సుంద - అట్లాంటి మణితో ఉపవాసాలున్నా కష్టమా? మీ ఇద్దరూ ఒకర్నొకరు చూసి భోజనం మానుకోండి.నాకు మాత్రం ఆకలిగా వుంది .నా కెవరున్నారుభోజనం మరిపించేందుకు?
శశి - మీరింకా పెళ్ళిచేసుకోలేదేం?
సుంద - కృష్ణుడి అదృష్టం అందరికి పడుతుంది ? పోద్ధస్తమానం పనిచేసి నిద్రపోయే మాకు
రాత్రిళ్ళు చంద్రకిరణాలు దొరుకుతాయా ?
శశి- అంత పని వుంటుంది ? కృష్ణా నువ్వుకూడా పనిలోవుంటే పగలంతా నాకేం తోచేది?
సుంద - భార్యలకు తోచదని కృష్ణానిమల్లే పోద్ధస్తమానం అందరు మొగాళ్ళుపలుసు కాచుకుంటూ కూచుంటారనుకుంటారా యేం?
శశి - పోనీ కృష్ణా,నువ్వు మళ్ళా ఆ ఒక్క యేడాది చదువ రాదూ ?
కృష్ణు- మరి నువ్వు ?
శశి- నేనా ? నేనా? ఎక్కడో ఒక చోట వుంటాను .
సుంద - ఆమె ఇక్కడే వుంటార్రా. నువ్వెళ్ళి చదువుకురా .
శశి - అవును ,పోనీ ఇక్కడే వుంటాను .నాకు భయమా ? ఒక్క యేడే కదూ?
కృష్ణు- అమ్మో! నిన్ను వదలి వెళ్ళడమే !
సుంద - ఒక్క యేడేకదూ!తర్వాత స్వతంత్రంగా బఠాకవచ్చును.
కృష్ణు- నాకింత కంటే స్వతంత్ర మక్కరలేదు .
సుంద -ఏమీపనిలేకుండా ఇట్లా వండడం బాగుందలేదు.
కృష్ణు- బ్రహ్మచారికి నీకేం తెలుసు బాగుందో లేదో ? ఏమంటావు శశి ?
శశి- అవును . ఆయనకేం తెలుసు ?
శశిరేఖ కృష్ణు లిరువురును దొడ్డి రాత్రి మంచము పై కూర్చుని యుండిరి గోవిందపురమునుండి వచ్చి ఈ వాడపిల్లిలో డింగిలోనుండి దిగి రెండు నేలల్తెనది. ఆ యూరిలో కృష్ణుడి స్నేహితుడు సుంధర్రావుండెను.అతడు సంవత్సరమునకు పూర్వము పరిక్షయందు కృతార్థుడ్తె ఆ యూరియందు డాక్టరుగా యుండెను .కృష్ణుడాతనికి తన కధ తెలుపగా అతడు విరినేంతో ఆదరించిఒక కుటిరమును,పెద్దదొడ్డియు నుండుట కిప్పించెను .ఈ రెండు నెలలును రెండుగంటలవలె గోప్పగాయకునిచే పాడబడిన మధురగీతమువలె ,సుందర విద్యుల్లతవలె గడచిపోయెను.
శశి -పోనీ ,నువ్వు చదువు ముంగిచాకూడదూ?
కృష్ణు -శశి నిన్ను వంటరిగా విడిచి ఉండగలనా?నాకు మన స్దిమితము ఉంటుందా ?
శశి - కాని ,అప్పుడు మనం స్వతంత్రముగా బతుకవచ్చునుగా?
కృష్ణు- అవునుగానీ, నిన్నుంచుటకు చోటులేదు, సొమ్ములేదు వృధలోచన లెందుకు ?
శశి- సుంధర్రావుగారు చూడు ఎంత స్వేచ్చగా వున్నాడో ?
కృష్ణు- ఆ స్వేచ్చ కంటే ఈ బంధనమే ప్రియతరము కాదూ ?అని ఆమె హస్తములతో అతని
మెడ కౌగాలించుకోనెను. ఆమెయు అతని శిరమును వంచుకొని తన హృదయమున నద్దుకోనేను .
శశి - ఇంతకంటే ఏం కావాలి ?
కృష్ణు- కాని సుందర్రావు పైఆధారపడటం బాగుండలేదు .
శశి - పోనీ, అనుకున్నట్లు నా నగఒకటి అమ్మేయ్యరాదూ?
కృష్ణు- కాని ,వాడంమనియ్యటాంలేదు. స్నేహం మొగమాటం.
శశి - పాపం, చాలా మంచి ఆయన లగున్నారు .
కృష్ణు- పోనీ, మళ్ళి గోవిందపురం వెడదామా?
శశి -వెడితే?
కృష్ణు -ఏమో !తెలియదు . కాని మా వాండ్లకీ సంగతి వ్రాసి ,ఏమంటారో చూస్తాను .
శశి - ఎందుకులేద్దూ ? ఇక్కడ బాగుండలేదూ?
కృష్ణు- ఎన్నాళ్ళితని మీద ఆధారపడి ఉండడం?
శశి - అవునది నిజమే .
కృష్ణు -ఏమిటో నాకు బాగుండడంలేదు.శశి ,నాకేం తోచదు.ఈ జీవితంలో నువ్వు తప్ప నాకు ధరి దాపు కనబడడంలేదు.
శశి - ఎప్పుడూ ఈ చిన్నతలలో తలపులతో బాధపడతావు.ఇట్లారా ! అన్నీమరిచిపో. ఏమయితేనేం ,మన ప్రేమ వుందిగాఇంకేం కావాలి ?
అని కృష్ణుని తలను తన హృదయంన నదుముకొని ముఖంను ముద్దు పెట్టుకొనెను .మంత్రింప బడిన దానివలె అతడు శశిరేఖ ప్రేమాను బంధనమున చిక్కి యెడలు మరచెను .
చంద్రుడు పెద్దమబ్బు వెనక దాగి అంచునకు మెరుగు పెట్టెను. కోర్కెల వెదజల్లు దక్షిణగాలి దేహ శ్రమను దిర్చుచు వీచెను.నల్లని నీడలు కదలునట్లు చెట్లు యిటునటు నూగెను .బాదం చెట్టు పువ్వులు క్రింద రాలెను. నారింజ పువ్వులవాసన వచ్చుచుండెను .
కృష్ణు -శశి ,యిట్లాటి పౌర్లమినాడేరెండు నేల్లకిందట ఏం చేస్తున్నాం ?
శశి - జ్ఞాపకముందిలే. ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నావు ."ఎందుకోచ్చావన్నాదయ్యా! పిరికివాడు !"
కృష్ణు - చెప్పకుండా ఇంట్లోంచి లేచివస్తే ఏమంటారేం?
శశి -పాపం , మా వాళ్ళేమను కుంటున్నారో యేమిటో? మనం మళ్ళిఆ వూరేడదాం, కృష్ణా !
