Previous Page Next Page 
మారణహోమం పేజి 82

 

    తృప్తిగా చూసింది రాధ. పెదిమలు సన్నటి చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి. నెమ్మదిగా పలికింది.
    "మనం దారుణ రణరంగంలోకి దూకుతున్నాం నిఖిల్! అధర్మం మీదకు దండెత్తి మనం జరపబోయే ఈ ధర్మయుద్దంలో నువ్వు మాకు సైన్యాధిపతివి! నిన్ను ఇక నుంచి నేను యఫ్. యం. నిఖిల్ అని పిలుస్తాను! ఫీల్డు మార్షల్ నిఖిల్!
    నువ్వు మాకు మార్షల్ నిఖిల్ వి. ఇక నుంచి జనావళికి, ఫాదర్ , మదర్ కూడా నువ్వే అవుతావు యఫ్. యం. నిఖిల్!
    కిటికీ దగ్గర నిలబడి మాట్లాడుతోంది రాధ.
    ఉన్నట్లుండి మెరుపువేగంతో ఆమె వైపు తిరిగాడు నిఖిల్. అతని చేతిలో రివాల్వర్ ఉంది.
    రివాల్వర్ నిప్పులు కురిపించడం మొదలెట్టింది. ఆరు బుల్లెట్లు రాధ దిశగా దూసుకొచ్చాయి.
    చివరి బుల్లెట్ తాలూకు శబ్దం క్రమంగా తగ్గి , నిశ్శబ్దం అవరించుకున్న తర్వాత, అప్పుడు నెమ్మదిగా తలతిప్పి వెనక్కి చూసింది రాధ.
    కిటికీ తాలుకూ కొయ్యకి ఒక సన్నటి రంధ్రం పడి ఉంది. ఆ రంద్రం మొదటి బుల్లెట్ చేసింది. మిగతా అయిదు బుల్లెట్లు,క్రమశిక్షణ ఉన్న సైనికుల్లా అదే రంద్రంలో నుంచి బయటకు వెళ్ళిపోయాయి!
    చప్పట్లు చరిచింది రాధ "యూ ఆర్ ఏ క్రాక్ షాట్! నిఖిల్! రియల్లీ యూ ఆర్ గ్రేట్!"
    నవ్వుతూ దగ్గరికి వచ్చాడు నిఖిల్.
    "భయం వెయ్యలేదా రాదా?"
    ఒక కనుబొమ్మ అలవోకగా ఎత్తి చూసింది రాధ.
    "భయమా? ఎందుకు ? నువ్వు నా ధైర్యాన్ని పరీక్షించడానికే రివాల్వర్ పెలుస్తున్నవని గ్రహించాలేనంత అమాయకురాలినా? అయినా కాకపోయినా, నీ చేతిలో చనిపోవడం కంటే అదృష్టం మరేం ఉంటుంది నిఖిల్? నన్ను చంపితే నువ్వే చంపాలి!"
    చిరునవ్వు నవ్వాడు నిఖిల్.
    "అలాగే నన్ను చంపగాలిగితే నువ్వే చంపాలి! రాదా! మనిద్దరం ఒకరినొకరు సమ ఉజ్జీ! ఈ ప్రపంచంలో ఇంకెవరూ మనకు సమానం కాదు!
    ఇవాళనుంచి నువ్వు నాకు కుడి భుజానివి రాదా!"
    కృతజ్ఞతా పూర్వకంగా అతని వైపు చూసింది రాధ. నలిగిపోయిన ఆలివ్ కలర్ బట్టలలో కూడా అందంగానే కనబడుతున్నాడు నిఖిల్. ఆ అమ్మాయిలోని అడమనసు అరక్షణం పాటు అరమూసిన కనురెప్పల నందు నుంచి చూస్తూ అతని అందాన్ని త్రాగేసింది.
    తర్వాత ఒక్కసారి తల విదిలించింది రాధ. అతని కళ్ళు తీక్షణంగా మారాయి. "ఇప్పుడింక మనమొక మాస్టర్ ప్లాన్ తయారుచెయ్యాలి నిఖిల్! ఒక్కసారి , ఒకేసారి చావుదెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ తగిలిన వాళ్ళు మంచి నీళ్ళడక్కుండా చావాలి! పక్కన నిలబడి చుస్తున్నవాళ్ళు కూడా కళ్ళు తిరిగి మూర్చపోవాలి! అంత దెబ్బ తియ్యగల పని ఏమిటి?"
    ఆమెను అంచనా వేస్తున్నట్లు కాసేపు చూసి అన్నాడు నిఖిల్. "ఒక ప్లేన్ ని హైజాక్ చెయ్యడమా?"
    నిర్లక్ష్యంగా చప్పరించింది రాధ.
    "హైజాకా? కిడ్ స్టఫ్! పిల్లాట లాంటిది హైజాక్! అంతకంటే గట్టిడోసు ఇవ్వాలి నిఖిల్!"
    చిరునవ్వు నవ్వాడు నిఖిల్. "హైజాక్ అనగానే నువ్వు చప్పరిస్తావని నాకు తెలుసు! నేననుకుంటున్నది వేరే ఉంది."
    ప్రశ్నార్ధకంగా చూసింది రాధ.
    "చాలా భారీ ఎత్తున విధ్వంసకాండ జరపడం!"
    "ఎక్కడ? దేన్నీ?"
    దానికి నేరుగా జవాబు ఇవ్వలేదు నిఖిల్. చెప్పడం మొదలెట్టాడు.
    "పాలస్తీనియన్ టెర్రరిస్టులు భయాన్ని క్రియేట్ చెయ్యడం కోసం మ్యునిక్ ఒలంపిక్స్ లో ఇజ్రేలీ ఆటగాళ్ళను నిర్ధాక్షిణ్యంగా చంపారు. విదీశీ రాయభార కార్యాలయాల మీద దాడులు జరిపారు. తెరిచీ తెరవగానే పేలే లెటర్ బాంబులు పోస్ట్ చేశారు. విమానాలని, షిప్పులనీ హైజాక్ చేశారు. అలానే ఐర్లాండులో ఐ. ఆర్. ఏ టెర్రరిస్టులు హిట్ లిస్టు తయారు చేసుకొని కొంతమంది ప్రముఖులను వరసగా చంపడమే తమ పనిగా పెట్టుకున్నారు.
    కానీ వాళ్ళలాగా మనుషులని చంపడం మన ఉద్దేశ్యం కాదు రాదా!"
    "మరి?"
    "నాకొక విషయం తెలిసింది."
    "ఏమిటది?"
    "హాధీ చాలా పెద్ద ఎత్తులో ఉన్నాడు. టెర్రరిస్టులందరినీ కలిపి "సన్స్ ఆఫ్ గన్స్" అని క్లబ్బులాంటిది జపాటా ప్రపోజ్ చేసినట్లే , హాధీ కూడా మాఫియా లాంటి గాంగులు అన్నింటినీ కలిసి ఒక సంస్థలాంటిది పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. చాలావరకు అతని ప్రయత్నాలు ఫలించాయి కూడా. హాంగ్ కాంగ్ లోని బాంబూ యునియన్, సిసిలియల్ గ్యాంగులు, కోర్సికన్ బ్రదర్ హుడ్, అమెరికన్ ఇటాలియన్ మాఫియా, జపనీస్ గాంగులూ, ఇండియాలోని స్మగ్లర్లు, గుండాలు, ధన్ బాద్ బొగ్గుగనుల మాఫియా అందరూ కలిసి ఇకనుంచి మరింత ఆర్గనైజ్డ్ గా కార్యక్రమాలు కొనసాగించబోతున్నారు. నన్ను కూడా చేర్చుకోవాలని చూశారు గానీ నేను లొంగలేదు."
    మెరుస్తున్న కళ్ళతో అతనివైపు చూసింది రాధ.
    "నువ్వు ఎంత సమర్దుడివి కాకపోతే, ఒకవైపు నుంచి ఇంటర్నేషనల్ టెర్రరిస్టులూ , ఇంకో వైపు నుంచి మాఫియా మనుషులు కూడా నీ సహకారం కోరతారు నిఖిల్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS