Previous Page Next Page 
మారణహోమం పేజి 92

 

    వేర్ దేరీజ్ ఏ విల్, దేర్ ఈజ్ ఏ వే! ఆత్మవిశ్వాసం ఉంటె చాలు! అనేక దారులు వాటంతట అవే ఏర్పడతాయి."
    నెమ్మదిగా చప్పట్లు చరిచాడు రింగడు. "నీ ఆత్మ విశ్వాసానికి జోహార్లు నిఖిల్! నువ్వన్నట్లే మరోదారి మిగిలే ఉంది."
    నిఖిల్, రాదా ఇద్దరూ ఆసక్తిగా చూశారు.
    "హాట్ ఎయిర్ బెలూన్!" అన్నాడు రింగడు.
    సూటిగా రింగది మొహంలోకి చూశాడు నిఖిల్. "హాట్ ఎయిర్ బెలూనా?"
    "యా! హాట్ ఎయిర్ బెలూన్! 1870 వ సంవత్సరంలో ఫ్రాన్స్కీ, రష్యాకీ, యుద్ధం జరుగుతున్నప్పుడు పారిస్ నగరానికి తక్కిన ప్రపంచంతో పూర్తిగా సంబంధం తెగిపోతే, వాళ్ళకు హాట్ ఎయిర్ బెలూన్లె దిక్కు అయ్యాయి."
    "హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఏమిటి?" అంది రాధ.
    "జెయింట్ సైజు బెలూన్లో హైడ్రోజన్ గ్యాస్ నింపుతారు. దానికింద తాళ్ళతో ఒక బుట్టకట్టి ఉంటుంది. ఆ బుట్టలో మనుషులు కూర్చుంటారు. " అన్నాడు నిఖిల్.
    "హైడ్రోజన్ గ్యాసు మూలపదార్ధాలన్నింటిలోకి అతి తక్కువ సాంద్రత గలది. గాలికంటే అతితెలిక. అందుకని సులభంగా గాల్లోకి లేస్తుంది. దానికి తోడు, కిందమంట ఉంటుంది. ఆ మంటవల్ల హైడ్రోజన్ వేడెక్కి మరింత పల్చగా అయిపోయి మరింత తేలిక అవుతుంది." అన్నాడు రింగడు.
    ఉహించుకోవదానికే థ్రిల్లింగ్ గా ఉంది రాధకి. హాట్ ఎయిర్ బెలూన్. దాని అడుగున పెద్ద బాస్కెట్. అందులో తనూ నిఖిల్ ఆకాశ పందిరికింద అలవోకగా తెలిపొతూ.........ఓహ్! ఎంత బాగుంటుంది!
    "కానీ రింగడూ! బెలూన్ లో ఎక్కి ఎంతదూరం పోగలం?" అన్నాడు నిఖిల్.
    "ఎంతదూరమైనా సరే! పంతొమ్మిదివందల డెబ్బయి ఎనిమిది ఆగస్టు పదకొండో తారీఖున ముగ్గురు అమెరికన్లు బెలూన్ లో ప్రస్క్ బల్ దగ్గర బయలుదేరి మిసెరీ ఫ్రాన్సులో పదిహేడో తారీఖున దిగారు. అంటే సరిగ్గా వారం రోజుల్లో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటారన్నమాట! ఇక్కడ నుంచి ఇండియన్ మెయిన్ లాండ్ పన్నెండువందల మైళ్ళ దూరంలోనే ఉంది. మీరు రిస్కు చేయవచ్చు."
    "రిస్కా?" అంది  రాధ.
    "యా! రిస్కు కూడా ఉంది దీన్లో!" అన్నాడు రింగడు.
    "బ్రిటన్ కి చెందిన ఆర్ 101 ఎయిర్ షిప్పు 1930 సంవత్సరంలో ఇంగ్లాండు నుంచి ఇండియాకు బయలుదేరి ఫ్రాన్సులో కూలిపోయింది. దాన్లో ఉన్న నలభై ఎనిమిది మంది మనుషులూ మరణించారు."
    "ఎందుకు కూలిపోయింది?" అన్నాడు నిఖిల్.
    "బెలూన్లో ఉన్న హైడ్రోజన్ మండిపోయి పెద్ద అగ్ని గోళంలా మారిపోయింది. ఎయిర్ షిప్పు కి ఉన్న మెటల్ ఫ్రేమ్ కూడా ఆ వేడిమికి కరిగిపోయింది. యా! రిస్కు కూడా ఉంది దీన్లో! అయినా తప్పదు! వేరే మార్గం లేదు" అన్నాడు రింగడు.
    ఆ మాటలు వింటుంటే రాధ మెడమీది నూగు రోమాలు నిక్కినిలుచున్నాయి.
    భయంతో కాదు! ఎగ్జయింట్ మెంటుతో! రిస్కు! అడ్వెంచర్ ! థ్రిల్లు! ఉరకలు వేస్తోంది ఆమె మనసు.
    "మనకు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడ దొరుకుతుంది?" అన్నాడు నిఖిల్.
    "మా ఇంట్లో !" అన్నాడు రింగడు కూల్ గా. "నేను బెలూన్లు చెయ్యడంలో ఎక్స్ పర్టుని. సంవత్సరానికి కనీసం రెండుమూడు అమ్ముతుంటాను.
    ఆ మాటకి వస్తే నేను తయారుచేసిన బెలూన్లోనే ఒక పార్టీ రేపు బయలుదేరుతోంది సింగపూర్ నుంచి ఇండియాకు! అడ్వెంచర్ అనుకోండి" అన్నాడు.
    "ఎవరు ఆ పార్టీ?" అన్నాడు నిఖిల్ నెమ్మదిగా.
    "ఒక అబ్బాయి , ఒక అమ్మాయి. కాలేజ్ స్టూడెంట్స్" అని ఆగి నిఖిల్ ని, రాదనీ మార్చి మార్చి చూశాడు రింగడు.
    ఆ తర్వాత నిఖిల్, రింగడు ఒకళ్ళని ఒకళ్ళు సాభిప్రాయంగా చూసుకున్నారు.

 

                                                              * * *


    ఆ రోజు రాత్రి టామిల్సన్ రోడ్డు లోని "కాశ్మీర్" హోటల్లో భోజనం చేశారు ముగ్గురూ. బాగా పొద్దుపోయాక బెనోయ్ రోడ్ కి తీసుకెళ్ళాడు రింగడు. అక్కడికి సముద్రం భాగా దగ్గర.
    ఆ ప్రాంతంలోనే ఒక  పెద్ద కాంపౌండ్ ఉంది. ఎత్తయిన ఆ కాంపౌండ్ వాల్ మీద నుంచి గాలిలో నెమ్మదిగా అటూ ఇటూ ఊగుతూ కనబడుతోంది జెయింట్ సైజు బెలూన్ ఒకటి. లోపలి కి వెళ్ళాక దాని కింద వైపు తాళ్ళతో కట్టి ఉన్న పెద్ద బుట్ట లాంటిది కూడా కనబడింది.
    "దీనికి కంట్రోల్స్ ఉంటాయా?" అన్నాడు నిఖిల్, నిశితంగా చూస్తూ.
    "ఉంటాయి. కానీ చాలా తక్కువ. మూడే మూడు కంట్రోల్స్. బుట్టకి అడుగు భాగంలో బాల్లాస్ట్ (కంకర) ఉంటుంది. మంట చెయ్యడానికి ప్రొపేన్ బర్నర్లు ఉంటాయి. బెలూన్ లో నుంచి గ్యాస్ కొద్దికొద్దిగా వదిలెయ్యడానికి ఏర్పాట్లు ఉంటాయి.
    ప్రొపేన్ బర్నర్లని వెలిగించాక, గ్యాస్ వేడి ఎక్కి, బెలూన్ పైకి వెళ్ళిపోతుంది. గాలి కరెంట్సుని మీరు గుర్తుపడుతూ, బెలూన్ ని కిందికీ పైకీ తీసుకువస్తూ గాలి వాటంతో బాటు పయనించవచ్చు. బుట్ట కింద ఉన్న బాల్లాస్ట్ ని కొద్దిగా వదిలేస్తే బెలూన్ మరింత పైకి వెళుతుంది. గ్యాస్ ని కొంచెం రిలీజ్ చేస్తే కిందికి వస్తుంది. ఇదిగో ఈ తాడు చూశారా, దీన్ని డ్రాగ్ రోప్ అంటారు. బెలూన్ లాండ్ అయేటప్పుడు డ్రాగ్ రోప్ బెల్లాన్ వేగాన్ని తగ్గించి అదుపులో ఉంచుతుంది. ఇది రిప్ పానెల్. దీన్ని తెరిస్తే గ్యాస్ అంతా రిలీజ్ అయిపొయింది" అని ఆగి వెనక్కి తిరిగి , "హలో దేర్!" అన్నాడు పలకరింపుగా.
    జీన్సూ, జేర్కీన్సూ వేసుకున్న ఒక అబ్బాయి, ఒక అమ్మాయి "హై" అని చేతులు ఊపి దగ్గరకు వచ్చారు.
    "రేపేనా టేకాఫ్?" అన్నాడు రింగడు.
    "యాయా! రేపే!"
    "ఎనీ ట్రబుల్?"
    "అబ్సల్యూట్ లీ నో! అల్ సిస్టమ్స్ రెడీ, స్టడీ గో!" అన్నాడు ఆ అబ్బాయి ఉత్సాహంగా.
    "ఫుడ్?"
    "ప్లేంటీ! రెడీగా ఉంచాం. బిస్కెట్స్, కేన్ద్ద్ ఫుడ్, డ్రింక్స్, ఫ్రూట్స్!"
    "ఎక్కడ?"
    "ఇంట్లోనే!"
    "ఇతను నిఖిల్, నా ఫ్రెండ్" అన్నాడు రింగడు నిఖిల్ వైపు తిరిగి కన్నుగీటుతూ.
    "హో ఆర్ యూ బడ్డీ!" అని కరస్పర్శ కోసం చెయ్యి జాపాడు ఆ కుర్రాడు.
    నిఖిల్ ఆ చేతిని అందుకున్నాడు. మరుక్షణంలో నేలమీద ఉన్నాడు ఆ కుర్రాడు. అతని మేడమీద ఉన్న ఒక నరాన్ని నొక్కాడు నిఖిల్. ఆటను ఫేయింట్ అయిపోయాడు. రింగడు అదే పని ఆ అమ్మాయిని చేశాడు. తను కూడా స్పృహతప్పి పడిపోయింది.
    నిఖిల్ , రింగడూ కలిసి వాళ్ళిద్దరినీ ఇంట్లోకి మోసుకెళ్ళారు. ఇంట్లో ఉన్న బిస్కెట్లూ, పళ్ళు అవీ తెచ్చి బెలూన్ లో పెట్టారు.
    ప్రొపేన్ బర్నర్లు వెలిగించాడు రింగడు. బెలూన్ లోని గాస్ వేడెక్కడం మొదలు పెట్టింది. మళ్ళీ ఒకసారి కంట్రోల్స్ ని చెప్పాడు రింగడు. చాలా జాగ్రత్తలు చెప్పాడు .
    బెలూన్ లో ఎక్కారు నిఖిల్, రాదా.
    "ఆగండి!" అని పెద్ద కేక వినబడింది. "స్టాప్! డోంట్ గో! స్టాప్!"
    ఉలికిపడి చూశారు ముగ్గురూ.
    ఒక ప్రెస్ ఫోటోగ్రాఫరు హడావుడిగా పరుగెత్తుకొస్తున్నాడు.
    "స్టాప్! స్టాప్! మీరు ప్రకటించిన షెడ్యులు పొద్దున్న ఏడుగంటలకి! అప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? లక్కీగా నేను వచ్చేశాను. ఇదీ ఒకందుకు మంచిదే! మీ టేకాఫ్ ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ ని నేను ఒక్కడినే అవుతాను. మోనోవలీ!  నేనే వాటినీ సిండికేట్ చేసి అన్ని పేపర్లకీ అమ్మి డబ్బు పోగేసుకుంటాను. లేట్మీ టెక్ సమ్ స్నాప్స్! సే చీజ్ (చీజ్ అనే పదాన్ని పలుకుతున్నప్పుడు పెదిమలు చిరునవ్వు నవ్వుతున్నట్లు అటో మేటిక్ గా వంపు తిరుగుతాయి. అందుకని కొంతమంది ఫోటో గ్రాఫర్లు అలా అనమంటారు ఫోటోలు తీసేటప్పుడు) చీజ్ అనండి! ఎస్! రెడీ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS