Previous Page Next Page 
మారణహోమం పేజి 90

 

    బయటకు వచ్చాడు తరుణ్. మిశ్రాగారి పర్సనల్ సెక్రటరీ నిరూప అక్కడ కుర్చుని ఉంది. డ్రీమీ గా అతనివైపు చూసింది.
    "ఇవాళ సాయంత్రం నేను ఫ్రీ! ఏ ప్రోగ్రామూ లేదు" అంది చిరునవ్వుతో. ఆమె కళ్ళలో ఆహ్వానం కనబడుతోంది.
    "బట్ ఐయామ్ వెరీ బిజీ! డర్టీ వర్క్! కానీ తప్పదు! ఏంచేస్తాం!" అని కన్నుగీటి వెళ్ళిపోయాడు తరుణ్.
    "నువ్వెపుడూ ఇంతే!" అని రుసరుసలాడుతూ అతను వెళ్ళినవైపే చూస్తూ ఉండి పోయింది నిరూప.
    నిజంగానే ఆరోజు సాయంత్రం చాలా పని ఉంది తరుణ్ కి. కానీ అది అతను బ్లఫ్ చేసినట్లు డర్టీ వర్క్ కాదు. చాలా ప్లెజెంట్ వర్క్.
    అమూల్యని కలవడం , ఇద్దరూ కలిసి ఒకరినొకరు సాయం చేసుకుంటూ నర్గీస్ ఖోఫ్తాలు చెయ్యడం, వాటిని కబుర్లతో పంచుకుంటూ తినడం -
    అప్రయత్నంగానే అతని చేతులు రెండూ జేబుల్లోకి పోయాయి. హుషారుగా విజిలు వేస్తూ వచ్చి కారెక్కాడు.


    
                                                         * * *


    నర్గీస్ ఖోఫ్తాని ఫోర్కుతో గుచ్చి నోట్లో బెట్టుకోబోతూ ఆగి, నవ్వింది అమూల్య.
    ప్రశ్నార్ధకంగా ఒక కనుబొమ్మ ఎత్తి చూశాడు తరుణ్.
    నేప్ కిన్ పెదిమలకి అడ్డం పెట్టుకుని నవ్వు అపుకుంది అమూల్య. "ఏం లేదు ఒకటి గుర్తొచ్చింది."
    "ఏమిటది?"
    "నర్గీస్ ఖోఫ్తా, నవరతన్ బిర్యానీ, స్టాఫ్ డ్ పరోటాలు- ఒక్కచేత్తో ఇన్ని చేసి పారేశారు మీరు. ఇన్ని చెయ్యడం కాదు గొప్పదనం! ఇన్ని చేసినా కూడా కిచెన్ అంతా గందరగోళంగా అయిపోకుండా ఇప్పుడే సర్దినట్లు ఉంది. ఇదెలా ఉందంటే, సినిమాల్లో చూపిస్తారే, హీరోగారు పదిమంది గుండు గుండాగాళ్ళతో హోరాహోరీ పోట్లాడినా, క్రాపు కూడా చేరగనట్లు! అలా!"
    ఇద్దరూ నవ్వుకున్నారు.
    "నిజం చెప్పండి! అలాంటి ఫైటింగ్ కూడా చేస్తుంటారా అప్పుడప్పుడూ మీరు?"
    "అప్పుడప్పుడూ ఏం ఖర్మ! పగలస్తమానం అదే పని కదా?"
    "ఎంతమందిని ఒక్కసారిగా ఉతికేయ్యగలరు మీరు?"
    "అరడజనుమందిని అయితే కూర్చున్న కుర్చీలో నుంచి లేవకుండానే కుదేయ్యగలను."
    చటుక్కున లేచి నిలబడి కరాటే ఫోజు పెట్టింది అమూల్య. ఆమె చేతిలోని ఫోర్కు సరిగా అతని కళ్ళముందు ఉంది.
    "మీరు ఎంతమందినయినా కుదేయ్యగలరు. కానీ నాతొ మాత్రం గెలవలేరు. చాలెంజ్" అంది అమూల్య. ఆమె పెదిమల మీద నవ్వు. ఆమె కళ్ళలో అల్లరి.
    తరుణ్ అది పట్టించుకోకుండా ఆదుర్దాగా ఆమె పాదాల వైపు చూశాడు "అమూల్యా! ఏమిటది? మీ కాళ్ళ దగ్గర!"
    బెదిరి , పాదాల వైపు చూసుకుంది అమూల్య.
    వెంటనే లేచి ఆమెని చేతుల్లో అందుకున్నాడు తరుణ్. క్షణంలో ఆమె గాల్లోకి లేచింది. మరుక్షణంలో బెడ్ మీద పడిపోయింది.
    అలా పడడంలో ఆమె పమిట తొలగిపోయింది. చీరే మోకాళ్ళ దాకా లేచిపోయింది.
    చీరే సవరించుకోవడం కొద్ది క్షణాలు ఆలస్యం చేసింది అమూల్య. ఆ కొద్ది క్షణాలు ఆటను మంత్రముగ్దుడిలా ఆమె అందాలని చూస్తూ ఉండిపోయాడు.
    "అమూల్యా!" అన్నాడు నెమ్మదిగా.
    నునుసిగ్గుతో చూసింది అమూల్య.
    "నా వ్రుత్తిలో నాకు ముఖ్యాతి ముఖ్యమైన అంశం సహనం. ఎవరినైనా వెంటాడుతున్నప్పుడు, ఎవరి కోసమన్నా వేచి ఉన్నప్పుడు గంటల తరబడి, ఒక్కోసారి రోజుల తరబడి ఓపిగ్గా కాచుకుని ఉండవలసి వస్తుంది. వేచి ఉండడం అనేది నాకు సెకెండ్ నేచర్ అయిపొయింది అమూల్యా. కానీ ఒక విషయంలో మాత్రం ఓపిక పట్టలేకపోతున్నాను."
    అదేమిటో తనకు తెలిసినట్లు మాట్లాడకుండా ఉండిపోయింది అమూల్య.
    "మిమ్మల్ని సొంతం చేసుకునే ఘడియ కోసం వేచి ఉండటం దుస్సహసంగా ఉంది అమూల్యా! నిజంగానే!"
    తలవంచుకుంది అమూల్య.
    ఆమె పక్కనే, కానీ ఆమెని తాకకుండా జాగ్రత్తగా కూర్చున్నాడు తరుణ్.
    "ఇవాల్టినుంచి మళ్ళీ చాలా బిజీ అయిపోతున్నాను అమూల్యా!"
    నిరాశ నటిస్తూ చూసింది అమూల్యా.
    "మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా?"
    "అవును, ఈ బాస్టర్డ్ నిఖిల్ నన్ను నిలువనిచ్చేటట్లు లేడు."
    "ఏం చేస్తున్నాడు?"
    తనకు తెలిసిన సమాచారం అంతా చెప్పాడు తరుణ్.
    "మీరేం చేస్తున్నారు?" అంది అమూల్య. మనసులోని అయిష్టాన్ని పక్కకి జరిపి, అతనికి మరింత దగ్గరగా జరుగుతూ.
    "సింగపూర్ బోర్డర్స్ అన్నీ క్లోజ్ చేయిస్తున్నాం. ఇండియన్ ఆర్మీనీ, ఎయిర్ ఫోర్సునీ, నేవీనీ అలర్టు చేస్తున్నాం. ఇంటర్ పోల్ ని హెచ్చరిస్తున్నాం."
    అతి కష్టం మీద గుటక మింగింది అమూల్య.
    అయితే చాలా తీవ్రమైన పరిస్థితి ఇది!
    ఈ సమాచారం తను వెంటనే నిఖిల్ కి చేరవెయ్యాలి.
    కానీ ఎలా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS