Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 103


    "మొగలాయి పరిపాలనలో మామిడి పళ్ళు పండించడానికి ధారణమైన కృషి జరిగింది. అందుకే ఆ పేర్లు స్థిరపడ్డాయి."
    
    "ఎన్ సైక్లోపీడియా అనేది ఏ భాషకి చెందిన పదం? ఆ భాషలో దాని అర్ధమేమిటి?"
    
    "ఇది గ్రీకు పదం దీని అర్ధం జ్ఞానచక్రం."
    
    "శిభి చక్రవర్తి మరో పేరు?"
    
    "ఉశీనరుడు."
    
    "ప్రస్తుతం సినిమాలలోగాని, రచనల్లోగాని హీరో అంటే అరడుగుల అందగాడు. పొట్టిగా, పీలగా కనిపించే వ్యక్తులు సైతం చరిత్రలో మహా యోధులుగా గుర్తింపుపొందారు. అలాంటి ముగ్గురు యోధుల వివరాలు చెప్పగలరా?"
    
    "నెపోలియన్ ఎత్తు అయిదడుగుల ఒకంగుళం, జూలియన్ సీజర్ ఎత్తు అయిదడుగుల రెండంగుళాలు, అలెగ్జాండర్ పొడవు అయిదడుగుల మూడు అంగుళాలు"
    
    "రైట్! కామన్ వెల్త్ అనే పదం తొలిసారి ఆంగ్ల సాహిత్యంలో ఉపయోగించింది ఎప్పుడు? కామన్ వెల్త్ దేశాల మధ్య మొదటి విషయం ఏమిటి?"
    
    అరక్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు ఆదిత్య "కామన్ వెల్త్ అనే మాట ఆంగ్ల సాహిత్యంలో షేక్స్ పియర్ రాసిన 'ది టెంపెస్ట్' అనే నాటకంలో మొదట కనిపించిందంటారు ఆ తరువాత వాస్తవిక జగత్తులో భవితవ్యం కోసం కృషి చేస్తున్న ఆలివర్ క్రాంవెల్ రాజు పెత్తనంలోని స్వతంత్ర రాజ్యంగా 'కామన్ వెల్త్' అనే పదాన్ని ఉపయోగించాడంటారు. ఇకపోతే కామన్ వెల్త్ దేశాలలోని మొదటి నియమం సభ్య దేశాలు ఒక దానిలో ఒకటి రాయబార్లని కాక, హై కమీషనర్లని నియమించుకోవడం."
    
    టైం చూసుకున్నాడు రోహిత్ మిగిలింది ఆరు నిముషాలు మాత్రమే.
    
    "మిస్టర్ సత్యేంద్ర! మగాళ్ళని చూసి భయపడటాన్ని ఏమంటారు?"
    
    "ఏండ్రోఫోబియా"
    
    "సూర్యుడు విశ్వానికి కేంద్రస్థానం తప్ప భూమికి కాదని తొలిసారి వాదించిన శాస్త్రజ్ఞుడెవరు?"
    
    "1543 లో కోపర్నికస్"
    
    "టెన్నిస్ లో మేన్స్ లాండ్ అంటే ఏమిటి?"
    
    "కోర్టుబేస్ లైన్ సర్వీస్, లైన్ మధ్యస్థానాన్ని నోమెన్స్ లాండ్ అంటారు."
    
    "నెల్పన్, డికోటెన్ చికెన్ వింగ్ అనే టెర్మ్సివాడే స్పోర్డ్ ఏది?"
    
    "రెజిలింగ్."
    
    ప్రబంధకి బోధపడిపోయింది. కేవలం ఆదిత్యని ఓడించడమే ధ్యేయంగా నిర్వహిస్తున్న పోటీ ఇది. సత్యేంద్రని రోహిత్ అడుగుతున్న ప్రశ్నలు ఆ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి.
    
    "మాల్గుడి డేస్ వంటి రచనతో అసాధారణమైన కీర్తి పొందిన ఆర్కే నారాయణ్ రాసిన రెండో నవల పబ్లిషర్స్ చేత ఆదిలో తిరస్కృతమైంది. ఆ నవలేది? ఎప్పుడలా జరిగింది?"
    
    హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించిపోయింది.
    
    "పాస్" అన్నాడు సత్యేంద్ర తెలియదన్నట్టుగా.
    
    ప్రబంధ అప్రతిభురాలైంది. ప్రశ్న గురించి కాదు ఆమె ఆలోచిస్తున్నది ఇంతసేపూ తనకున్న అనుమానం గురించి అంతా ముందే నిర్ణయించుకున్నదైతే సత్యేంద్ర ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడేం?
    
    ఒకవేళ తమ మధ్య అనుమానించే సయోధ్యలేదని నిరూపించుకోటానికి జరుగుతున్న ప్రయత్నమా?
    
    "మిస్టర్ ఆదిత్య!"
    
    రోహిత్ అడగడం ఇంకా పూర్తికానేలేదు. వెంటనే చెప్పాడు ఆదిత్య. "ఆ నవల పేరు ది బేచిలర్ ఆఫ్ ఆర్ట్, అలా తిరస్కృతమైంది 1937లో."
    
    అందరికన్నా ముందు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నది ప్రబంధ.
    
    చాలా పటిష్టమైన పోరాటం కొనసాగిస్తున్న ఆదిత్య శాశ్వతంగా తనవాడన్న ఆలోచన ఆమెను ఎంత ఆహ్లాదపరుస్తోంది అంటే, అతడి జవాబుల్ని కాదు అతడినే పరిశీలిస్తూ వుండిపోయింది.
    
    "నౌ ది లాస్ట్ బంచ్ టు మిస్టర్ ఆదిత్యా "వేగంగా మిగిలిన గడువులో ప్రశ్నల్ని అడిగాడు రోహిత్ "ప్రపంచ చరిత్రలో మొట్ట మొదటసారి విమానాన్ని హైజాక్ చేసింది ఎవరు? ఎప్పుడు?"
    
    "ఏభైయేడేళ్ళ క్రితం పెరూలో జరిగింది తొలిసారి అది నిర్వహించిన వాడు డాన్ కూపర్"
    
    "రైట్! శిలువ వేస్తున్న సమయంలో తన తల్లి మేరీని జాగ్రత్తగా చూసుకోమని జీసస్ చెప్పిందెవరికి?"
    
    "ప్రియ శిష్యుడు జాన్ కి."
    
    "ఫైన్" అభినందించాడు రోహిత్.
    
    "ఇటలీలోని 'లీనింగ్ టవరాఫ్ పిసా' ప్రాముఖ్యం ఏమిటి?"
    
    "ఇటలీ శాస్త్రజ్ఞుడు గెలీలియో మేథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేసింది పిసా యూనివర్శిటీలో రెండు వేర్వేరు బరువులు గల వస్తువుల్ని ఒకేసారి నేలకి విడిచినప్పుడు, ఎక్కువ బరువుగల వస్తువు ముందు నేలని తాకుతుందన్న అరిస్టాటిల్ థియరీ తప్పని నిరూపించాటానికి నూట ఎనభై అడుగుల ఎత్తున్న పిసీ లీనింగ్ టవర్ని ఎన్నుకున్నాడు గెలీలియో రెండు వేర్వేరు బరువులున్న వస్తువుల్ని అదే టవర్ పై నుంచి కిందకి వదిలి, రెండూ ఒకేసారి నేలను తాకుతాయన్న నిజాన్ని ప్రజలకి సోదాహరణంగా నిరూపించాడు."
    
    ఆడిటోరియం కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించిపోయింది.
    
    "స్త్రీ పెళ్ళి చేసుకోవడమంటే శీతాకాలంలో మంచుఊబిలో కూరుకోవడంలాంటిది. చేసేది ఒక్కసారే అయిన జీవితకాలం గుర్తుండిపోతుంది అన్న రష్యన్ రచయిత ఎవరు?"
    
    "మేక్సింగోర్కీ"
    
    "రైట్!"
    
    "ప్రపంచ ప్రసిద్ది చెందిన కోకాకోలాని తొలిసారి తయారు చేసిందెవరు?"
    
    "1916లో అమెరికాలోని జార్జియాకి చెందిన కెమిస్ట్ జాన్ ఎస్ పెంబర్టన్."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS