Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 13

    లాక్ కరిగిపోయింది. దాని స్థానంలో ఓ రంధ్రం.
    భస్మ చేతిని లోనికి పోనిచ్చి లాక్ ఓపెన్ చేసాడు.
    లోపల...
    అయిదువందల రూపాయల నోట్లు...
    కట్టకట్టలుగా...
    లాంగ్ కోటులోవున్న గోడ గడియారంలోని చిన్న ముళ్ళు తిరిగే శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది.
    ఒక్కో కట్ట బ్యాగులో సర్డుతున్నాడు.
    సరిగ్గా అపుడు ఠంగున వినిపించిందో కంఠం.
    "హ్యాండ్సప్..."
    భస్మ వేనితిరిగి కూడా చూడలేదు.
    బ్యాంకుకు కాపలావున్న రెండో సెంట్రీ... బ్యాంకు చూట్టూ ఓ రౌద్ కొట్టి షట్టర్ దగ్గర సెంట్రీ స్పృహ తప్పి పడివుండడం చూసి అనుమానం వచ్చి షట్టర్ ఓపెన్ చేసి లోపలకి వచ్చాడు.
    తాపీగా నోట్ల కట్టలను సర్డుతున్నతన్నిచూసి తుపాకీ గురిపెట్టి "హ్యాండ్సప్..." అన్నాడు.
    భస్మ అతని మాటలు పట్టించుకోవడంలేదు. నిట్లకట్టలు సర్దూతునే వున్నాడు.
    సెంట్రీ విచిత్రంగా చూసాదతని వంక. ఎంత దైర్యం...?!
    "ఏయ్... కౌన్ హైతుమ్..." గట్టిగా కరువైన కంఠంతో హేచ్చారించాడు సెంట్రీ తుపాకీ మొనని భస్మ కంఠానికి ఆన్చి.
    అప్పటకి పూర్తయింది నోట్ల కట్టలు బ్యాకులో సర్దడం. మొత్తం నోట్ల కట్టలు సరదాక, జీప్ పెట్టి పైకి లేచి భుజానికి తగిలించుకున్నాడు.
    సెంట్రీ చేయి తుపాకీ ట్రిగ్గర్ మీద బిగుసుకుంది.
    "రుక్  జావ్ ... గోలీ మారుంగా" అంటూ తుపాకీ మొనని మరింత గట్టిగా భస్మ వీపుకు ఆన్చి అన్నాడు సెంట్రీ.
    "భస్మా... కమాన్ హిట్...హిట్ హిమ్ .." అతనికి సజెషన్స్ అందుతున్నాయి.
    భస్మ మెల్లిగా సెంట్రీ వైపు తలతిప్పి చేతిని కత్తిలా చేసి సెంట్రీ మొహం మీద ఓ దెబ్బ వేసాడు.
    అంత దైర్యంగా అంత సదన్ గా భస్మ రియాక్ట్ వుతాడని వూహించని సెంట్రీ... ఒక్క క్షణం తూలీ... వెంటనే తేరుకున్నాడు.
    తుపాకిని భస్మ గుండెలవైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ తుపాకీలోంచి దూసుకువెళ్ళి భస్మ గుండె భాగానికి తాగాలి ఖంగుమని శబ్దం చేస్తూ నెల మీద పడింది.
    సెంట్రీకి నోట మాటరాలేదు.
    వెంటనే అతనికి భయమేసింది. డేంజర్ అలారమ్ వైపు పరుగెత్తాడు.
    "భస్మా... స్మాష్ హిమ్ ..." సజెషన్ యిచ్చాడు అగర్వాల్.
    సెంట్రీ వేగంగా డేంజర్ అలారం దగ్గరకు పరుగెత్తాడు.
    అప్పుడు తెరుచుకుంది భ..స్మ..నే...త్రం... అతని కంట్లోంచి విద్యుత్ తరంగాలు వెళ్ళి సెంట్రీని తాకాయి. కరెంట్ షాక్ కొట్టినట్టు నాలుగడుగుల దూరంలో పడ్డాడు.
    మరుక్షణమే యాసిడ్ లో ముంచినట్టు అతని శరీరం ముద్దగా మారడం ప్రారంభించింది. కరుగుతూ కరుగుతూ బూడిదిలామారిపోతుంది...
    భస్మ తాపీగా బయటకు నడిచాడు.
                                              ***
    మౌనకు నిద్ర రావడంలేదు.
    మంచంమీద నుంచి లేచి బాల్కానీ దగ్గరకి వచ్చింది.
    ఎదురుగా అపార్ట్ మెంట్ కనిపిస్తోంది. చల్లగాలి రివ్వున వీచి ఆమె మొహాన్ని పరామర్శించింది.
    అర్దరాత్రి ఒంటిగంట కావస్తోంది.  అప్పుడప్పుడు వచ్చే వెహికల్స్ తప్ప జనసంచారం లేదు.మౌనకు రాత్రిరెస్టారెంట్ లో  జరిగిన సంఘటనే గుర్తొస్తోంది. అతనిలోఏదో ఆకర్షణవుందనిపించింది.మౌనకు.
    అతని ఆలోచన  రాగానే నవ్వొచ్చింది. నిన్నటివరకూ అతనెవరో తెలియదు. పరిచయమూ లేదు. అయినా ఓ వ్యక్తిమీద సదన్ గా యిఇలామ్తి అభిప్రాయం కలగడమేంటి? అన్నా ఆలోచన కూడా వచ్చింది.
    ఎదురుగా వున్న అపార్ట్ మెంట్ వైపు చూస్తొన్నా మౌన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
    ఆమె గుండె ఒక్కక్షణం కొట్టుకోవడం మానేసింది. చూస్తొంది భ్రమా? నిజమా? అన్నా డైలమాలో పడిపోయింది.
                                            ***
    అపార్ట్ మెంట్ దగ్గరకి వచ్చాడు భస్మ. గేటు దగ్గరవున్న వాచ్ మెన్ భస్మను చూడగానే దగ్గరకి వచ్చి సెల్యూట్ చేసి 'గుడ్ నైట్ సాబ్'అన్నాడు.
    భస్మ ఏం మాట్లాడలేదు. వాచ్ మెన్ భస్మ భుజానికి వేలాడుతున్నా భ్యాగును అందుకున్నాడు. భ్యాగ్ అతనికిచ్చి భస్మ ముందుకు కదిలాడు తన ప్లాటువైపు.
                                                                        ***
    తన హొటల్గది బాల్కానీలోనుంచి యిదంతా చూస్తూనే వుంది. మౌన.భస్మతో వాచ్ మెన్ మాట్లాడాం, భస్మ భుజానికి వున్న బ్యాగ్ తీసుకోవడం, భస్మ లోపలకి వెళ్ళడం...
    ఇదంతా అర్డంకీలేదు మౌనకు.
    అతని మీద తకంత ఇంట్రెస్ట్ ఏర్పడడానికి కారణం ఏమిటా? అని కాసేపు ఆలోచించిందిమౌన.
    ఓ వ్యక్తిమీద యిమ్త్రస్ట్ పెరగడానికి వుండే కారణమేంటి?
    అవతలి వ్యక్తి ఆకర్షణనీయ రూపామా? హోదానా? మాతకారితనమా? యినేమీ కాకుండా... మీరేమిటి?
    మౌనకు అర్డంకాలేదు.
    ఎక్కడో చదివిన ఓ వాక్యం గుర్తొచ్చింది.
    'అర్దంకాని విషయం గురించి, ఆలోచించడం అర్ధరహితం' అన్నా వాక్యం అది.
    కనీసం అతని పేరయినా తెలుసుకోవాలనిపించింది.
    అతనిమీద వున్న యిమ్త్రస్ట్ ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో... అమెక్కూడా తెలియదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS