శ్రీశ్రీ
కె.వి. రమణారెడ్డి
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి !
అంచనా వేయాలనంటే అందరూ జేకొట్టినట్టే
అంచనా వేయాలనంటే అందలం ఎక్కించినట్టే
అంచనా వేయాలనంటే అంబరం కొలిపించినట్టే !
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి !
అంచనా వేయలే మతనిది చలచ్చంచల దీప్తలేఖని
దీప్తలేఖిని దివ్యలేఖని !
అశనిలోపలి మన మహాగ్నిని అవనిలోగిటి ద్రవమహార్చిని
అంచనా వేయలేమాతని అగ్నులొలికే వజ్రపాణిని !
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి !
రసము పౌరుష పాటవంబును లుప్తమైనను పద్యనాడుల
గద్య లోపలి గర్జ దూరిచి,
నడక హుందా నగిషి నేర్పరితనము పోయిన గద్యముక్కున
కవన గతమౌ కదము చేరిచి,
పద్య గద్యోద్వాహ వైభవ శుభారంభకు డాయె శ్రీశ్రీ!
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి ! ...
ఆచారంనుంచి ఆచార్యులనుంచి కులపతుల సభాపతుల నతకరించి
మందగమనం నుంచి గంధచందనాదులనుంచి
మందకుంజరాస్థిపంజరాల నదిలించి
ప్రేతాత్మల కిష్కింధల నతిక్రమించి గమించి
భీతాత్ముల గుత్తిజుత్తు అత్తరు మత్తుల నడంచి
వివాద విరోధాలు వివిధ వాగ్యుద్ధాలబద్ధాలనుంచి
మడుల మడుగుల మురికి మోసాలను బయల్పరచి తరించి
పండిత మహామహోపధ్యాయులు గుత్తకొన్న చెత్తనుంచి
గదుల చెదలు విదిల్చి మదులగదుల ద్వారబంధాలను తెరిపించి
కవిత్వపు సత్యాన్ని
విత్తాన్ని విత్తనాన్ని
కాపాడినవాడు
పాడి పాడించినవాడు శ్రీశ్రీ
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి !.
దూరాలు గమించి భారాలు వహించి
వరదలనూ బురదలనూ అధిక్రమించి
శీరినీ చక్రినీ పులినీ కొడవలినీ చేరి
సభాసంరంభాలుత్సవాలుత్సాహాలూ చీరి
కవిత్వపు సత్యాన్ని
విత్తాన్ని విత్తనాన్ని
కాపాడినవాడు
పాడి పాడించినవాడు శ్రీశ్రీ !
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి !.
దూరాలు గమించి భారాలు వహించి
వరదలనూ బురదలనూ అధిక్రమించి
శీరినీ చక్రినీ పులినీ కొడవలినీ చేరి
సభాసంరంభాలుత్సవాలుత్సాహాలూ చీరి
కవిత్వపు సత్యాన్ని
విత్తాన్ని విత్తనాన్ని
కాపాడినవాడు
పాడి పాడించినవాడు శ్రీశ్రీ !
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి !.
అంబరంలో కృష్ణపక్షికి నుపులో పోలికే ఇతనికి
మనిషి మనసున గదులుచూడడు మనిషినీ మనిషినీ ఎంచడు
మూకలను గానీ గ్రహించడు
సంజవలె సతమతం అయేజీవితాలకు ఉపకరించడు కారణం ?
ఆయనే సంధ్యావారివర్ణపుటపరఖండం
ఆయనే సందేహ సంశయ చలచ్చంచల మేఘశకలం !
పాడుతా శ్రీశ్రీ గురించి
మీటుతా వందన విపంచి !
పక్షిబాసలు పచ్చిఘోషలు అలల కలకల శిలల విల విల
గుండె దడ దడ కండ గడగడ -
చరాచరముల సకలజిహ్వల కొకే ఒక శ్రీశ్రీదె గొంతుక
గొంతుబాకా గుండె తప్పెట
మూగమనసుల నోటియాసట! ... పాడుతా ...
పాటలా శ్రీశ్రీవి ? కావవి, గాడ్పులో గర్జలో కాంతులో
మాటలా ఆయనవి? కావవి, బరిసెలో బాకులో తుపాకులో! ... పాడుతా ...
క్షణం నిలువడు నిలిచి గెలువడు
గెలిచినా వెనుదిరిగి చూడడు
గెలుపులన్నీ కూర్చి నూర్చడు
గమనమే శీలం, శ్రీశ్రీ
మాది భాగీరధి !
సిద్ధిఫల విజ్ఞా ఖండాలన్ని కూర్చుకు
పార్శవర్తుల మెదడు నింపక
పొంగి ముందుకు దొర్లిపోయే
సాగర తరంగం మనోరంగం
అరబి తురంగం మనోరంగం ! ... పాడుతా ...
ఏళ్ళు ఏభై నిండుకుంటే
నిండు కోనీ
అతడు ఆమని !
వుటలునూరే నింపుకొంటే
నింపు కోనీ
అతడు మణిఖని !
చెట్లు కొడితే చెట్లు పొదిగే
వనం అతని దివ్య కవనం !
జీవమే శీలం, శ్రీశ్రీ
అజరామరార్క శ్రీ !!
('శ్రీశ్రీ సన్మాన సంచిక, ఫిబ్రవరి, 1970)
