అక్కడ రాజు కోసం పగలంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన పద్మ నిరాశ తో "ఛీ, ఈరాజు బావ ఎప్పుడూ ఇంతే. వస్తానని గొప్పగా టెలిగ్రాములేమో ఇస్తాడు. చివరికి రానేరాడు. నన్ను ఏడిపించేలని తప్ప మరొక పని లేదేమో" అనుకొంటుంది కసితో. "అదేమిటే అన్నం తినకుండానే నిద్ర పోతావా ఏమిటి?" అన్న తల్లిని కోపంగా విదిలించి పారేసి నిండా దుప్పటి ముసుగు తన్ని పడుకొంది.
కమలమ్మ మరొకసారి నవ్వుకోంది లోలోపల.
7
పరీక్షలు దగ్గర పడ్డాయి. ఎక్కడెక్కడో దుమ్ము కొట్టుకుని మూలాన పడ్డ మందుల పుస్తకాలన్నీ దుమ్ము దులిపి చదువు కుపక్రమించాడు రాజు. ఆరోజు సాయంత్రం నుంచీ "సర్జికల్ అనాటమీ " ముందేసుకుని ఏకాగ్రత తో చదువు తున్నాడు. బయట ఆకాశమంతా మేఘామృతమై చలిగాలి వీస్తోంది. కొద్దిగా చినుకులు కూడా పడటం ప్రారంభించాయి. రాజు లేచి తల చుట్టూ మఫ్లర్లు చుట్టుకొని టేబులు లాంపు వేసుకొని మళ్ళీ చదువులో పడ్డాడు. వెనక గదిలో అప్పలరాజు వంట చేస్తూ తప్పేళాలతో సంగీతం పాడించేస్తున్నాడు. 'అబ్బబ్బ ఏమిట్రా ఆ గోల? ఎంతసేపటికి తప్పేళాలతో మోత తప్ప వంట మాత్రం తెమిలేట్టు లేదు. త్వరగా తగలేట్టు. నాకు ఆకలి మండి పోతుంది." అన్నాడు రాజు.
"పాపం బుల్లి పాపాయి కదూ. ఆకలేయ్య కేం చేస్తుంది? పాలసీసా నోటి కందివ్వనా?"
సుపరిచితమైన కంఠస్వరం విని తలెత్తి చూశాడు రాజు. వాకిట్లో వనజ నిలబడి వుంది. చలికి వణుకుతూ నవ్వుతోంది. బట్టలు తడిసి, వంటి కతుక్కొని పోయాయి. పల్చటి బ్లౌజు వున్నా లేనట్టే బ్రాసరీ కనిపిస్తోంది. రాజు హత బుద్దితో వనజ వంక చూడసాగాడు. ఈ సమయం గాని సమయంలో- అనుకోకుండా -- వనజ వంటి అతిధి రావటం అతనికి తక్కువ ఆశ్చర్యాన్నే మీ కలిగించలేదు. బయట జోరున వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులూ గాలి ప్రపంచ మంతా తల క్రిందులయ్యేట్టు ఉంది.
"యూనివర్శీటీ నుంచి వస్తున్నాను. ఈ ప్రాంతాని కిచ్చేప్పటికి గాలి ఎక్కువైంది. రిక్షావాడు ఒక్క అడుగు కూడా తోక్కలేక పోయాడు. సరే మన ఖర్మలె అనుకోని రోడ్డు మీద వాన లో లెప్ట్ రైటు కొట్టటం ప్రారంభించాను. ఇక్కడి కొచ్చేప్పటికి బయట మీ కారు కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకోని లోపల కొచ్చేశాను. వనజ అకాలమైన తన రాకకు కారణాన్ని వివరించింది.
రాజు తేరుకొని, నవ్వుతూ "మంచి పనే చేశావు. కాని నిన్ను నేను సంజాయిషీ అడుగలేదే-- ఈ ఉపోద్ఘాత మంతా ఎందుకు. ఈ ఇంట్లో నీకు ఎప్పుడూ సుస్వాగతమే" అన్నాడు.
"ఇంతకు ముందు మీ ముఖం చూస్తె అలా కనిపించ లేదు సుమా" అన్నది నవ్వుతూనే.
"నువ్వే ఏమిటి నా ముఖం చూసి ఎవరూ ఏమీ సరిగ్గా కనుక్కోలేరు. సరే లోపలకు పద. మా అక్కయ్య చీరలేవో రెండు మూడు ఉండాలి. ముందా బట్టలు మార్చుకుంటే తరువాత మాట్లాడుకొందాం.
మరో అరగంటకు వనజ బాత్ రూమ్ లోంచి వచ్చింది. మనోహరమైన పరిమళం గదంతా వ్యాపించింది. దీర్ఘమైన తల వెంట్రుకలు దువ్వుకోకుండా వదిలి వేసింది. కమలమ్మ గారి ధర్మవరం పట్టుచీర శరీరం మీద తేలిపోతోంది. జాకెట్టు వేసుకోలేదు కాబోలు, పమిట చెంగునే భుజాల చుట్టూ కప్పుకొని ఉన్నది.
రాజు కిటికీ తలుపు తెరిచి చెయ్యుబయటకు పెట్టాడు. ప్రచండమైన గాలి లోపలి కొచ్చి గదిలోని వస్తువులన్నీ అల్లకల్లోలమై పోయాయి. వర్షం విపరీతంగా కురుస్తోంది.
ఈ తుఫానులో కారు కూడా కదిలేట్టు లేదు. ఇది తగ్గేవరకూ నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చేట్టుంది. అక్కడ పంతులమ్మ గారు ఆదుర్దా పడుతుంటారేమో?" అన్నాడు రాజు కిటికీ తలుపులు బలంగా మూసివేస్తూ. గాలి హోరులో అతని మాటలు స్పష్టాస్పష్టంగా వనజ చెవుల బడ్డాయి.
"ఆదుర్దా పడటానికి అక్కయ్య ఊర్లో లేదు. ప్రకాశాన్ని తీసుకుని విజయనగరం వెళ్ళింది.
అప్పల్రాజు హార్లిక్స్ కలిపి తీసుకొచ్చాడు. వనజ గ్లాసు చేత బట్టుకుని వేడి వేడి పానీయాన్ని చప్పరిస్తూ సర్జికల్ అటానమీ పేజీలు తిరగవేస్తోంది. రాజు వెనక నుంచి ఆమె అందాన్ని చూస్తూ మేను మర్చి పోతున్నాడు. వనజ కొంచెం సేపటికి తలెత్తి "నేనూ ఒకప్పుడు మెడిసిన్ చదువు దామనుకున్నాను" అన్నది.
"ఇప్పుడు మాత్రం మేం? బి.యస్.సి అయ్యాక చాడువోచ్చుగా?"
వనజ నిట్టురుస్తూ చదవొచ్చు. కాని మా కుటుంబ పరిస్థితి మీకు తెలియదు . అక్కయ్య సంపాదన మా తిండికి, బట్టలకూ మాత్రమే సరిపోతుంది. వచ్చే సంవత్సరం ప్రకాశం కాలేజీలో చేరబోతున్నాడు. కనీసం వాడైనా బాగా చదివించగలిగితే అదే పదివేలు. నేను కూడా ఈ బి.యెస్.సి అయ్యాక ఏదైనా ఉద్యోగంలో చేరాలను కొంటున్నాను." అన్నది.
రాజు మాటాడలేదు. కాసేపటికి వనజే తలెత్తి "యేమిటి . రాక రాక మీ ఇంటికి అతిధి గా వస్తే మీ ఇల్లంతా చూపించారా ఏం?" ఇదేం అతిధి మర్యాదండీ?" అన్నది.
రాజు నవ్వి అతిధులు వేరు, ఆత్మీయులు వేరు ఆత్మీయులకు ఒకరు చూపించాల్సిన పనేముంది?' అన్నాడు.
వనజ లేచి లోపలి కెళ్ళింది. ఇల్లు చూసి వస్తానంటూ. రాజు హృదయమెందుకో ఉద్వేగంతో దడదడ లాడసాగింది. ఊరికే విచలికుడోతున్నాడు. చీకటి రాత్రి వర్షం. ఈదురు గాలి అనుకోకుండా వనజ ప్రత్యక్షం కావటం అతని మనస్సు అపూర్వమైన అనుభూతులనేవో కాంక్షిస్తుంది. ఉత్కంటతో ఊగిస లాడసాగింది' నిస్సంకోచంగా ఇల్లంతా తిరిగి వచ్చిన వనజ "అదేమిటి, మీరు అలా ఐపోయారెమిటి?" అన్నది.
తనలోని ఆకస్మిక పరివర్తన వనజ కనిపెట్టి నందుకు లజ్జితుడోతూ "ఆహా, ఏమీ లేదే!" అన్నాడు.
అప్పల్రాజు వచ్చి భోజనానికి పిల్చాడు హటాత్తుగా అతిధి వస్తాడని కల కన్నాడో ఏమో చాలా పదార్దాలే తయారు చేశాడు. "ఇవన్నీ నేను తినగలనా?" అన్నది వనజ వడ్డించిన పదార్ధాల వంక చూస్త్గూ.
"ఫర్వాలేదు. మీ ఇంట్లో నా చేత ఎన్నిసార్లు తినిపించలేదు. వానదేవుడి పుణ్యమా అంటూ నా అతిధి ఋణం ఈ వేళన్నా కొద్దిగా తీర్చు కొంటాను."
వనజ అతి సున్నితంగా ముని వేళ్ళతో అన్నాన్ని కలుపుకొంటూ "మీరున్నది ఒక్కరే కదా , ఇంత పెద్ద ఇల్లూ ఈ వంట వాడూ, ఈ ఏర్పాట్లన్నీ అనవసరం కదూ? మీరు తినే నాలుగు మెతుకులూ ఏ హోటల్లో తింటే పోదు?" అన్నది.
నిజమే. నేనూ ఒక్కొప్పూడు అలాగే అనుకుంటూ ఉంటాను. కాని మా నాన్నగారు అలా అనుకోరు. ఇది మా స్వంత ఇల్లు అయన సంవత్సారానికి రెండు మూడు సార్లు ఓ నాలుగయిదు రోజుల పాటు మాత్రమే ఇక్కడుంటారు. అందుకోసం ఈ టేలిఫోనూ, వంటవాడూ , ఈ అట్టహాసమంతా ఇలా ఉండవలసిందే."
"ఆ ఫోటోలో ఉన్నవారే కదూ మీ నాన్నగారు! వారిని నేనొకసారి చూశాను. మా కాలేజీ లో బహుమతులు పంచి పెట్టారు. అప్పుడు చాలా నిరాడంబరంగా కనిపించారు."
రాజుకు వాళ్ళ నాన్నగారంటే అపరిమితమైన భక్తీ గౌరవాలున్నాయి. అందుచేత ఉత్సాహంగా చెప్పసాగాడు. ఆయనెప్పుడూ నిరాడంబర జీవే. ...నిజంగా ఆయనిక్కడున్నప్పుడు చూస్తె ఈ ఏర్పాట్ల లో ఏదీ ఆడంబరంమని గాని, అనవసరమని గాని అనిపించదు ఉద్యోగస్తులు, నాయకులూ, మంత్రులూ -- ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి పోతూనే ఉంటారు. ఆ టెలిఫోను విశ్రాంతి అన్న మాటే లేకుండా ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. ఆ నాలుగు రోజులూ ప్రశాంత కోసం నేను ఏ ఫ్రెండు రూంలోనో తలదాచు కొంటాను."
అప్పల్రాజు అతిధి మర్యాదలో లోపమేమీ రానివ్వాటం లేదు. ప్రతి పదార్ధం పేరు పేరునా బలవంతంగా వద్దిస్తున్నాడు. "వంట చాలా బాగుంది అప్పలరాజు. మళ్ళీ మళ్ళీ తినాలని పిస్తుంది." అన్నది విమల.
అప్పల్రాజు ఆ పొగడ్త లకు లొంగిపోయాడు అలాగే రండమ్మ . రోజూ రండి. మా బాబుగారికి మీరోక్కరు బరువోతారా ఏమిటి?" అన్నాడు.
"ఫర్వాలేదే! యజమానికి తగిన నౌకరే దొరికాడు." అన్నది వనజ నవ్వుతూ.
పరోహోసోక్టులతో భోజనం ముగిసింది.
(1).jpg)
"నీకు పరీక్షలనుకొంటాను. నేను వచ్చి మీ చదువు పాడు చేయటం లేదు కదా?"
"ఆ, ఒక్కరోజు చదువు లేకపోతె ఏమీ మునిగి పోదులే. సరదాగా కబుర్లు చెప్పుకుందాం."
కబుర్ల తో చాలా రాత్రి గడిచిపోయింది. వనజ రెండు మూడు సార్లు కిటికీ తలుపులు తీసి చూసింది. వర్షం కాని గాలి ఉదృతం గాని ఏమీ తగ్గలేదు. బంగాళాఖాతం అల్లకల్లోలమై పోతోంది. "ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చేట్టుంది. యేమీ ఖర్మరా భగవంతుడా" అన్నది వినపడీ వినపడనట్లు.
"ఇప్పుడెలా వెళ్తావ్, హాయిగా నా గదిలో పడుకొని నిద్రపో. నేను ఈ గదిలో మంచం వేసుకుని పడుకుంటాను" అన్నాడు రాజు.
"ఔను నాకు నిద్రవస్తోంది." అన్నది వనజ బద్దకంగా వచ్చే అవులింతను అపుకొంటూ.
"అప్పల్రాజు ని తోడూ పడుకోమని చెప్పనా."
వనజ నవ్వింది "ఎందుకు? మీ మీద నాకు విశ్వాసం లేకపోతేగా? గుడ్ నైట్ అంటూ పడక గదిలో కెళ్ళి తలుపు మూసివేసింది. మరో రెండు నిముషాల్లో ఆ గదిలో లైటు ఆరిపోయింది.
ఉద్విగ్నుడైన రాజు హటాత్తుగా చల్లాబడి పోయాడు. ఏ అనుభూతిని ఆశిస్తూ అనిశ్చిత పరిస్థితి లో- తహతహ లాడిపోయాడో ఆ మార్గానికి కూడా గడియ పడిపోయింది. నిరుద్వేషమైన మనస్సుతో పడక ఏర్పాటు చేసుకునినిద్ర కుపక్రమించాడు. కాని నిద్ర రాలేదు. వనజ సుందర మైన రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది. నున్నటి మెడ వంపులూ, విశాలమైన మెత్తని చెక్కిళ్ళు మత్తుగా, బరువుగా వాలిపోయే కనురెప్పలూ విమ్నోన్నతాలను ప్రస్ప్రుటం చేసే మెత్తని సిల్కు చీరెలో పరిపిష్టి చెందిన అవయవాల సోంపూ , స్త్రీ స్పర్శ నెరుగని అతనికి ఉద్రేకం కలిగించసాగాయి. ఆడదీ, అదృష్టమూ రెండూ ఒకటే నంటారు. నిజమే ననిపించింది. అందీ అందకుండా తప్పించుకు పోతాయి రెండూ. రాజు అలోచల్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించ సాగాడు. లైటు హౌస్ కాంతి క్రమం తప్పకుండా గాజు కిటికీ మీద పడి మాయమౌతుంది. బయట తుఫాను ప్రళయ గర్జనలు ఎక్కువయ్యాయి. నిద్ర పట్టకపోతే ఒంట్లు లెక్కపెట్టుకోమని ఎవరో చెప్పారు. రాజు ఒంట్లు లెక్క పెడుతూ నిద్రా దేవిని కౌగలించుకోవాలని ప్రయత్నించ సాగాడు.... ఒకటి....రెండు....మూడు....నాలుగు..... పదీ......వందా.......ఎనిమిదోందల డెబ్బై ఆరు.......గాజుల మోత ...వనజ కూడా ఇంకా నిద్ర పోనట్లుంది..... ఆరొందల పది.... ఛఛ లెక్క తప్పిపోయింది. నిద్రాదేవి అందినట్లే అంది మాయమైపోతోంది. మెత్తటి దిండు తోడ కింద పెట్టుకొని "యస్' మార్కుల కాళ్ళు, ముడుచుకున్నాడు. ఎంతసేపు గడిచిందో.... మగత నిద్రలో అతని శరీరమేదో కొత్త స్పర్శాను భూతికి లోనైంది. ఎవరో తన పక్కన కూర్చున్నట్టు అనిపించింది. మధురమైన సువాసన-- మృదువైన అవయవాల స్పర్శా-- సిల్కు చీరే .. రాజు తమకం తో కప్పుకొన్న రగ్గు తొలగించాడు. వనజ పసి పిల్లలా ఉన్ని రగ్గు లోకి వచ్చేసింది. రాజుకు నిద్ర మత్తు వదిలి పోయింది. వనజ కాలిపోతున్న అతని ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఎడ తెరిపి లేకుండా ముద్దు పెట్టుకో సాగింది.
