"ఇంతకీ అసలు విషయం చెప్పు"
"నేనో హత్య చేయబోతున్నాను."
అయన ముందు ఉలిక్కిపడ్డారు. తరువాత చిరంజీవి మెదడు విషయమై అనుమానం వచ్చి కొద్దిగా బెదిరేడు. డాక్టరు పక్కనుంటే మంచిదని 'అమ్మా! అర్చన' అంటూ మేనకోడల్నిపిలిచేడు. ఆయనుద్దేశ్యం గ్తహిమ్చి, "మీరు కంగారుపడకండి" అన్నాడు చిరంజీవి.... "నన్ను పూర్తిగా చెప్పనివ్వండి."
"చెప్పు"
"ఒక శవాన్ని నేను రేండోసారి చంపుతాను. అది శవమనీ, దాన్ని నేను చంపుతున్నాననీ ఫోటోలు తీద్దాం. కానీ పోలీసులకి మాత్రం అది నేను చేసిన హత్యాలాగే కనబడ్తుంది. నాకు ఉరిశిక్ష పడేంతగా దారుణమైనా కారాణాలు కల్పిద్దాం. మరుసటిరోజు ఇక నేను ఉరికంబం ఎక్కబోతున్నాననగా మీరు రుజువులు బయట పెడ్తారు" చిరంజీవి కంఠం ఆవేశంగా మారింది. "ఒక్కరోజు ఆలస్యమై వుంటే ఏమై వుండేది? ఒక అమాయ్యకుడు బలైపోయి వుండేవాడు ..... ప్రజలారా___ పార్లమెంటు సభ్యులరా____ మీరు చుసేరుగా, న్యాయం యెంత గుడ్డిదో! ఇలా యెంతమంది అమాయకులు ఈ ఉరిశిక్షకి బలి అయిపోయరో.....! మార్చండి.....! వెంటనే ఐ.పి.సి 302 ని మార్చండి!!!..... ఇదీ మన నినాదం..... ఎలావుంది."
"నా మొహంలా వుంది" అన్నాడు సర్వోత్తమారావు. "నువ్వు ఒకసారి చచ్చిన శవాన్ని మళ్ళీ ఇంకోసారి మర్డరు చెయ్యటం ఏమిటి దాన్ని నేను ఫోటోలు తియ్యట మేమిటి? ఆఖరి నిముషంలో ఉరి రద్దు చెయ్యటానికి __ఇదేమ నాటకం అనుకున్నావా?"
చిరంజీవి నవ్వేడు. అతడిప్పుడు మామూలు చిరంజీవిలా లేదు ఒక నిర్ణయానికి వచ్చిన నాయకుడిలా వున్నాడు. "మామూలు వాళ్ళుఇదంతా సాధ్యం కాదు, కానీ మీకూ, నాకూ అవుతుంది. దేశం మొత్తం మీద మిమ్మల్ని మించిన క్రిమినల్ లాయర్ లేరు. అటువంటి మీరు తలుచుకుంటే సాధ్యం కానీది లేదు. ముందుకీ ఉరకటానికి నేనెలాసిద్దంగా వున్నాను."
అయినా దానికి అయన ఒప్పుకోలేదు.
దాదాపు రెండుగంటల వాగ్వివాదం తరువాత అయన అయిష్టంగా ఒప్పుకున్నాడు. చిరంజీవి లేస్తూ అన్నాడు. "ఇందులో మనకొచ్చిన నష్టమేమీలేదు గోరుగారూ. ఈ దెబ్బతో పీనల్కోడ్ మారుస్తే మార్చేరు. లేకపోతె లేదు_ ఇక ఈ దేశ ప్రజల ఖర్మ ఇమ్తెఅనుకుని మనప్రయత్నము విరమిద్దాం."
"నా కెందుకో భయంగా వుందబ్బాయ్ " అని గెడ్డం గోక్కుంటూ "సర్లే_ఇది కూడా ఎందుకు ప్రయత్నించకూడదు? మహా అయితే కోర్టులో పిల్లచేష్టలాడినందుకు ఫిన్ వేస్తారంతేగా _వెయ్యనీ" అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు.
చిరంజీవి అయన దగ్గర సెలవు తీసుకుని బైటకొచ్చేసరికి ఇంటిగంట కావొస్తుంది. వెన్నెల పిండారబోసినట్లు వుంది. అతడు గాలిలో తెలినట్టునడుస్తున్నాడు. మనసంతా థ్రిల్ తో నిండివుంది.
ట్లింగ్...... ట్లింగ్......
ప్లాష్ లైట్ట్లి ........ విలేఖర్లు....... ఎక్కడ చూసినాన్యూసే ప్రాణానికి తెగించి ఒకయువకుడి సాహసచర్య___ ఉరిశిక్ష రద్దుకైఇద్దరులాయర్లు అప్పోర్వసాహాసం.... పార్లమెంటు చరిత్రలోనే నూతన అధ్యాయం.... పీనల్ కొద మార్పు.
గ్౦ట్లి ...... గ్౦ట్లి......
ఒక మోటార్ సైకిల్ పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చి పక్కన ఆగటంతో వులిక్కిపడి ఈ లోకంలోకి వచ్చేడు. దూరంగా జైలుగంటలు రెండుసార్లు మ్రోగినయ్.
ఆగిన మోటార్ సైకిల్ మీదనుంచి ఒకపోలీసు ఇన్ స్పెక్టర్ దిగి____
"ఎక్కడికి బ్రదర్ ఈ టైమ్ లో" అని అడిగేడు అనుమానంగా. రోడ్డు మధ్యలో తూల్తున్న చిరంజీవి తలతిప్పి, ఇన్ స్పెక్టర్ ని చూసి,"హల్లో, గుడ్ ఈవినింగ్ " అని ఆకాశంవైపు చూసి రాత్రి ని గుర్తుకొచ్చి "సారీ గుడ్ నైట్ " అని, అంతలోనే అర్ధరాత్రి దాటిపోయిందని గమనించి "గుడ్ మార్నింగ్ " అన్నాడు.
ఇన్ స్పెక్టర్ అనుమానం బలపడింది. "రాత్రి రెండింటి వరకూ ఎబారు తెరిచివుంది?" అని గద్దించే. చిరంజీవి బిత్తరపోయేడు. తాను లాయర్ననీ, అయినా ఎప్పుడూ నిజమే చెప్తాననీ సర్వోత్తమరావుగారింటికి నుంచి వెళ్తున్నాననీ అన్నాడు.
సర్వోత్తమరావు పేరు చెప్పగానే ఇన్ స్పెక్టర్ కొద్దిగా అటెన్షన్ లోకి వచ్చి బహువచనంలోకి దిగి సమ్రతగా "అయన మీకేం అవుతారు సార్" అని అడిగేడు.
"అయన మా మామగారు."
"ఆయనకి కూతుర్లు లేరే " మళ్ళీ అనుమానం వచ్చింది ఇన్ స్పెక్టర్ కి.
మీ కడుపు కాల__ఆయనింటి విషయాలు చాలా తెలుసు అనుకుని "అదే _అయన మేనకోడలూ __ నా ఫియాన్సీ " అన్నాడు స్టయిల్ గా .
"కంగ్రాచ్యులేషన్స్ . మీ కారేమయింది సార్! నడచివెళుతున్నారు."
"గారేజిలో వుంది, రిపేరు కిచ్చాను." అన్నాడు, చెప్పులు కనబడకుండా పామ్తులోకి లాక్కొంటూ.
"మీరేమి అనుకోకపొతే _-మోటార్ సైకిల్ మీద దింపుతాను."
"నో. నో. అక్కర్లేదు" అంటూ ముందుకు కదిలేదు చిరంజీవి, ఇన్ స్పెక్టర్ వెళ్ళిపోయాడు.
చిరంజీవి ఇంటికి వెళ్ళేసరికి రెండున్నర, సరాసరిరాములవారిబొమ్మ దగ్గరికి వెళ్ళిపోయేడు. చెంపలేసుకుని ___"స్వామీ అబద్ధం ఆడెను నన్ను క్షమించు .... నోటికొచ్చినట్టూ అర్చనగారి గురించి కోసేను. సారీ."
స్ఫూర్తి దుప్పటి తొలగించి అర్ధరాత్రి పూజలు చేస్తున్నా చిరంజీవిని ఓరగాచూసి, మళ్ళీ మూసుకుంటే అర్చన __ కళ్ళు తెరిచిన అర్చనే.
6
తమ ఇంట్లోకి అడోలాటి స్మశాన వాతావరణం నెలకొని వుండటానికి కారణం రామయ్యేనని అర్చన అభిప్రాయం. చాలా చిత్రమైన మనిషి అతడు. ఎప్పుడూ మౌనంగా వుంటాడు. అతడి నోటివెంట మాట బైటకొచ్చి ఎన్నేళ్ళయిందో. అతడి కళ్ళలో భయంకొలిపే అదోలాటి స్థబ్ధత వుంది. అయితే పనంతా ఠంచనుగా, కరెక్టుగా చేస్తాడు.
