Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 12

 

    తాను చిన్నగా నవ్వి, మళ్ళీ అన్నాడు గోపాల్రావు: "నాన్న కొయ్యబారి నిలుచుని, తేరుకున్న తరవాత ముందుకి రెండు గజాలు నడిచి వెళ్ళిపోయిన రాజమ్మ దగ్గరకు నాలుగంగల్లో వెళ్ళి నిలేసి, "నువ్వు మా అల్లుడితో లేచి పోలేదూ?" అని అడిగారట. ఇహ దాని నోటి కడ్దేమిటి? ఇష్ట మొచ్చినన్ని వాగి, మీ అల్లుడు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. నేను తిరుపతి లో చూశానని చెప్పిందట. నిజమే నంటావా , రాజమ్మా? అంటూ అనునయంగా అడిగాడట. మీరు తనకు కనిపించి నట్టూ, తిరుపతి లో మీరు పెళ్ళి చేసుకున్నట్టూ చెప్పిందట రాజమ్మా." ఇద్దరూ కలిసి నవ్వుకున్నారోసారి.
    "ఇంకేముంది? తహసీల్దారుగాల్లుడు తిరుపతి లో మళ్ళీ పెళ్ళి చేసుకున్నా డన్న వార్తా ఊరంతా పాకి అక్కయ్య చెవినీ పడింది. మీరు పెళ్ళి చేసుకుని ఎక్కడో స్థిరపడ్డారనే నిశ్చయానికి వచ్చాం. ఆనాటి నుంచీ పూర్తిగా ఆశ వదులుకున్నాం. నాన్న క్రుంగి పోయారు. బహుశా అయిదారు నెలలు మాత్రమే అలా అలా తిరిగేవారు. తరవాత అయన మంచం మీదే తీసుకున్నారు. అయన పోయాక అక్కయ్య వేరు ఉన్నారు. ఉద్యోగరీత్యా నేను మరో ఊరుకు వెళ్లాను. ఇంటి అద్దె, పొలంలో వచ్చే ధాన్యం అమ్మకీ, అక్కయ్య కీ వదిలేశాం." అంటూ పూర్తీ చేశాడు గోపాల్రావు    
    "అయితే వాసు బాగా చదవగలడంటావా? తెలివైనవాడేనా?" ప్రశ్నించాడు ప్రసాదరావు.
    "వాడి మార్కుల లిస్టు చూసి ఉంటె ఇలా అడగరు మీరు!" నవ్వాడు గోపాల్రావు.
    "వాడి గురించి ఏమి ఖర్చులున్నా మొహమాట పడకు. వ్రాయి . నువ్వూ పిల్లల వాడివి. ఖర్చుకి నేను పంపిస్తుంటా. మరేం అనుకోక తీసుకో. కాని, ఈ సంగతి మరొకరికి తెలియాడం నాకు ఇష్టం కాదు, గోపాలం. ఆనాడు ఎలా నవ్వుల పాలయ్యానో నీకు తెలుసు. ఇలా ఏకాంతంగా బ్రతకడమే నా కిష్టం. ఆ మరి భోజనం చేద్దాం" అన్నాడు వాచీ చూసుకుంటూ ప్రసాదరావు.
    వక్కపొడి నములుతూ సిగరెట్ వెలిగించి, మంచం మీద మఠం వేసుకు కూర్చుని, "అయితే , బావా! మీకు కావలసిన విశేషాలన్నీ రాబట్టుకున్నారు. మీ మధ్య ఇలా విడిపోయే తగువు లేలా వచ్చాయి? ఇంటి దగ్గర నుంచి వచ్చాక మీ రిప్పుడెం చేస్తున్నారు?చెప్పరా ? భలే గడుసు వారండీ!" అని హాస్యంగా నవ్వుతూ అన్నాడు గోపాల్రావు.
    "వినడానికెగా వచ్చావు? చెపుతాను, విను. అదేమిటోనోయ్ ఇప్పటికీ గతాన్ని తేలిగ్గా తీసుకోలేక  అప్పుడప్పుడడోలా బాధపడుతుంటాను. పదహారు సంవత్సరాల క్రితం జరిగిపోయిన పాత కధ ...విను. నీతో చెప్పినందువల్ల లాభం, నష్టం రెండూ లేదు...." అంటూ చిన్నగా దగ్గి, ఈజీ చైర్లో చేరబడి కూర్చున్న వాడల్లా నిటారుగా కూర్చుంటూ, "మీ నాన్నగారి దగ్గర నేను గుమస్తా నని నీకూ తెలిసిందేగా? మీ నాన్న గారి ఇష్ట ప్రకారం మీ అక్కయ్య కూ, నాకూ పూర్తీ అంగీకారంతో మా వివాహం జరిగింది. ఎభయ్యో వడిలో పడ్డ వాణ్ణి.... ఇహ నాకు సిగ్గెందుకు? ఓ రకంగా మాది ప్రేమించి చేసుకున్న పెళ్ళి. ఒకరిని చూడకుండా ఒకరం ఒక్క రోజు కూడా ఉండలేక పోయేవాళ్ళం.
    ఓ అయిదు సంవత్సరాలు ఎటువంటి పొరపొచ్చాలు మా ఇద్దరి మధ్యా రాలేదు. జీవితమంతా అలాగే దోర్లిపోతుందని భ్రమించాను.... కాని వచ్చిందోయ్ ఒక కారణం! ముందు మీ నాన్నగారికీ, నాకూ బేధాభిప్రాయం. ఆరోజు మాములుగా ఆఫీసుకు వెళ్ళబోతూ మీ నాన్న గారి గదిలో ఏవో మాటలు వినిపించి చనువుగా వెళ్ళాను. జూనియర్ గుమస్తా జోసెఫ్' మీ నాన్నగారి ముందు రెండు వందల రూపాయల నోట్లు ఉంచి నమస్కరించాడు. అయన అవి జేబులో కుక్కుకుంటూ నన్ను రమ్మని సంజ్ఞ చేశారు. నాకు అనుమాన మొచ్చింది. అంతకీ తొలిరోజు సీనియారిటీ ప్రకారం కొన్ని గుమాస్తా పోస్టులు ఊస్టింగ్ చెయ్యమని గవర్నమెంటు నుంచి ఆర్డరు వచ్చింది. ఇతని ఉద్యోగం పోవచ్చు. 'చూడు, ప్రసాద్, జోగయ్య పోస్టు ఊస్టింగ్' అన్నారు. అనగానే నా గుండెలు గుబగుబ లడాయి. ఆ అన్యాయానికి . 'లేదండి, అతను సీనియర్' అన్నాను. 'నాకు తెలుసు' అన్నారు తీక్షణంగా నావైపు చూస్తూ. 'అది అన్యాయం ' అన్నాను. 'అవనీ నేను చెప్పుతున్నాను. ఈ విషయంలో నువ్వు జోక్యం పెట్టుకోకు' అన్నారు. నేను మాట్లాడకుండా ఇవతలికి వచ్చాను. నాకు జోగయ్య ఉద్యోగం నిలబెట్టాలనే పట్టుదల హెచ్చింది. మీ నాన్నగారి ప్రయత్నం విఫలమై మాట తిన్నారు. అతని తరపున ప్రయత్నించి ఫలితం సాధించాను నేను. ఆ జోగయ్య అక్కే రాజమ్మ. వాళ్ళది చాలా పేద కుటుంబం. జోగయ్య సంపాదన మీదే వారి సంసారం నడిచేది. నా పై వాళ్ళకి గౌరవం, కృతజ్ఞతా భావం ఉండడం సహజమే గదా? పైగా, జోగయ్య నాకో స్నేహితుడై పోయాడు. ఆఫీసు నుంచి నేను వస్తుంటే వారు ఓసారి ఆహ్వానించడం, నేను వారిచ్చే అతిధి సత్కారం స్వీకరించడం ఓ అలవాటయిపోయింది. అపజయం మనస్సులో పెట్టుకున్నారు, గోపీ, మీ నాన్న. నాతొ ముభావంగా ఉంటూ వచ్చారు. మీ అక్కయ్య కూడా వాళ్ళ నాన్న చేసే పనికి అడ్డు తగిలానని మెత్తగా చివాట్లెసేది. 'పేనుకు పెత్తనమిస్తే  బుర్రల్లా దోలిచిందట. ఇంతేనండి. చెప్పు కింద వాళ్ళని చెప్పు కిందే ఉంచాలి' అని ఇలా సూటిగా గుండెల్ని గుచ్చుకునే మాటలు మీ అమ్మగా రానేవారు. ఇన్నీ సహించాను, గోపీ. కాని...." అంటూ ఆగి ఒక్కసారి కళ్ళు మూసుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు ప్రసాదరావు.
    ఒక్కసారి బరువుగా తల వాల్చి మళ్ళీ ప్రసాదరావు వైపు చూశాడు గోపాల్రావు.
    "అలా జీవితం సాఫీగా సాగిపోయిందా! అయినా నేనొక నష్ట జాతకుడ్నీ , గోపీ....అమ్మా, నాన్నా నేను నెలల వాడిగా ఉన్నప్పుడే పోయారట కలరా వచ్చి. మా అమ్మమ్మ చేరదీసింది. నేనేదుగుతూ ఉండగా మా మేనమామలు ఇద్దర్నీ , పినతల్లినీ, తాతయ్య నీ కాపు పట్టే వృక్షాలను గాలివాన వేళ్లతో పెకలించినట్టు మృత్యువు పొట్ట పెట్టుకుంది. నన్ను అభిమానించి నాపై జాలి చూపే వ్యక్తుల్ని పోగొట్టుకున్నాను. నాకోసం ప్రమిద నింకిన చమురు పీలుస్తూ వెలిగే జ్యోతిలా అమ్మమ్మ జీవించి విద్యా బుద్దులు చెప్పించింది. అమ్మమ్మ నన్ను వదిలి పోయే రోజు మీ అక్కయ్య నాకు చేయూత నిచ్చింది. నేను ఒంటరి వాణ్ణి కానను కున్నాను. మా నాన్న గారి వాత్సల్యం చూరగోన్నాక పితృ ప్రేమ ఇలా ఉంటుందనుకున్నాను...." గొంతు గాద్గదికమైంది. కనుకొలకుల్లో నీరు నిలిచింది.

                                   
    "నా జీవితం వడ్డించిన విస్తరనుకున్నాను. నా భవిష్యత్తు పూలబాటలో పయనిస్తుందనుకున్నాను. అందమైన ఊహ గానాలు నిర్మించుకున్నాను. కాని..... నా జీవితంలో అన్నానికి వాచే రోజులు ఉన్నాయని, ముందు తోవలో ముళ్ళు పరుచుకున్నాయని, నా ఊహ సౌధాలు గాలి మేడలనీ , ఓదార్పు, సానుభూతి లేని ఒంటరి జీవితం గడుపుతానని అనుకోలేదు, గోపాలం!
    "కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుకి వస్తే ఇప్పటికే హృదయం కదిలిపోతుంది. నా పెళ్ళయిన రెండు సంవత్సరాల్ తరువాత అనుకుంటాను-- ఆఫీసు ఇన్ స్పెక్షనుందని వారం రోజుల ముందు నుంచీ రికార్డులు పూర్తీ చేస్తున్నాం. ఉదయం వెళ్ళి రాత్రి ఎనిమిది గంటలకి ఇల్లు చేరేవాణ్ణి వారం తరువాత కాంపు నుంచి అయన తిరిగి వచ్చారు. మధు చెప్పింది కాబోలు-- ఆఫీసుకి వెళ్ళబోతూన్న నన్ను 'ప్రసాదం' అని గట్టిగా పిలిచారు, అయన నిద్ర లేస్తూ. వెళ్ళాను. 'మీరు నిద్ర పోయారు నేను వచ్చేసరికి' అన్నాను-- ఆయన్ను పలకరించనందుకు కారణం మనవి చేస్తూన్నట్టు.
    'చూడు, భోజనం చేసి పది గంటలకి వెళ్ళు ' అన్నారు అజ్నాపిస్తున్నట్టు. 'కాదండి, వెళ్ళాలి' అంటూ నసిగాను. "ఏమిటి కాదు? ఇలా రాత్రీ, పగలూ అనక పనిచేస్తే ఆరోగ్యం పాడవదూ? పద. ఇంట్లోకి నడు" అన్నారు నవ్వుతూ. "మా హెడ్ గుమస్తా?' అన్నాను. "ఊ ఏం చేస్తాడు? నువ్వేవరనుకుంటాడు? నేను ఉన్నంత కాలం నువ్వు కష్టపడి సంపాదించవలసినది లేదోయ్- ఉద్యోగం పురుష లక్షణం అని కాని, వద్దు ఈవేళ ఆఫీసుకి వెళ్ళక, భోజనం చేసి మధ్యాహ్నం హాయిగా నిద్రపో. సాయంత్రం ఇద్దరూ సినిమాకి పొండి. అమ్మాయి గోల పెడుతుంటే వినక్కర్లే?' అన్నారు. అలాగే మౌనంగా నిలుచున్నాను నేను. ఆవేళ నేను చెయ్యవలసిన పని చాలా ఉంది..... 'ఫర్వాలేదు. నిన్నేమన్నా అనడానికి ఎవరికి గుండెలున్నాయి? వెళ్ళు. ఈవేళ ఆఫీసుకి లీవ్ లెటరు పంపించు.' అన్నారు నవ్వుతూ. అలాంటి మనిషి నన్నింట్లోంచి తరిమారంటే అంతకన్నా దురదృష్టమేముంది, గోపీ? అందుకే వయసొచ్చాక ఎప్పుడూ అలా ఏడవని నేను ఏడ్చాను ఆరోజు" అని మొహమంతా తువ్వాలుతో తుడుచుకుని మళ్ళీ చెప్పడిలా:
    'అలాంటి వెన్నో సంఘటనలు నా శరీరాని కేలాటి రంగు మెచవుతుందో అలాటి రంగు ఖరీదయిన సూట్లు కుట్టించేవారు. ఆ బట్టలు నే వేసుకున్నప్పుడు "ఏదీ, ప్రసాద్ , ఇటురా' అని ప;పిలిచి తృప్తిగా నావైపు చూసేవారు. ఓసారి నాకు జ్వరం వచ్చింది నాలుగు రోజులు. తానూ సెలవు పెట్టి ఇంట్లో ఉండి పోయారు. పసివాడిలా నా మంచం చుట్టూ తిరిగే ఆయన్ని అత్తగారు -- "అదేమిటండి మీరూ! అతన్ని వదలకుండా తిరుగుతారు-- అతనికి కాలూ చెయ్యీ రాయడానికి వీలు లేకుండా!' అన్నారు మందలింపు గా.నవ్వేసి అవతలికి వెళ్ళారాయన. నేను పకాలున నవ్వేశాను.'
    గత సంఘటన పునరావలోకనంలో ప్రసాదరావు పెదాల పై హసరేఖలు విరిసి మాయమయ్యాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS