Previous Page Next Page 
మారణహోమం పేజి 93

 

    ఫ్లాష్ గన్ ఎడమచేత్తో పట్టుకుని కుడిచేత్తో కెమెరా ట్రిగ్గర్ నొక్కడం మొదలెట్టాడు ఆ ఫోటో గ్రాఫర్.
    కర్తవ్య విమూఢుయినట్లు చూస్తూ నిలబడిపోయారు నిఖిల్ ,రాదా రింగడూ.
    రింగడు బుర్ర త్వరత్వరగా అలోచించేస్తోంది. ఆ అబ్బాయినీ, అమ్మాయినీ బందించినట్లు ఈ ఫోటోగ్రాఫర్ ని కూడా లోపల బంధించి వెయ్యవచ్చు. కానీ ఇతను ప్రెస్ తాలూకు మనిషి. పొద్దుపోయేసరికి ఇతను కనబడకపోతే గొడవ మొదలయిపోతుంది.
    బెలూన్ చుట్టూ తిరుగుతూ చకచక స్నాప్స్ తీసేస్తున్నాడు ఫోటోగ్రాఫర్. రకరకాల యాంగిల్స్ లో ఫోటో గ్రాప్ అయిపోతున్నారు నిఖిల్, రాదా. రేపు వాళ్ళిద్దరి ఫోటోలు సింగపూర్ ప్రతికలన్నిటిలో పడిపోతాయి. రేపు కాకపోతే ఎల్లుండికి వాళ్ళిద్దరూ పట్టుబడిపోవడం ఖాయం.
    "మీరు ఆ అమ్మాయి భుజమ్మీద చెయ్యి వెయ్యండి! ఆ అదీ!" అంటున్న ఫోటోగ్రాఫరు కాలికి కాలు అడ్డం పెట్టాడు రింగడు.
    ధభేలుమని కిందపడ్డాడు ఫోటోగ్రాఫరు. దిమ్మదిరిగిపోయింది అతనికి. కొద్దిక్షణాల పాటు నేలమీద పడుకుని ఉండిపోయాడు. ఆ కొద్ది సేపట్లో అతని కెమెరాను అందుకుని ఓపెన్ చేసి ఫిల్ముని ఎక్స్ పోజ్ చేశాడు రింగడు. చూసుకోకుండా తొక్కినట్లు ఫ్లాష్ గన్ ని బూటు కాలుతో తొక్కి నుసినుసి చేసేశాడు.
    "యూ డెవిల్!" అన్నాడు ఫోటో గ్రాఫరు నిలుచున్నా తర్వాత మండిపడుతూ "అంతా సర్వనాశనం చేసేశావే!"
    భయంగా బిక్కుబిక్కుమంటూ చూశాడు రింగడు "సారీ సర్! ఎక్స్ ట్రీమ్ లీ సారీ! ఐయామ్ టేర్రిబ్లీ సారీ సర్!"
    "అపు దండకం! అరె! అరె! వెళ్ళిపోతున్నారు వాళ్ళు!" అన్నాడు ఫోతోగ్రాఫరు.
    బెలూన్ మెల్లగా పైకి లేవడం మొదలు పెట్టింది.
    స్నేహపూర్వకంగా వీడ్కోలు సూచకంగా చేతులు ఊపుతున్నారు నిఖిల్, రాదా.
    రింగడు కూడా ఆర్ద్రంగా చెయ్యి ఊపాడు.
    రింగడిని మరి నాలుగు బండబూతులు తిట్టి, తన ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఫోటోగ్రాఫరు. టైపురైటర్ ముందు కుర్చుని ఒక పేపరు మీద గబగబా టైపు చేశాడు.
    "బెలూన్ లో అడ్వెంచర్ చేయ తలపెట్టిన ఒక యువజంట , కొన్ని అనివార్య కారణాలవలన షెడ్యూలు సమయానికి కొద్దిగంటలముందే సింగపూర్ నుంచి ఇండియాకి బయలుదేరింది. లెటజ్ విష్ దేమ్ లాక్ అండ్ బాన్ వాయొజ్! వాళ్ళను గురించిన వివరాలు రెండోపేజీలో చూడవచ్చు."
    కాగితాల్ని సర్రున టైపు రైటరులోంచి బయటకులాగి తన ఫైల్లో ఉన్న మరో కాగితాన్ని దానికి పిన్ చేశాడు. ఆ రెండో కాగితంలో ఆటను ముందే సేకరించిన వివరాలు అన్నీ టైపు చేసి ఉన్నాయి.
    తర్వాత ఆ రెండు కాగితాలనీ న్యూస్ ఏజెన్సీ కి అందజేశాడు అతను.
    ఆ వార్తని ప్రింటు చెయ్యడం మొదలెట్టాయి పేపర్లు అన్నీ.
    సింగపూర్ ప్రభుత్వం రోడ్లూ, రైళ్ళు, విమానాలు, షిప్పులూ, అన్నిటినీ కనిపెట్టి ఉన్నా, ఎవరికీ ఏ అనుమానం రాకుండా సింగపూర్ లో నుంచి బయటపడ్డారు నిఖిల్, రాదా.
    ఇంక ఇండియా చేరాలి!

 

                                                        * * *

    ఫోన్ దగ్గరే అసహనంగా కాచుకుని కుర్చుని ఉన్నాడు తరుణ్. అతని ప్రక్కన ఉన్న యాష్ ట్రే అంతా సిగరెట్ పీకలతో నిండి ఉంది.
    చాలాసేపటి తర్వాత ఫోన్ రింగయింది.
    "హల్లో!"
    "నిఖిల్ ఆచూకీ దొరికింది" అన్నాడు లైన్లో అవతల ఉన్న వ్యక్తీ క్లుప్తంగా.
    "చెప్పు."
    "మీరు ఉహించింది కరక్టే! అతను రింగడితో కలిసి ఉంటున్నాడు!"
    "బాస్టర్డ్ ని చంపకండి! కాచ్హిమ్ అలైవ్! పట్టుకోగానే కబురంపు. నేను వాడిని ఇండియాకు తెప్పించే ఏర్పాటు చేస్తాను. వాడిని పర్సనల్ గా టాకిల్ చెయ్యాలి. నేను."
    "ఎస్ సర్!"
    "ఎనీథింక్ మోర్?"
    "ఎస్సర్! అతనితోబాటు ఒక ఇండియన్ గర్ల్ కూడా ఉంది"
    "ఎవరు"
    "రాధట"
    తన చేతిలో ఉన్న సిగరెట్ తో తనకే ఒక్క చురక పెట్టుకోవాలనిపించింది తరుణ్ కి. చనిపోయే ముందు రాజు చెప్పింది ఏమిటో అతనికి ఒక్కసారిగా అర్ధమయింది.
    నిఖిల్ సింగపూర్ వెళ్ళాడు బాధతో!
    అది బాధ కాదు, రాధతో అన్నమాట!
    "సరే! రాదని కూడా నిఖిల్ తోబాటే ఉంచండి."
    "ఎస్సర్!" అన్నాడు సింగపూర్ లో ఉన్న ఏజెంటు.
    
                                                            * * *


    ఇంటికి వచ్చి తలుపు ముందు ఆగి సిగరెట్ అంటించుకొని గాడంగా పొగ పీల్చాడు రింగడు. అతనికి తృప్తిగా ఉంది. ఒక మంచి ఫ్రెండుకి తనకి చేతనయినంత సాయం చేశాడు. అది చాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS