Previous Page Next Page 
తప్పు పేజి 14

 

    కృష్ణ మోహిని నవ్వి 'ఫ్రెండ్ అంటున్నావు. నాకు తెలియని ఫ్రెండ్ యేవరున్నారు చెప్మా? ఆ ఆ అర్ధం అయింది. నాకు చేపల్ని యివ్వ లేదంటే.... ఒక్క మాట నేనంటే నీకు వల్లమాలిన అపేక్ష. ఆ సంగతి ఆఫ్ కోర్స్ యిప్పుడు తప్పకుండా ఒప్పుకోవాలి. అచ్చా! నాకన్నా మించిన ఆత్మీయులు ఈ వూళ్ళో యేవరున్నావు బావా?' అనిఅడిగింది.
    శ్రీకాంత్ చురుకుగా చూశాడు: 'సీరియస్ నెస్ బొత్తిగా లేదు. వాడు యిడ్లీ, సిరా బుడ్డి మోహాలే వేశాడు. నువ్వు వట్టి యిడియట్ లా వున్నావు చూడబోతే. జరిగింది చెప్పకుండా యేమిటి న్యూసెన్సు.' అన్నాడు చిరాకు పడుతూ.
    క్రుష్ణమోహిని చప్పట్లు చరిచి గిల్టీ గా ఫీల్ కాకు బావా! తప్పేం వుంది మరో పిల్లకి అన్నీ చేపల్నీ యిచ్చానని చెప్పుకుంటే' అన్నది.
    ఉమేష్ తల దించుకుని గడ్డి పరకల  మధ్య వ్రేళ్ల ని పోనిస్తూ ఆలోచిస్తున్నాడు.
    కృష్ణ మోహిని నెత్తిన ఒక్కటి అంటించాడు శ్రీకాంత్. 'వాడికి నీ ధ్యాస తోటి రాత్రంతా నిద్ర లేదు. నిన్న ఏం జరిగిందో చెప్పకుండా సిల్లీగా మాట్లాడకు. మాకేం తెలీదని ప్రమాణం చేస్తే నమ్మవెం.'
    కృష్ణ మోహిని బుద్దిగా కూర్చుంది. ఆ తరువాత తల ఎత్తింది. అంతవరకూ ఆ పిల్ల హాస్యంగా మాట్లాడిందంటే నమ్మందుకే వీలులేనంత గంబీరంగా మారిపోయింది. రెపరెప లాడిస్తున్న కనురెప్పల మధ్య నీటి మీది చేప పిల్లలా తారట్లాదుతున్నాయి కనుపాపలు. క్షణం లోనో అరా క్షణం లోనూ తుఫాను వచ్చే సూచనలతో వున్న ఆకాశం మాదిరిగా ఆ పిల్ల మొహం లో విచార రేఖలు నీలి మేఘాల వలె ఆక్రమించు కున్నాయి. 'తల్లి తండ్రులు చేసిన తప్పుకి పిల్లలు బాధ్యులౌతారా బావా? నిన్న అమ్మా, నాన్నా మంచి రోజని ఉమేష్ కి చిన్నప్పటి నుంచీ అనుకుంటూన్నాం కదా అని మీ నాన్నగారి దగ్గరికి వచ్చారు. యెంతైనా లాయరు కద. కాలికి వస్తే మెడకీ, మెడకి వేస్తె కాలికి తగిలించి నాన్నగారిని మాటల్తో వోడించి పంపారు. మావయ్య కన్నా సీనియర్ అయినా నాన్న ముద్దాయిలా మాట్లాడలేక పోయారు.'
    'ఉమేష్ ని రాధిక కూతురి కి యివ్వాలని చిన్నప్పటి నుంచీ అనుకుంటున్నాం ఉపేంద్రా, అన్నారుట. యిది యెంత నిజమో మాకు తెలీదూ.'
    'తండ్రి కులానికి ప్రాధాన్యతని యిస్తారు కదా. అయినా అతని తమ్ముడు అమెరికన్ ని చేసుకోలేదూ. అయన మాత్రం '.......కృష్ణ మోహిని చటుక్కున నాలిక కరుచుకుంది. శ్రీకాంత్ ఉమేష్ లకి అవహాగన కాలేదు.
    కృష్ణ మోహిని సంభాషణ మార్చి కబుర్లు చెప్పింది. నోరు జారిన మాటని తీసుకునేందుకు తలక్రిందు లయింది. ఉమేష్ తననే చేసుకుంటానని ప్రమాణం చేయాగానే ముగ్గురూ బయలు దేరారు యింటి ముఖం పడుతూ.
    దారిలో సంభాషణ మరి సాగలేదు. నార్కెల్ డాంగా దగ్గర కృష్ణ మోహిని ఆగిపోయింది. అన్నదమ్ములిద్దరూ రోజూ మాదిరి గానే సాయంత్రం శంఖారావం అయిపోయినా జోడా మందిర్ కి వెళ్ళి శివుడి నీ, కాళికా దేవినీ దర్శనం చేసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ యింటి వైపు మళ్లారు.
    కృష్ణ మోహిని అన్న ఒక్క మాటా శూలం లా పొడుస్తోంది యిద్దరి గుండెల్లోనూ. 'అయన మాత్రం......' ఆయనేం తప్పు చేశాడు? యిద్దరూ పదే పదే అనుకుంటుండగానే యిల్లు వచ్చేసింది. యిల్లు నిశ్శబ్దంగా వుంది. కొద్దిగా చీకటి పడడం వల్ల హాలులో దీప లెని కారణంగా మరీ చీకటి గా వుంది. హాలులో దీపం వేసి మెట్లెక్కి తల్లి వున్న గదిలోకి వెళ్లారు. ఆవిడ అక్కడ లేదు. పూజా మందిరం లో దేవుడి దగ్గర నిశ్చలంగా కూర్చుని దైవ ప్రార్ధన చేస్తున్నది.
    తండ్రి గదిలోకి తొంగి చూశారు అయన గురక పెడుతూ గాడ నిద్రలో వున్నాడు.
    వంట యింట్లో కి వెళ్ళి ఫాస్కు లో వున్న 'టీని' కప్పుల్లో వొంచుకుని యిద్దరూ తిరిగి తమ గదిలోకి వచ్చేసి ఫాన్ క్రింద సోఫాలో కూర్చుండి పోయారు. క్రితం రోజు ఈ సమయం అప్పుడు వుమేష్ తో బాటు అర్ధం లేని తిరుగుడు తిరిగి చివరికి లైబ్రరీ నుంచి యింటి మొహం పట్టారు. కానీ యివాళ ఉమేష్ చాలా ఉత్సాహంగా , హాయిగా కబుర్లు చెబుతున్నాడు. శ్రీకాంత్ బుర్ర లో కృష్ణ మోహిని అన్నమాట పదే పదే వినిపిస్తోంది. 'అయన మాత్రం ?'
    నాన్నగారేం చేసి వుంటారు? మేనమామా మేనత్తా యిద్దరూ వస్తూనే వున్నారు కాని కులం లేని పిల్లని చేసుకున్నారేమో అనుకుంటే. అయితే ఆయనకి వెనకాల యేదైనా చరిత్ర వుందా? వుంటే అదేమిటి? శ్రీకాంత్ ఆలోచనలు కళ్ళెం లేని గుర్రం లా పరుగులు పెడుతున్నాయి మెదడు లో. చెదలు పట్టి మెదడు పూర్తిగా దోలుచుకు పోతున్నంత బాధగా వుంది.
    అతను నిశ్శబ్దంగా గంబీరంగా శూన్యం లోకి చూస్తున్నాడు గది కిటికీ గుండా. హల్లో అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. ఒకటి కాదు నాలుగైదు అడుగుల ధ్వని. వీధిలో టాక్సీ తలుపు వేసిన శబ్దం. ఉమేష్ టీ కప్పు టేబిల్ మీద పెట్టేసి క్రిందికి వచ్చేశాడు. శ్రీకాంత్ ఆలోచనల గొలుసు తెగిపోయింది. అతనూ తమ్ముడి వెనకే హాల్లోకి వచ్చేశాడు రెండేసి మెట్లు దాటేసి.
    క్రింది హల్లో రాధిక సామాన్లన్నీటినీ తీసి వో మూలగా పెడుతోంది.
    అన్నదమ్ముల సంతోషానికి అవధుల్లేవు. రాధిక చెప్పా పెట్టకుండా వచ్చేసింది. అకస్మాత్తుగా వచ్చేసి అందర్నీ ఆశ్చర్యం లో ముంచేసింది. రాధిక వెనక వున్న నంద గోపాల్ యిప్పుడు దాదాపు చాలా యేళ్ళకి చూసిన వాళ్ళు గుర్తు పట్టడం కష్టం ఆయె విధంగా మారిపోయాడు. అతను ఇదివరకటి కన్నా చాలా లావు అయాడు. ఫారిన్ వెళ్ళి రెండేళ్ళు ఉన్నందు వల్ల పక్వానికి వొచ్చిన యాపిల్ పండు రంగు లో వున్నాడు. అతను మీసాలు కొత్తగా పెంచాడు. యెదుటి వ్యక్తుల్ని సవాల్ చేస్తున్నాయి అవి అతని కి అందం రీవి వాటి వల్ల రెండు రెట్లు పెరిగింది.
    రాధిక చిన్నప్పుడు యెలా వుందో యిప్పుడూ అలాగే వుంది. కొద్దిగా వయసు తెచ్చిన మార్పు తప్ప మరేమీ లేదు. పట్టు చీర కట్టుకు మెడ మీదికి కొంచెం యెత్తుగా బర్మా ముడి వేసుకుంది. మెళ్ళో పుస్తెల గొలుసు తప్ప యింక యే ఆభరణాలు లేవు. ఒక చేతికి వాచీ, మరో చేతికి బంగారు కంకణం. నుదుట తిలకం తో అతి నాజూకు గా, ముట్టుకుంటే మసిపోతుందేమోనన్న భ్రమ కలిగిస్తోంది.
    తల్లి తండ్రీ యిద్దరూ అందగాళ్ళే. తండ్రి తరపున శరీర సౌష్టవన్నీ, తల్లి రక్తం నుంచి అంద చందాలనీ కౌగలించుకుని మరీ పుట్టింది గంగ. తండ్రి కోరిక ప్రకారం మెడిసిన్ చదువుతున్నది. యిప్పుడు మూడో సంవత్సరం లో వుంది. ముక్కుకి పక్కగా పై పెదవికి కొద్దిగా పై భాగం లో పెసర గింజంత పుట్టుమచ్చ గంగ అందాన్ని రెట్టింపు చేస్తోంది. రెండు జడలు వేసుకుని మామూలు చీర కట్టుకుంది. యెదురు వచ్చిన అన్న దమ్ములిద్దరూ మాట్లాడడం మరిచిపోయారు. ముగ్గుర్నీ మార్చి మార్చి చూస్తూ.
    నందగోపాల్ పలకరింపు గా 'హౌ ఆర్ యూ' అని అడిగాడు. యిద్దరూ సమాధానం యిచ్చి 'రండి , రండి' అన్నారు అప్పడు తెరుకున్నట్లు.
    చెల్లెలు యింత అకస్మాత్తుగా కనీసం వుత్తరం అయినా రాయకుండా రావడం చటర్జీ కి ఆవిడ అంతరార్ధం ఏదో అంతు బట్టలేదు. గోవింద కి రాధిక రాక యేనుగును యెక్కించినంత సంతోషాన్ని యిచ్చింది.
    యిల్లు సందడిగా పెళ్ళి వారింటిని మరిపిస్తోంది. చటర్జీ రెండు రోజుల తరువాత పద్యం తిని కులాసాగా తిరుగుతున్నాడు.
    ఆదివారం నాడు డైనింగ్ టేబిల్ మీద అందరూ ఒక్కసారే భోజనాలకి కూర్చున్నారు. చటర్జీ కలుపుకున్న అన్నాన్ని చేతిలోకి తీసుకుని నోటికి అందించబోతూ ఆగి గంగ వైపు చూసి ' యేమోయ్ గంగా బావలిద్దరి లో యెవర్ని యెన్నుకుందామని వచ్చావేమిటి?' అని అడిగాడు.
    గంగ కనుబొమ్మలు అతనా ప్రశ్న వేసి వేయడం తోనే ముడిపడి పోయాయి. దృష్టిని తల్లి వైపుకి తిప్పింది. రాధిక నవ్వేసి ' చిన్నపిల్ల దానికేం తెలుస్తుందన్నయ్యా . నన్నడుగు నేను చెబుతాను ' అన్నది.
    'చిన్న పిల్ల పాపం. పాలు త్రాగుతోందా యేమైనానా? మెడిసిన్ చదువుతున్న కూతుర్ని నువ్వు పాపాయిలా చూడడం బాగులేదు రాదీ. చాయిస్ యిస్తున్నాను అన్సర్ చెప్పిందుకేం?'
    'నీ ధోరణి గమ్మత్తుగా వుందన్నయ్యా. చాయిస్ యివ్వడం యేమిటి ? యివాళ అది నా యెత్తున పెరిగి పోయిందని అభిప్రాయం మార్చుకుంటామని అనుకుంటున్నా వేమిటి? అదేం లేదు శ్రీకాంత్ ని అది చేసుకుంటుంది. వాడి ఫోటో కి వెండి ఫ్రే,మ్ కట్టించి టేబిల్ మీద పెట్టుకుంది. ప్రొద్దుటే లేవగానే నిలువెత్తు శ్రీనివాసుడి ఫోటో చూసి ముందు నీ కొడుకు మొహమే చూస్తుంది . దేవుడిని అరాదిస్తున్నట్లే అరాదిస్తోంది. నా కూతురు.' రాధిక మొహం లో గర్వపు రేఖలు దోబూచు లాడసాగాయి.
    చటర్జీ తలెత్తి చూశాడు చుట్టూ . అందరూ చాలా కుతూహలంగా వింటున్నారు ఈ ధోరణి. అతను నెమ్మదిగా అన్నాడు. 'ఆఫ్ కోర్స్ నువ్వన్నది రైటే కాదనను. కానీ దాన్ని అడిగి తెలుసుకుందాం అని.'    
    రాధిక మొహం లో రంగులు యేర్పడ్డాయి. అన్నం కలుపుకుని యాంత్రికంగా తింటున్నదే కాని రుచిని గ్రహించడం లేదు. ముద్దలు చేస్తున్న చేతులు నోటికి అందిస్తున్నాయి. పళ్ళు నములుతున్నాయి. మెదడు మాత్రం స్థబ్దుగా వుండి పోయింది. నందగోపాల్ మొదటి నుంచీ మితభాష. ఇవాళే అతను ప్రప్రధమం గా సంభాషణ లోకి తల దూర్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS