Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 12

    "అయినా నీ వాలకం చూస్తుంటే అతన్తో కమిటయ్యేలా వున్నాడు. కొంపదీసి లావ ఎట ఫస్ట్ సైట్ కాదుగా... ణా కసలే 'సైట్' అంది శర్మిష్ట కన్నుగీటి.
    "నీకూ అదే డౌట్ గా వుంది. నింపాదిగా అంది మౌన.
    ఉలిక్కిపడ్డాడు అందరూ.
    "ఏంటీ... ఒకేసారి అరచినంత పన్జేసి అడిగారు."
    "అవునే... ఎందుకే ఆ రఫ్ అండ్ టప్ఫే గుర్తొస్తున్నాడు. ఎంత మ్యాన్లీగా వున్నడే... బహుశా టార్జాన్ కజినేమో..." అంది మౌన.
    "ఏయ్... మౌనా ఆర్యూ జోకింగ్?" అంది సుచిత్రాశర్మ.
    "అయాం డ్యాం సేరియాస్..." అంది మౌన.
    "అందుకే అన్నాను రాత్రిళ్ళు ఢిల్లీశివారు ప్రాంతాల్లో తెలుగు సినిమాలకు వెళ్లొద్దని... ఏ దిష్టో తగిలి వుంటుంది. ఏ తెలుగు సినిమా అత్మోఆవహించి వుంటుంది..." అంది భామిని.
    "మైనే ప్యార్ కియా... కుచ్ కుచ్ హోతాహై... యే థీల్లగీహైమస్త్..." అంది సీలింగ్ ప్యాన్ వైపు చూస్తూ మౌన.
    "ఓ రనాయనోయ్... నీకు ఖచ్చితంగా గాలి సోకింది" అంది సవిత.
    "అవునవును. అతడిగాలే..." అంది మౌన కన్ ఫార్మ్ గా.
    "దీన్ని ఇలా వదిలేయల్సిందే.. లేక పోతే మనకు పిచ్చి పట్టడంఖాయం..." అంటూ అందరూ ముసుగుతన్ని పడుకున్నారు.
    "డియర్ ప్రెండ్స్... మీరు ముసుగుతన్ని పడుకున్నా, ముసుగుతన్నకుండా పడుకున్నా ఐ లవ్ హిమ్ ... నిజ్జం..." అనికుని తనూ ముసుగుతన్ని పడుకుంది.
                                                                     ***
    భస్మ మెయిన్ రోడ్డుమీదకి వచ్చాడు. లాంగ్ కోట్ వేసుకుని ఉన్నాడు. తలకు మప్లర్. అతని మొహంలో ఎ ఎక్స్ ప్రెషన్సూ లేవు. పరుగులాంటి అర్దరాత్రి పన్నెండు కావస్తోంది.
    రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడూ వచ్చేపోయే వాహానాలు తప్ప జనం లేరు.పెట్రోలింగ్ వ్యాన్ లు తిరుగుతున్నాయి. పడి నిమిషాల్లో అతను కిన్నెరా బ్యాంకు దగ్గరకు వచ్చాడు. సెంట్రీ బ్యాంకు చూట్టూ రౌండ్ కొడుతున్నాడు.
    భస్మ కునుకిపాట్లు పడుతున్న సెంట్రీ దగ్గరకువచ్చాడు.
    అతని చేతులు కట్టులా మారాయి. చేతిని గాల్లోకి లేపి, అతని మెడ మీద బలంగా కొట్టాడు.
    నోట్లోంచి శబ్దం రాకుండానే వెనక్కి విరుచుకుపడ్డాడు. కోటు జేబులోంచి కీ బంచ్ తీసాడు.అయిదు నిమిషాల్లో తాళం తెరుచుకుంది. షట్టర్ పైకి లేపి, లోపలకి వెళ్ళాక షట్టర్ వేసేసాడు.
                                                                     ***
    కంప్యూటర్ ముందు కూచుని వున్నాడు సైంసిస్ట్ అగర్వాల్. అతని పక్కనే ఖాన్, లల్లూరామ్, కరంజయా కూచున్నారు.
    అంత చలిలోనూ అగర్వాల్ మొహమంతా స్వేదం అలుముకుంది.
    భస్మ మీద తను చేసే తొలి ప్రయోగం. స్క్రీన్ మీద బ్యాంక్ కనిపిస్తోంది. భస్మ తన డేగ చూపులతో చూట్టూ గమనిస్తున్నాడు.
    "భస్మా... గో లెప్ట్... స్టాప్ దేర్... మూవ్... గో... రైట్" అంటూ సజెషన్స్ యిస్తున్నాడు అగర్వాల్.
    ఆ సజెషన్స్ కు అనుగుణంగా భస్మ కదులుతున్నాడు.
    "వాహ్... అగర్వాల్ సాబ్... మీరు గ్రేట్...మీ సజెషన్స్ భస్మ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ వున్నా ఈ సజెషన్స్ యివ్వచ్చా?" డౌట్ గా అడిగాడు కరంజయా.
    "కుదర్దు. కేవలం పడి కిలోమీటర్ల దూరం వరకు మాత్రమె నా సజెషన్స్ రీసీవ్ చేసుకోలేడు" చెప్పాడు అగర్వాల్.
    "మరి మనం సజెషన్స్ రికార్డ్ చేస్తాం. మనం చెప్పామో... అదే చేస్తాడు. అంతకుమించి మరో పని చేయలేడు."
    "అంటే.."
    "మనం ఓ వ్యక్తి ఫోటోని చూపించి... సజెషన్స్ పంపించి ఆ వ్యక్తిని మంటే ఆ వ్యక్తినే చంపుతాడు. మరో వ్యక్తి అడ్డం వచ్చినా అతడ్నే చేయడు. అలాగే నవ్వడం, ఏడవడం... ఆలోచించడం చేయడు. మన ఆలోచించమని చెబితే అదే ఆలోచిస్తాడు. అతని ఆలోచనలను శాసిస్తాం...' గర్వంగా చెప్పాడు అగర్వాల్.
                                             ***
    లాకర్ దగ్గరకు వచ్చాడు భస్మ.
    అతని కళ్ళు లాకర్ లో వున్న నెంబర్లను సునిశితంగా గమనిస్తున్నారు అతని చేతివ్రేళ్లు ఆ నెంబర్లని కలిపే ప్రయత్నం చేస్తున్నాయి.
    తన మెదడులో ఫిక్స్ అయినా సజెషన్స్ ప్రకారం నెంబర్లు ను తిప్పుతున్నాడు.
    అయినా లాకర్ మెయిన్ లాక్ తెరుచుకోవడం లేదు.
    "భస్మా... స్మాష్... లాకర్ లాక్ ని స్మాష్ చెయ్..." అతనికి సజెషన్స్ అందుతున్నాయి.
    భస్మ మెల్లిగా తన తలను కొద్దిగా కిందికి వంచాడు. తల మధ్యభాగంలో చిన్న కదలిక.
    ఆ భాగంలో వున్న కన్ను తాలూకు కన్రేప్పలు మెల్లిమెల్లిగా తెరుచుకుంటున్నాయి.
    ఒకటి... రెండు... మూడు...
    కన్రేప్పలు తెరుచుకున్నాయి.
    కొద్దీ క్షణాలు... స్ప్లిం ట్ సేకన్స్ లో... కనుగుడ్డు ఎర్రగా మారడం ప్రారభించింది.
    అతని కనుగుడ్డులో నుంచి ఒక విధమైన కిరణాలు... సూటిగా లాకర్ లాక్ కు తగిలాయి.
    కొన్ని వందల వోల్టుల విద్యుత్ తగిలినట్టు... బలమైన, దృఢమైన అ లాకర్ లాక్... వేడికి కరగి పోతున్నట్టు... క్షణాల్లో ఓ అద్బుతం జరిగింది మెల్లిమెల్లిగా భస్మ మూడో నేత్రం మూసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS