సీ. కాటుకకొండపైఁ గాయురేయేండకుఁ
జెలువైన పచ్చనివలువచాని
గగనోదరంబున నెగడుచందురునకుఁ
గవయైన నాభిపంకజము వాని
పొడుపు గుబ్బలిమీఁది ప్రొద్దుచందంబున
బొడవైనరత్నంపుఁ దొడవు వాని
తరఁగలఁదోతెంచు నురుగులకాంతికి
గరుసైనధవళ శంఖంబు వాని
గీ. తెల్ల దామర విరి మీఁదఁ దేఁటి వోలెఁ
బాలమున్నీటిలోపలఁ బవ్వళించి
యోగనిద్రావిలో లుఁడై యున్నవాని
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. శ్రీరామచంద్రుచేఁ జెలఁగి పూజలు గొన్న
పరమేశుఁ డారంగపతి యితండు
ఏడుకోటలలోన వేడుక విహరించు
కపటనాటకుఁడైన ఘనుఁడి తండు
బ్రహ్మరుద్రామర ప్రముఖుల కెల్లను
నాది మూలంబై నయతఁ డితండు
వైనతేయుని నెక్కి వరుసదానవకోటిఁ
బరిమార్చు శ్రీజగత్సతి యితండు
గీ. విశ్వరూపంబు చూపిన వేల్పితండు
విశ్వ ముదరంబునం గల విభుఁ డితండు
అట్టి శ్రీరంగశాయి నాయాత్మ యందు
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. మున్నీ ఁటితరగలు మోచినచాడ్పునఁ
బులకాంకురంబులు మొలక లెత్త
ప్రిదిలిన కౌఁగిలి బిగియించు సిరిచేతి
కంకణఝుణణాత్కార మెసఁగ
జలజాసనుఁడు లోనమేలఁగెడు పొక్కిలి
తమ్మిపైఁ దేంట్లు జుంజుమ్మురనఁగ
గంధర్వగానంబు కన్నులఁ జిలికినఁ
బర్యంకనాగంబు పడగలెత్త
గీ. అల్ల నరకన్ను విచ్చి యింద్రాదిసురుల
విన్నపము లోలి నాలించుచున్న వాని
వెడఁదకన్నుల నల్లని యొడలి వాని
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. శ్రీకరరత్న శింజితనూపురస్పుర
త్పాదపద్మంబులు పరగు వాని
కాంచీక లాప సంఘటితదుకూలంబు
కాంచనచేలంబు గలుగువాని
గ్రైవేయకకంబులు కమనీయహారముల్
కంకణంగదములు గలుగువాని
మకరకుండలరత్న మహనీయమకుట స
న్మందహాస విలాస మహిమవాని
గీ. భరత లక్షణశత్రుఘ్న పవనసుతులు
గొలువ జానకితోఁ గూడి కొమరుమిగులు
నటియా యోధ్యరామ నే నాత్మలోన
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. ఇంద్రనీల సమూహసాంద్రఘనాఘనో
జ్జ్వలమైన దేహంబు గలుగువాని
సత్యప్రధానమౌ సాధుభావంబున
సజ్జనరక్షణ సలుపు వాని
మేరుమహీధరభూరి ధైర్యంబున
నబ్ధిగ బీరత నలరు వాని
గీ. భరత లక్షణశత్రుఘ్న పవనసుతులు
గొలువ జానకితోఁ గూడి కొమరుమిగులు
నట్టియా యోధ్యరామ నే నాత్మలోన
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. శతకోటికందర్ప సమజగన్మోహన
భూరిసౌందర్య విస్పూర్తివాని
త్రిభువన కోదండ దీక్షాగురుం డన
బిరుదువిఖ్యాతిఁ బెంపెసఁగు వాని
చండభండన ధరాస్థలి దివ్య మేఘంబు
వలె శరలాఘవం బలరువాని
సింధుబంధురగర్వ సింధుర క్రమకళా
సింహ విక్రమ కేళిఁ జెలఁగు వాని
గీ. భరత లక్షణశత్రుఘ్న పవనసుతులు
గొలువఁ బోరోలగంబునఁ జెలువ మలరు
నట్టి పట్టాభి రాము నే నాత్మలోన
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. నీలమేఘచ్ఛాయ నేగడేడు తిరుమేన
మెండుగాఁ గస్తురి మెత్తినాఁడు
ధగ దగద్డగ యనుతుళుకు బిళ్ళయు లెస్స
కటితటి దిండుగాఁ గట్టినాఁడు
కోటి సూర్యుల కాంతి కుదురైన రత్నంబు
ఘనకిరీటము తలఁ గలిగినాఁడు
కలుముల నీనెడు కాంతి చే నొఱ పైన
యురమునఁ గౌస్తుభ మూనినాఁడు
గీ. విరాజ కావేరి మాధ్యమ వెలసినాఁడు
ఎలమి భక్తుల కోర్కెల నిచ్చినాఁడు
అట్టి శ్రీరంగశాయి నే నాత్మలోన
భరత లక్షణశత్రుఘ్న పవనసుతులు
గొలువ జానకితోఁ గూడి కొమరుమిగులు
నటియా యోధ్యరామ నే నాత్మలోన
మేలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సి. సుర లర్దిఁ గల్ప ప్రసూనముల్ వర్షింప
నప్సరోవనితలు నాట్యమాడ
దుందుభిధ్వానముల్ తుములంబులై మ్రోయఁ
దూర్యఘోషంబులు తొంగలింపఁ
జేరి వశిష్టుఁ డాశీర్వాద మొనరింప
నలయరుంధతి శోభనంబు పాడ
వరగుణంబుల నెల్ల వాల్మీకి నుతియింప
నారదమౌని గానం బొనర్పఁ
గీ. జెలఁగి సింహాసనంబున సీత తోడ
రమణఁ గూర్చుండి రాజ్యపాలనము సేయు
నట్టియాయోధ్యరాము నేనాత్మలోన
మెలఁత! కలగంటి నంతట మేలుకొంటి.
సీ. సౌమిత్రి వేడుక ఛత్రంబు దాల్పంగఁ
బాదుకల్ భరతండు భక్తి నిడఁగ
శత్రుఘ్నుఁ డంతలోఁ జామరంబును వీవ
సుగ్రీవుఁడర్ధితో సురఁటి వీవ
అంగదుం డంతంత నడపంబు పట్టంగ
సరసఖడ్గము విభీషణుఁడు తాల్ప
సామీరి మతిమీఱి సన్నుతిఁ గావింప
జాంబవంతుండు హెచ్చఱిక దేల్ప
