుకూ?
    ఇండియాలోనే -- బరోడా సంస్థానంలో ఉండిన వాద్ నగర్ లో 1935 వ సంవత్సరంలో త్రవ్వకాలు సాగిస్తుంటే కేవలం పదిహేను అంగుళాల పొడుగు మాత్రమే వున్న మనిషి శరీరం కనబడింది. ఆస్థిపంజరం కాదు -- మనిషి శరీరమే -- అయితే కాల మహిమ వల్ల అది ఒక రాయిలాగా ఘనీభవించిపోయింది. ఫసిల్స్ అంటాం చూడండి -- అట్లా అన్నమాట! ఇది చాలా అసందర్భంగా వుందని అప్పట్లో నెట్టి పారేశారు. కానీ అదే టైం లో ఆవు తాలుకూ శిలాజం దొరికింది. ఆ ఆవు కేవలం అడుగున్నర ఎత్తు వుండేది.
    ప్రపంచవ్యాప్తంగా పొట్టి మనుషుల గురించిన కధలు ప్రచారంలో వున్నాయి రాజూ. ఉదహరణకి ఇండియాలోనే వింధ్య పర్వతాల ప్రాంతంలో రాతితో చేసిన అతి చిన్న కత్తులు కనబడ్డాయి. అవి బొమ్మ కత్తుల కంటే కూడా ఇంకా చిన్న సైజులో వున్నాయి.
    అవి మామూలు మనుషుల ఉపయోగించలేనంత చిన్నవి అన్నమాట! అంగుళంలో మూడోవంతు సైజు! అంతే! అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి ఉండే అట్లాంటి మినియేచర్ కత్తులు ఇండియాలోనే కాక ఈజిప్టులోనూ, ఆఫ్రికా , ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సిసిలీ, లాంటి చోట్ల కూడా కనబడ్డాయి ." అంది సృష్టి.
    "మరగుజ్జు అంటే ఒక జోక్ గుర్తు వస్తుంది " అన్నాడు రాజు.
    ఏమిటన్నట్లుగా చూసింది సృష్టి.
    "ఆరడుగుల పొడుగున్న మారుగుజ్జుని, నీతి కోసం ప్రాణం పెట్టె రాజకీయవేత్తనీ చూపించమన్నాట్ట ఎవరో!"
    నవ్వింది సృష్టి .

    
                            *    *    *

    "అయితే మైక్రో కారు తయారయినట్లేనా ?" అన్నాడు జ్ఞాని . అతనొక సైంటిస్టు.
    ఆ అండర్ గ్రవుండ్ లేబొరేటరీ చాలా పకడ్భందీగా ఉంది. దాని గోడలు మాములు గదుల గోడల కంటే పదిరెట్లు మందాన ఉన్నాయి. భూమి పైన అటంబాంబు పేలినా కూడా ఆ అండర్ గ్రవుండ్ లేబొరేటరీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండేటట్లుగా హైటెక్ నిర్మాణం చేశారు.
    అంత పెద్ద లేబొరేటరీకి ఒకే ఒక్క తలుపు ఉంది. అది ఉక్కుతో చేసింది. బుల్లెట్ ప్రూఫ్ అవడం దాన్ని తక్కువ చెసినట్లవుతుంది. రాకెట్ లు ప్రయోగించినా చెక్కు చెదరనంత స్ట్రాంగుగా వుంది ఆ తలుపు.
    "యస్సర్! మైక్రో కారు తయారయింది !' అన్నాడు అసిస్టెంటు ఎగ్జయిటెడ్ గా. అతని చేతిలో చిన్న ఉంగరపు పెట్టె లాంటిది వుంది. పెట్టె తెరిచాడు అసిస్టెంటు.
    అందులో ఒక ఆవగింజ సైజులో వున్న చిన్న కారు వుంది.
    "వెల్ డన్ !" అన్నాడు సైంటిస్టు జ్ఞాని." అయితే , ఇది నీ ట్రైనింగ్ కి అంతం కాదు -- ఆరంభం మాత్రమే ! గుర్తుంచుకో! దాదాపు పాతికేళ్ళక్రితమే కొందరు జపనీస్ సైంటిస్టులు ఇట్లాంటి మైక్రోకారు తయారుచేశారు. ఎవరు ఏది చేసినా కూడా దాన్ని సూక్ష్మరూపంలోకి మార్చడం అనేది జపనీయులకి అలవాటు కదా- వుంగరంలో పట్టే ట్రాన్సిస్టర్ రేడియోలు, రిస్టువాచీ సైజు టీవీలు తయారు చేసింది జపాన్ వాళ్ళే ! బోనసాయ్ మరుగుజ్జు వృక్షాలు తెలుసుకదా. బ్రహ్మాండమైన మర్రి రావి వృక్షాలనీ కూడా ఇన్ డోర్ ప్లాంట్స్ లాగా సైజులో బాగా కుదించేశారు వాళ్ళు.
    ఆ పద్దతిలోనే జపాన్ వాళ్ళు అప్పట్లోనే ఒక మైక్రోకారు తయారు చేశారు. అది ఎంత చిన్నదంటే , అగ్గిపుల్ల మీద చులాగ్గా నడుస్తుంది. బియ్యపు గింజ సైజులో ఉంటుంది ఆ కారు. టొయోటా కార్ల కంపెనీ వాళ్ళు తయారు చేశారు దీన్ని. ఒరిజినల్ మోడల్ తో పోలిస్తే ఈ మైక్రో కారు అందులో కేవలం వెయ్యోవంతు సైజులో వుంటుందన్నమాట - అయితే అదొక్కటే తేడా -- మిగతా విషయాల్లో ఈ మైక్రోకారు ఒరిజినల్లాగానే వుంటుంది. అందులోనూ విడిభాగాలు ఉంటాయ్. టైర్లు వుంటాయి. చక్రాలుంటాయి. హెడ్ లైట్స్ వుంటాయి. టెయిల్ లైట్స్ కూడా వుంటాయి. హేబ్ క్యాప్స్ మీద కంపెనీ పీరు సూక్ష్మామైన అక్షరాలతో రాసి వుంటుంది.
    ఆ కారు తాలుకూ మోటారులో మళ్ళీ ఐదు భాగాలు ఉంటాయి. మోటారు సైజు 0.7 ,మిల్లిమీటర్లు మాత్రమే. ఆ మోటారు సాయంతో ఆ మైక్రోకారు సేకెండుకి ఐదు సెంటిమీటర్లు వేగంతో నడిచింది.
    సైంటిస్టు జ్ఞాని, ఆశువుగా చెప్పేస్తున్న దానికి అసిస్టెంట్ అనుచర్ గబగబా బుర్ర వూపేస్తున్నాడు "తెలుసు సార్- తెలుసు సార్ " అన్నట్లు.
    మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు జ్ఞాని.
    "జర్మన్లు కూడా అప్పట్లో ఒక మైక్రోమినీ హెలికాప్టర్ ని తయారుచేశారు. దాని ఎత్తు అంగుళంలో మూడో భాగం మాత్రమే! దాని బ్లేడ్లు నిమిషానికి లక్షసార్లు తిరుగుతూ ఆ మైక్రో మినీ హెలికాప్టర్ ఎగిరేటట్లు చేసేవి."
    'అవున్సార్!" అన్నట్లు తల ఊపాడు అసిస్టెంటు.
    "నువ్వు అంతకంటే బెటర్ గానే ఏదో తయారుచేసి వుంటావని ఆశిస్తున్నాను అనుచర్!" అన్నాడు జ్ఞాని గంభీరంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS