Previous Page Next Page 
అభిలాష పేజి 11

    చిరంజీవి చుట్టూ చూసేడు. ఆమె వివరిస్తూ ముందుకు వెళ్ళింది. అతడికి ఉక్కపోస్తున్నట్టు అనిపించింది.స్వచ్ బోర్డు ప్రక్కనే వున్నేగ్జాసర్ ని పోన అనుకుని భ్రమపడ్డాడు. పక్కనేవున్న బటన్ నొక్కెడు. అయితే ఆ బటన్ మిషన్ తాలూకుది. అతడు దాన్ని నొక్కగానే పెద్ద చప్పుడుతో కన్ మేయర్ తిరగసాగింది. ఒక్కసారిగా అన్ని మరలూ పని చేయసాగేయి.
   
    అదే సమయానికి అర్చన రెయిలింగ్ చివరకి వెళ్ళింది. ఒక్క సారిగా వచ్చిన శబ్దంతో ఆమె కంగారుపడి వెనక్కీ తిరిగింది. అడుగు తడబడటంతో పక్కకిజరి బెల్ట్ ఆమెని తబతోపాటూ తీసుకెళ్ళాసాగింది. ఆమె కెవ్వున కేక వేసింది. చిరంజీవి చప్పున స్విచ్ ఆఫ్ చేసేడు. కానిఅప్పటికే ఆమె మధ్యకి వెళ్ళిపోయింది.
   
    చిరంజీవి వళ్ళంతాచెమటలు పట్టేయి. ఒక్కక్షణం ఏం చెయ్యాలో తోచలేదు. అర్చన ఏ క్షణమైనా పడిపోయేటట్టూవుండి. మూట తీసి వున్న సిలిండర్ లోంచి క్రితం రోజు వేడి తాలూకు పొగలు ఇంకా వస్తూనే వున్నాయి. అతడు మరి ఆలోచించకుండా రెయిలింగ్ మీదనుంచి క్రిందకి దూకి_ బాయిలర్ స్క్రూస్ పట్టుకుని పైకిఎక్కాడు. కాల్షియం వాసన ముక్కుపుటాల్లోంచిరక్తం వస్తుందా అన్నంతగా మండుతూంది. బాయిలర్ పక్కనుంచి లివర్ మీద కాలువేసి బెల్తుని అందుకున్నాడు. తరువాత నెమ్మదిగా పాక్కుంటూ ముందుకెళ్ళి ఆమెకి చెయ్యి అందించాడు. కొద్దికొద్దిగా వెనక్కీ జరుగుతూ ఆమెతోపాటు ట్రాలీ వరకూ వచ్చి దానిమీద కాలువేసి నేలమీదకు జారేడు. అతడి భీజం పట్టుకుని ఆమెకూడా కొండకి దిగి గుండెల్నిండా వూపిరి పీల్చుకుంది.
   
    "నిజంగా చచ్చిపోయననే అనుకున్నాను." ఓంకా వనుకుతూన్న చేతివెళ్ళని చూసుకుంటూ అంది అర్చన. తెల్లటి చేతులు__ బలం అంతా మోపటంవల్ల రక్తం ఎగచిమ్మిఎర్రగా మారాయి.
   
    "నన్ను క్షమించండి " అన్నాడు. చిరంజీవి పాలోపోలిన మోహంతో, ఫ్యాన్ అనుకున్నాను."
   
    ఫ్యాక్టరీ వాచ్ మెన్, గుమస్తా పరుగెత్తుకుంటూవచ్చారు శబ్దం విని.
   
    "నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఒక్కసారిగా అంత శబ్దం విని కంగారుపడ్డాను. స్విచ్ వేయగానే అంత శబ్దం వస్తుందని నేనూ అనుకోలేదు. అదీగాక ఒక్కసారి బెల్టు కదలటంతో నిలదొక్కుకోలేకపోయెను." అంది అర్చన కర్చీఫ్ తో నుదురు అద్దికుమ్తూ _ "అయితే నాకో విషయం అర్ధంకాలేదు. ఏమ్డుకుసగంలో మీరు స్విచ్ ఆఫ్ చేశరు?" అని అడిగింది.
   
    "మరి చెయ్యకపొతే ...." అంటూ ఏదో అర్ధమయి వాక్యం పూర్తీ చెయ్యకుండా మధ్యలో అపుచేసేడు .... చెయ్యకపొతే ఏమయి వుండేదీ? బెల్టు చివరివరకూ వెళ్ళి వుండేది. దానితోపాటు అర్చన కిమ్దవార్కూవచ్చి వుండేది. హాయిగా నేలమీద దిగివుండేది. తనేదో రక్షింవాడిలా మధ్యలో స్విచ్ ఆఫ్ చేసి కిందకు వచ్చేదాన్ని రాకుండా చేసి తార్చన్ లా బాయిలర్ ఎక్కి ఆమెని కిందకి దింపేడు.
   
    తన తెలివి తక్కువతనం అర్ధమయ్యేసరికి అతడి మోహం ఎర్రబడింది.
   
                                  5
   
    రోజులు గడిచేకొద్దీ చిరంజీవి చిక్కిపోతున్నాడు. గెడ్డం గీసుకుంటూ ఆలోచనలో పడిపోతాడు. ఎందుకో తనలో తనే నవ్వుకుంటూ వుంటాడు. వగైరా _వగైరా స్పూర్తి ఇదంతా గమనిస్తూనే వున్నాడు. ఒకరోజు నిలదీసి అడిగేడు.
   
    "నేను... నేను.... అర్చనా నేనూ___ అదే అర్చనని నేను___" అని కళ్ళవెంట నీళ్ళు పెట్టుకున్నాడు. స్పూర్తి కంగారుపడి "ఏమైంది...... అసలు సంగతి చెప్పు" అన్నాడు.
   
    "మొదలు పెడ్తే ధైర్యం వస్తుంది. మొదలుపెట్టనివ్వదు. ధైర్యం వస్తే మొదలు పెట్టగలను ధైర్యం రాదు."
   
    "ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అది చెప్పి ఎదవరాదూ. వూరికే ఏడుస్తావేం?" విసుక్కుంటున్నాడు. చిరంజీవి మరింత దుఃఖంతో "ప్రేమపాచిపోయిన పాయసంలాంటిది. అడిత్యగాన్ని కోరుతుంది." అన్నాడు.
   
    "గన్ షాట్  గా...." అన్నాడు స్ఫూర్తి. "అర్చనలాంటి అమ్మాయిని ప్రేమిస్తే అది త్యాగానికే దారితీస్తుంది. నెత్తిమీద రూపాయి పేట్టి అమ్మితే అర్ధరూపాయికింముడుపోయే నీలాంటివాణ్ణి అర్చన కాదుగదా, వాళ్ళింటి వంటమనిషి కూడా ప్రేమించదు."
   
    "మరి నేనేం చెయ్యాలి?"
   
    హీరోలా ఒక గిప్పపనేదైనా చెయ్యాలి. టెస్ట్ మాచ్ లో సెంచరీ కొట్టాలి. లేకపోతేరికార్డ్ బద్దలుకొట్టే పనేదైనా చెయ్యాలి. అమ్మాయిలు_ అందులోనూ అర్చనలాంటివాళ్ళు మామూలుగా ప్రేమించేసేయ్యరు."
   
    చిరంజీవి ఆలోచనలో పడ్డాడు. ఏదైనా చెయ్యాలి నిజమే. ఏదైనా అధ్బుతం చెయ్యాలి! ఇదే ఆలోచనతో ఓ నేల గడిపేడు.
   
    చాలా గొప్ప గొప్ప ఆలోచన్లు, జీవితగతిని మార్చేవి, హాఠాత్తుగా స్పురిస్తూ వుంటాయి. ఆ రోజు పేపరు (సేక్తంబారు 1981 లో వార్తా 'హిందూ' లో పడింది.) చదువుతూ వుండగా, ఓ వార్తామీద చిరంజీవి దృష్టిపడింది.
   
    "ఉరికంబం ఎక్కబోయే ముందు సుప్రీంకోర్టు స్టే" అన్నహేడ్డింగుతో వున్న వార్తా అది. మరుసటిరోజు తెల్లవారుఝామునే ఉరికిసిడ్డపెడ్తూన్న ఖైదికీ స్టే లభించింది.
   
    చిరంజీవి మామూలుగానే దాన్ని చదివి పక్కన పడేసేడు. కానీ రాత్రి పక్కమీద వాలేక హాఠాత్తుగా ఒక ఆలోచన స్పురించింది. నిముషాల్లోఅది రూపు దిద్దుకొనగా, అప్పటికప్పుడే లాయరుగారింటికి పరుగెత్తాడు. అప్పుడు రాత్రి పదయింది.
   
    స్టడీ రూమ్ లో లా పుస్తకాలు తిరగేస్తున్న సర్వోత్తమరావు. ఆ సమయంలో చిరంజీవి రావటం చూసి ఆశ్చర్యపోయాడు.
   
    "నాకో బ్రహ్మాండమైన అలోచన వచ్చింది. ఇక ఈ దెబ్బతో మన దేశంలో ఉరిశిక్ష రద్దు చేయబడ్తుంది.  అసలీ వార్తారాగానే దేశం అట్టుడికి నట్టు వుడికిపోయింది. పార్లమెంటు గందరగోల మవుతుంది. అసలు విషయం తెలిసేక మనిద్దరి పేర్లూ మార్మోగిపోతాయి. మన వెనుక ప్రజలుంటారు. దాంతో ఐ. పి. సి. 302 సెక్షన్ మార్చబడుతుంది.      
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS