8
అది భానుమూర్తి క్లాసు. ఇంకా అయన రాలేదు. అతను క్లాసులోకి రాగానే తాను క్లాసు నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించు కొంది వసంత. ఒకవైపు ఆమె గుండె వేగంగా కొట్టుకొంటుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ఏదో చెయ్యాలని పంతం పట్టింది ఆమె మనస్సు.
రెండు విధాలా నష్టం ఆడువారి కేనేమో? అందుకే వారిని అబలలు అన్నారు. మగవారి దౌర్జన్యాలకు లొంగి పోలేరు. వారిని ఎదిరించి అవమానాల పాలు కాలేరు. అఘాయిత్యానికి లోబడినా, లోబడక ఎదిరించినా , నలుగురి లో అనుమానాలు, నగుబాట్లు కాక తప్పదు. అనాదిగా సాగుతూ వస్తున్నా ఈ రకపు జీవితానికి విముక్తి ఎప్పుడు? బహుశా లేదేమో! రెండు వైపులా అతి పదునుగా ఉన్న కత్తి మీద సాము చేసే స్త్రీ జీవితం లో ఏ కొంచెం పొరపాటు జరిగినా అపాయాలకు గురి కావలసి వస్తుంది. తప్పదు. ఆ అపాయాలను ఎదురు కొన్ననాడే అంతిమ విజయం లభిస్తుంది. అంత ధైర్యం, ఆత్మ స్థైర్యం అందరికీ అలవడవు. అసలు అనర్ధాలు జరిగేందుకు అవకాశాన్నివ్వడమే ఒక పొరపాటు. ఆ అవకాశానికి లొంగి పోవడం మరొక పొరపాటు. లొంగినా సమాజాన్ని ఎదురించ లేకపోవడం అంతకన్నా పెద్ద పొరపాటు.
క్లాసు విద్యార్ధులంతా లేవడంతో పరధ్యానంగా ఉన్న వసంత గాభరాగా లేచి వచ్చిన లెక్చరర్ ను చూసి ఆశ్చర్యపోయింది. విద్యార్దులంతా క్రొత్త లెక్చరర్ గారిని చూసి తిరిగి కూర్చోవడం మరిచి పోయారు.
'సిట్ డౌన్" అన్నాడాయన.
కానీ ఎవ్వరూ కూర్చోలేదు.
ఇంకోసారి గట్టిగా అన్నారాయన ఆశ్చర్యపోతూ.
అందరూ నిర్లిప్తంగా కూర్చున్నారు.
భానుమూర్తి వస్తే ఎలా అని బాధపడుతున్న వసంత అతను రాకపోవడంతో చింతించింది.
"సార్, ఇది ఇంగ్లీషు పోయిట్రీ క్లాసు మీది కాదు." లేచాడు ఒక విద్యార్ధి.'
"ఆ విషయం నాకు తెలుసు. పోయిట్రీ కి కూడా నన్నే వేశారు."
"భానుమూర్తి గా రెందుకు రారో చెప్పగలరా?"
"ఆ విషయం ఆయన్నే అడిగి తెలుసు కుంటే మంచిది."
'అలాగే . మీరు బయటి కేళ్ళండి." అరిచిందొక కంఠం.
"షటప్!' గద్దించాడు ఆ ;లెక్చరర్.
"అంటే?' రెట్టించిందొక గొంతు.
ఆ విద్యార్ధి ని చూసినా ఏమనలేక పోయ్యాడాయన.
అయన పాఠం చెపుతుండగా ఎవ్వరూ సరిగ్గా వినలేక పోయారు. ఆసక్తి ఉన్న కొందరు విద్యార్ధులు అయన ఉపన్యాసం విని తమ ఆసక్తి చంపుకొన్నారు. ఆఖరి బెంచీ లోని వారు చిన్న కునుకు తియసాగారు. మరికొందరు డిటెక్టివ్ పుస్తకాలు చదువు కొంటుండగా, మరికొందరు బాతాఖానీ వేశారు. వసంత మెదడు ఆలోచనలతో వేడెక్కింది. కేవలం తనన్న మాట కోసం ఇందరిని అన్యాయం చేస్తాడా అనిపించి ఆశ్చర్య పోయింది. తనే అతని బదిలీ కారకు రాలని తెలిస్తే విద్యార్ధులు ఊరుకుంటారా?
"ఏయ్ మిస్టర్, బొత్ ఆఫ్ యు గెట్ అప్!" అరిచాడు లెక్చరర్ సహించలేక.
మూర్తి రావు ఇద్దరూ లేచి నిలబడ్డారు. వారిద్దరూ వసంత సౌందర్యం గురించి మాట్లాడు కుంటున్నారు.
"పాఠం చెప్పేటప్పుడు మాట్లాడకూడదని తెలియదూ?" కంఠంస్వరాన్ని హెచ్చిస్తూ అడిగాడు.
"ఇప్పుడు మీరు చెపుతున్నారు కాబట్టి ఇక మీదట తెలుసు కొంటాం" నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రావు.
ఆ మాటతో లెక్చరర్ కోపం తారస్థాయి నందుకుంది. కానీ ఏం చెయ్యగలడు పాపం? చేయగలిగిందల్లా క్లాసు నుండి తాను బయటికి వెళ్లి పోవడమే . కానీ అంత చేతకాని వాడు కాదు.
"యూ యూన్ లెస్ ఫెల్లోస్. సిట్ డౌన్ " అన్నాడు.
"సార్, మాటలు కాస్త మర్యాదగా రానిస్తే, ఉభయులకూ మంచిది." అందించాడు మూర్తి.
"వాట్! నన్నే ఎదిరిస్తారా? గెటవుట్! ఇంకెప్పుడూ నా క్లాసు లోకి రావద్దండి."
"థాంక్స్ సార్" అని వారిద్దరూ పుస్తకాలు చంకన పెట్టి బయటికి నడిచారు.
"ఇంకా ఎవరికైనా నా క్లాసు లో ఉండటం ఇష్టం లేకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు."
'ఇక్కడుంటే ఈ వాగుడు అడ్డంగా ఉంది. బయటి కెళ్ళి మన పనులు చూచుకుందాం పదరా" అని డిటెక్టివ్ లు చదివే వాళ్ళూ , బాతాఖానీ వేసేవాళ్లూ కాక, అయన లెక్చర్ తో విసుగెత్తిన మరికొందరు విద్యార్ధులూ లేచారు. వారిని చూసి నిద్రపోతున్న వారు గంట అయిందనుకొని వారిని అనుసరించారు. మిగిలిన కొందరు అది చూసి గట్టిగా నవ్వారు. ఆ దెబ్బతో ఆ లెక్చరర్ గారి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
ఆ సాయంకాలం విద్యార్ధులు కొందరు భానుమూర్తి దగ్గరికి వెళ్ళారు. కాలేజీ నుండి గదికి వెళ్ళడానికి సిద్దమవుతున్న భానుమూర్తి వారిని చూసి "ఏమిటి, అంతా కట్టకట్టుకొని వచ్చారు?' అన్నాడు చిరునవ్వుతో.
"సార్, మీరు మా క్లాసు తీసుకోక పోవడం కష్టంగా ఉంది."
"ఏం చెయ్య మంటావు, మిస్టర్ ప్రకాశం? నాకూ మీ క్లాసు తీసుకోవాలంటే కష్టంగా ఉంది."
"మాలో ఏం తప్పుందో చెప్పండి సార్, దిద్దుకుంటాం."
"మీలో ఏం తప్పు లేదు, మిస్టర్ భాస్కర్ , మొదటిసారిగా నేను మీ క్లాసు తీసుకోవడం నాదే తప్పు."
"సార్, మీరలాగంటె మేం చాల బాధపడవలసి వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత మాకు గట్టేక్కగలమనే ధైర్యం చిక్కింది. ఇందరికి అన్యాయం చెయ్యడం మీకు న్యాయం కాదు."
"మిస్టర్ గోపాల్, నన్ను బలవంతం చేయకండి. ఇక మీ క్లాసు తీసుకోలేను. అంతే" అని అక్కడి నుండి క్రిందికి వచ్చేశాడు, భాను మూర్తి.
"సార్" అన్న శబ్దం వినిపించి గతుక్కుమని వెను తిరగకుండా అక్కడే నిలబడ్డాడు.
"నామీద కోపంతో విద్యార్ధు లందరి నీ కష్టపెట్టడం భావ్యం కాదు."
"నా కేవరి పైనా కోపం లేదు, మిస్ వసంతా!"
"అయితే కోరి ఎందుకు మార్పు చేయించు కున్నారు?' అతని వెనుకగా కొద్ది దూరంలో నిలబడి ఉన్న వసంత బాధగా ప్రశ్నించింది.
"అది నా స్వవిషయం." తిరిగి చూడలేక అలాగే చెప్పాడు.
"మీరలా మొండిగా వాదిస్తే మేం ఏమీ అనలేము. కానీ వారి బాధను కాస్త గుర్తిస్తే మంచిది."
"వారి బాధనే గుర్తించావు. మరి నా హృదయం లో రగులుతున్న ఈ చిచ్చును రగిలిస్తూ ఇలాగే ఉండమంటావా? దాన్ని అర్పెదేవరు?"
వసంత జవాబు చెప్పలేక పోయింది.
"వసంతా! మానవులు చాల మటుకు స్వార్ధ పరులు. ఈనా బాధ నలాగే రగులనిచ్చి వారి బాధ తీర్చే శక్తి నాలో లేదు. అది నేర్చుకోలేదు. ఒకవేళ అలా చేసినా నేను నా హృదయాన్ని చంపుకొని పతనమై పోక తప్పదు. పిచ్చివాడుగా మారిపోతాను. నా గురించి ఏం ఫర్వాలేదు కానీ, మరొకరి జీవితం అనవసరంగా నవ్వులపాటు కావలసి వస్తుంది. క్షమించు . నేను నా ఉద్దేశ్యాన్ని మార్చు కోలేను" అని వెళ్ళిపోయాడు.
