Previous Page Next Page 
మారణహోమం పేజి 84

 

    దగ్గరగా వచ్చి అతని చేతిమీద చెయ్యి వేసింది రాధ. "పద నిఖిల్! మనకు చాలా పని ఉంది!"


    
                                                        * * *


    ఆ రాత్రి అతిముఖ్యమైన కాన్ఫరెన్స్ జరిగింది నిఖిల్ స్థావరంలో. నిఖిల్ రాధలతో బాటు, నిఖిల్ అసిస్టెంటు రాజు వచ్చాడు. స్ట్రెచర్ మీద లాయరు బిల్డింగ్ వాలాని తీసుకొచ్చారు. అనారోగ్యం రోజురోజుకీ ముదురుతోంది ఆయనకు.
    నలుగురూ కూర్చున్న తర్వాత , తను అనుకుంటున్నది చెప్పాడు నిఖిల్. బిల్డింగ్ వాలా మొదట్లో అతని ప్రపోజల్స్ ని వ్యతిరేకించాడు. అది నిప్పుతో చెలగాటం అన్నాడు. మరనహోమమే తలపెట్టి అందరినీ భయభ్రాంతులని చెయ్యదలుచుకుంటే అంతకంటే మంచిపద్దతులు మరెన్నో ఉన్నాయన్నాడు.
    కానీ రాజు మాత్రం నిఖిల్ తో, రాధతో ఏకీభవించాడు.
    "అయితే ఒక చిన్న ఇబ్బంది ఉంది." అన్నాడు నిఖిల్. "తరుణ్ కీ కుడా ఈ దేవాలయం సంగతి తెలిసింది. నాకూ, హధీకీ సంబంధం ఉందని అతను ఉహిస్తున్నాడు. హధీకీ ఆ దేవాలయానికీ సంబంధం ఉందని కూడా అతనికి తెలుసు. హటాత్తుగా మెరుపుదాడి ఒకటి జరిపి అతను మనందరికీ మట్టు పెట్టినా పెట్టవచ్చు."
    "ఈ సంగతి మనకు ఎలా తెలిసింది?" అన్నాడు రాజు.
    "అమూల్య చెప్పింది."
    "అమూల్య తరుణ్ సమాచారాన్ని ఎఫెక్టివ్ గా అందజేయ్యగలుగుతోందా?" అన్నాడు బిల్డింగ్ వాలా ఆయాసంతో రొప్పుతూ.
    "ఆమెకి వున్న పరిధుల్లో ఫర్వాలేదు."
    "దేవాలయం వచ్చేనెల చివర్లో కలశ ప్రతిష్టాపన చేస్తారు. అంటే ఇంకా దాదాపు నలభై రోజులు టైం వుంది. ఇంక రేపో, ఎల్లుండో, దేవాలయం నిర్మాణం చుట్టూ వేసి వుంచిన రహస్యం అనే తెరలు ఎత్తేస్తారు హధీ బృందం. ఉద్రుతమైన ప్రచారం మొదలెడతారు. ఇంత గొప్పదేవాలయాన్ని తలుచుకుని వరదలా ఉప్పొంగుతుంది ప్రజల సెంటిమెంటు. హీనపక్షం పదిలక్షల మంది జనం చేరతారు ఆరోజున. దేశంలోని ప్రముఖులూ, ప్రభుత్వోద్యోగులూ, ప్రజా జీవితంలో సంబంధం ఉన్న ప్రతివాళ్ళు ఆ సమయంలో అక్కడ ఉంటారు. ఇంటర్నేషనల్ టీవీ నెట్ వర్క్స్ వాళ్ళందరూ వస్తారు. దేశదేశాల పత్రికా ప్రతినిధులు వస్తారు. నేపాల్ రాజు స్వయంగా వచ్చినా రావచ్చు. మారిషస్ , సింగపూర్, కంబోడియా - ఇలా భారతీయ సంస్కృతీ ప్రభావం ఉన్న దేశాల ప్రతినిధులు వస్తారు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ - అమెరికా నుంచి కెనడా నుంచి యూకే నుంచి వస్తారు.
    ఇంతమంది ముందు గనక మనం ఆ గుడిని డైనమైట్ చెయ్యగలిగితే , మనని చూసి ప్రపంచం గడగడలాడి పోతుంది! గజగజ వణికి పోతుంది! ఏమంటారు?"
    మిగతా ముగ్గురూ తమ సమ్మతిని ప్రకటిస్తూ తలలు ఊపారు.
    నిఖిల్ అన్నాడు . "ఈ ప్రయత్నంలో ఫెయిలవకూడదు. ఈ పధకాన్ని నేనూ రాదా మాత్రమే కలిసి ఎగ్జిక్యుట్ చేస్తాము. ఎక్కువమంది కలిస్తే, ఆటంకాలు కూడా ఎక్కువ కావచ్చు. పధకం బెడిసికొట్టే ప్రమాదం ఉంది. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్! ఈ రహస్యం మన నలుగురికే తెలుసు. ఇంకెవరికీ తెలియకూడదు. అందుకని మనం ఈ నలభై రోజులూ అంటే మన పని పూర్తీ అయ్యేదాకా ఇంకెవరికీ అందుబాటులో ఉండకూడదు! అర్ధమయిందా! ఎవరికీ దొరకకూడదు మనం! నేనూ రాదా దేశం వదిలి వెళ్ళిపోతున్నాం కొద్దిరోజులపాటు."
    బిల్డింగ్ వాలా ఆశ్చర్యంగా చూశాడు.
    "ఎక్కడికి?"
    "సింగపూర్! సింగపూర్ లో మా కోసం హోటలు రిజర్వేషన్లు సిద్దంగా ఉంటాయి. అక్కడ మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ సహకారం మనకి కావాలి. ప్రయత్నాలన్నీ పూర్తీ అయాక, నేనూ రాదా గుట్టుచప్పుడు కాకుండా వచ్చేసి విధ్వంసం చేసేస్తాం . ఎనీ క్వశ్చన్స్?"
    "సింగపూర్ కి ఎప్పుడూ వెళుతున్నారు?" అన్నాడు రాజు.
    టైం చూసుకున్నాడు నిఖిల్. తెల్లవారు ఝామున అయిదవుతోంది.
    "మార్నింగ్ ప్లయిట్ కి మెడ్రాస్ వెళుతున్నాం. అక్కడ నుంచి సింగపూర్ వెళ్ళే నెక్స్ ట్ ప్లయిట్ కాచ్ చేస్తాం. ఎనీ మోర్ క్వశ్చన్స్?"
    ఇంకేమీ లేదన్నట్లు అందరూ తలలు ఊపారు.
    సమావేశం ముగిసిందన్నట్లు సూచిస్తూ లేచి నిలబడ్డాడు నిఖిల్.
    అయితే -
    అతనికి తెలియని విషయం ఒక్కటే!
    అంతకు ముందు రోజే తరుణ్ వేరే పనిమీద సింగపూర్ చేరుకున్నాడని !

 

                                                          * * *


    ఒకటిన్నర బిలియన్ల డాలర్లకంటే ఎక్కువ ఖర్చుతో నిర్మించబడిన సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టులో దిగింది విమానం. ప్రపంచంలోని అత్యాధునికమైన విమానాశ్రయాలలో అది ఒకటి.
    పాసింజర్ టెర్మినల్ కి చాలా దూరంలో ఆగింది విమానం. అందుకని ప్రయాణీకులని టెర్మినల్ బిల్డింగు దాగా చేర్చడానికి ఒక బస్సు వచ్చింది.
    అందులో ఎక్కారు నిఖిల్ , రాదా.
    బస్సు కదిలి , అరైవల్ బస్ స్టేషన్ ముందు ఆగింది.
    డిపార్చర్ లాంజ్ ఆ స్టేషన్ కంటే ఒక అంతస్తుపైన ఉంది.
    హెల్త్, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పూర్తీ అయ్యాక కన్వేయర్ బెల్టుకి పై భాగాన ఉన్న బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు నిఖిల్. ఒక్కొక్క ప్లయిట్ నెంబరు ప్లాష్ అవుతూ ఒక్కొక్క విమానం తాలూకు లగేజ్ బెల్టు మీదకి వచ్చేస్తోంది. బోర్డు మీద తమ ప్లయిట్ నెంబరు రాగానే , బెల్టు మీద జరుగుతూ వస్తున్న తమ లగేజ్ ని అందుకున్నాడు నిఖిల్. కస్టమ్స్ క్లియరెన్స్ అయిన తర్వాత బయట ఉన్న అరైవల్ హాల్ లోకి వచ్చారు. అక్కడనుంచి కిందికి దిగి,  చిన్న సొరంగం లాంటి దాన్లో నుంచి నడిచి, ప్రైవేట్ కార్లు నిలబడే పార్కింగ్ చేరుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS