Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 102


    
    "నెపోలియన్"
    
    "నౌ ది టర్న్ గోస్ టు మిస్టర్ ఆదిత్య" ఆదిత్యని ఏకాగ్రంగా చూస్తూ అడిగాడు రోహిత్.
    
    "టర్కీ దేశంలో పెద్ద సిటీ ఇస్తాంబుల్ దాని మొదటి పేరేమిటి?"
    
    "కాన్ స్టాంట్ నోపిల్"
    
    "ఫ్రాన్స్ దేశానికీ పెర్ ఫ్యూమ్స్ ఎక్కువగా వాడటానికి కారణాన్ని వివరంగా చెప్పండి."
    
    ఒక వాక్యంతో పూర్తిచేసే జవాబు కాదు. సాలోచనగా అన్నాడు ఆదిత్య రీసెంట్ సర్వే ప్రకారం పారిస్ లోని జనాభాలో నలుగురికీ ఒక్కరే ప్రతిరోజూ స్నానం చేసేది అది అక్కడ అలవాటు కాబట్టే అక్కడ పెర్ ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతారంటారు.
    
    రెండు లిప్తల తర్వాత అన్నాడు రోహిత్ "రైట్ జపాన్ లో స్నానాల అలవాట్లగురించి చెప్పండి."
    
    మళ్ళీ అలాంటి ప్రశ్నే.
    
    "జపాన్ లో ఇప్పటికీ ప్రజలకి ప్రతిరోజూ స్నానం చేసే అలవాటు లేదు. సగటున వారానికి మూడుసార్లు స్నానం చేయటం అక్కడి సంప్రదాయం కాబట్టే అరవైశాతం ఇళ్ళల్లో బాత్రూమ్స్ వుండవు. ఆ మూడుసార్లు స్నానం చేసే అలవాటులో కూడా అక్కడి ప్రజలు ఎక్కువగా ఆధారపడేది పబ్లిక్ బాత్ పైనే అంటే, నామినల్ గా డబ్బులు తీసుకుని స్నానం చేయించటానికి జపాన్ అమ్మాయిలు సిద్దంగా ఉండే పబ్లిక్ బాత్ రూమ్స్ లో."
    
    "తాజ్ మహల్ నిర్మాణంలో ముఖ్య శిల్పి"
    
    "ఉస్తాద్ ఇషా."
    
    "రైట్!" అది అభినందనో, ఉక్రోషమో తెలియదు రెప్ప వాల్చకుండా ఆదిత్యనే చూస్తూ వుండిపోయాడు రోహిత్.
    
    "ఇప్పటికి గడిచిన సమయంలో పదిహేను నిమిషాలు మొదటి అరగంటలో ఇంకా పావుగంట మిగిలింది. "సో.... మిస్టర్ సత్యేంద్ర! ప్లెయిన్ వైట్ ప్లాగ్ ను ఉపయోగించే దేశం ఏది?"
    
    "వెస్ట్రన్ సహారా."
    
    "రైట్ ఆల్గోమీటర్ అనే సాధనాన్ని దేనికి ఉపయోగిస్తారు?"
    
    "నొప్పిని కొలవటానికి"
    
    "నెదర్లాండ్ కరెన్సీ నేమంటారు?"
    
    "ప్లోరిన్ లేక గిల్దర్"
    
    "ఒలింపిక్స్ లోని రెండు వందల మీటర్ల పరుగుపందాన్ని స్త్రీల కోసం ప్రారంభించిన సంవత్సరం ఏది?"
    
    "1948 లండన్ లో."
    
    "ఇంగ్లీషు భాషకి అరిజన్స్ గా భావించే రెండు భాష లేవి?"
    
    "గ్రీకు, లాటిన్."
    
    "రైట్" అభినందనాగా చూశాడు సత్యేంద్రని.
    
    ప్రేక్షకులలో ఉత్కంఠ అధికమౌతోంది. సత్యేంద్ర, ఆదిత్యలో ఎవరు నెగ్గేదీ తెలియనిస్థితి.
    
    "మిస్టర్ ఆదిత్యా! ప్రపంచంలోని ఓ నగరంలో ప్రజలకన్నా ఎలుకలే అధికంగా వున్నాయని గుర్తించారు. ఆ వివరాలు చెప్పండి."
    
    "స్పెయిన్ లోని బార్సిలోవా నగరంలో ప్రజల సంఖ్య పదిహేడు లక్షలైతే, ఎలుకల సంఖ్య పందొమ్మిది లక్షలు"
    
    "భారతదేశంలో తొలి సినిమా స్కోప్ సినిమా ఏది?"
    
    "కాగజ్ కే ఫూల్"
    
    "ప్రపంచపు ఏడు అద్భుతాలలో ఒకటైన బాబిలోన్ లోని హేంగింగ్ గార్డెన్ను ఎవరు, ఏ సందర్భంలో నిర్మించారు?"
    
    "క్రీస్తు పూర్వం 550కి ముందు బాబిలోన్ ని పాలించిన నెబుకద్నెజర్ భార్య మీద తనకు గల అనురాగానికి గుర్తుగా ఈ హేంగింగ్ గార్డెన్ నిర్మించారు"
    
    "నేను బ్రతికి దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నాను. నా అవస్థ మానవజాతి కంతటికీ పంచితే లోకంలో సంతోషించేవాడే వుండడు' అని స్నేహితుడితో మొరపెట్టుకున్న అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ఏ సందర్భంలో?"
    
    వెంటనే జవాబు చెప్పగలిగాడు ఆదిత్య "ఇరవైమూడు సంవత్సరాల దాంపత్య జీవితంలో ముక్కోపి అయిన భార్య తన మొహం పైన కాఫీని విసిరికొట్టి స్నేహితుల మధ్య అవమానించినా సహనంతో భరించగలిగిన ఆ ప్రెసిడెంట్ పేరు అబ్రహం లింకన్. అతడి భార్య మేరిహడ్"
    
    "ఒక ఓడ మునిగేటప్పుడు నౌకను చివరగా వదిలే వ్యక్తి ఎవరు?"
    
    "కాప్టన్."
    
    "రాంగ్..." ఠక్కున అనేసిన రోహిత్ సత్యేంద్రవైపు చూశాడు.
    
    "రేడియో ఆఫీసర్" జవాబు చెప్పాడు సత్యేంద్ర.
    
    ఆదిత్య అయిదు మార్కుల్ని కోల్పోవడమే గాక, సత్యేంద్రకి రెట్టింపు అంటే పది మార్కులు అధికంగా లభించాయి.
    
    "మిష్టర్ సత్యేంద్ర! జూడోని కనిపెట్టిన వ్యక్తి ఎవరు?"
    
    "జపాన్ కి చెందిన డాక్టర్ బిజారోకానా."
    
    "బాడ్మింటన్ కి ఆ పేరెలా వచ్చింది?"
    
    "ఇంగ్లండులోని గ్లౌసెస్టర్ షైర్ లో ఒక నగరం పేరు బాడ్ మింటన్. దాని పేరే ఆ క్రీడని స్థిరపరిచారు."
    
    "ఆంగ్ల రచయిత మార్క్ ట్వేన్ అసలు పేరు?"
    
    "శామ్యూల్ లాంగ్ హోమ్ క్లెమెన్స్"
    
    "మనం వాడే చెక్కకు 'టేక్' అనే పేరు ఎలా వచ్చింది?"
    
    "ఈ పదం మలయాళం నుంచి ఇంగ్లీషులోకి వెళ్ళి, ఆ భాషలోనూ స్థిరపడిపోయింది"
    
    "రష్యాలో ప్రచురించే వార్తాపత్రిక పార్టీ స్థాపకుడి పేరు?"
    
    "లెనిన్."
    
    "రైట్ మిస్టర్ సత్యేంద్రా!"
    
    వెంటనే ఆదిత్య వైపు చూసిన రోహిత్ అడిగాడు "మామిడి పళ్ళలో జహంగీర్, నూర్జహాన్ లాంటి పేర్లు ఏర్పడటానికి కారణం చెప్పగలరా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS