Previous Page Next Page 
మారణహోమం పేజి 80

 

    "కొత్త రకం తుపాకి, పాదరసం బుల్లెట్లతో చేసి ఇస్తానన్నాను. ఆ బులెట్ తాకితే , తల పుచ్చకాయలా పగిలిపోతుంది."
    "దట్సాల్ యువర్ అనర్!" అని పబ్లిక్ ప్రాసిక్యుటర్ వైపు తిరిగింది అమూల్య "యువర్ విట్ నెస్!"
    "నే చెప్పలేదూ! ఈ పిల్ల గడుగ్గాయి! తినేసింది అందరిని! అయితే ఒకటే సంతోషం!
    నిర్మల నిరపరాధి అనీ, తన ప్రాణానికి ముప్పు వస్తోందనీ ముందే ఉహించి, ఆత్మరక్షణ కోసమే నరేందర్ ని చంపిందనీ తేల్చిపారేసింది! ఎవరు గెలిచారన్నది కాదు నాకు ముఖ్యం! ధర్మం గెలిచిందా లేదా అన్నదే ప్రశ్న!" అన్నాడు వామనరావు తన అసిస్టెంట్ తో.
    " ఒక్క దెబ్బతో రెండు కేసులు గెల్చింది! ఇక్కడ నిర్మల కేసూ , అక్కడ పోచయ్య కేసూ! టూబర్డ్స్ ఇన్ వన్ షాట్!" అన్నాడు అసిస్టెంట్.
    ఆ తర్వాత అమూల్య ప్రాసిక్యూషన్ కధనాన్ని కాయితం పడవని నీళ్ళలో మున్చేసినట్లు ముంచెయ్యడానికి ఎంతోసేపు పట్టలేదు.
    మద్యం ముట్టుకోదు అమూల్య. కానీ తనకు ఇవాళ షాంపేన్ తగినంత మత్తుగా ఉంది విజయగర్వంతో.
    తనని వదిలేస్తున్నారని విన్న నిర్మల చూసేప్పటిదాకా ఆ వార్తని నమ్మలేక పోయింది. తర్వాత చటుక్కున వంగి అమూల్య కాళ్ళు పట్టుకోబోయింది.
    "ఛ!ఛ! ఇదేమిటి! తప్పు!
    అక్కలు ఎవరైనా చెల్లెళ్ళ కాళ్ళు పట్టుకుంటారా?" అంది అమూల్య నవ్వుతూ.
    "అవును. కాదు..........కా........నువ్వు నా చెల్లివి! కాదు! నా పానాలు దక్కించిన దేవతవు."
    అమూల్య అభిమానంగా ఆమె భుజం మీద చెయ్యి వేసింది.
    ఇద్దరూ బయటికి వచ్చారు.
    అప్పుడు జరిగింది అది.
    నల్లటి మెరుపుల్లా నాలుగు కొడవళ్ళు గాల్లోకి లేచాయి. నాలుగు దెబ్బలు హృదయవిదారకంగా కేక పెట్టింది నిర్మల. మళ్ళీ కొడవళ్ళు లేచాయి. అప్పటికే స్పృహ తప్పి పోయింది నిర్మలకి.
    నిశ్చేష్టులై చూస్తున్న అందరూ తెరుకునేసరికి దుండగులు వేచి వున్న జీపు ఎక్కి పారిపోయారు.
    నిర్మల మీదికి ఒంగిపోయి చూసింది అమూల్య.
    నిర్మల చేతులు, కాళ్ళు విడివిడిగా తెగిపడి విలవిల కొట్టుకుంటున్నాయి.
    కేవలం తల మాత్రం ఉన్న మొండెంగా మారిపోయింది నిర్మల.
    కోర్టు గేటు దగ్గరే జరిగిపోయింది ఆ దారుణం.

 

                                                    * * *


    రెండు చేతుల్లో తలను పట్టుకుని కూర్చుని ఉన్నాడు నిఖిల్.
    అతని పక్కనే నిలబడి ఉంది రాధ. ఆమె ఆగ్రహంతో ఊగిపోతోంది. రక్తవర్ణంలో ఉన్నాయి ఆమె కళ్ళు.
    "చెప్పండి నిఖిల్! కోర్టు గేటు దగ్గరే నిర్మల మీద ఇంత ఘతకం జరిగిపోయింది. తను ఒకవేళ బతికి బయటపడినా, ఇంక జీవచ్చవం కిందే లెక్క! బ్రతికినన్నాళ్ళు వీల్ చెయిర్ కి అంకితమైపోవాలి తను, దానికి బదులుగా ఏం చెయ్యబోతున్నాం మనం?"
    మెల్లిగా తల ఎత్తాడు నిఖిల్. అతని పెదిమలు పట్టుదలని సూచిస్తూ వంపు తిరిగి ఉన్నాయి.
    నిర్మల మీద కొడవలి ఎత్తిన వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి, సున్నపు బస్తాలలో పెట్టి, కుట్టేసి నీళ్ళలో ముంచుతాను. కుతకుత ఉడికి చస్తారు. ఇది నిజం రాదా! చేసి తీరతాను."
    అపహాస్యంగా నవ్వింది రాధ. "వెరీగుడ్ నిఖిల్! ఇది వరకు నన్నెవరో ఎత్తుకెళ్ళిపోయారు. కారణమైన రౌడీరమేష్ ని లాక్కొచ్చి శిక్షించావ్! ఆ తర్వాత ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు! ఇప్పుడు నిర్మల! నిర్మల మీద దారుణానికి ఒడిగట్టిన వాళ్ళను పట్టుకొచ్చి సున్నంలో ఉడకేస్తావ్! లేకపోతే ఉప్పు పాతర వేయిస్తావ్! తర్వాత? తర్వాత ఇంకో నేరం ఇంకో ఘోరం! ఇంకోసారి నువ్వు వాళ్ళని ఆడుకుంటావ్!@ ఆ తర్వాత? మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది నిఖిల్! ఇది అనంతంగా సాగిపోతుంది. దీనికి ఇప్పుడే ఇక్కడే అడ్డుకట్ట వెయ్యాలి! ఈ అన్యాయాలను, అక్రమాలను, అధర్మాన్ని ఇప్పుడే ఆపెయ్యాలి నిఖిల్! ఆపెయ్యాలి!"
    "ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ అధర్మం జరిగినా, అక్కడ నేను ప్రత్యక్షం అవుతాను రాదా! ఇవాళ నుంచి నిద్రపోను! విశ్రమించను! ఇదే సర్పయాగంలా భావిస్తూ ప్రపంచంలోని పాపాత్ములందరినీ తెచ్చి దహనం చేసేస్తాను" అన్నాడు నిఖిల్ తీవ్రంగా.
    "ఇటీజ్ జస్ట్ ఇంపాజిబుల్!" అంది రాధ కూల్ గా "అసంభవం అది!"
    నిఖిల్ మోహం కోపంతో ఎరుపెక్కింది. "ఏది అసంభవం? నేను అంత అసమర్ధుడిని అనుకున్నావా?"
    "మీ సమర్ధతని నేను శకించడం లేదు. మీరు చెయ్యబోయేనని అసాధ్యం అంటున్నాను."
    "నేను తలచుకుంటే అరివీర భయంకురుడిలాంటి అబూనిడాల్ కూడా కాళ్ళు చేతులు కట్టేసి తెచ్చి నీ ముందు పడేయ్యగలను రాదా!"
    "నేను చెప్పే పాయింటు నీకు అర్ధం కావడంలేదు. లోకంలో పాపం రోజురోజుకి పెరిగిపోతోంది. పాపాత్ములు పెట్రేగిపోతున్నారు. అయితే ఒక్కొక్కళ్ళనీ డీల్ చేస్తూ  అందరి పనీ పట్టాలంటే వందేళ్ళు కూడా సరిపోవంటున్నాను."
    అయితే ఏం చెయ్యాలని నీ ఉద్దేశ్యం?"
    ఆమె వైపు పరీక్షగా చూశాడు నిఖిల్.
    "రాదా! నువ్వు మానసికంగా అలిసిపోయినట్లు ఉన్నావు. హల్సుసినేషన్స్ వస్తున్నాయి నీకు. అవునా? గో ! గో అండ్ టేక్ లాట్స్ ఆఫ్ రెస్ట్!"
    "నిద్రకు ఇంక గుడ్ బై నిఖిల్! నీకూ, నాకు కూడా ! టెర్రరిస్టుగా మారాలి నువ్వు! చెడు పాలిట సింహస్వప్నం అవ్వాలి ఇవాళ నుంచే!"
    "నాకు సాధ్యమయినంత............"అనబోయాడు నిఖిల్.
    అసహనంగా అతన్ని ఆపేసింది రాధ. "నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నా కళ్ళతో ఒకసారి చూడు నిఖిల్! నువ్వు నాకంటే పెద్దవాడివి. అందుకే నీ ఆలోచనలు ఇంకా కొంచెం పాత పద్దతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎటూ చూసినా, ఎక్కడ చూసినా వయోలెన్స్! వయొలెన్స్! వయొలెన్స్! వయోలెన్స్ అనేది ఒక మానియాలాగా, ఒక క్రేజ్ లాగా అయిపొయింది. ఉదాహరణకి సూపర్ హిట్ సినిమాలు తీసుకో! నిఖిల్! ఫస్ట్ బ్లడ్, రాంబో, దబ్లాస్ట్ ఫైటర్, ఎక్స్ టెర్మినేటర్, కమాండో - ఏమిటో వీటిలో? వయోలెన్స్, ఇంకా వయొలెన్స్! మరింత వయొలెన్స్! అదే కావాలసింది జనానికి!
    ఇప్పటి ఉద్యమాలే తీసుకో! పోలీసు బుల్లెట్లకు\ ఎదురొడ్డి, ప్రాణాలు అర్పించడానికి పాతికమంది తయారుగా ఉంటారు గానీ, శాంతియుతంగా ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణత్యాగం చెయ్యడానికి ఒక్కరూ తయారుగా ఉండరు! పొట్టి శ్రీరాములు తర్వాత ఆమరణ నిరాహారదీక్ష పూని చనిపోయిన తర్వాత అసంఖ్యాకమైన విదంగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళెవరన్నా ఉన్నారా నిఖిల్ ఆ తర్వాత అసంఖ్యాకమైన ఉద్యమాలు నడిచాయి! లెక్కకి అందనంత మంది బలవంతపు చావు చచ్చారు!
    కానీ ఒక్కరు , ఒక్కరు కూడా శాంతియుతంగా ప్రాణత్యాగం చెయ్యలేదు! నాకు తెలిసినంతవరకూ!
    ఎందుకు? ఎందుకు?
     ఎందుకంటే? శాంతి మీద గ్లామర్ తగ్గిపోతోంది నిఖిల్! వయోలెన్స్ అంటే ఆరాధన పెరుగుతోంది?
    ఇకపోతే రాజకీయ నాయకుడయి ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎమ్జిఆర్ ఏమి చెబుతున్నాడు? తన అనుచరులను కత్తులు పట్టుకు తిరగమని వుద్భోదిస్తున్నాడు! కారణాలు ఏమై ఉండవచ్చు గాక!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS