గుండెలనిండా పొగపీల్చి వదిలాడు!
అతనిలో అంతవరకు పెల్లిబకిన ఆవేశం చల్లబడిపోయింది!
మెల్లిగా తలతిప్పి చూసాడు!
సల్మా!!
మంచం మీద బోర్లా పడుకుని దిండులో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోందామె.
ఆమె గుండ్రటి బుజాల క్రిందుగా ఏపుగా ఎదిగిన కుడి వక్షశిఖరం పెల్లుబుకుతూ కనిపించింది!
అప్పుడు పసిగట్టాయి అతని కళ్ళు.. ఆమె బంగారు రంగు శరీరం మీద నెత్తుటి గాట్లు!!
ఎర్రని గుర్తులు!!....
అంగుళం అంగుళం మేర నెత్తురు!!
అతని గుండె దడదడమంటున్న శబ్దం అతనికే వినిపిస్తోంది! ఆ స్థితిలో సల్మా పోలీస్ స్టేషన్ లో హాజరైతే... తన చేతులకి సంకెళ్లు తప్పవు!!
కఠినమైన కారాగార శిక్ష తప్పదు!!
ఎందుకలా ప్రవర్తించాడు తను?
ఎందుకు?
మాధురి!!
యస్! దట్ బ్లడీ ఉమెన్!!
రంభ ఊర్వశి మేనక తిలోత్తమలకే తలదన్నే అపూర్వ సౌందర్య రాశి మాధురి....
అరమోడ్పు కన్నులతో విరిసిన పుష్పబాణాలని, ముసిముసి నవ్వులతో రగిల్చిన మోహజ్వాలలని తట్టుకోలేక.... వెనుకనుంచి ఆమె విశాలమైన వీపుమీద సున్నితంగా ఓ ముద్దు పెట్టుకుంటే....
ఛెళ్!!.... ఛెళ్!!!
అందరి సమక్షంలో!అంతమంది సమక్షంలో!
ఎంత ధైర్యం!ఎంత పొగరు! ఎంత గర్వం!
నో!
ఆమె నెత్తురు విస్కీలో కలుపుకుని తాగాలనే తన నిర్ణాయనికి, ఆ రోజు తన రూం మేట్ సూరిబాబు గనుక అడ్డు తగలకపోయివుంటే తనెంత పైశాచికంగా ప్రవర్తించేవాడు! ఒకసారి, కాదు!రెండుసార్లు కాదు, మూడుసార్లు!
త్రీటైమ్స్!త్రీ ఛాన్సెస్!
మాధురీ... ది బ్లడీ స్వైన్!
సూరిబాబు గుర్తుకు రాగానే పూర్తిగా చల్లబడిపోయింది తనలోని ఆవేశం!
కానీ.. .అప్పుడప్పుడు.... ఆ అవమానం గుర్తుకొచ్చినప్పుడు.... సల్మా.... సల్మాలాంటి మరొకరు... ఇలా బలైపోవలసిందేనా? మెల్లిగా మంచం వైపు నడిచాడు.
అతని అడుగులు తనని సమీపిస్తున్నట్లు పసిగట్టి, చివ్వున తలెత్తింది సల్మా.
"మైగాడ్! ఆమె పెదవులని ఎంత దారుణంగా కొరికేశాడు తను!
ఆమె బుసలుకొడ్తూ, ఎర్రబారిన కళ్లతో ప్రశాంత్ వైపు చూస్తూ...
"ఆగు!" అని అరిచింది వణికే స్వరంతో.
అప్రయత్నంగా ఆగిపోయాడు ప్రశాంత్.
"నీ గుండెలమీద వాలి సేదతీర్చుకోవాలని, నీ కౌగిట్లో కరిగిపోయి పన్నీటి జలపాతంలా ప్రవహించాలని, నీ ముద్దుల వర్షంలో తడిసిపోవాలని.... నీ కోసం పరితపించి, కోరికోరి నీ దగ్గరికి వస్తే... ఇలా చేస్తావా?
నీ కంటికి నేనొక మనిషిలా కనిపించలేదు!నీలాంటి వాడికి నన్ను నేను సమర్పించుకోవాలని అనుకోవటం నా బుద్ది తక్కువ!" ఏడుపు దిగమింగుకుంటూ ఆవేదన నిండిన స్వరంతో ఆవేశంగా అంది సల్మా.
ఒక్క క్షణం ఆమెవైపు మౌనిలా చూస్తుండిపోయాడు.
ఆమె చివాలున మంచం దిగి, విప్పేసిన దుస్తులని చకచక ధరించింది....
"సల్మా!!" ఖంగుమంది ప్రశాంత్ కంఠస్వరం.
"అందుకోవటం, ఆస్వాదించటమే తప్ప. క్షమాపణలు కోరే అలవాటు ఈ ప్రశాంత్ చరిత్రలోనే లేదు! ఐ డోంట్ డూ ఎనీథింగ్ వాట్ ఐ డూ వన్స్! కాబట్టి థాంక్స్ చెప్పటం ఒక్కటే నేను ఈ పరిస్థితుల్లో చెయ్యగలిగింది!" అన్నాడు.
అతని మొహంలో విస్తరించి వున్న ప్రశాంతత ఆమెకు ఉపశమనం కలిగించలేదు.
తలుపు తెరుచుకుని బైటికి వెళ్లిపోయింది సల్మా.....!
ఒంటరిగా మిగిలిపోయిన ప్రశాంత్...
"నా దృష్టిలో మగాడంటే ఎలా వుండాలో నువ్వు గ్రహించడానికి మరో జన్మెత్తాలి మిస్టర్!" అన్నమాధురి మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే.. శిలాప్రతిమలా వుండిపోయాడొక్క క్షణం!!
