Previous Page Next Page 
మారణహోమం పేజి 97

 

    కనబడితే కాల్చేయ్యమని చెప్పాడు.
    షూట్ అట్ సైట్! వెయ్యిమంది మనుషులు సర్వసన్నద్ధంగా తాయారు. వేల కళ్ళతో నిఖిల్ కోసం వెదకడం మొదలెట్టారు.
    నిఖిల్ రాదా ఉన్న పడవ కాసేపు అటూ , కాసేపు ఇటూ ఒరిగి పోతోంది.
    "ఇది ఎంతోసేపు నిలవదు" అంది రాధ నిశ్చయంగా.
    నిఖిల్ జవాబు చెప్పెలోగానే ఆమె అన్నంతా జరిగింది.
    తనచుట్టూ తానూ ఒక్కసారి గిర్రున బొంగరంలా తిరిగి తర్వాత చివికిపోయిన కాగితపు పడవలా ముక్కలు ముక్కలుగా విడిపోయింది పడవ. నీళ్ళలో పడ్డారు నిఖిల్, రాదా.
    నీళ్ళలో పడీ పడడటంతోనే రెండు పెద్దకొయ్య ముక్కలను చేజిక్కించుకున్నాడు నిఖిల్. రాధ వైపు ఒక కొయ్యని తోశాడు.
    "ఫర్వాలేదు రాదా! ఒడ్డు చేరుతున్నాం! కాసేపు భరించు! పట్టు వదలకు!" అన్నాడు పెద్దగా.
    కోయ్యని గట్టిగా పట్టేసుకుంది రాధ. ఆ కొయ్యని పట్టుకు తేలుతూ, ఇంకో అయిదు నిమిషాల తర్వాత ఒడ్డు చేరారు ఇద్దరూ.
    ఒడ్డు చేరీ చేరగానే ఆయాసంతో ఇసుకలో వెలికిల్లా పడుకున్దిపోయారు. రాధకి అయితే ఉపిరితిత్తులు చిరిగిపోయి శ్వాసనాళానికి అడ్డం పడుతున్నంత ఆయాసంగా ఉంది. "ఇండియా చేరుకున్నాం!" అన్నాడు నిఖిల్ రోప్పుతగ్గాక.
    నీరసంగా తల ఊపింది రాధ. నదీ తీరం నుంచి ఒక వంద గజాల దూరంలో వృక్షాలు కనబడుతున్నాయి.
    "లే రాదా! ఇలా ఓపెన్ స్పేస్ లో ఉంటే మనని ఎవరైనా చూస్తారు. డేంజరు!" అన్నాడు నిఖిల్.
    చాలా కష్టం మీద లేచి నిలుచుంది రాధ. సోలిపోయినట్లు అతనిమీద వాలిపోయి నడవడం మొదలెట్టింది.
    "ఒక దేశం బార్డరు దాటి ఇంకో దేశానికి వచ్చెయ్యడం ఇంత సులభమా?" అంది నిఖిల్ చెవిదగ్గర నోరుపెట్టి మాట్లాడుతూ.
    మనది చాలా పెద్ద బోర్డరు కదా! ఈ చివరనుంచి ఆ చివరి దాకా గస్తీ కాస్తూ ఉండడం చాలా కష్టం.
    అందుకే బంగ్లాదేశ్ నుంచి అంతమంది కాందిశీకులు ఇండియాకి తరలి వచ్చెయ్యగలుగుతున్నారు. బార్డరు పొడుగునా బార్బాడ్ వైరుతో కంచే వెయ్యాలని ప్రపోసల్ కూడా ఉంది. కానీ అది ఎంతవరకూ సంభవమో తెలియదు" అన్నాడు నిఖిల్.
    ఊ కోడుతూ అతని మాటలు వింటూ అతని మీదే వాలిపోయి నడుస్తున్న రాధ మరింత దగ్గరగా జరిగింది. ఆమె ఊపిరి వెచ్చగా తాకుతోంది అతని చెంపలకి.
    "నిఖిల్! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ నిఖిల్!" అంది కలవరిసున్నట్లు.
    చెవికి అంత దగ్గరగా చెప్పినా ఆ అమ్మాయి మాటలు అతనికి వినబడలేదు.  
    కనీ చాలా దూరం నుంచి వస్తున్న ఒక శబ్దం మాత్రం అతనికి సుస్పష్టంగా వినబడింది.
    మోటారు రోద!
    సన్నగా గాలిలో తేలుతూ వస్తోంది ఆ శబ్దం.
    చెవులు రిక్కించి వింటున్నాడు నిఖిల్.
    క్రమంగా శబ్దం దగ్గరయింది. ఉన్నట్లుండి చెట్ల వెనుక కనబడింది ఆలివ్ కలర్ మిలటరీ వ్యాను. దానిమీద ఎర్రటి క్రాస్ పెయింట్ చేసి ఉంది.
    ఆర్మీలో మెడికల్ వింగ్ తాలూకు వ్యాను అయి వుండాలి అది.
    తీవ్రంగా ఆలోచిస్తున్నాడు నిఖిల్. తను సింగపూర్ నుంచి తప్పించుకు బయట పడ్డాదన్న సంగతి ఈపాటికి వీళ్ళకి తెలిసిపోయి ఉంటుందా? తెలిసిపోయినా ఆశ్చర్యం లేదు. తరుణ్ సామాన్యుడు కాదు. అతన్ని తక్కువగా అంచనా వెయ్యడానికి వీలులేదు.
    మిలిటరీ అంబులెన్సు వాళ్ళకి అతి సమీపంలో ఆగింది.
    ఊపిరి బిగపట్టి చూస్తున్నారు చెట్ల చాటున ఉన్న నిఖిల్ , రాదా.
    ఖాళీగా ఉంది ఆ అంబులెన్స్. డ్రైవర్ మాత్రమే ఉన్నాడు దానిలో. అతను కిందికి దిగి ఒక చెట్టు దగ్గరికి నడిచి అక్కడ నిలబడ్డాడు. సవ్వడి చెయ్యకుండా అతన్ని సమీపించాడు నిఖిల్.
    ఒక నిమిషం తర్వాత ఆ సోల్జరు ప్యాంటు గుండీలు పెట్టుకుంటూ వెనక్కి తిరిగాడు. వెంటనే అతని మోహంలో ఆశ్చర్యం కనబడింది. మరుక్షణంలో అతన్ని తన ఉక్కు కౌగిట్లో బిగించేశాడు నిఖిల్. అతని మెడ  మీద ఒక నరాన్ని గట్టిగా నొక్కాడు.
    సోల్జరు గొంతులోంచి శబ్దం వెలువడింది. తర్వాత అచేతనంగా నిఖిల్ చేతులలో నుంచి జారి కింద పడిపోయాడు అతను.
    అతని యూనిఫాం విప్పి తను తొడుక్కున్నాడు నిఖిల్. ఆ సోల్జరు చాలా భారీమనిషి. చాలా పొడుగరి అయిన నిఖిల్ కి కూడా ఆ యూనిఫాం రెండు సైజులు పెద్దదయింది.
    కొంచెం శ్రమతో సోల్జరుని మోసుకెళ్ళి గుబురుగా ఉన్న ఒక పొదలో పడుకోబెట్టి అంబులెన్స్ దగ్గరకు వచ్చాడు నిఖిల్.
    శుభ్రంగా ఉతికి మడతలు పెట్టిన తెల్లటి దుప్పట్లు దొంతరగా పెట్టి ఉన్నాయి అంబులెన్సులో.
    "ఒక దుప్పటి నడుముకి చుట్టుకో!" అన్నాడు నిఖిల్ రాధతో.
    ప్రశ్నార్ధకంగా చూస్తూ దుప్పటిని నడుముచుట్టూ చుట్టుకుంది రాధ.
    " ఈ బెర్తు మీద పడుకో!"
    మారు మాట్లాడకుండా పడుకుంది రాధ. ఆమె మీద మరొక దుప్పటి కప్పాడు నిఖిల్.
    పొట్ట ఎత్తుగా కనబడుతూ గర్భిణీ స్త్రీ లా ఉంది రాధ. ఆక్సిజన్ టెంట్ తాలూకు రబ్బరు ట్యూబులు రెండు ఆమె ముక్కుకు దగ్గరగా పెట్టాడు నిఖిల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS