Previous Page Next Page 
మారణహోమం పేజి 81

 

    అహింసా పరమో ధర్మ్హ అని చెప్పిన మహనీయుల దగ్గర నుంచి చాలా ముందుకి వెళ్ళిపోయాం నిఖిల్!
    అక్కడ పంజాబ్, పంజాబ్ ఎలా ఉంది? తగలబడిపోతోంది!
    పంజాబ్ ఉద్యమాల లాంటి ఉద్యమాలు నడిపి గద్దె నెక్కాలనో, ప్రత్యర్ధులను గద్దె దింపాలనో ఎన్ని చోట్ల, ఎంతమంది నాయకులకు కుతూహలంగా లేదు?
    ఇకపోతే దేశం!
    దేశం ఉన్న స్థితి చూస్తుంటే దేహం దహించుకుపోవడం లేదా నిఖిల్!
    ఈ దేశాన్ని ఎలా దోచుకుతిందామా అని చూసేవాళ్ళే గానీ, తోచినంత సేవ చేద్దామని ఎవరన్నా అనుకుంటున్నారా? ఎవరన్నా?
    కేరళలో జరిగిన ఆ కేసు తెలుసా నిఖిల్? జాతీయ గీతం పాడబోమని కొంతమంది బాలికలు కోర్టుకెళ్ళారట. వాళ్ళ చిన్న బుర్రలకు తట్టి ఉండే విషయమేనా ఇది నిఖిల్? ఈ విషం వాళ్ళ బుర్రలకు ఎక్కించిన పెద్దలెవరు? దేశం సంకట పరిస్థితిలో ఉంది. ఇప్పుడా ఇలాంటి రాద్దాంతాలు? గిల్లికజ్జాలు?
    ఇంత ఓపిక ఉన్న మనుషులెవరూ పెద్ద పెద్ద్ద అక్రమాలమీద తిరగబడరేం నిఖిల్?
    నిఖిల్! మన ఇంట్లో దోమలూ, నల్లులూ, విషప్పురుగులూ పెరిగిపోతే ఏం చెయ్యాలి?
    పావు లీటరు కిరోసిన్ లో క్రిమిసంహారిణి మందేదైనా కలిపి స్ప్రే చెయ్యాలి. మరుక్షణంలో చచ్చి ఊరుకుంటాయ్ అవన్నీ! అంతేగానీ రక్తం పీల్చే ఒక్కొక్క నల్లినీ పట్టుకుని నేల రాసేస్తానని శపథం పట్టడం అవివేకం నిఖిల్!
    నువ్వు ఒక్క నల్లిని చంపెలోగా నాలుగు నల్లులు పుట్టుకోస్తాయ్ అక్కడ! నువ్వు గెలవలేవు నిఖిల్! యూకెన్ నెవర్ విన్!"
    అనర్ఘళంగా మాట్లాదేస్తున్న రాధ వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు నిఖిల్.
    కొద్ది రోజుల క్రితం భయంతో గజగజ వణుకుతూ , విహ్వాలమైన చూపులతో తన దగగ్రికి వచ్చిన ముక్కుపచ్చలారని ముగ్ధ , ఇప్పుడు కళ్ళెర్రజేసిన కాళికలా నిలబడి ఉన్న ఈ రాదా ఒక్కరేనా?
    పరిస్థితులు ఎలా మార్చేస్టాయ్ మనుషులని!
    "చెప్పు! రాదా! నేనేం చెయ్యాలి?" అన్నాడు మృదువుగా.
    "చెబుతున్నాను నిఖిల్! ఒక్కొక్కసారి , ఒక్కొక్కరిని రక్షించడం చాలా స్లో ప్రాసెస్! ఆ విధంగా అందరినీ ఆడుకోవడం అసంభవం! అంత కష్టపడి మనం ఎవరికన్నా సహాయం చేసినా మళ్ళీ వాళ్ళకు ఆపద వాటిల్లవచ్చు.
    దేహానికి అస్వస్థత చేస్తే జ్వరం లాంటి సింప్టమ్స్, లక్షణాలు బయటికి కనబడతాయి నిఖిల్. సమర్దుడయిన డాక్టరు, కేవలం జ్వరం తగ్గించాలని తాపత్రయపడడు. అది ఎందుకు వచ్చిందో కనుక్కుని, ఆ మూలకారణాన్ని నిర్ములించాలనుకుంటాడు. ఇప్పుడు దేశానికి కూడా జబ్బు చేసింది నిఖిల్! ఆ జబ్బు లక్షణాలే ఈ పావులు పెరిగిపోవడం! ఆ జబ్బుకి విరుగుడు ఒకటే ఉంది నిఖిల్! అది టెర్రరిజమ్!"
    నిట్టూర్చాడు నిఖిల్.
    "టెర్రరిజం అంటే అర్ధం తెలిసే వయసు కూడా లేదు రాదా నీకు! టెర్రరిస్టు లందరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం సాధించుకోవడానికి అందరినీ బెదిరించి, భయభ్రాంతులని చేస్తూ ఉంటారు వాళ్ళు.
    పంజాబ్ టెర్రరిస్టులు ఖలిస్తాన్ అనే వేరే దేశం స్థాపించుకోవాలని టెర్రరిజానికి దిగారు. పాలస్తీనియన్ గెరిల్లాలు పాలీస్తానా దేశం స్థాపించాలని టెర్రరిస్టులుగా మారారు. మనకు అలాంటి కారణం ఏదీ లేదే!
    మనం దేశభక్తులం రాదా! అది మర్చిపోకు! మనం దేశాభక్తులం! మనం బతికేది చచ్చేది కూడా ఈ దేశం కోసం! ఈ దేశం కోసం మాత్రమే! ఆ సంగతి కలలో కూడా కలవరిస్తూ ఉండాలి రాదా మనం!"
    "మన టెర్రరిజం వేరే దేశం కావాలని కాదు. వేరే రాష్ట్రం కావాలని కాదు.
    వేరే వ్యవస్థ కావాలనే కోరికతో టెర్రరిస్టులుగా మారుతున్నాం నిఖిల్ మనం! అర్ధమయిందా? వేరే వ్యవస్థ కోసం!
    దేశమంతా మనని చూసి దడుచుకునేటట్లు చేయాలి నిఖిల్! ఈ ఎస్టాబ్లిష్ మెంటుని , ఈ కుళ్ళిపోయిన కుత్సితపు వ్యవస్థని వంచేలా చేసి, మొట్టికాయలు మొట్టాలి. మన పవరు చూపించి మనం పవరులోకి రావాలి నిఖిల్!
    అప్పుడు, అప్పుడు మాత్రమే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు చెయ్యగలుగుతాం! "పవర్ కమ్స్ త్రూ ద బారెల్ ఆఫ్ ఎ గన్! అని చెప్పారు మవ్ సే టుంగ్. పవర్ కమ్స్ త్రూ టెర్రరిజం అని మార్చుకుందాం మనం.
    ఆర్డర్ క్రియేట్ చెయ్యాలంటే ముందు మనం డిసార్డర్ క్రియేట్ చెయ్యాలి నిఖిల్! చిన్నాభిన్నం చేసెయ్యాలి ఈ వ్యవస్థని! తప్పదు! ముందు కొంత జన నష్టం, ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగవచ్చు. కానీ ఆ శిధిలాలలో నుంచి పుట్టుకొస్తుంది కొత్త వ్యవస్థ. బూడిదలో నుంచి ఫీనిక్స్ అనే పక్షి పుట్టుకొస్తుందని చెప్పినట్లు! ఏమంటావు నిఖిల్?
     నిర్మల! నిర్మలని రక్షించడానికి అంత ప్రయాసపడ్డాం! చివరికి ఏమయింది నిఖిల్? కేసు గెలిచి బయటికి రాగానే కాళ్ళు, చేతులూ నరికేశారు. ఎంతమందిని ఎంతకాలమని కనిపెట్టుకుని ఉండి రక్షించగలవు నిఖిల్? నువ్వు కొంచెం అడమరచితే అదే అదనుగా తీసుకుని విజ్రుంభిస్తారు శతృవులు."
    కదలలేక, మెదలలేక మెడలు నరికేసిన అరటి బోదేలా నిస్సహాయంగా పడి వున్న నిర్మల నిఖిల్ కళ్ళముందు మెదిలింది. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. గోళ్ళు అరచేతిలో గుచ్చుకుపోయి రక్తసిక్తమైపోయాయి. ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. వళ్ళు గిట్టకరిచి, పట్టుకున్నాడు. అతని ఊపిరి ఆగి, ఆగి బుసలాగా వస్తోంది.
    అంత రౌద్రమయిన భంగిమలో నిఖిల్ ని ఎప్పుడూ చూడలేదు రాధ. ఉగ్రనరసింహవతారంలా ఉన్నాడు నిఖిల్ . ఒక్కొక్క అక్షరం ఒత్తోత్తి పలుకుతూ అన్నాడు-
    "అవును రాదా! దేహాన్ని కేన్సరు పట్టుకుంటే , సకల ప్రయత్నాలూ చేసి దాన్ని సమూలంగా నిర్ములించడమే సరైన ఆన్సరు! ఒక్కొక్క కణాన్నీ చంపుదామని అనుకుంటే ఒక్కొక్క క్షణానికే వెయ్యి కేన్సరు కణాలు పట్టుకొచ్చి పుట్టి ముంచేస్తాయి!
    నువ్వు చెప్పింది కరక్టే రాదా! ఉష్టం ఉష్ణేన శీతలం! ఉష్ణానికి ఉష్ణం తోడయితేనే చల్లదనం వస్తుందిట! దౌర్హన్యానికి దౌర్జన్యమే మందు! రాధా! ఇది తుది కాదు! మొదలు! ఇక నుంచి రక్తానికి రక్తం, హింసకు హింస! మోసానికి మోసం! ద్వేషానికి ద్వేషం!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS