సీ. శ్రీరామచంద్రుని పేర నంకితమయి
నవరత్న నామసుందరము నయిన
నవపద్యనవక మేనరుఁడైన భక్తితో
వ్రాసినఁ జదివిన వరుసతోడ
సంగ్రహించిన విన్న సకల ఫలంబులు
శ్రీరామ లిచ్చును సిద్ద మెప్పు
డాయురారోగ్యంబు లైశ్వర్యమును గల్గు
నిష్ఠ సంసిద్దియు నెల్లవేళ
గీ. ప్రతిదినంబును మానక పరమనియతి
వినెడు పురుషుఁడు ధర సర్వజనులలోన
నుత్తమొత్తముఁడగు వేదవేత్తలయిన
వానితో సాటిగారు భూవలయమునను.
దశ సీనములు
సి. పాలమున్నీటిలో ఫణిరాజశయ్యపై
యోగనిద్రాసక్తి నున్నవాని
కోటి సూర్యప్రభల్ మీటుకిరీటముల్
వేయుమస్తకముల వెలయువాని
కౌస్తుభమణియును గర్జకుండలములుఁ
గమలనేత్రంబులుఁ గలుగువాని
సిరియును భూదేవిచరణంబు లొత్తంగఁ
గరుణారసము చాలఁ గలుగువాని
గీ. దలఁతు నుతియింతు ధ్యానింతుఁ దగ భజింతు
నన్ను ఁ గృపతోడఁ బ్రోవు మనాధనాధ!
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమపురుష!
సీ. కౌండిన్యుసతినోము కానుక సోలెఁడు
నూకలిచ్చిన మెచ్చి సాకినావు
కోరి కుచేలుఁడు కొణిదేఁ డడ్కులు దెచ్చి
యిచ్చిన సంపద లిచ్చినావు
పాంచాలియును మీకు బలుసుకూరము నీళ్లు
బోసినఁ గృపతోడఁ బ్రోచినావు
సగ మొగిఁ గొఱికి యాశ బరి యిచ్చిన పండ్లు
భక్షించి యామెఁ గాపాడినావు
గీ. భక్తవత్సల వర పంచభక్ష్యములను
నాకొసంగిన నర్పింతు నీకు నెపుడు
శ్రేమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమపురుష!
సీ. అదినారాయణ! ఆత్మపరాయణ!
కేశవాచ్యుత! హరి! వాసుదేవ!
శ్యామలాంబుద వర్ణ! కామితార్ధప్రద!
సామగానప్రియ! సదయహృదయ!
భక్తరక్షామణీ! పరమాత్మ! పరమేశ!
దేవ! జగన్నాధ! దేవవంద్య!
శర్వాణిసన్నుత! గీర్వాణవందిత!
నీరజలోచన! నిగమవినుత!
గీ. లోకనాయక! సద్భుక్త లోక వరద!
పుండరీకాక్ష! మము వేగఁ బ్రోవు మయ్య
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమపురుష!
సీ. గ్రాహంబుచేఁ జిక్కి కరి డస్సి మొఱ వెట్ట
గజరాజునాపదఁ గడపి నావు
తండ్రిబాధకునోపి తగమిమ్ము నుతియింపఁ
గరుణతోఁ బ్రహ్లదుఁ గాచినావు
అసన్నుఁడై వేఁడ నావిభీషణునకు
మెచ్చి లంకారాజ్య మిచ్చినావు
కట్టినపుట్టముల్ కౌరవు లోల్వంగఁ
బాంచాలి దురవస్థఁ బాపినావు
గీ. కాన శరణంబు వేఁడేదఁ గమలనాభ
అభయదానమ్ము మాకిమ్మ సుభగచరిత
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమపురుష!
సీ. దేవ జనార్ధన దివ్యగోవర్ధన
ఖగరాజవాహన కలుషదహన
వాసుదేవనందన వాణీశ వందన
కాళియమర్దన కంసహరణ
పంక జలోచన భవబంధమోచన
దారిద్ర్యభంజన దైత్యదమన
సమ్మని పాలన సద్దర్మ శీలన
కరి శాపనాశన యురగశయన
గీ. పరమపావన త్రిభువన పారిజాత
దీనమందార నమఁ బ్రోవ దిక్కు నీవె
శ్రీమనోనాద! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమపురుష!
సీ. దాతవు తల్లివి తండ్రివి భ్రాతవు
హితుఁడవు బంధుఁడ వీవ మాకు
కావంగఁ బ్రోవంగఁ గర్తవు భోక్తవు
పెన్నిధి వని నమ్మియున్న వాఁడ
నను నేరమెంచక యనుకంప గనుపింప
దీనరక్షామణి దిక్కు సూపు
వేయు మోములు రెండువేలు జిహ్వాలు గల
శేషుండు మిము నుతి సేయలెఁడు
గీ. ఇట్టి మిమ్ము నుతింప నే నెంతవాఁడఁ
బాపకర్ముండఁ బాపుండఁ బాపమతిని
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పర్మనాభ! దయానిధీ! పరమపురుష!
సీ. ఉదయా స్తమానమ్ము నుడుగకనేనాడు
మాటలే మీనామమంత్రజపము
బాహుయుగ్మంబున బహువిధంబులఁ జేయు
పనులె మీశ్రీదివ్యపాదపూజ
ఎడపక పుడమి పై నిడెడు వాయదుగులు
తగ మీకుఁ జేయు ప్రదక్షిణములు
శయ్యపై వేడ్కల శయనించు టేల్లను
ధరఁ జాగి సాష్టాంగదండ మిడుట
గీ. గాఁ దలంపుము ననుఁ జాలఁ గరుణఁ బ్రోవు
నాదుకోర్కుల నీడేర్చు యాదవెంద్ర
శ్రీమనోనాధ! మాధవ! శ్రీయనంత
పద్మనాభ! దయానిధీ! పరమపురుష!
