రామయ్యకన్నా భయం కొలిపేవాడు. అతడికొడుకు బైరాగి. అతడో ఫేటిసిస్ట్. ఆడవాళ్ళు బట్టల్నీ, వస్తువుల్నీ దాచుకుని సంతృప్తిపడే వాళ్ళని ఫేటిస్తిస్ట్ అంటారు. పదహారేళ్ళ వయసులో అతడిని చూసి భయంతో వణికిపోయింది. అర్చాన. అప్పుడతనికిఇరవై ఏళ్ళు. అయినా సన్నగా_ ఆస్టిపంజరంలా _ పద్నాలుగేళ్ళ కర్రనివానిలా వుండేవాడు. లోతుకుపోయిన బుగ్గలు __ గాజు కళ్ళు, సన్నటిమెడ __ అతని చూపులు ఆమెని చాలా భయపెట్టేవి. అయితే మెడిసన్ లో చేరి, కొద్దికొద్దిగా ఆమె వ్యక్తిత్వాన్ని సంపాదించుకొనే కొద్ది అతడు నెమ్మదిగా తన 'షేల్' లోకి వెళ్ళిపోయాడు.
అ ఇంట్లో మూడోవ్యక్తి రంగమ్మ __ వంటమనిషి. ఆమె వంటింట్లో మాట్లాడితే పైన అయిర్ కండిషన్స్ రూమ్ లోకి కూడా వినిపించాల్సిందే __ మతిమరపు ఎక్కువ అవటంతో ఉప్పు బదులు పంచదార _ దాని బదులు వంటసోడా వేసి అందర్నీ ఇబ్బంది పెట్టేది.
ఈ ముగ్గుర్ని ఆ ఇంటినుంచి తప్పించటానికి మొదట్లో అర్చన ప్రయత్నించింది. కానీ ఎంతోకాలం నుంచి నమ్మకంగా పనిచేస్తున్నా వాళ్ళని తొలగించటానికి అయన ఒప్పుకోలేదు. ఆ తరువాత అర్చన తన చదువు. బిజినెస్ వ్యవహారాల్లో పడి ఇంటి విషయాలు పట్టించుకోవటం మానేసింది_ ఆమెకి అంత టైం లేదుకూడా.
* * * *
టైమ్ ఏడయింది.
క్రిందనుంచి పెద్ద స్వరంతో సుప్రభాతం వినిపిస్తోంది. అర్చానకి మెలుకువ వచ్చింది కానీ లేవలేదు. బద్దకంగా అలానే బ్యాలెన్స్ షీట్ స్టడీ పూర్తయ్యేసరికి రాత్రి రెండయింది. దాదాపు పదిలక్షలదాకా మేనేజింగ్ డైరెక్టరూ, మిగతావాళ్ళూ కలసి తినేసేరన్న ఆమె అనుమానం,ఆడిట రిపోర్ట్ చదివేక ధ్రువపడింది. మరుసటిరిజే మీటింగ్, ఆమె వాళ్ళని కడిగేయ్యటానికి నిశ్చయించుకుంది. వీలైతే తొలగించటానికి కూడా.
ఏడున్నరయింది. ఇంక మూడోకాల్ రాలేదు.
సర్వోత్తమరావు ఐదింటికే లేస్తాడు. లేవగానే వచ్చి మేనకోడల్ని లేపటానికి ప్రయత్నిస్తాడు. అది మెదటి కాల్. తరువాత స్నానంచేసి రెండవసారి వస్తాడు. అర్చన లేవడు. పూజ అయ్యాక మళ్ళీ అప్పటికి ఎనిమిది అవుతుంది. అప్పుడు లేస్తుంది. "నీ కెన్నో మంచిగుణాలు నేర్పెన్నమ్మాయ్, ఈ ఒక్కటీ నేర్పలేకపోయాను" అంటాడు. ఆమె నవ్వేస్తుంది "పోన్లే అంకుల్. మరీ అన్నీమంచి గుణాలే వుంటే బావోదు."
ఆ రోజు మాత్రం అయన పైకొచ్చేసరికి ఆమె లేచింది. మోకల్లా మీదనుంచి నైట్ గౌను సర్దుకుంటూ పక్కమీదే కూర్చొని "అంకుల్_ నేను కొంచెం మాట్లాడాలి" అంది ఉపోద్ఘాతంగా.
"ఏమిటి విషయం? ఈ రిపోర్టులు చూసేను అంకుల్. బ్రహ్మానందం మనవి పదిలక్షలుదాకా ముంచేడు." అన్నది. బ్రహ్మానందం కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు .
"పదిలక్షలు కాదు, యాభై లక్షలైన సరే _నువ్వు స్నానంచేసి తీర్ధం తీసుకునేదాకా ఏ విషయమూ మాట్లాడను" అంటూ లేచాడు. అర్చన నాలుక బైటపెట్టి వెక్కింరించి బాత్ రూమ్ లోనికి వెళ్ళిపోయింది.
సన్నగా హమ్ చేసుకుంటూ పంపు తిప్పింది. బాత్ టబ్ లోకి నీళ్ళు నిండుతున్నాయి. జుట్టు వెనక్కీతోసి, తడవకుండా ప్లాస్టిక్ కాఫ్ పెట్టింది. మెడ వెనగ్గా చేతులు పోనిచ్చి బటన్ విప్పింది. నడుము దగ్గర తాడువిప్పి భుజాలు బ్రహ్మ అనే కంసాలి పెట్టిన గీటులా వుంది.
ఆమె షవర్ తిప్పింది పదిననీటిచుక్క ఆమె శరీరం మీద ధారగా మారి క్రిందకి జారుతుంది. నుదుటిమీద పడినచుక్క, ముక్కుకోన శిఖరంలా వుండటంతో హిమాలయం మీదనుంచి దూకిన అలాక నందా అయింది. పెదవిమీద పడిన చుక్క గెడ్డం వంపులో మెలికతిరిగి కృష్ణానది అయి జారింది. మరోచుక్క కంఠంమీద పడి జారి పాపికొండల మధ్య గంగగా మారింది. నాభీమీద పడింది జారి క్రిందకి డిగి ఆమె జాన్ అయ్యింది.
"సమ్ టైమ్ ఐ __ ఫీల్ లైక్ ఎ మదర్ లేన్ చైల్డ్ " సన్నగా పడ్తూ స్తానం చేస్తున్నా అర్చన చప్పున పాత ఆపింది.
ఎవరో చూస్తున్నారు!
బైట నిలబడి _ తాళంచెవి కన్నంలోంచిఎవరో రహస్యంగా చూస్తున్నారు. ఆమె మోహం ఎర్రగా కందిపోయింది. కానీ క్షణంలో సర్దుకుని పాత కొనసాగిస్తూ, షవర్ మరింతగా తిప్పింది. పెద్ద శబ్దంతో నీళ్ళు పడ్తున్నాయి. ఆమె చప్పుడు కాకుండా టబ్ లోంచి లేచి పక్కకి వెళ్ళింది _ క్లీన్ చేసే బ్రష్ లోంచి ఒక పిల్లనితోసి, మరింత నిశబ్దంగా తలుపు పక్కకి చేరుకుంది. కన్నంలోకి జాగ్రత్తగా పుల్లని తోసి, ఒక్కసారిగా ముందుకు నెట్టింది. బాధగా చిన్న మూలుగు _ఎవరో పరుగెత్తిన శబ్దం.
ఆమె మామూలుగానే స్నానం పూర్తీచేసి క్రిందకి వచ్చింది. మనసులో ఎ భావాలున్నా అవేశాపదకుమ్డా మామూలుగా వుండటం ఎగ్జిక్యూటివ్ లక్షణం. బ్రేక్ ఫాస్టు వడ్డీస్తూన్న రంగామ్మతో మామూలుగానే అడిగింది. _ "బైరాగి ఏడి రంగంమ్మా?"
"ఇప్పటివరకూ ఇక్కడే వుండాలి. ఎక్కడికి వెళ్ళాడో .... పంపించమంటారా?"
"పంపించు " అని ఆమె లేచిపోయింది. ఆమె స్టడీరూమ్ లో సర్వోత్తమరావుతో మాట్లాడ్తూవుంటే రంగమ్మవచ్చి కనబడటంలేదు. ఎక్కడికి వెళ్ళాడో మరి?" అన్నది.
అయన మధ్యలో కల్పించుకుని "ఏమిటి" అని అడిగేడు. బైరాగి ఎక్కదికి వేళ్ళాడన్న ప్రసక్తి వచ్చింది. "వంట్లో బావోలేదన్నాడు, ఆస్పత్రికి పొమ్మన్నాను." అన్నాడాయాన.
"ఏమైందట" రంగమ్మ అడిగింది. పైకి గయ్యాళిలా కనబడ్తుంది. కానీ ఎవరికైనా ఓర్చుకోలేదు.
"కంట్లో ఏదో కురుపైందట" అన్నాడాయన అర్చన మోహంకోపంతో ఎర్రబడటం వాళ్ళిద్దరూ గమనించలేదు.
