15-12-76
8.30 Arts and Crafts factory
(ఆలిత కళల, హస్తకళల కర్మాగారం)
10.00 - Underround air - raid shelters
(భూగర్బ - విమాన రక్షక శిబిరాలు)
1.30. Impeial summer palaces
(చక్రవర్తుల వసంత భవనాలు)
5.30 Delegation meets the Vice Chairman at the Great Hall of the People.
(పార్లమెంటు భవనంలో ప్రతినిధి వర్గం చైనా ఉప ప్రధానిని కలుసుకుంది.)
కళలకు కూడా ఫ్యాక్టరీ ఏమిటని ఎందుకాశ్చర్యం? చైనాలో కళాకారులు కూడా కార్మికులే. సామాజికావసరాలకు అనుగుణ్యంగా కళలను తీర్చి దిద్దటమే వారి ధ్యేయం. కుమ్మరి పనులకూ, వడ్రంగిపనులకూ సహా విద్యుచ్చక్తిని వినియోగిస్తారు. వెదురు బద్దలను విద్యుద్యంత్రాలు కొలత ప్రకారం కోసి చదునుచేస్తాయి. ఆ తర్వాత వాటిని మానవ హస్తాలు రకరకాల కళారూపాలుగా తయారుచేస్తాయి. వాటికి అనడమూ ఉంది. ఉపయోగమూ వుంది. అక్కడ మనిషి యంత్రానికి బానిస కాదు. యంత్రాలే మనుష్యుల అజ్ఞాల ననుసరించి చాకిరీ చేస్తాయి.
అణుయుద్ధం ప్రమాదం నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని చైనా వారి ఉద్దేశం. అటువంటి ప్రమాదం నుంచి ప్రజలను రక్షించడానికే భూగర్బ శిభిరాలు. ఇవి పీకింగ్ నగరానికి అధో భాగంలో ఫర్లాంగు పొడుగున అనేకానేకంగా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే మేము చూశాము. విమాన దాడి జరిగితే నగరంలోని ఆబాల వృద్ద పర్యంతరం అందరూ అక్కడ రక్షణ పొందవచ్చు.
వేసవి కాలంలో చక్రవర్తుల నివసించే భవనాల్లో కూడా గుళ్ళూ, దేవుళ్ళూ ప్రత్యక్షం. అయితే ఇప్పుడక్కడ పూజా పునస్కారాలేవీ లేవు. ప్రాచీన చైనా శిల్ప సంపాదకు నిదర్శనంగా మాత్రమే అవి మనల్ని ఆకర్షిస్తాయి. భోగలాలసత్వంతో కూడిన వైభవ జీవితాలోకవైపూ, నిత్య దారిద్ర్యంతో కూడిన నికృష్ట జీవితాలోకవైపూ! అవీ ఆనాటి రాచరికపు నాగరికతకు లక్షణాలు. అయినా అవి చైనా దేశ చరిత్రలో అంతర్బాగాలే. ఒక్క చైనాలోనే అన్న మాటేమిటి. ప్రపంచ మంతటా చిన్న చిన్న స్థానిక విభేదాలను మినహాయిస్తే నిన్న మొన్నటిదాకా ఇదే కధ. అదంతా మారిపోయినా ఇప్పుడొక నూతన వ్యవస్థ రూపొందుంతున్నందుకు సంతోషించడానికి బదులు "అయ్యో - ఆనాటి వైభావాలన్నీ మాయమైనాయే" అని వాపోతూ కవిత్వాలు కట్టేవాళ్ళూ. వాళ్ళ అడుగులకీ మడుగు లోత్తేవాళ్ళూ ఈనాటికీ కనబడుతూ ఉండడమే ఎంతో విచారించదగ్గ విషయం.!
చైనా ఉపప్రధాని తమ దేశీయ రాజ్యాంగ విధానం గురించి ప్రసంగించారు. పెట్టుబడిదారీ పంధా వైపు తమ దేశాన్ని మళ్ళించడానికి జరిగిన జరుగుతున్నా ప్రయత్నాలను వివరించి, వాటిని ఖండించారు. సాంస్కృతిక విప్లవం వల్ల ప్రజల మనస్తత్వంలో, ముఖ్యంగా బాలబాలికల, యువతీ యువకుల ఆలోచనా విధానంలలో వచ్చిన ఆరోగ్యకరమైన మార్పులను విశదీకరించారు. పెట్టుబడిదారీ పత్రికలూ మాత్రమే చదివేవారికి చైనాలో సాంస్కృతిక విప్లవం విఫలమయిందన్న దురభిప్రాయం కలుగుతుంది. (అటువంటి అభిప్రాయం కలిగించడమే ఆపత్రికల ఉద్దేశం) కాని ఇది సరికాదు.
సాంస్కృతిక విప్లవం కన్ప్యుషియస్ ను వెలివేసింది. ఎందువల్ల? అతనివి బూజుపట్టిన భావాలు కావడం వల్ల. అతనొక చోట అంటాడు. "ధనవంతులు నేరాలు చెయ్యరు. నేరాలు చేసే వారెప్పుడూ దరిద్రులే!" అని. ఈ వర్గ వివక్షతనూ, విశేషించి ధనికవర్గోత్కర్షను నేటి చైనా ప్రజలు అంగీకరించరు. కన్ప్యుషియస్ సూక్తులలో ఇలాంటివే ఎన్నో ఉన్నవి. అందుకనే అతడ్ని డినేగ్రేట్ చెయ్యడం జరిగింది.
మరి మనదేశంలో అందరూ వర్గవిభేధాలకు కాలదోషం పట్టిందనే వాళ్ళే. కుల తత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలని గావుకేకలు వేసేవాళ్ళే. డిల్లీలో మహానాయకుల మొదలు, పల్లెల్లో చోటా నాయకులదాకా, వర్ణ వ్యవస్థ మనదేశాన్ని పట్టి పీడిస్తున్న వేరు పురుగని గర్హిస్తున్నవారే. కాని, ఆ వర్ణ వ్యవస్థను సృష్టించిన దేవుణ్ణి నేనే అని భగద్గీతలో బాహాటంగా ప్రకటించిన శ్రీకృష్ణ భగవానున్ని ఎందుకు వెలివేయ్యడం లేదో!
మరెందుకూ కాదు మనం చెప్పెదోకటీ, చేసే దొకటీ! అనాది కాలం నుంచీ ఈ హిపోక్రసీ మన నరనరాలలో జీర్ణించుకుపోయి వుంది! అదీ అసలు కారణం!
పది
16-12-76 ఉదయం 9 గంటలకు పీకింగ్ భూగర్బ రైలు మార్గాన్ని చూశాము. మాస్కో మెట్రో కన్నా ఇది చాలా చిన్నది. మాస్కోలో నగరాన్నంతటిని చుట్టే సర్క్యులర్ రైలు మార్గంతో బాటు నగరంలో ఎక్కడికైనా వెళ్ళడానికి వీలుగా రేడియల్ రైలు మార్గాలున్నాయి. రైల్వే స్టేషన్లు పాలరాతితో నిర్మించబడి ఒక్కొక్కటీ ఒక్కొక్క తాజ్ మహల్ లా ఉంటాయి.
పీకింగ్ నగరపు భూగర్బ మార్గం తూర్పు నుండి పడమర దాకా ఒకే సరళ రేఖలో వుంది. దీనికి సంబంధించిన మోడల్ ఒకటి చూపిస్తూ మాతో వచ్చిన గైడ్ ఈ రైలు మార్గాపు వివరాలన్నీ అభివర్ణించాడు. తర్వాత కొన్ని మైళ్ళ దూరం ఈ రైలు మార్గం మీద ప్రయాణం చేశాము.
ఉదయం 10 నుంచి 11 దాకా పీకింగ్ రేడియో స్టేషన్. అక్కడందరూ హిందీ మాట్లాడుతున్నారు. హిందీని భారతదేశపు జాతీయ భాషగా పరిగణించి చీనా వారు దాని కియ్యవలసిన గౌరవం ఇస్తారు. పీకింగ్ యూనివర్శిటీ లో హిందీ నేర్చుకుంటున్న చీనావారి సంఖ్య కూడా ఏమంత తక్కువ కాదు. పీకింగ్ రేడియో ఒక్క హిందీలోనే కాదు, ప్రపంచంలోని అన్ని భాషలలోనూ రోజుకు 24 గంటల రకరకాల కార్యక్రమాల నిర్విరామంగా ప్రసారమవుతూ ఉంటాయి. భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష తెలుగని, అటువంటి తెలుగు భాషలో కూడా పీకింగ్ రేడియో నుంచి ప్రసారాలు జరగవలసిన ఆవశ్యకత ఎంతయినా వుందని అచ్చటి మిత్రులకు నేను నచ్చ జెప్పాను. తెలుగుకు రావలసినంత ప్రాముఖ్యం రాకపోవడానికి మన ప్రయత్నలోపమే తప్ప చైనా వారి అశ్రద్ధ మాత్రం కారణం కాదు.
రేడియో స్టేషన్ నుండి బైటికి వచ్చేస్తున్నప్పుడు అచ్చటి అధికారులు మాకు చిన్న చిన్న బహుమతులిచ్చారు. (ఖరీదైన బహుమతులివ్వడం చైనావారి పద్దతి కాదు. అలా ఇవ్వడం అంటే లంచమిచ్చి ఎదుటి వారి అభిమానాన్ని పొందడమే అని వారి ఉద్దేశ్యం.)
అలా ఇచ్చిన బహుమతులలో ఒక చిన్న మావో బాడ్జీ ఉంది. ఇది చూడడానికి చాలా ముచ్చటగా వుంటుంది. మద్రాసుకు మరలి వచ్చిన తర్వాత ఒక మిత్రుడిది తనకు కావాలని తీసుకున్నాడు.
16-12-76 సాయంత్రం మూడుంపావుకు రెవీఅలీ (Rewi Alley)అనే న్యూజిలాండ్ కవి ఆతిధ్యం స్వీకరించాము. అయన ఏనాడో స్వదేశాన్ని వదలి చైనాను తన రెండవ మాతృదేశం చేసుకున్నాడు. చైనా దేశపు పౌరసత్వం స్వీకరించాడు. ఇప్పటితని వయస్సు 79 సంవత్సరాలు. చైనా విమోచన పోరాటాల్లో పాల్గొన్న విదేశీ ప్రముఖుల్లో ఈయన ఒకడు.
చైనా గురించి మనం ఎన్నో పుస్తకాలూ చదువుతూ ఎంతో తెలుసుకున్నాం అనుకుంటాం. కాని ఈయన ఇంట్లో గడిపిన కొద్దిపాటి కాలంలో నేనెంతో తెలుసుకున్నాను. అంతకన్నా గొప్ప సంగతి. ఈయన కవితలు ఒకనాటి, ఈనాటి చైనా గురించి తెలుసుకోవడానికి నాకెంతో ఉపకరించాయి. తనవి మూడు కవితా సంపుటాలు. ఈయన నాకు బహూకరించాడు. Over China's Hills of Blue (చైనా దేశపు నీలిగిరుల మీద) Today and Tomorrow (ఇవాళా రేపు) Winds of Change(పరివర్తనపు గాలులు) అనేవి ఈ పుస్తకాలు. ఈ మూడూ న్యూజిలాండ్ లో అచ్చయినాయి.
ఇవి కాక రెవీ గారు Greetings for 1977 అనే పుస్తకం నాకిచ్చారు. ఇందులో అయన స్వయంగా ఫోటోగ్రాఫ్ చేసిన రెడ్ గార్డుల చాయా చిత్రాలున్నాయి. దేశమంతటా తిరిగి అయన తీసిన ఫోటోలు.
ఈ గ్రీటింగ్స్ కింద అయన కవిత్వం రాయలేదు. కవిత్వాన్ని కూడా మించినదేదో ఉందంటామే, అది రాశారు.
All the hope of China
is with those, who will as they grow
tend the machines, make several
blades grow where but one
grew before, it will be they
who'll carry on the search
for oil and cool, who will
build, new rail roads, broad high ways
new homes,carrying some of
the sweetness of their child hood
into the fiture, and in turn
bringing up children of their own
to follow on, children who will
learn to all their analyse and create,
reaching out to all other children
of a working world.
--Rewi Alley
