Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 11

    "ఏయ్ మౌనా... ఏంటీ... ఎటో వెళ్ళిపోయింది మనసూ... అని పాత పాడుకుంటున్నావా?" సవిత అడిగేసరికి తేరుకుని "అదేం లేదు... అతనివాలకంగామనిస్తున్నాను... చాలా గమ్మత్తయిన మనిషిలా వున్నాడు..." అంది మౌన.
    "ఓ సారీ వెళ్ళి మాట్లాడి రారాదూ...' అంది భామిని.
    "ఏం అక్కరేడు..." అంది మౌన అలా అన్నదేకానీ, ఆమెకూ వెళ్ళి అతన్ని పలకరించాలని వుంది. అంతకన్నా, "... మహ్ను భావా... ఓ అమ్మాయి ' సారీ' చెబితే, ఓ చిరునవ్వు నవ్వి ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం కూడా తెలియకపోతే ఎలాగయ్యా..." అని నిలదీయాలని వుంది.
    సరిగ్గా అప్పుడే ఆ రెస్టారెంట్ ముందు ఓ జీపు ఆగింది. అందులో నుంచి బిలబిలమని ఓ పడి మంది ఆగంతుకులు దిగారు. వాళ్ళా చేతుల్లో రాడ్స్, సైకిల్ చేయిన్లు, హాకీ కర్రలు, క్రికెట్ బ్యాట్ లు వున్నాయి.
    ఢిల్లీలో ఇలాంటి గ్యాంగ్ స్టర్స్ కు కొదవేమీ లేదు. అర్ధరాత్రి టైం కాబట్టి రెస్టారెంట్ లో పెద్ద రష్ వుండదని విద్వంసం సృష్టించి, భయత్సాతంతో వాళ్ళని హడల గొట్టి డబ్బు దోచుకోవాలని వాళ్ల ప్లాన్.
    ఒకేసారి ఆ రెస్టారెంట్ లో రష్ తక్కువుగా వుంది.
    డేంజర్ అలారం మోగించడానికి మేనేజర్ లేచాడు. అది గమనించిన ఓ అగంతుకుడుమేనేజర్ ని బయటకు లాగాడు. భస్మ కూచున్న సీటుకు అవతలివైపే డేంజర్ అలారమ్ ఉంది.
    మేనేజర్ భస్మ కు సైగ చేశాడు.
    అయినా భస్మ అదేం పట్టించుకోకుండా నూడుల్స్ తింటున్నాడు. రెస్టారెంట్ లో వున్న వాళ్ళంతా భయంతో వణికిపోతున్నారు. ఆకలి మాట మరచి, ప్రాణం మీద భయంతో బుగుసుకుపోయారు.
    మౌన, వాళ్ల ప్రెండ్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. తలోదిక్కుకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
    "ఎవరు కదిలినా ఛస్తారు" వార్నింగ్ ఇష్యూ చేశాడు ఆ అగంతుకుల్లో ఒకడు.
    ఎక్కడి వల్లక్కడే స్తాత్యూల్లా వుండిపోయారు.
    మౌన ఆశ్చర్యంగా భస్మ వైపు చూసింది.
    అతను మాత్రం చాలా తాఫీగా నూదల్స్ తింటున్నాడు.
    "ఏయ్ మౌనా... అతడెంటే... ఓ పక్క మనం భయంతో వణికి పోతూంటే, జేమ్స్ బాండ్ సినిమాలో సీన్ కానరీ టైపులో నిపాడిగా నూదల్స్ తింటున్నాడు" అంది మెల్లిగా మౌనకు మాత్రమె వినిపించేలా శర్మిష్ట.
    ఆ ఆగంతుకులు దృష్టి భస్మ మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు.
    ఇంతమంది భయంతో గిజగిజలాది పోతూంటే తనకు పట్టనట్టు వున్న అతడి మీద వాళ్లకు కోపం కూడా వచ్చింది.
    "మనల్ని పూచికపుల్లలా చూస్తొన్న ఆ బద్మాష కు మన దెబ్బ రుచి చూపించి బుద్ధి చెప్పోంది..." ఓ ఆగంతుకుడు తన అనుచరుడికి చెప్పాడు.
    సైకిల్ చెయిన్ గాలిలోకి లేపి అక్కడ్నుంచి భస్మ వీపుపైకి విసిరాడు. భయంతో కళ్ళు మూసుకుంది.మౌన.
    అతను గట్టిగాకేక వేస్తాడని వూహించింది.
    కానీ భస్మ అదేం పట్టించుకున్నట్టు లేదు. తాపీగా తింటూనే వున్నాడు.
    "రేయ్  బద్మాష్..." అంటూ భస్మ జుట్టు వుంది. భస్మ తల మద్య భాగంలో వున్న కన్ను కొద్ది కొద్దిగా తెరుచుకోసాగింది.
    చేయి చుర్రు మనడంతో భస్మ జుట్టు వదిలేసాడు ఆగంతుకుడు.
    "క్యాహోగయా?" అడిగాడు వాళ్ళకు బస్ లా వున్న లావుపాటి వ్యక్తి.
    "చేయి కాలింది సాబ్" అన్నాడతను.
    "చేయి కాలదమేంటి బె... మండు తాగావా?" అంటూ భళ్ళున నవ్వి, భస్మ దగ్గరకి వెళ్ళి హాకే కర్రతో అని మూతిమీద బలంగా కొట్టాడు."
    పెదవి చిట్లి రక్తం వచ్చింది.
    అందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు.
                                              ***
    అగర్వాల్ రెస్టారెంట్ లో జరుగుతున్నదాన్ని... ఎదురుగా వున్న కంప్యూటర్ స్క్రీన్ లో చూస్తున్నాడు.
    "భస్మా... పిడికిలి బిగించు... హిట్... కమాన్ హిట్ దెమ్..."అన్నాడు అగ్రవాల్ అతనికి సజెషన్స్ ఇస్తూ.
                                               ***
    ఆగంతుకులు అందరూ కలసి భ్స్మను చూట్టుముట్టారు.
    సరిగ్గా అప్పుడు రియాక్టయ్యాడు భస్మ.
    అతనికి పిడికిళ్లు బిగుసుకున్నాయి.
    ఫట్..ఫట్...ఫట్..
    ఒక్కో ఆగంతుకుడు గాలిలోకి ఎవరో విసిరేసినట్టు ఎగురుతున్నారు. హాహాకారాలు రెస్టారెంట్స్ లో ప్రతిద్వనించాయి. అయితే నిముషాల్లో ఆ ఆగంతుకులు శవాల్లా పడిపోయారు. అతి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చవబాదుతున్నాడు భస్మ. అప్పటి వరకూ ఆ ఆగంతుకులను అసహ్యించుకున్న కస్టమర్లె, వాళ్ళమీద జాలి చూపించారు. క్షణాల్లో వాళ్ళు కుంటుతూ, మూలుగుతూ జీవుల్లో పారిపోయారు. భస్మ తాపీగా బిఉల్లు కౌతర్ లో చెల్లిచి బయటకు జీవుల్లో పారిపోయారు. భస్మ తాపీగా బిల్లు కౌత్ర్ లో చెల్లించి బయటకు నడిచాడు.
                                             ***
    "ఏయ్...మౌన... ఏంటీ ఆలోచిస్తున్నావు? రెస్టారెంట్ నుంచి వచ్చిన ఎప్పట్నుంచి మంచం మీద బావుర్లాపడుకుని ఆలోచిస్తున్న మౌనాని అడిగింది భామిని. హొటల్ ల్లోంచి వచ్చాక అందరూ నైతీల్లోకి మారారు. మౌన మాత్రం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే వుండిపోయింది.
    "ఏయ్ మౌనా... నిన్నే... ఏమిటి పరధ్యానం... కొంపదీసి ఇందాకా రెస్టారెంట్ లో కనిపించిన రఫ్ అండ్ తఫ్ హీరో గురించి ఆలోచిస్తున్నావా? అయినా అతడేమిటే... టార్జాన్ సినిమాలో హీరోలా ఉలకడు. పలకడు... మొహంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా లేదు. ఆ మానవుడు నవ్వి ఎన్నాళ్లయిందో?" అంది మౌనను ఉడికిస్తూ శర్మిష్ట.
    "అది కాదే... ఆ మనిషిని చూస్తె రోబోలా అనిపించాడు. ఎంత తాపీగా నూడల్స్ తింటున్నాడు. మనమెంత టెన్షన్ గా వున్నామో... అతనంట రివర్స్ లో తాపీగా వున్నాడు. అతనిలో ఏదో సం థింగ్ స్పెషల్ వుందని ణా నమ్మకం" అంది లేచి కూచూంటూ మౌన.
    "ఆ.. వుంది... మిద నైట్  మసాలా స్పెషల్... బహూశా ఏ అడవుల్లోనో తపస్సు చేసి, దేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి విసుగొచ్చి... గడ్డం తీసేసి, ప్యాంటూ షర్టు తగలించుకుని అరణ్యంలో నుంచి జనాణ్యంలో వచ్చి వుంటాడు. తపస్సు చేసి చేసి మాట్లాడం కూడా మరచిపోయుంటాడు జీవుడు" అంది సుచిత్రాశర్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS