Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 101


    
    "సో....లెట్ మి స్టార్ట్ విత్ మిస్టర్ సత్యేంద్ర!"
    
    ప్రారంభం జరిగిపోయింది. ఒక ప్రేమకథ భవిష్యత్తుకి పోరాటం మొదలయింది.
    
    ఇసుక రేణువు రాలిపడితే వినిపించేటంత నిశ్శబ్దం.
    
    "సత్యేంద్రా! 1928ఓ ఒలింపిక్స్ లో మొదటిసారి ఒలింపిక్ ప్లేమ్ అందించారు ఓ సంప్రదాయంలా ఆ తర్వాత మనో పద్దతి ఆచరణలోకి వచ్చింది. అది ఒలింపిక్ టార్చ్ రిలే పద్దతిలో పరుగెత్తుకుంటూ తీసుకురావడం అది ఏ సంవత్సరంలో మొదలయింది?"
    
    "1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో" టక్కున చెప్పి అయిదు మార్కులు స్కోర్ చేశాడు సత్యేంద్ర.
        
    "గైనో ఫోబియా అంటే?" మళ్ళీ సత్యేంద్రనే అడిగాడు.
    
    "స్త్రీలను చూసి భయపడటం."
    
    "ప్రపంచంలో అత్యధిక సాంద్రతగల పట్టణం?"
    
    "మెక్సికో సిటి"
    
    అవాక్కై చూస్తున్నాడు సూరి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదిత్యకి అసలు అవకాశం రాదు.
    
    మొదటి అరగంట వ్యవధిలోనే సత్యేంద్ర గెలుపుక్కావలసిన స్కోర్ ని సొంతం చేసుకుంటాడు.
    
    అసలు నిబంధనల్ని వేదిక మీద కాదు, వేదిక పైకి వెళ్ళేముందు నిర్ణయించుకోవాల్సింది. ఇందరి ముందు రాద్దాంతం చేసుకోవడం సభ్యతగా అనిపించదు.
    
    ప్రణయ ఇప్పుడు ఇదే విషయాన్ని మాత్రమే కాదు, చాలా సింపుల్ గా రోహిత్ అడిగే ప్రశ్నల్లో ఆ ముఠా ఆడే ఫౌల్ గేమ్ గురించి ఆలోచిస్తోంది. లాభంలేదు, నిలదీయాలి.
    
    "ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది?"
    
    "చూనీస్."
    
    "రైట్. ప్రపంచంలో రెండో విశాలమయిన దేశం?"
    
    "కెనడా"
    
    "స్టాపిట్ మిస్టర్ రోహిత్" అరిచింది సూరికాదు.
    
    ప్రబంధ! రోషంగా నిలదీసింది... "ఇది ముందే చేసుకున్న ఏర్పాటు కాదు అని నేను అనుమానించకుండా ఉండాలీ అంటే, మరోసారి ఈ అరగంట నిబంధనని సడలించి ఆలోచించండి అదేపనిగా మీరు టెంత్ స్టాండర్డ్ ప్రశ్నల్ని అడుగుతూ పోతే సత్యేంద్ర అన్నిటికీ జవాబు చెపుతాడు"
    
    "మిస్ ప్రబంధా!"
    
    "లెట్ మి స్పీక్ మిస్టర్ రోహిత్! ఇలా అన్ని ప్రశ్నల్నీ మిస్టర్ సత్యేంద్రకే కేటాయించడం దారుణం. అదిత్యనీ అడగాలి."
    
    "చూడండి ప్రబంధా! సత్యేంద్ర చెప్పలేని ప్రశ్నకి ఆదిత్య జవాబు చెబితే అతడు రెట్టింపు మార్కులని స్కోర్ చేస్తాడు"
    
    "బట్ వన్... అలా ప్రేక్షకుల్ని మీరు మభ్యపెట్టారు. అసలు మీ వుద్దేశం ఆదిత్యకి అవకాశం దక్కకుండా చూడటం."
    
    "ప్రబంధా!" వాసుదేవరావు జోక్యం చేసుకోబోయాడు.
    
    "ఇది నా జీవితానికి సంబంధించింది డాడీ! ఇందులో మీరు జోక్యం చేసుకుంటే నేను అంగీకరించను."
    
    "అవును....అవును..." విధ్యార్ధులు గావుకేకలు పెట్టారు.
    
    "ఆదిత్యని కూడా అడగాలి."
    
    "ఇది అన్యాయం!"
    
    ఆడిటోరియం ప్రతిధ్వనించిపోతోంది.
    
    రోహిత్ ఏమనుకున్నాడో...."ఓకే! అయిదేసి ప్రశ్నల్ని ఒక్కొక్కర్నీ అడుగుతాను."
    
    "ఎస్!" అప్పుడు తలూపింది ప్రణయ. "అది న్యాయం ఈ అయిదు ప్రశ్నలూ అడిగేటప్పుడు ఏ వ్యక్తి అయినా జవాబు చెప్పలేకపోతే అదే ప్రశ్నని రెండో అభ్యర్ధిని అడిగి, చెప్పగలిగితే రెట్టింపు మార్కులివ్వాలి."
    
    "అవును!" వందల సంఖ్యలో విద్యార్ధులు సమర్ధించారు.
    
    "వెల్!" క్షణంపాటు అచేతనంగా నిలబడ్డ రోహిత్ ఆమోదించినట్టుగా చేతిని పైకెత్తి, మొదటి అయిదు ప్రశ్నలూ పూర్తి కావడంతో ఇప్పుడు ఆదిత్యకేసి చూశాడు, "మిస్టర్ ఆదిత్యా! గాలోమేనియా అంటే?"
    
    క్షణం తర్వాత అన్నాడు ఆదిత్య "ఫ్రెంచి దేశస్థుల అలవాట్లని, అలంకరణల్ని అనుకరించే వ్యామోహం"
    
    "రైట్ రోమన్ అంకెల్లో రాయడంసాధ్యం కాని అంకెఏది?"
    
    "జీరో."
    
    "తొలిసారి టూత్ బ్రష్ వాడిన దేశం ఏది? ఏ సంవత్సరం అది?"
    
    "1498లో చైనా దేశంలో మొదలైంది."
    
    "ఒక పిల్లిని చూసి ఎలుక నవ్వింది అంటే సమీపంలో కలుగుఉండదని అర్ధం. ఈ సామెత ఏ దేశానికి చెందినది?'
    
    "నైజీరియా."
    
    "రైట్! ఆంగ్ల భాషలో సుప్రసిద్దమైన వెబ్ స్టర్ అమెరికన్ డిక్షనరీ పూర్తిచేయటానికి నోవా వెబ్ స్టర్ కి ఎంతకాలం పట్టింది?"
    
    "పద్దెనిమిదేళ్ళు"
    
    "ఓకే!" తల తిప్పిన రోహిత్ సత్యేంద్రకేసి చూశాడు.
    
    ఆడిటోరియమంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది.
    
    "మిస్టర్ సత్యేంద్రా! సేఫ్టీ ఎలివేటర్ ని కనిపెట్టిందెవరు?"
    
    "ఎలీషా ఓటిస్."
    
    "మిస్టిసాఫ్ సీస్ అని పిలిచే దేశం ఏది?"
    
    "బ్రిటన్"
    
    "లాటిన్ అమెరికాలో ఆధిపత్యం గల భాష ఏది?"
    
    "స్ఫానిష్."
    
    "పుట్టగొడుగులకి ఆకుపచ్చ రంగు ఉండకపోవటానికి కారణం?"
    
    "అందులో క్లోర్ ఫిల్ లేకపోవడం."
    
    "ఎబిలిటీ ఈజ్ ఆఫ్ లిటిల్ అకౌంట్ వితౌట్ ఆపర్చ్యునిటీ' అని చెప్పిన గొప్ప వ్యక్తి ఎవరు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS