Previous Page Next Page 
తప్పు పేజి 12

 

    'చూస్తూ చూస్తూ కిరస్తానీల పిల్లని చేసుకుని కులాచారాల్నీ మంట కలుపుకుంటారా? యిలా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి మగపిల్లలు పుడితే అంత బాధ వుండదు. ఎటొచ్చి ఆడపిల్ల పుడితేనే."
    'నేనేం చవటని కాను. నా బిడ్డ కడిగిన ముత్యంలా వున్నాడు. వాడిని వేలకి వేలు యిస్తామని యెంతో మంది అంటున్నారు. రాధిక కూతురు అయితే ఈడూ జూడూ సరిపోయి చూడ ముచ్చటగా వుంటుంది. ' అతని మాటలు ఆగిపోయాయి టక్కున. గోవింద కుర్చీ మీంచి స్పృహ తప్పి పడిపోయింది. అతను ఖంగారుగా లేచి వచ్చి భార్యని రెండు చేతులతోనూ యెత్తుకుని గదిలొకి తీసుకు వచ్చి మంచంమీద పడుకో బెట్టి వెంటనే డాక్టర్ కి ఫోన్ చేశాడు. అంతవరకూ నిబ్బరంగా వుపన్యాసాన్ని ధారాళం గా యిస్తున్న అతను భార్య స్పృహ తప్పి పడిపోగానే వెర్రి వాడిలా, కాలు కాలిన పిల్లిలా గదిలో పచార్లు చేస్తూ, మధ్య మధ్య గోవింద కి మెలుకువ వస్తుందేమో నని చూస్తూ, విసన కర్రతో జాగ్రత్తగా విసురుతూ , పిచ్చిగా గోవింద మూసినా కళ్లల్లో కి ఆశగా చూస్తూ డాక్టరు కోసం యెదురు చూడసాగాడు. పన్నెండు గంటలు దాటిపోయింది అప్పటికి.
    శ్రీకాంత్ వుమేష్ చెమటలు కక్కుతుండగా గృహన్ముఖులయారు. యింటికి యెదురుగా డాక్టర్ ఘోష్ కారు ఆగి వుండడంతో ఖంగారు పడిపోతూ మెట్లు యేక్కేసి వడివడిగా తల్లిని చేరుకున్నారు. తండ్రి ఆవిడ తల గట్టున కూర్చుని విచారంగా వున్నాడు. డాక్టర్ పరీక్ష చేసి 'మరేం ఫరావాలేదు. వీక్ నెస్ దీనికి కారణం. ఉద్రేక పూరితం అయిన మాటలంటే తరుచు యిలా పడిపోవడం సంభవిస్తుంది. కనుక జాగ్రత్తగా చూసు కొండి.' అనేసి యింజక్షన్ యిచ్చి మందు తీసుకునేందుకు డిస్పెన్సరీకి యెవరి నైనా పంపమని చెప్పి వెళ్ళిపోయాడు.
    గోవింద మరో గంట గడిచేక లేచి కూర్చుని పనిలో ప్రవేశించింది. చటర్జీ వారించినా వినలేదు. గతంలో అయితే గర్భస్రావం జరిగినప్పుడు అతను కాఫీ తయారు చేసి యిచ్చినప్పుడు సంతోషంగా అందుకున్నది. కానీ యిప్పుడు యెందుకో గోవింద కి అతనిచేత ఏదీ చేయించాలని లేదు.
    ఇల్లు ఈరోజు కొత్తగా వుంది. అన్న దమ్ములిద్దరికీ గోవింద గంబీర్యం తండ్రి మౌనం యిద్దర్నీ విచిత్రావస్థ లోకి తోసేసింది.
    ఆదివారం యెప్పటి మాదిరిగా గడవలేదు. సాయంత్రం ఆరు గంటలు కాగానే శ్రీకాంత్ వుమేష్ బయటికి అడుగులు వేశారు. హల్లో కుర్చుని వున్న చటర్జీ పుస్తకం చదవడం ఆపేసి 'యెక్కడికి వెడుతున్నారు?" అని అడిగాడు.
    శ్రీకాంత్ గాని, ఉమేష్ గానీ అబద్దాలు ఆడడానికి తాత్కాలికంగా నైనా అలవాటు పడలేదు!' నేను గుడికి వెళ్ళి అలా చెరువు గట్టు వైపు వెళ్లొస్తాను నాన్నగారు' అన్నాడు శ్రీకాంత్.
    చటర్జీ వుమేష్ వైపు చూశాడు.
    'అలా ఉపేంద్ర మావయ్య గారింటికి వెళ్ళి వస్తూ వస్తూ క్లాస్ మేట్ రాయ్ ని కలుసుకుని వస్తానండీ' అన్నాడు ఉమేష్.
    చటర్జీ స్వరం లో శాంతం ప్రవేశించింది. రాయ్ యింటి కి వెడితే నాకేం అభ్యంతరం లేదు.'
    'మరి' నసుగుతూ అర్ధం కానట్లు చూశాడు తండ్రి వైపు వుమేష్.
    'యివాల్టి నుంచీ ఉపేంద్ర యింటికి వెళ్ళడం నాకు మంచిదిగా తోచడం లేదు.'
    అన్నదమ్ములిద్దరూ డిల్లపోయారు కాస్సేపు. తరువాత తేరుకుని బజారు లో నడక సాగించారు.
    దార్లో చాలా దూరం యిద్దరూ మాట్లడుకో లేదు. ఉమేష్ చౌరస్తా దాటాక అన్నాడు. 'చిత్రంగా లేదన్నయ్యా. మావయ్య యింటికి యివాళ మనం క్రొత్తగా వేడుతున్నామా. చిన్నప్పట్నించి ఆ యింట్లో ప్రతి రోజూ హాజరు వేసుకుంటున్నాం . అదీ కాకుండా........'
    శ్రీకాంత్ ఆగి తలెత్తి తమ్ముడి మొహం లోకి చూశాడు. 'యివాళ కాక పోయినా రేపు ఆ యింటికి అల్లుడి గా చేసుకోవాలని నిన్ను మావయ్య అంటూనే వున్నాడు. వున్నట్లుండి ఎందుకిలా మారిపోయారు నాన్నగారు? తగాదా యేదైనా వచ్చింది యేమో.
    ఉమేష్ పెరిగి పెద్ద వాడయాక మనసులో ఆడపిల్ల మాదిరిగా లాలిత్యాన్ని పెంచుకుంటూ ఎదిగాడు. తండ్రి శాసనం అతన్ని కాళ్ళూ చేతులూ కట్టి పడేసి జైల్లో కూలేసినట్లుంది. అతను ముందుకు సాగలేక పోయాడు. మార్గ మధ్యలో ఆగిపోయి 'లైబ్రరీ వైపు వెడదాం అన్నయ్యా,' అన్నాడు. శ్రీకాంత్ తమ్ముడి వెనుకే అనుసరించాడు. ఇవాళ్టి రోజున ఉమేష్ ఆస్థవ్యస్తంగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేయదలుచుకున్నాడో, యేది చేస్తున్నాడో అతనికే అంతు చిక్కడం లేదు. కడుపులో  చిత్రమైన బాధ మెలికలు తిరుగుతూ అతన్ని రంపపు కోత కోస్తోంది.
    పెట్రోలు పోసిన తపన శరీరాన్ని అస్వాదీనం లో వుంచసాగింది. శరీర భాగం అంతా పక్ష వాతంతో కూల్చి వేయబడ్డట్లు అనిపిస్తోంది. లైబ్రరీ లో కూర్చున్నాడన్న మాటే గానీ అతను పుస్తకం లోకి దృష్టి ని పంపాడే గాని అక్షరాల్ని చదవలెకపోతున్నాడు. ఒకవేళ పెదాలూ, జిహ్వా కలిసి పదజాలాన్నీ వుచ్చరించగలిగినా మెదడు అసలు గ్రహించడం లేదు. ఉండి ఉండి వాచీ చూసుకుంటున్నాడు. అతను ప్రతి రోజూ యీవెల్టి కి వుపెంద్రుడి యింట్లో టీ త్రాగుతూ మనోమోహిని తోనూ, కృష్ణ మోహిని తోనూ పేకాట ఆడేవాడు. అటు వంటిది యివాళ అతని శరీరాన్ని మనసునీ ఒక్క ఆజ్ఞతో తండ్రి బందితుడిని చేశాడు. కుడిచేతిని జుట్టు లోకి పోనిచ్చి పిచ్చి వాడిలా పీక్కుంటున్నాడు.
    శ్రీకాంత్ క్రీగంట తమ్ముడి చర్యల్ని గమనిస్తూనే వున్నాడు. అతను లేచి బయలుదేరేందుకు సైగ చేశాడు. తప్పనిసరిగా అన్న వెనకే యింటి మొహం పట్టాడు వుమేష్. దారిలో తమ్ముడిని యేమాత్రం కదిలించినా ఆడపిల్ల కన్నా అధ్వాన్నంగా ఏడుస్తాడని శ్రీకాంత్ గ్రహించి మాట్లాడకుండా నడక సాగించాడు. అన్న పలకరిస్తే కొంత బాధని చెప్పుకో వచ్చని తమ్ముడు యెదురు చూసి ఆశా భంగం పొందాడు.
    ఇల్లు చేరుకునే సరికి తల్లీ తండ్రి ఏదో మాట్లాడు కుంటున్నారు. కొడుకు లిద్దరూ గుమ్మం లో అడుగు పెట్టగానే 'యెందాకా వెళ్ళారోయ్,' అని అడిగాడు చటర్జీ.
    'లైబ్రరీ కండి.' అన్నారు యిద్దరూ యేక కంఠంతో.
    'దట్స్ గుడ్ ,' అనేసి చటర్జీ గోవింద తో కబుర్ల లో మునిగి పోయాడు.
    ఉమేష్ కి యింట్లో ఏ వస్తువుని చూసినా చిరాకు గా వుంది. కాలికి అడ్డం వచ్చినా రాకపోయినా వస్తువు లన్నిటినీ చెల్లాచెదురు చేశాడు. మంచినీళ్ళు తాగేసి గ్లాసు ని తూము లోకి విసిరేశాడు. తల్లి లేచి వచ్చి ' టీ' యిస్తానంటే 'అక్కర్లేదు ', అన్నాడు కటువుగా.
    భోజనాల సమయంలో తండ్రికి యెదురు చెప్పే సాహసం లేనందు వల్ల గప్ చిప్ గా రెండు మెతుకులు తిన్నాననిపించుకుని పరిషం పట్టి లేచాడు. సోమేంద్ర నాద్ పిల్లలిద్దరికీ పదేళ్ళప్పుడే వుపనయనం చేశాడు.
    తల్లీ తండ్రి పడుకునే వరకూ పుస్తకం లో తలదూర్చి వుంచాడు. చటర్జీ కొడుకు దీక్ష గా చదువుతున్నందుకు చాలా సంతోష పడ్డాడు. తండ్రి గదిలో దీపం అరిపోగానే అన్న దగ్గరికి వచ్చాడు. అతనికి సాయంత్రం నుంచీ మనసు స్థిరంగా లేదు. తమ్ముడు రావడం గుర్తించి తలెత్తాడు శ్రీకాంత్. టేబిల్ దగ్గర కూర్చుని అతను ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నాడు.
    ఉమేష్ అన్న యెదురుగా కూర్చుని 'అన్నయ్యా ఒక్కసారి మావయ్య యింటి గుమ్మం వరకూ వెళ్ళి వస్తాననుకో, నాన్న గారికి తెలుస్తుందంటావా , అని అడిగాడు.
    పక్కలో బాంబు బ్రద్దలైనట్లు అదిరిపడ్డాడు శ్రీకాంత్. అతని చేతులు అప్రయత్నంగా గుండెల మీదికి వెళ్లాయి. చేతి గడియారం వైపు చూసి 'టైమెంతో తెలుసా?" అన్నాడు.
    ఉమేష్ తలతిప్పాడు తెలియదన్నట్లు. 'పది గంటలకి పది నిమిషాలు వుంది. యిప్పుడే కాదు వెలుతురూ వున్నప్పుడైనా మనం ఆ ఛాయలకి వెళ్ళినట్లు తెలుస్తే నాన్నగారు తోలు వోలిచేస్తారు.'
    ఉమేష్ మొహం లో నీలి నీడలు ఆక్రమించాయి. తమ్ముడి వైపు జాలిగా చూడడం తప్ప అన్న ఏదీ చేయలేక పోయాడు. ఉమేష్ బల్ల మీద చేతుల్ని వుంచి కుడి చేతి పిడికిలి బిగించి బల్ల మీద ఒక గుద్దు గుద్ది 'యేమైనా సరే నేను కృష్ణ ని పెళ్ళి చేసుకు తీరతాను. ' అన్నాడు దృడ నిశ్చయానికి వచ్చేసిన వాడిలా.
    శ్రీకాంత్ కి ఆశ్చర్యంగా వుంది. తమ్ముడు! పిరికి గా కనిపించే వుమేష్ మాట్లాడే మాటలేనా యివి? అతనికే నవ్వు వచ్చింది. పిల్లి సైతం నాలుగు గోడల మధ్య బంధిస్తే యెదురు తిరుగుతుంది. ఆ సామెత అతనికి జ్ఞాపకం రాగానే మరోసారి నవ్వుకుని తమ్ముడి భుజం మీద చేయి వేసి 'విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్' అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS